కాస్తో కూస్తో చదువుకుని...ఆలోచనా శక్తి ఉండి...పిల్లల భవిత మీద భయమున్న మధ్య తరగతి తల్లిదండ్రులను ఈ మధ్య ఒక పెద్ద ప్రశ్న వేధిస్తున్నది. ఆ ప్రశ్న: అసలు ఈ కేబుల్ టీ.వీ.కనెక్షన్ అవసరమా?
ఒక పదిహేను రోజుల పాటు టీ.వీ.ఛానెల్స్ కు సెలవు ఇప్పించాలని లోక్ సత్తా అధినేత జే.పీ.గారు ప్రకటించడం... అది నిజంగా మంచి పని అని నేను కలిసిన, నాకు తెలిసిన వారిలో 90% మంది అనడంతో నేను ఆలోచనలో పడ్డాను. ఇన్నాళ్ళు "information is power" అని అనుకున్నవాడిని కాస్తా...అసలు టీవీ లేని జీవితం ఎలా వుంటుందో పరీక్షించదలుచుకున్నాను. సంక్రాంతి కి మా ఊరు వెళ్ళినప్పుడు టీవీ అవాయిడ్ చేసాక...మనం కూడా టీవీ లేకుండా బతక వచ్చని కొద్దిగా అవగతం అయ్యింది.
ఈ లోగా...హైదరాబాద్ లో మా ఇంటి పక్క గుజరాతీ ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసింది. కేబుల్ వాడు...వాళ్ళ టీ.వీ.కనెక్షన్ కట్ చేయబోయి మా కనక్షన్ తీసిపారేసాడు. నేను వెళ్లి చెబితే...కేబుల్ కనెక్షన్ వెంటనే ఇస్తారు...కానీ...మరి కొన్ని రోజులు టీ.వీ.లేకుండా బతికి చూద్దాం...అని గమ్మున కూర్చున్నాను. ఈ ధోరణిపై మొదటిరోజు ఇంట్లో కొద్దిగా అప్రకటిత నిరసన ఎదురైనా...పరిస్థితి అదుపులోనే ఉంది. ఇవ్వాల్టికి టీ.వీ.లేకుండా మూడో రోజు. ఆ ఆదివారం ఆలుగడ్డలు తరుగుతూ..'కలర్స్' ఛానల్ లో 'గజని' సినిమా పాక్షికంగా చూడడమే ఆఖరు.
టీ.వీ.లేకపోవడం వల్ల పగలంతా...ఎంతో టైం దొరుకుతున్నది. సాయంత్రం కుటుంబంతో కూర్చుని నాలుగు మాటలు...మంచీ చెడూ మాట్లాడుకునే అవకాశం కలుగుతున్నది. బుర్ర కూడా ఫ్రెష్ గా అనిపించింది. గతంలో ఆ పిచ్చి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కూడా వీలు దొరికినప్పుడల్లా చూసి టైం ఆగం చేసుకునే వాడిని. ఇప్పుడు ఆ టైం వేరే పనులకో, వాకింగ్ కో బదలాయించాను.
జనవరి 26 న రోజంతా...హాయిగా...టీ.టీ.అకాడమిలో స్కూల్ పిల్లల టేబుల్ టెన్నిస్ మ్యాచులు చూస్తూ గడిపాను. ఆ రోజు గుమ్మడి గారు చనిపోయారని ఈ ఉదయం పేపర్స్ లో చూసే దాక తెలియలేదు. అదొక్కటి మినహా...మనం చూడకపోతే...కొంపలు కాలిపోయే వార్తలు ఏమీ లేవు- మనకున్న ఈ డజను ఛానెల్స్ లో. ఇది ప్రాథమిక అవగాహన, అభిప్రాయం మాత్రమే సుమా!
"నేను కావాలనే ఇంట్లో టీ.వీ.లేకుండా చేశా. మేము చాలా హాయిగా బతుకుతున్నాం. ఎందుకండీ...ప్రపంచంలో బాధలన్నీ అప్పటికప్పుడు తెలుసుకుని బీ.పీ. పెంచుకోవడం," అని మా అబ్బాయితో కలిసి టీ.టీ. ఆడే విష్ణు ఫాదర్ రావు గారు ఒక ఐదు నెలల కిందట పిచ్చాపాటీగా చెబితే...ఆశ్చర్య పోయాను. ఇప్పుడు ప్రయోగం మొదలు పెట్టాను.
టీ.వీ.చూడకపోవడం వల్ల వచ్చే లాభ నష్టాల లిస్టు ఒకటి తయారు చేస్తున్నాను. అది పోస్ట్ చేసాక దానిపై మంచి చర్చ జరుపుకుందాం. అంతవరకూ సెలవ్.
Wednesday, January 27, 2010
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
నేను కూడా రాత్రి డ్యూటీ నుంచి రాగానే రామూగారు బ్లాగ్ లో మన మీడియా గురించి ఏమి రాశారు అని ఆతృతగా నెట్ తెరవడం, అంతర్జాలంలో గంటల తరబడి సమయం వృధా చేయడం మానాలి.
శ్రీనివాస్
మా ఇంట్లో కూడా టివి తీసివేయాలని వుంది కానీ గృహహింస కేసుపడేలా వుంది :(
ఈ మద్య టి.వీ ని అందరు తిట్టేస్తున్నారు. దాన్ని నియంత్రించటం అంత కష్టమైనా పనా అనిపిస్తుంది నాకు. సోమవారం నుంచి శుక్రవారం వరకు టి.వీ ని స్విచ్ ఆన్ చేయటనికే ఉండదు, ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు కదా? శనివారం పొద్దున, పిల్లలకి ఒక కార్టూన్, శనివారం రాత్రి కుటుంబం అంతా ఒక సినిమా, మళ్ళీ ఆదివారం కుటుంబం అంతా కలిసి ఎదైనా ఒక ఆట చూడటం. ఇలా నియంత్రించుకోటం మన చేతుల్లోనే లేదంటారా? అందరికి సాధ్యం అయ్యే పని కాదంటారా? మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి సాధ్యపడుతోంది మరి. ఇంకో పోస్ట్ లో రాసిన వంటకాలన్ని ఎలా చేయలో ఎంటో చెప్తారని ఎదురు చూస్తున్నా -- విజయ
No one sits infront of TV 24 hours a day!It is only during morning and evening times except a some time in the afternoon depending upon the job of the individual.But the kids glue to it on holidays.It is the self control that is vital for anything and any excess or over response is harmful whether it is TV or internet.Most of the times TV is informative,educative and entertaining one and destructive some times and hence one has to choose among all these.Any habit if it is limited there is no harm but if it becomes addiction it is dangerous.Let us not get addicted to TV and ofcourse ap mediakaburlu.
JP Reddy
sir,meeru tv chudakapote visleshana evaru esthaaru.plz tv choodandi
anna
if you dont have the TV, then what about your blog?
Ramana
వేరే పనుల వల్ల వారం రోజూలుగా టీవీ చూడటం కుదరలేదు. మనసు హాయిగా ఉంది.
Television,radio,cinemas are part of our life in the society but they should not become the part of our lofe.These are gifts of our technological successes which are meant for the common man but unfortunately these are being mismanaged,misused in the society which is resulting in a sort of hate campaign against these which is unwanted and irrevelant.The only thing is one has to manage these properly with ethics,moral and human values for the benefit of mankind not for the destruction of the values in the society.
JP Reddy
RAMU GARU MEERU NIJAM TELUSUKUNNANDU SANTHOSHAM.
MEE @TV@ DISCUSSION PAINA NENU O STORY RAASANU CHADAVANDI
WWW.VINUVINIPINCHU.BLOGSPOT.COM
అన్నయ్య ,
* అంతా టీవీ మీద పది ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదు . చివరకు మీరు కూడా. అంతా హిపోక్రాటిక్ గా మాట్లాడుతున్నారనిపోస్తోంది. వేలువేలు పెట్టి టీవీలు కొనుక్కోవడం ఎందుకు.? అడ్డమైన ప్రోగ్రామ్స్ వస్తున్నాయని నెత్తి నోరు బాదుకోవడం ఎందుకు? ఇంట్లో టీవీ ఉన్నంత మాత్రాన 24 hours చూస్తామా? సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మధ్య మీ బ్లాగ్ బోరింగ్....
సాక్షి అందర్నీ ఆశ్చర్య పరచే క్వాలిటీతో వస్తోంది. వై డోన్ట్ యు కామెంట్.
టీవీ ఉండాల్సిందే! కానీ దాని రిమోట్ మాత్రమే కాదు,దాన్ని నియంత్రించడం మన చేతిలో ఉండాలి.
మా ఇంట్లో సీరియల్సూ, సినిమాలూ ఏమీ చూడం! ఉదయం అరగంట, సాయంత్రం గంట కార్టూన్లు నడుస్తాయి. ఉదయం పదింటిదాకా CNBC, NDTV Profit నడుస్తాయి.
ఈ మధ్య లో అప్పుడప్పుడూ న్యూస్ అప్ డేట్స్ తప్పక చూస్తుంటాను. అంతే!
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి