గడిచిన రెండేళ్ళ కాలంలో తెలుగు ఎలెక్ట్రానిక్ మీడియాలో ఒక ప్రమాదకరమైన ధోరణి ప్రవేశించింది. డబ్బు కక్కుర్తి దండిగా ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఒడిగట్టిన పాపం ఇది. దీని వల్ల వారిని నమ్ముకున్న చాలా మంది భవితవ్యం అనిశ్చితిలో పడిపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం వల్ల జనం చస్తుంటే...ఆంధ్ర లో కొందరు పెట్టుబడి దారులకు మీడియాలో పెట్టుబడి పెట్టి పేరు, డబ్బు గడించాలన్న బుద్ధిపుట్టింది. సంఘ సేవ ముసుగులో వీరు పవిత్రమైన జర్నలిజాన్ని ఒడిసి పట్టుకున్నారు.
T.V.-9 మీద కడుపుమంటతో ఒక ఛానల్, కాంగ్రెస్ సేవ చేసి తరిద్దామని...ఆనక ఆ పార్టీ విసిరే మాసం ముద్దలతో పండగ చేసుకుందామని ఒక ఛానల్, తమ కులస్థుల పార్టీని ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత గుర్తుకు వచ్చి మరొక ఛానల్ పుట్టుకొచ్చాయి. తెలుగు దేశం పార్టీకి, 'ఈనాడు' కు పోటీగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివాదాస్పద పెట్టుబడులతో 'సాక్షి' కూడా మొదలయ్యింది.
సరే...'సాక్షి' అంటే...నిర్మొహమాటంగా 'ఈనాడు' చూపిన దారిలోనే పయనిస్తూ తమ కులపోళ్ళకు పెద్ద పదవులు ఇచ్చి...చాలా ఆకర్షణీయమైన జీతాలు ఇచ్చి జర్నలిస్టులను ఆకర్షించింది. 'ఈనాడు' కు భిన్నంగా 'సాక్షి' పతంజలి గారిని సంపాదకుడిగా నియమించి కొంత న్యాయంగా వ్యవహరించింది.
ఈ పరిణామంలో భాగంగా ఈ లావుపాటి సాలరీ ప్యాక్ లు గతంలో చూసి ఎరుగని జర్నలిస్టులు తెగ రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే అప్పటిదాకా 'ఈ-టీ వీ', టీ.వీ.-నైన్ వంటి ప్రధాన ఛానెల్స్ లో తక్కువ జీతం, ఎక్కువ పని ఒత్తిడి తో వేరే మార్గం లేక కుక్కిన పేనుల్లగా పడివున్న జర్నలిస్టులు, టెక్నీషియన్స్ కు రెక్కలు వచ్చాయి.
ఆయా ఛానెల్స్ లో రెండు, మూడు స్థానాలలో వున్న వారు కొత్త ఛానెల్స్ లో కింగులై పోయారు. వారు జీవితంలో ఎన్నడూ లేని విధంగా యాభై వేలకు పైన జీతం పొందారు. దాంతో...తాము సర్వజ్ఞులం కాబట్టి... ఇన్నాళ్ళకు ఇంత మంచి అవకాశం వచ్చిందని వారు మనసా వాచా కర్మణః నమ్మారు తప్ప...కొత్త ఛానెల్స్ యజమానులు ఎంత చెత్త వెధవలో వారు పట్టించుకోలేదు. డబ్బు, పదవి ముందు ఏదైనా..దిగదుడుపే కదా!
ఒక డ్రైవర్ గా జీవితం...ప్రారంభించి ఆనతి కాలంలోనే వనితల పరోక్ష సహాయంతో వినుతి కెక్కిన ఒక సారు...ఛానల్ పెడుతున్నానంటే...'ఈనాడు' ఎదుగుదలకు ఎంతో దోహదం చేసిన ఒక 'తమిళ' సారు రంగప్రవేశం చేసారు. మరొక కొమ్ములు తిరిగిన మహామహుడు....కుల పోషణ, కళా పోషణ రెండూ చేయవచ్చని ఆ టీంలో జంప్ అయ్యాడు. 'ఈనాడు' లో కుమిలిపోతున్న కొందరితో మరొక జర్నలిస్టు, ఆయన గారి వందిమాగధులు, అన్తే వాసులు వచ్చి మంచి మంచి జీతాలతో చేరిపోయారు. వారు...అరచేతిలో స్వర్గం చూపించి తమకు తెలిసిన వారిని ఈ ఛానల్ లో చేర్పించారు. ఎక్కడో సుఖంగా ఉన్నవారిని మెహర్బానీ కోసం తమ ఛానల్ కు తెచ్చుకున్నారు. కొందరు డబ్బు ఆశతో అ ఛానల్ పంచన చేరారు.
ఎన్నికలయ్యే దాక బండి బాగానే నడిచింది. తర్వాత ఒక్కరికి మన మాజీ డ్రైవర్ గారు డోర్ చూపించండం మొదలు పెట్టారు. ఈ క్రమంలో...సీనియర్లు జెండా పీకారు, కొందరు ఆ పనిలో వున్నారు. ఈ క్రమంలో వీరిని నమ్మి ఈ ఛానల్ లో చిరిన వారి భవిత అగమ్యగోచరం అయ్యింది.
ఇక రెండో కేస్ స్టడీ...ఒక విద్యా సంస్థ వారు పెట్టిన ఛానల్. తనను తాను నిరూపించుకోవాలని రగిలిపోతున్న ఒక మాజీ దోస్తు తో కలిసి రాజా లాగా వీరు ఒక ఛానల్ పెట్టారు. ఈ సేనియర్ జర్నలిస్టు...తన పలుకుబడిని, వాక్ చాతుర్యాన్ని ఉపయోగించి...మంచి జట్టును జమ చేశాడు. అబద్ధాలు చెప్పకపోతే...ఆ పూటకి అజీర్ణం చేసే ఈ మహానుభావుడు ఒకడుగు ముందుకేసి కాకమ్మ కథలు చెప్పాడు. "మనకు డబ్బు ధోకా లేదు. ఎందుకంటే..పెట్టుబడి పెడుతున్నది...ఒక ఎన్.ఆర్.ఐ.," అని ఈ సారు సహచరులను మోసం చేశాడు....దారుణంగా.
"వాడు అబద్ధాలు చెబుతాడని తెలుసు గానీ..మరీ ఇంత బరితెగిస్తాడని అనుకోలేదు. లోకల్ పెట్టుబడిదారుడి పేరు చెబితే...జనం రారని..మమ్మల్ని మోసం చేశాడు. వాడు మాత్రం చాలా జీతం తీసుకునే వాడు" అని ఒక సీనియర్ వాపోయాడు.
తీరా కొత్త వార్త ఏమిటంటే...ఈ సారుకు ఆ యాజమాన్యానికి ఈ మధ్య యవ్వారం బెడిసింది. సారు అదే వాక్ చాతుర్యంతో మరొక ఛానల్ చూసుకుని చెక్కేసాడు. 'మీతో పనిచేయడం భలే బాగుంది. సెలవ్," అని ఒక ఆంగ్ల మెయిల్ పంపి మరీ వేరే ఛానెల్స్ తో బేరాలు పెట్టుకున్నాడు.
మరి..ఈయనను నమ్మి ఈ ఛానల్ లో చేరిన వారి బతుకేమిటి? వారంతా...బిక్కుబిక్కున బతుకుతున్నారు ఇప్పుడు.
కాబట్టి...సీనియర్ జర్నలిస్టులూ...దయచేసి ఇతరుల గురించి కూడా ఆలోచించండి. మీరు చేరే ముందు...ఛానల్ యజమాని గురించి ఆరా తీయండి, వాడు చెత్త వెధవ...వాడిది పాపపు అజెండా...వాడు కులం గుల గాడు అయితే..జాగ్రత్త పదండి. మిమ్మల్ని నమ్మి మీ టీం లో చేరే వారిని నట్టేట ముంచకండి. యజమానులు...మానవత్వం లేని దుర్మార్గులు. వారి పంచన అమాయకపు జర్నలిస్టులను పడేసి...చేతులు దులుపుకొని పారిపోకండి. ఇవి సున్నితమైన...జీవితాలు ....బ్రదర్.
Sunday, November 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Yes... Ramu garu... meerannadi 100%correct. e pedda salru thama dari thamu chusukuntu nammi vachina vallani natteta munchuthunnaru. Onemorething.. Sastry garu thana mandimarbalam kosam NTV lo kondariki udwasana palikaru. ippudu Rajavaru thana vari kosam mari kondari noti kada koodu theestunnaru. E gemelo balavuthunnadi amayakule. But e paddalantha oka vishayam gurthu pettukovali... evaram ekkada sashwatham kaadani... meeremantaru...?
ee prapancham ilage untundi. oka channel nunchi gani, oka paper nunchi gani vellipovalani anukunnappudu vallE somtanga annee alochinchukuni vellali. evari careerku evaroo javabudaari kaadu.
- laman
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి