Sunday, November 15, 2009

ఇదేమి జర్నలిజం....రామోజీ గారూ...

"కే.సీ.ఆర్., రాజ్ థాక్రేలను ఉరితీయాలి" అనే శీర్షికతో నవంబర్ 14 న 'ఈనాడు'లో ఒక వార్త వచ్చింది. ఇలా ఉరితీయాలని డిమాండ్ చేసింది ఎల్.బీ.నగర్ ఎం.ఎల్.ఏ. సుధీర్ రెడ్డి. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నందున ప్రత్యేక చట్టం తెచ్చి వారిద్దరిని ఉరి తీయాలని ఈ రెడ్డి గారు కోరారు ఒక విలేఖరుల సమావేశంలో. మన 'ఈనాడు' వారు దాన్ని ప్రచురించారు. ఆ చిన్న బిట్టుకు రెడ్డి గారి ఫోటో కూడా మరిచిపోకుండా వేసారు. 
 
ఇది ఒక అనాగరికమైన కోరిక, వార్త. ఎవడో ఒక ఎం.ఎల్.ఏ. ఎవరో నేతలను ఏదో కారణం మీద ఉరితీయండి అని కోరితే అది ఒక వార్త అవుతుందా? ఒక వ్యక్తి చావు కోరుకునే వారి మాటలు యథాతథంగా వాడవచ్చా? వారు ఆ కోరిక కోరినప్పుడు..సబ్ ఎడిటర్ దాన్ని ఎడిట్ చేయాలి కదా? నిజంగా ఇట్లా మాట్లాడిన వారిని ఉరి తేసే సంప్రదాయం మన దగ్గర ఉందా?

 
ఇలాంటి రెచ్చగొట్టే మాట ఎవడు అంటాడా అని విలేకరులు ఎదురు చూస్తే ఎలా? వార్తల నిర్ధారణ విషయంలో ఒక సమస్య కనిపిస్తున్నది మన పత్రికలలో. ఒకడు విలేకరుల సమావేశం పెట్టి...ప్రత్యర్ధి పై ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తాడు. తన ప్రత్యర్ధి కోట్ల ఆస్తులు సంపాదించాడని, పలువురితో అక్రమ సంబంధాలు వున్నాయని అంటాడు. ఆధారాలు వాడు ఇవ్వడు, మన మిత్రులు అడగరు. ఇన్ని కోట్ల ఆస్తులు అంటూ వాడు అని ఒక ఫిగర్ కూడా ఇస్తాడు. ఆ ఫిగర్ తో సహా ఆ ఆరోపణకు వార్త రూపం ఇవ్వడం నేరం. ఒక నరం లేని నాలుక రాజకీయ లబ్ది కోసం చేసే ఆరోపణలు 'ఈనాడు' స్థాయి పత్రికలకు వార్తలు కాకూడదు.

 
జర్నలిజం రూల్ బుక్ ప్రకారం అలాంటి నిరాధార వార్తలు వేయడం శిక్షార్హం. మంచి లాయర్ను పట్టుకునే కోర్టుకు ఎక్కితే...ఆరోపణలు చేసిన వాడితో పాటు ఆ వార్తను వేసిన ఆ పత్రికకూ భారీగా చమురు వదిలించవచ్చు. కానీ...మన దగ్గర అన్నీ కొట్టుకుపోతాయి. అంతా నడుస్తుంది.
అలాగే...కొన్ని సార్లు పత్రికలు ఏ నిరసన కారులో నిస్పృహతో చేసే శవయాత్రల ఫోటోలను ప్రముఖంగా ప్రచురిస్తాయి. ఛానెల్స్ వాటిని తెగ చూపిస్తాయి. నిరసనకారులు కసిగా ఆ గడ్డి శవాన్ని చెప్పులతో కొడుతుంటారు. ఈ అనాగరిక పనికి పత్రికల వత్తాసు! ఒక సారి "ది హిందూ' మొదటి పేజీలో ఇలాంటి 'శవయాత్ర' ఫోటో ప్రచురించింది.  నేను అప్పటి 'రీడర్స్ ఎడిటర్' కు మెయిల్ పంపాను. ఆయన చాలా బాగా స్పందిస్తూ...ఆ తరహా జర్నలిజం చెడ్డదని లెటర్ రాసారు.


అలాగే...దిష్టి బొమ్మల దహనం. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే....అది నచ్చని వారు ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ తయారు చేసి...కుండలతో ఊరేగించి...రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ఆపి కసిగా దాన్ని తగలపెడతారు. కొందరు కాలుతున్న బొమ్మను కాళ్ళతో తన్ని వికృతంగా ప్రవర్తిస్తారు.  సరే...నిరసన కారుల ధోరణులు అనేకం...కానీ...ఇలాంటి మొరటు ఫోటోలు, వార్తలు వేయడం భావ్యమేనా?   మనమున్నది తాలిబాన్ల రాజ్యం లోనా? ప్రజా స్వామ్యం లోనా?

10 comments:

Praveen Sarma said...

నేను "వార్త" పేపర్ చదువుతుంటాను. వార్త ఫ్రంట్ పేజ్ లో వచ్చే వార్తలు ఈనాడు ఫ్రంట్ పేజిలో రావు. ఈనాడు ఫ్రంట్ పేజిలో వచ్చే వార్తలు వార్త ఫ్రంట్ పేజిలో రావు. ఈనాడు వాళ్ళు లోకల్ న్యూస్ ఎక్కువగా వ్రాయడం వల్ల జిల్లాలలో వాళ్ళ సర్క్యులేషన్ పెరిగింది. నిజానికి ఈనాడు నెం.1 అబద్దాలకోరు పేపర్. సాక్షి పేపర్ వచ్చిన తరువాత వార్త దిన పత్రిక సర్క్యులేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు కూడా నేను నమ్మేది వార్త పేపర్ నే.

Anonymous said...

eenadu is worse but sakshi are worst.

సుదర్శన్ బాబు said...

కేవలం రాజకీయ వార్తలని బేస్ చేసుకుని"ఈనాడు" పత్రికని అనలేము.. అనకూడదు.
అయిదారు సంవత్సరలకు ముందువరకు అది చాల గొప్ప తెలుగు పత్రిక. కాని కొన్ని కారణాల వల్ల అది ఇప్పుడున్న విధంగా మారి ఉందవచ్చు. అంత మాత్రాన అది అనడం సరికాదు. చాల స్థాయి, అనుభవం, సర్క్యులేషన్ గల పత్రిక అని మర్చిపోకూడదు..

మా కాలేజి లో అన్ని పత్రికలు ఒక కాపీ ఉంటే, ఈనాడు మాత్రం రెండు కాపీలు ఉండేది.. అయినా అది లంచ్ టైం లో దొరకడం కస్టం.. :)

నామటుకు నాకు స్పోర్ట్స్ న్యూస్ ఈనాడులో చదివితేగాని తృప్తి ఉండదు. అలాగే ఎడ్యుకేషన్ మొదలైనవి కూడా..సరైనది నమ్మదగినది ఉంటుంది. రొచ్చు రాజాకీయాలని పక్కన పెడితే - చాల విషయాల్లో ఈనాడుకి, మిగిలిన పత్రికలకి స్పస్టమైన తేడా తెలుస్తుంది. అన్ని పత్రికలు విజ్ఙ్నానాన్నే అందించినా, ఈనాడు లొ చదివినవే ఎక్కువగా హత్తుకున్నయి. గుర్తున్నాయి.

Praveen Sarma said...

నా దృష్టిలో ఈనాడు ఒక పచ్చి అబద్దాలకోరు పేపర్. చంద్రబాబు నాయుడు టైమ్ లో మూత పడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించి ఈనాడులో ఒక్క ముక్క కూడా వ్రాయలేదు. వార్త పేపర్ మాత్రం ఆ పరిశ్రమల గురించి వివరంగా వ్రాసింది. సాక్షి విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వ అనుకూల వార్తలే ఫ్రంట్ పేజ్ లో ఎక్కువగా వ్రాసేది. రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత సాక్షిలో ప్రభుత్వ అనుకూల వార్తలు తగ్గాయి. సాక్షి పేపర్ ని రాజశేఖర రెడ్డే తన కొడుకు చేత తన పర్సనల్ పర్పోస్ కోసం పెట్టించాడు. ఇప్పుడు అతను చనిపోయిన తరువాత ఆ పేపర్ లో అతన్ని పొగడడానికి కొత్త మేటర్ ఏమి వస్తుంది? అందుకే సాక్షి పేపర్ ప్రజా సమస్యలు గురించి ఎక్కువగా వ్రాయడం మొదలు పెట్టింది.

Vinod said...

rajakeeya news gurinchi matladithe anni abaddala puttale. ea paper rajakeeyamga correct ga rasindo cheppagalara. vartha eenadu sakshi anni oke category. vere news ayithe eenadu chala better.

Praveen Sarma said...

వార్త పేపర్ లో వరల్డ్ బ్యాంక్ కీ, గ్లోబలైజేషన్ కీ వ్యతిరేకంగా కొన్ని వ్యాసాలు వచ్చాయి. ఈనాడులో అవి కూడా రాలేదు. రాజకీయ వార్తల విషయంలో వార్త పేపరే నాకు మెరుగు అనిపించింది. నేను ఎక్కువగా చదివేవి రాజకీయ వార్తలే. అందుకే నేను వార్త పేపర్ తెప్పిస్తుంటాను.

umashankar said...

Mr Praveen sarma garu... meeku vaartha paper tappa inkokati kanabatam ledemo....tappulu vedukutu pote anni paperlalo untai...okka sakshi(colors paper/nomatter) tappa...migita major circulation paperlu paravaledu. eenadu gurinchi...meeru oka news ni pattukoni manchi paper kadu anadam entavaraku samanjasam!!?? ippatiki eenadu ee mana rashtam lo largest circulated paper! intamandi opinion tappa!!?? leka...........??????

Anonymous said...

ఈనాడు పేపర్ ఒక మేడిపండు లాంటి పేపర్ .నక్క ఆకాశం కథ లాగ ,అంతా ఐపోయింది ,అంతా అవినీతి ,అందరూ దొంగలే ,లాంటి అర్థం వచ్చే విధంగా వ్రాస్తుంది .సరిన పోటీ ఉంటేనే అసలు రంగు బయట పడేది .ఇప్పుడదే జరుగుతుంది .ఎన్టీయార్ సంగతి ఒక్కటి చాలు .ప్రజలు తెలుసుకున్నా చదవడానికి కంటికి ఇంపుగా ఉంది కాబట్టి చదివారు ,తప్ప సూపర్ పేపర్ మాత్రం కాదు .

Anonymous said...

ఇవ్వాల్టి ఈనాడు లొ సాక్షి కి, ఆర్ ఆర్ గ్లోబల్; రెండు ఒకే అడ్రస్ అని రాసారు. తీరా చూస్తే, ఆ రెండు వేరు వేరు ఫ్లాట్ నెంబరు వున్నాయి. రాము గారు, మీ కామెంట్ ప్లీస్!

Anonymous said...

please read

http://ammaodi.blogspot.com

it will revel the secret of EENADU and sakshi