Tuesday, March 23, 2010

'మా భూమి' మళ్ళీ వస్తుందా?: ABN-AJ లో చర్చ

నిన్నంతా...PRP వారి దాడితో తిక్కతిక్కెక్కి పోయిన ABN-ఆంధ్రజ్యోతి 'మా భూమి' సినిమాపై ఒక మంచి చర్చ జరిపిందీ రాత్రి. నిన్న...గెస్టు అన్న స్పృహ లేకుండా...ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ గారిని స్టూడియోలో ఘోరంగా అవమానించిన యాంకర్ మూర్తి ఈ రోజు...ఎంతో లీనమై 'మా భూమి'పై చర్చ నిర్వహించారు. (పీఅర్పీ పై కథనాన్ని పునఃప్రసారం చేసిన సందర్భంగా చూడనిరాకరిస్తూ కొంగుకప్పుకున్న పద్మగారి ఫోటో 'ఆంధ్రజ్యోతి' పేపర్ మొదటి పేజీలో ప్రచురించడం...ఘోరం..అనైతికం...అవమానకరం.)

ఇక వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం వస్తువుగా నరసింగరావు గారు అద్భుతంగా మలిచిన 'మా భూమి' విడుదలై మూడు దశాబ్దాలు సందర్భంగా ఈ ఛానల్ ప్రత్యేక చర్చ జరిపింది. ఇది మంచి ఐడియా. ఈ సినిమాలో నవ యువకుడైన గద్దర్...సుద్దాల హనుమంతు గారు రాసిన 'బండెనక బండి కట్టి....' అనే పాట పాడుతుంటే....గుండె బరువెక్కింది. విద్యార్థి ఉద్యమాలలో తిరిగిన వారు కంజెర కొడుతూ....విప్లవ స్ఫూర్తితో ఈ పాట పాడకుండా ఉండి ఉండరు.

ఈ చర్చలో పలువురు కాలర్స్ ను ఉత్తేజపరిచిన మూర్తి...ప్రేక్షకులందరి తరఫున...మళ్ళీ 'మా భూమిని' ప్రజలకు అందించాలని నరసింగ రావు గారిని కోరారు. ఇప్పటి దర్శకులు రావు గారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. విప్లవం సంగతి కాకపోయినా...ఒక సినిమాను ఎంత బాగా తీయవచ్చో ఆయన ప్రతి ఫ్రేములో నిరూపిస్తారు.

ఎన్ని తూటాలు పేలినా...ఎత్తిన ఎర్ర జెండా దించకు...అన్న పిలుపుతో ఈ సినిమా ముగుస్తుంది. ఆ పాటతోనే ABN-AJ కార్యక్రమం ముగిసింది.

కానీ...ఈ లోపలే వచ్చిన ఒక వార్త: దేశంలో రైతాంగ సాయుధ పోరాటానికి బాటలు పరిచిన విప్లవ మూర్తి కాను సన్యాల్ ఆత్మహత్య. 

నార్త్ బెంగాల్ లోని సిలిగురిలో...ఆయన సొంత ఇంట్లో ఉరి వేసుకుని మరణించారట. చాలా రోజుల కిందటనే సాయుధ పోరును చీదరించుకున్న సన్యాల్...చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను బ్రిటిష్ సైన్యం ఉరి తీసింది ఈ రోజే కదా!

కాను సన్యాల్ ఆత్మహత్య గురించి విని నాకు మా ఆనంద రావు గుర్తుకు వచ్చాడు. ఖమ్మం జిల్లా వైరాలో విప్లవ భావాలున్న పిల్లలకు ఆనంద రావు ఒక స్ఫూర్తి. పీ.డీ.ఎస్.యూ.లో పనిచేసిన తను...ఆడి పాడే మా బ్యాచ్ తో కలిసి మెలిసి ఉండేవాడు. మాకు అతనొక నేత. సమాజ ఉద్ధరణకు పాట ఒక సాధనమని...అందుకు 'జన నాట్య మండలి' ఒక వేదిక అని నూరిపోసాడు. 

మండలిలో రహస్య శిక్షణ (?)కు సిద్ధం కావాలని ఆనంద రావు చెప్పిన మాటలకు మానసికంగా సిద్ధమవుతున్నప్పుడే....ఆయన రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్యో కాదో తెలియదు కానీ....."ఛీ...ఇంత పిరికివాడు నూరిపోస్తే...మనం విప్లవంతో ఊగిపొయ్యామా?" అని పలువురు అప్పటి నుంచి బుద్ధిగా చదువుకోవడం మొదలు పెట్టారు. చత్తీస్ గడ్ లో పర్యటించి....నక్సల్ ఉద్యమాన్ని ఒక ఆదర్శ పోరాటంగా స్తుతిస్తూ అరుంధతీ రాయ్ 'అవుట్ లుక్' లో పెద్ద వ్యాసం రాసిన వారంలోనే...ఈ పరిణామం.

9 comments:

kvramana said...

I still don't understand why Maa Bhoomi has not been converted into CDs. Hats off to Mr Rao who has kept off the commercialisation of his master piece.
Secondly, I also fail to understand the life span of an idealogue. Does it end the moment his idea is accepted or rejected? Does Kanu Sanyal belong to that category? Because Kanu Sanyal is one individual. But imagine the influence he must have had on dozens if not hundreds of youths in his proximity. If you think he did his bit the moment he spread his idealogy, then I think his death today is immaterial.
Ramana

Rajendra Devarapalli said...

ఇక వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం వస్తువుగా నరసింగరావు గారు అద్భుతంగా మలిచిన 'మా భూమి' ....ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ ఘోష్,నరసింగరావు గారు నిర్మాణంతో పాటు పలు శాఖల్లో పాలుపంచుకున్నారు.

Anonymous said...

అక్షరమే ఆయుధం !

అవును...అక్షరాలా అది నిజం ! మరి ఆ ఆయుధం తోటే కదా గిట్టనివాళ్ళను మట్టుబెట్టే
ప్రయత్నం చేస్తుంది మన కుహనా మీడియా అధినేతలు. నరనరాన అహంకారాన్ని,
అవలక్షణాలని నింపుకుని, మీడియా ముసుగేసుకుని తమ పబ్బం, తమ వారి లబ్ధికోసం
అహర్నిశలు పరితపిస్తున్న మీడియా బడాబాబుల జాతకాలు బయటపడే రోజు అతి దగ్గర్లోనే
వుంది.

ఆనాడు నచ్చని కాంగ్రేస్ పార్టీని మట్టుబెట్టేటందుకు నిత్యం అసత్యాలని వార్తలుగా
రాసి, కాంగ్రేసుని తుదముట్టించే యోధుడిగా ఎన్.టి.రామారావుని ఫోకస్ చేసి,
అధికారాన్ని పొందేలా చేసాడు తన ఈనాడు పేపర్ ద్వారా రామోజీరావు.

తన ట్యూన్స్ కి తగ్గట్టుగా ఆయన డాన్స్ చేయడంలేదని ఆయన్ని పదవీబ్రష్టుడిని
చేయడానికి కంకణం కట్టుకుని చంద్రబాబుతో చేతులుకలిపి, మరలా అసత్యాలని సత్యాలుగా
రాసి వైస్రాయ్ హోటల్ ఉదంతం నెరిపి ఎన్.టి.ఆర్. పైనే చెప్పులు విసిరేయించి తన
అక్కసుని తీర్చుకుని పదవీబ్రష్టుడిని చేసి సాగనంపాడు.
తన ప్రత్యర్ధి అయిన ఉదయం పేపరుని మూతమూయించేందుకు, ఆ పేపర్ యజమానీ, మాక్-డోవెల్
కంపెనీకి ఆంధ్రా డ్రిష్టిబూటర్ అయిన మాగుంట సుబ్బరామిరెడ్డి గారికున్న
ఆర్ధికవనరులని దెబ్బతీసేందుకు, ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన ఉద్యమానికి శ్రీకారం
చుట్టాడు. ఆతని దురుద్దేశ్య ఉద్యమానికి ఆలంబనైయ్యింది మల్లాది సుబ్బమ్మ.
అసలువిషయం తెలియని పిచ్చిజనం ఇదంతా రామోజీరావుకి సమజంపైవున్న పిచ్చప్రేమ
అనుకున్నారు. అలా ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకుని ప్రత్యర్ధులను
దెబ్బతీయటం రామోజీరావు అక్షరాబ్యాసం నాడే నేర్చుకున్న విద్య. అలా అనుకున్న
విధంగా ఉదయం పేపరుకి సంద్యావందనం కావించాడు రామోజీరావు.

ఇవాళ అదే బాణీని పుణికిపుచ్చుకున్నాడు వేమూరి రాధాకృష్ణ. ఆనాటి రామోజీ బాటనే
నడిచే ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సరం ఎన్నికల సమయంలో, ప్రజల గుండెల్లో
నిలిచివున్న మహాబలపరాక్రమవంతుడైన ఆనాటి ముఖ్యమంత్రి, వై.ఎస్.రాజశేఖర రెడ్డిని,
క్షణక్షణానికీ నిర్వీర్యుడౌతున్న చంద్రబాబు నాయుడు ఇక ఏమీ చేయలేడన్న
కృతనిశ్చయానికొచ్చి, చిరంజీవి గారొక్కడే ఏమైనా చేయగలడన్న
స్థిరనిర్ణయానికొచ్చి, గతిలేక ఆయన భజనకు శ్రీకారం చుట్టాడు.

ఆంధ్రరాష్ట్రంలో చిరంజీవి గారి రాజకీయ ప్రవేశాన్ని ఇంతమంది కోరుకుంటున్నారు...
అంతమంది కోరుకుంటున్నారు...అంటూ వూరూరా సర్వేలు జరిపించి, ఆహా,ఓహో అంటూ పూనకం
వచ్చిన వాడిలా వూగిపోతూ, తక్షణ లబ్ధిని పొందాడు. అది చిరంజీవి గారికున్న
గ్లామర్ ని పొగిడి, తన పేపర్ సేల్ పెంచుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఇది
జగమెరిగిన సత్యం. రాధాకృష్ణ కూడా ( నిజాయితీ అంటూ వుంటే ) బాధపడుతూనైనా
ఒప్పుకోవాల్సిన విషయం. దానికి నిదర్శనం...ఆనాడు దేశవ్యాప్తంగా అన్ని
దినపత్రికల అమ్మకాలు తగ్గుముఖం పడితే, ఒక్క ఆంధ్రజ్యోతి అమ్మకాలే ఆకాశంలోకి
దూసుకుపోవడానికి గల కారణం ఏమిటి ?

సత్యవార్తలకు ఆంధ్రజ్యోతి నిఖార్సైన పత్రికనా ? పక్షపాతరహితంగా వార్తలను
అందిస్తుందనా ? ఆ రెండూ కాదు ! చిరంజీవిగారి పట్ల ఆయన అభిమానుల్లో ఉండే
ఉత్సాహాం ! ఆయన గురించిన వార్తలను తెలుసుకోవడంలో పొందే ఆనందం !! ఇదే జ్యోతి
కండ కావరానికి అసలు కారణం.

మరి ఇవాళ ప్రజారాజ్యంపై కత్తికట్టడానికి గల కారణమేమిటీ ?

బలవంతుడైన ప్రత్యర్ధి రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం ఈ విషసర్పాలు మరలా బుస
కొట్టేందుకు ఆస్కారమిచ్చింది. రాజశేఖర రెడ్డిని ఓడించడానికి చిరంజీవి గారి
గ్లామరు అవసరం గానీ, ఆయన మంచితనం గానీ, మనుగడగానీ అవసరంలేదు. ఇవాళ చంద్రబాబుని
రాబోయే కాలానికి ముఖ్యమంత్రిని చేయడానికి, ముఖ్య అవరోధమైన చిరంజీవి గారి
ఉనికిని దెబ్బతీయడానికి కంకణం కట్టుకొన్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.

అందుకే భేతాళుడైన చంద్రబాబుని బుజాన వేసుకుని, అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని
అక్రమార్కుడిలా తన పరాక్రమాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మంచితనాన్ని
చేతకాని తనంగా భావించినా, అక్రమార్కులు పరాక్రమ వంతులుగా ఫోజిచ్చినా బాక్సులు
బద్దలవ్వక తప్పదు.! అదే ఋజువైందిప్పుడు !

Saahitya Abhimaani said...

.........నూరిపోస్తే...మనం విప్లవంతో ఊగిపొయ్యామా?" అని పలువురు అప్పటి నుంచి బుద్ధిగా చదువుకోవడం మొదలు పెట్టారు.

మంచి పని చేసారు.

Anonymous said...

anynomous post koncham abhyamtharakaram ga vundi

One Stop resource for Bahki said...

'జన నాట్య మండలి' ..వైరా ఐదవ తరగతిలో నేను కూడా వీరితోకలసి ఆడాను పాడాను , ఆనంద రావు గారు అప్పట్లో వీరి వీరాభిమాని మా తీచరు .

venkata subba rao kavuri said...

బండెనక బండి రాసింది సుద్దాల కాదు. యాదగిరి. దీని దర్సకుడు గౌతం ఘౌష్. ఏబీఏన్ చర్చ పక్క దొవల సాగింది. వ్యక్తుల సొంత దబ్బాల మోత ఎక్కువయింది. ఐ న్యూస్లొ కొంత మేర బాగుంది. పాడయిన రీళ్ళను బాగు చేయటం రెండు రోజుల్లో పూర్తవుతుందని, వెంటనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తామని నరసింగరావు ప్రకటించటం సంతోషం. సీడిని కూదా విడుదల చేస్తామని కూడా ఆయన చెప్పారు. మాభూమి బ్రుందానికి అరుణారుణ శుభాకాంక్షలు.
వెంకట సుబ్బారావు కావూరి

WitReal said...

I didnt understand what ramana said above:

>>> Kanu Sanyal is one individual.
hitler is also one individual. so?

imho, kanu sanyal or anandarao (i really dont know anything abt this person) or any other armed struggler who treads the path of non-violence, kills/gets-killed/disillusioned/depressed this way.

Anonymous said...

it was violence...not, non-violence.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి