Sunday, March 28, 2010

'ఆంధ్రజ్యోతి'ది.....వికారపు జర్నలిజమే: అబ్రకదబ్ర లేఖ

                                                                                        హైదరాబాద్,
                                                                                   మార్చ్ 28, 2010
డియర్ వేమూరి రాధాకృష్ణ భాయీ సాబ్ గారూ....
'జ్యోతికి మసిపూయగలరా!' అన్న ప్రశ్నతో మీరు నిన్న ప్రచురించిన ఒక ప్రత్యేక వ్యాసం చదివాక మీకు ఈ లేఖ రాయకుండా ఉండలేకపోతున్నాను. నిజమే అన్నా....'జ్యోతి'కి మసి పూయలేము గానీ...మసి వచ్చేది 'జ్యోతి' నుంచే గదా బ్రదర్! ఈ తిక్క లాజిక్ వదిలి...పాయింట్ల వారీగా మీ 'ప్రత్యేక వ్యాసం' చూద్దాం... 

1)   అన్నా..."తనను ధిక్కరించిన వారిని దండించడానికి ఇది సినిమా కాదు, రాజకీయ రంగం, ప్రజాస్వామ్య యుగం!" అని మొదటి పేజీలో ఒక బాక్స్ లో మీరు సెలవిచ్చారు. ఆ బాక్స్ పైన "పెద్ద మనిషీ..ఇదేనా పధ్ధతి...ఉండవల్లిపై విరుచుకుపడ్డ రోశయ్య" అని తాటికాయ అంత అక్షరాలతో బ్యానర్ స్టోరీ చూడకుండా మీరు మీ 'ప్రత్యేక వ్యాసం'లో ఈ వాక్యం రాసుకున్నట్లు ఉన్నారు. 
మీరు వ్యాసంలో రాసుకున్న వేయిన్నొక్క సుద్దులను...ఈ బ్యానర్...తూచ్ అని తీసిపారేస్తుంది కాదన్నా. అదొక స్టోరీ...దానికి రెండు పెద్ద బొమ్మలు. రెచ్చగొట్టే డెక్స్, 'కొంచెం నిప్పు...కొంచెం మెప్పు..' అనే కసరత్తు. ఇదేమి జర్నలిజం బ్రదర్? 

ఒక సీ.ఎం.ఒక ఎం.పీ.ని అందరిముందు పట్టుకుని కాస్త కటువుగా మాట్లాడడం వార్త కాదని ఎవరూ అనరు. అది మీకు పతాక శీర్షికా? కాంగ్రెస్ కొంపలో చిచ్చు పెట్టాలన్న తెంపరితనం కాదాఇది? నెగిటివ్ వార్తల పట్ల మనకున్న పిచ్చి మమకారం. ఈ వికారపు జర్నలిజాన్ని పెంచి పోషిస్తూ....నేను పత్తిత్తునని సంపాదకీయం పేజీలో ఎంత పెద్ద వ్యాసం రాసావ్ బ్రదర్!? ఇప్పుడు ఆ 'ప్రత్యేక వ్యాసం' సంగతి చూద్దాం. 


2) "దాడులు, నిరసనలు, కేసులు ఎదుర్కోని పత్రిక ఒక పత్రికే కాదు. అలాంటిది ఉన్నా లేనట్టే.." అని ఒక మిత్రుడు చేసిన వ్యాఖ్య గమనార్హం అని రాసుకున్నారు...మొదటి సుదీర్ఘ పేరాలో. మీ లాంటి పేపర్స్ తో ఇదే సమస్య స్వామీ. మీకు తోచింది రాసి..."ఇది ఒకడు (అత్యంత విశ్వసనీయ వర్గాలు, ఉన్నత స్థాయి వర్గాలు....బొంగు... భోషాణం...) చెప్పాడు అని రాసుకుంటారు. గుండెల నిండా "దమ్మున్న ఛానల్" అని ఓ...తెగ ఊదర కొట్టుకుంటున్నారు కదా...ఎప్పుడూ ఈ పదాల మాటున ఆడుకుంటే ఎలా? ఏదో...ఉండవల్లి వ్యాసంలో...."అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలియజేసిన సమాచారం ప్రకారం..." అన్న మాట వాడారు..మీ సోర్సును కాపాడుకునే ప్రయత్నం అనుకుందాం. మీ 'ప్రత్యేక వ్యాసం' లో కూడా 'ఒక మిత్రుడు' అని రాస్తే ఎలా బ్రదర్? మనకు తోచింది...వన వాదనకు అనువైనది రాసి....ఎవడికో అనామకుడికి ఆపాదిస్తే ఎలా? మీ పేపర్తో ఇదే పెద్ద సమస్య.

2) "ఒక పత్రికలో జర్నలిస్టు గా గడిపి, ఎం.ఎల్.ఏ.గా అవతారం ఎత్తిన కన్నబాబు.." అని రాసారు. ఎక్కడ ఏ పదాలు వాడాలో సో కాల్డ్ ఎం.డీ.కి మీకే తెలియకపోతే...మీ సిబ్బందికి తెలుస్తుందని నాలాంటి బేకార్ గాళ్ళు ఎలా అనుకుంటారు? కన్నబాబు...జర్నలిస్టుగా 'గడపడం' ఏమిటి? 'ఒక పత్రిక' ఏమిటి? అడుగడుగునా....నిజాలు దాయాలన్న బుద్ధి మన రక్తంలో ఉన్నట్లుందే!
కన్నబాబు పనిచేసింది 'ఈనాడు' లో. అతను అక్కడ 'గడప'లేదు. బాగా పనిచేసాడు...చాలా మంది జర్నలిస్టులలాగా మన బీటు పార్టీ జనాల చంకలు నాకి, పైరవీలు చేసి...కులం అడ్డం పెట్టుకుని...కోట్లు దండుకోలేదు. ఏమిటీ...'ఎం.ఎల్.ఏ. అవతారం ఎత్తాడా?"--ఇది కన్నబాబునే కాక...ఒక నియోజక వర్గ ఓటర్లను కించపరచడమే. తను ఎన్నికల్లో గిలిచాడు మహాశేయా. పదాలు కాస్త డిగ్నిఫైడ్ వి వాడితే బాగుంటుందేమో!


3) మీ పత్రికకు సొంత అజెండా లు ఉన్నాయన్న ఆరోపణపై...వివరణ ఇస్తూ..."ఆయా అంశాలు, వ్యక్తులు, పార్టీలకు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి," అని మీరు రాసారు. మీరు సత్యం అంగీకరించారు. కీప్ ఇట్ అప్. బలహీనుడి పక్షం ఉండడం 'ఆంధ్రజ్యోతి' అజెండా అన్నారు. ఇక్కడొక చిక్కు ఉంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి, మీకు చంద్రబాబు బలహీనంగా కనిపిస్తున్నారు. మనం కోరుకున్నట్లు...బాబు గారు అధికారం లోకి వస్తే...తమకు ఆయనే 'మరింత బలహీనుడి'గా కనిపిస్తే...జనం గతేం కాను. మొత్తం మీద మీ అజెండా చెప్పారు..సంతోషం.

4) ఏ.బీ.ఎన్. పై దాడి తర్వాత మీకు ఒక మిత్రుడు ఫోన్ చేసి..."మీరు ఏ కాజ్ కోసమైతే కృషి చేసారో..." అని బాధపడ్డారు. మీరు ఏ కాజ్ కోసం కృషి చేసారో...నా లాంటి మందమతులకు గుర్తుకు రావడం లేదు. కుల సంఘాలపై మీరు అప్పట్లో రాసిన వార్త...'డార్క్ ఎల్లో జర్నలిజం" అని నా నమ్మకం. ఈ వార్త వెతుకుతా...దీనిమీద మీకొక లెటర్ రాస్తా. మళ్ళీ..ఒక మిత్రుడు అన్నారు. ఎవరు సార్...మీ అజ్ఞాత మిత్రులు? వాళ్ళ పేర్లు చెబితే...వాళ్ళు మహానీయులో, అమాంబాపతు గాళ్లో తెలుసుకుని తరిస్తాం.

5) ఏమిటీ...ఆయన (వై.ఎస్.) పాదయాత్ర చేపట్టినప్పుడు 'ఆంధ్రజ్యోతి' మాత్రమే స్పందించి, ప్రాధాన్యత ఇచ్చిందా?  మీరు మాత్రమే ఇచ్చారా? ఎంత పెద్ద అబద్ధం! ఆ జన స్పందన చూసి మీడియా అంతా...స్పందించాల్సి వచ్చింది...చచ్చినట్లు. అది వై.ఎస్.కు మీరు చేసిన ఫేవరా? మీ డ్యూటీ మీరు చేశారు. అంతే.


6) టీ.ఆర్.ఎస్.కు ముందు 'బాసటగా నిలిచి' తర్వాత...'చంద్ర శేఖర రావు వ్యవహార శైలి అరాచకంగా మారడం.." అని ఒక మాట రాసారు. మన దురహంకారపు జర్నలిజాన్ని ప్రతిబింబించే మాటలివి. మీకు ఎవరి 'శైలి' నచ్చితే...వారిని ఎత్తుతారు....ఎవరు "దురహంకారులో" మీరే నిర్ణయిస్తారు...వారిని కూలదోస్తారు. జర్నలిస్టులు చేయాల్సిన పని ఇదా? జర్నలిజం ధ్యేయం ఇదని మీరు అనుకుంటున్నారా? కాస్త..జనానికి కూడా చాన్స్ ఇవ్వండి సార్....


7) "కాంగ్రెస్, టీ.డీ.పీ. కి ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పక్షం ఉంటే మంచిదని పలువురు భావించినట్లుగానే 'ఆంధ్రజ్యోతి' భావించింది.."అని రాసారు.  ఎవరా "పలువురు?". ఒకవేళ...ఈ మీ "పలువురు"...రాజకీయ ప్రక్షాళనకు వేమూరి రాధాకృష్ణ గారు ఎన్నికలలో నిలబడాలంటే  సై అంటారా? అలాగే....ఈ రొచ్చు జర్నలిజంలో కమలం లాంటి 'ఆంధ్రజ్యోతి' ఉంటే పరువు తక్కువ...అని ఈ మీ 'పలువురు' భావిస్తే...పేపర్, చానెల్ మూసిపారేసి వెళ్ళిపోతారా? 

8) ఓరి నాయనోయ్. "కృతఘ్నులు" మాత్రమే అలా చేయగలరు...అని కూడా రాసారు! మీరు రాసింది ఎలా ఉందంటే...."నేను ఆ పార్టీలకు మంచి ప్రచారం ఇస్తే...వాళ్ళు కనీసం కృతజ్ఞతాభావం తో మెలగడం లేదు...ఇదేమి దారుణం?" అన్నట్లుంది. మీడియా పని...మీడియా చెయ్యాలి గానీ...ఈ కృతజ్ఞత ఆశించడం ఏమిటి? ఆశించినా....మరీ బరితెగింపుగా ఈ 'ప్రత్యేక వ్యాసం' లో రాసుకోవడం ఏమిటి? మీకు నిజంగానే...ఏదీ దాచుకోవడం రాదు సార్.


9) 'కాదూ కూడదు అనుకుంటే, ఇప్పుడు కొత్తగా ఎవరికి వారు, తమ పార్టీ ప్రచారానికై పత్రికలు లేదా చానెళ్ళు ప్రారంభిస్తున్నట్లుగానే...'చిరంజీవి అండ్ కో' కూడా ఒక పత్రిక గానీ..ఛానల్ గానీ, లేదా రెండూ గానీ ప్రారంభించుకోవచ్చు,' అని మీరు రాసారు. మీరు తప్ప మిగిలిన వాళ్ళు పార్టీ ప్రచారానికి పత్రికలు, ఛానెల్స్ పెట్టుకుంటున్నట్లు మీరు చెప్పడం వల్ల తెలిసింది. 'చిరంజీవి అండ్ కో' ఏమిటండీ? నోటికొచ్చింది రాయండి....ఇదే జర్నలిజం అనండి....తెలుగు జనం చేసుకున్న పాపం. 


10) బ్రదర్...మన నీచ నికృష్ట రాజకీయ జర్నలిజం...మన మనసులో అసలు భావాలు....'ప్రత్యేక వ్యాసం' సాగే కొద్దీ బైటపడసాగాయి. "చిరంజీవి విషయంలో మీడియా విశ్లేషకులు, మేథావులు, రాజకీయ పరిశీలకులు కూడా సరిగా అంచనా కట్టలేకపోయారు. అందుకే..అధికారానికి దూరంగా, కేవలం 18 స్థానాలకే పరిమితం చేస్తూ తీర్పు ఇచ్చారు," అని రాసారు.
రాధాకృష్ణ గారూ...ఇది ఘోరం. ఇక్కడ చిరంజీవిపై మీ అక్కసు ప్రతి అక్షరంలో కనిపిస్తున్నది. బలహీనుడి పక్షం నిలబడతామని ముందు చెప్పారు కదా....చిరంజీవి బలహీనుడే కదా...(మీ ఓట్ల లెక్కలనుబట్టి చూస్తే). మరి ఆయనకు మద్దతివ్వడం మీ అజెండా కావాలి కదా? 

ఈ రాతకూతలతో మీరు ఇచ్చిన స్ఫూర్తితో...నేను కూడా ఒక కటువైన మాట చెబుతాను, మరోలా అనుకోకండి. ఈ రాష్ట్రాన్ని రెడ్లు, కమ్మలే ఏలాలా? బడుగులు..దళితులూ..డక్కామొక్కీలు తింటూ పైకి ఎదగ కూడదా? బీ.సీ.లను మీరు ఎదగనివ్వరా? మామకు కోలుకోలేని ద్రోహం చేసి...అధికారం చేచిక్కించుకున్న నాయకుడు....మీకు ఆదర్శపురుషుడు. మిగిలిన వాళ్ళు పిచ్చ జనం. ఏమి నీతి సారు?  


రాయాల్సింది ఎంతో ఉంది రాధాకృష్ణ భాయి..ఇక ఆపుతాను. "లోపాలను ఎత్తి చూపితే సవరించుకోవడం విజ్ఞుల లక్షణం....,"అని మీరు ఈ 'ప్రత్యేక వ్యాసం' లో ఒక మాట రాసారు. ఈ లేఖలో నేను రాసిన మాటలకు కోపగించుకోరని...మీరు, మీ బృందం విజ్ఞులు కాబట్టి....లోపాలు ఉంటే...సవరించుకుని...పేపెర్, ఛానల్ లతో తెలుగునేలను తెగ ఉద్ధరించాలని  కోరుకుంటూ...
మీ
అబ్రకదబ్ర
ఫిలిం నగర్
హైదరాబాద్

32 comments:

lakshman said...

Really excellent article.

Anonymous said...

దున్నపోతు మీద వాన కురిసినట్లే. ఏమీ ప్రయోజనం ఉండదు. కొమ్ము విసరాలని ప్రయత్నించకపోతే చాలు

Anonymous said...

Its the Nice post ever read in this blog !

Ramu garu, please convey my 'THANKS' to Abrakadabra.

-Sriram

Ajit Kumar said...

కత్తికన్నా కలం గొప్పదని మరోసారి నిరూపించారు. చాల బాగుంది.

Saahitya Abhimaani said...

I hope many more Abrakadabras come and fight the menace of third rate journalism from within.

VARA said...

adugadugunaa ahnkaaram ...jurnalism viluvaluleni.boothu vyaasam..radhaa krishna raasindhi.....News paper MD kaadu kadaa....school ane maata teleekunda...chittu kaagitaalu erukone vyakti..inthakante degnified gaa behave chese vaadu......
Ramu gaari vyaasam lo cheppinatlu...Ramu gaaru 30% of the story ni koodaa cheelchi chendaada ledu.......inkaa chaalaa vundhi.........siggu vunna edavite indulo konninaa oppukovaali ..correct chesukovaali....

Modata chesin de boothu pani...current news ki sambandam leni oka story prachaaram chesi.....galaata cheyaalanukonaadu.........
enno rojula nunchi mamalni vadileyandi ani mothukontuna PRP vaallu...calm gaa vunte party ni inkaa thokkutoone vunaarani...tiragabaddaaru.........

daani ki malli inko boothu pani modaletaaru ABN sirs............vaallu velli CM ki memo ivvochu ...PRP ni ban cheyamani EC ki letter pampochu......Motham vishayaanni vichaarana jaripinchamannanduku ....malli buradha poosukoni...vere vaalla ki pooyataani ki bayalderaadu...ee Dammunnodu.....siggu vidichesina vaadi ki...dammu vunna vaadi ki....a small line diffrence vundhi...adi manodi ki telisinatlu ledu.........

VARA said...

"DAMMUNODU"....."siggu vadilesinodu"......ee rondu maatala ki chaalaa meaning diference vundhi..........chaalla thin border vundhi veeti madya........

Manodi ki aa difference teliyatam ledu.....

Anonymous said...

మీ వ్యాసం లో రెడ్లు ,కమ్మలె పరిపలించాలా ? అనే విషయాన్నీ నేను తీవ్రం గా వ్యతిరేకిస్తున్నాను .రెడ్డి లేదా కమ్మ లేదా కాపు ,వెనుకబడిన కులాల వారు అయినా ముఖ్యమంత్రి అయితే ఆయా కులాలవాళ్ళకి మేలు చేస్తారని మీరు భావిస్తే అది మీ ఆవేశం గానే అర్థం చేసుకోవాలి .నేను రెడ్డిని అయితే చెన్నారెడ్డి /విజయభాస్కర రెడ్డి /రాజశేఖర రెడ్డి నాకు మేలు చేసి ఉంటారా .కులాల సమూహాలు చాల చిన్న స్తాయిలో మాత్రమే మనిషి ఎదుగదలకు సహాయపడతాయి .రెడ్లు ,కమ్మలు,కాపులు,వెనుకబడిన వాళ్ళు ,మైనారిటీలు అని విడదీసి చూపిస్తున్నది మీడియా ,మనలోని నిరాశ ని ,మన బద్దకాన్ని ,లక్హ్యం పై కాక ఇలాంటి ఏదో ఒక కారణాన్ని చూసుకిని సంతృప్తి పడతాము కనుకే మీడియా ఏది చెప్తే అది నమ్మే పరిస్తితి కి వచ్చాం .ఎ కులపు వాడిన నాది నీది ఒక కులం కాబట్టి నీకు లంచం లేకుండా పని చేస్తానని అంటాడ ? సొంత కులాల మీద ప్రజల్లో ఎంత అసహ్యాన్ని కలిగిస్తున్నారంటే ,టి వి ౯ వారంటారు కులం పేరడిగితే చెప్పుతో కొట్టాలి అని ,మరి రాజకీయ నాయకులూ ,మీడియా వాళ్ళు బూతు చూపిస్తే ,పిల్లలు చెడిపోతే దానికి దేంతో కొట్టాలి .ప్రజల అమాయకత్వాన్ని కొన్నాళ్ళు సినిమా లు (కొన్ని),స్వాములు ,ఇప్పుడు మీడియా సొమ్ము చేసుకొంతున్నై .ప్రభుత్వ పధకాలు గురించి ఒక్క మీడియా వాడిన ఫోకుస్ చేసి ,ఇదిగో మీరు ఇలా వెళ్తే మీరు లంచం లేకుండా పని అవుతుంది లాగా ఏమైనా programmes ఉన్నాయా .మనిషి కి ఉండే బలహీనత ల మీదే మీడియా ద్రుష్టి .ఒకప్పుడు లాయర్లు ,స్టూడెంట్స్,ఉద్యోగస్తులు ,కమ్మునిస్తులు ప్రభుత్వాన్ని బెదిరించేవాళ్ళు (మంచికోసం లేదా సొంత అవసరాల కోసం ).ఇప్పుడు మీడియా .మీడియా వాళ్లకి డబ్బిస్తే చిన్న సమస్య పెద్దదిగా చేసి ,అయ్యో ఇలా కాకపోతే మనం చాలా నష్టపోతామేమో ? అని ప్రజల్లో అభిప్రాయం వచేచే టట్లు చేస్తారు .జర్నలిస్టులనే వాళ్ళు నిజంగా అంత స్వచమైన వల్లే అయితే సమాజం లో ఇంత కుళ్ళు ఉండదు .
రాస్తే చాల ఉంది
శ్రీనివాస రెడ్డి

Anonymous said...

మీ వ్యాసం లో రెడ్లు ,కమ్మలె పరిపలించాలా ? అనే విషయాన్నీ నేను తీవ్రం గా వ్యతిరేకిస్తున్నాను .రెడ్డి లేదా కమ్మ లేదా కాపు ,వెనుకబడిన కులాల వారు అయినా ముఖ్యమంత్రి అయితే ఆయా కులాలవాళ్ళకి మేలు చేస్తారని మీరు భావిస్తే అది మీ ఆవేశం గానే అర్థం చేసుకోవాలి .నేను రెడ్డిని అయితే చెన్నారెడ్డి /విజయభాస్కర రెడ్డి /రాజశేఖర రెడ్డి నాకు మేలు చేసి ఉంటారా .కులాల సమూహాలు చాల చిన్న స్తాయిలో మాత్రమే మనిషి ఎదుగదలకు సహాయపడతాయి .రెడ్లు ,కమ్మలు,కాపులు,వెనుకబడిన వాళ్ళు ,మైనారిటీలు అని విడదీసి చూపిస్తున్నది మీడియా ,మనలోని నిరాశ ని ,మన బద్దకాన్ని ,లక్హ్యం పై కాక ఇలాంటి ఏదో ఒక కారణాన్ని చూసుకిని సంతృప్తి పడతాము కనుకే మీడియా ఏది చెప్తే అది నమ్మే పరిస్తితి కి వచ్చాం .ఎ కులపు వాడిన నాది నీది ఒక కులం కాబట్టి నీకు లంచం లేకుండా పని చేస్తానని అంటాడ ? సొంత కులాల మీద ప్రజల్లో ఎంత అసహ్యాన్ని కలిగిస్తున్నారంటే ,టి వి ౯ వారంటారు కులం పేరడిగితే చెప్పుతో కొట్టాలి అని ,మరి రాజకీయ నాయకులూ ,మీడియా వాళ్ళు బూతు చూపిస్తే ,పిల్లలు చెడిపోతే దానికి దేంతో కొట్టాలి .ప్రజల అమాయకత్వాన్ని కొన్నాళ్ళు సినిమా లు (కొన్ని),స్వాములు ,ఇప్పుడు మీడియా సొమ్ము చేసుకొంతున్నై .ప్రభుత్వ పధకాలు గురించి ఒక్క మీడియా వాడిన ఫోకుస్ చేసి ,ఇదిగో మీరు ఇలా వెళ్తే మీరు లంచం లేకుండా పని అవుతుంది లాగా ఏమైనా programmes ఉన్నాయా .మనిషి కి ఉండే బలహీనత ల మీదే మీడియా ద్రుష్టి .ఒకప్పుడు లాయర్లు ,స్టూడెంట్స్,ఉద్యోగస్తులు ,కమ్మునిస్తులు ప్రభుత్వాన్ని బెదిరించేవాళ్ళు (మంచికోసం లేదా సొంత అవసరాల కోసం ).ఇప్పుడు మీడియా .మీడియా వాళ్లకి డబ్బిస్తే చిన్న సమస్య పెద్దదిగా చేసి ,అయ్యో ఇలా కాకపోతే మనం చాలా నష్టపోతామేమో ? అని ప్రజల్లో అభిప్రాయం వచేచే టట్లు చేస్తారు .జర్నలిస్టులనే వాళ్ళు నిజంగా అంత స్వచమైన వల్లే అయితే సమాజం లో ఇంత కుళ్ళు ఉండదు .
రాస్తే చాల ఉంది
శ్రీనివాస రెడ్డి

Ramu S said...

శ్రీనివాస రెడ్డి గారు,
మీరు సదుద్దేశంతో మంచి విషయం ప్రస్తావించారు. కులాలను బట్టి ముఖ్యమంత్రులు నేరుగా మేలు చేయరు కానీ..మన రాష్ట్రంలో ఈ రెండు కులాల పెద్దలు రెండు పార్టీల పాలనలో బాగా బాగుపడ్డారు. ఇది వాస్తవం. ఉదాహరణకు...ఒక రెడ్డి డీ.ఎస్.పీ.(అవినీతిపరుడు) ని వై.ఎస్.హయాం లో నలుగురు ఎస్.పీ.లు ఏమీ చేయలేకపోయ్యారు. ఆ రెడ్డి డీ.ఎస్.పీ.గారు తన కులం వాళ్ళు ఆ జిల్లాలో తప్పు చేసినా ఏమీ అనే వారు కాదు. ఇలా ఒక పధ్ధతి ప్రకారం తెలీకుండా మేళ్ళు జరుగుతాయి. ఇప్పుడు రోశయ్య గారి కులస్తులు కొన్ని జిల్లాలలో హవా నడుపుకుంటున్నారు. కులం ఒక జాడ్యంగా తయారయ్యింది. కనిపించీ కనిపించని ప్రభావం చూపుతుంది. మీ లాంటి మంచి వాళ్లకు లాభం ఉండకపోవచ్చు కానీ...చాలా మందికి కులం ఇప్పుడు ఒక వరమండీ..
రాము

Anonymous said...

రాముగారు అబ్రకదబ్ర ఉత్తరాన్ని రాధాక్రిష్ణకు కూడా మెయిల్ చేయండి. బాగా బలిసి కొట్టుకుంటున్నడు.

Anonymous said...

శ్రీనివాస రెడ్డి చెప్పిన విషయం ఆలోచింప జేసేదిగా వుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడుల రాతల్లో కులదురభిమానం కనిపిస్తుంది. మొన్న ఓ గురువు ( ప్రొఫెసర్ అని చెప్పుకున్నాడు ) తనకు కులపరమైన అవార్డ్ వచ్చిందని బోర్డ్ వేసుకుని కూడలి లో వూరేగుతూ గర్వంగా చెప్పుకున్నాడు. :D

అర్క said...

నేను రెడ్డిగారి వాదనతో ఏకీభవిస్తాను. అక్రమాలు చేసేవాళ్ళు కలసి పనిచేయడానికి కులం అడ్డంకాదు. మహా అయితే కొన్నిసందర్భాలలో అది ఒక ప్రోత్సాహకం మాత్రమే. కులద్వేషాన్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవడానికి రాజకీయనాయకులు పన్నిన ఉచ్చులో మేధావులనుకొనేవాళ్ళూ ఇరుక్కుంటున్నారు. కులం ప్రభావం ఎంతవరకూ ఉంది అనేదానిపై ఒక వ్యాసం రాసి రామూగారికి పంపాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. త్వరలోనే పంపగలనని ఆశిస్తున్నాను. ఇన్నాళ్లకు కులం గురించి రెండో వైపు మాట్లాడే వారొకరు రెడ్డిగారి రూపంలో కనబడ్డారు. సంతోషం

మయూఖ said...

అబ్రకదబ్ర గారు చాలా మంచి వ్యాసం వ్రాసారు.ప్రజల అభిప్రాయాలతో పని లేకుండా తమ అభిప్రాయాలనే ప్రజల అభిప్రాయాలగా చెబుతున్న పత్రికా యాజమాన్యాలకు కనువిప్పు కావాలి.ప్రచురించిన రాము గారికి ధన్యవాదములు.

Alapati Ramesh Babu said...

అబ్రకదబ్రర గారు, అసలు జర్నలిసం నకు విలువలు తగ్గిచాలకాలము అయింది ఇప్పుడు జ్యొతి వారు చేసెది వలువలు వూడదిసి దిగంబరత్వాన్ని నిస్సిగు గా చూపి దానికి లెనిపొని వలువలు చుట్టి ప్రజాస్వమియ మీదకు వారి దాడీ తప్ప వెరె యేమి లెదు .ఇంతకన్న ప్రమాదము గావున్నది రాథక్రిష్న గారి వైకిరి వారు వారిని శ్రి నార్ల,ప్రసాద్, రామొజి లా ఆనుకుంటారు కాని వీరికి "హిరణ్యక్షుడి ఆహం ,రావణాసురిడి లెక్కలెని తత్వము,కంసుడి లా మూర్ఖత్వము అందుకె వారి పెపర్ మీద అన్నిసారులు అంతమంది దాడి .

venkata subba rao kavuri said...

ఒకప్పుడు లాయర్లు ,స్టూడెంట్స్,ఉద్యోగస్తులు ,కమ్మునిస్తులు ప్రభుత్వాన్ని బెదిరించేవాళ్ళు (మంచికోసం లేదా సొంత అవసరాల కోసం ). idi tappa srinivasa reddy gaari vaadana saastreeyamgaa vumdi. rama gaari vivaranalo nijamunnaa adi paakshikamae.yemta kula pichchi vumdanukunnaa vaadu koodaa somta laabham kosam itarulaku chesae daanilo tana kulapoodi koesam chaesaedi ......1 saatam koodaa vumdadugaaka vudadu. ayitae kulagajji gaallu ati chaestala valana yaedoo tega chaesinatlu paiki kanpistumdi. kaavaalamtae imkaa lootugaa pariseelimchadi. naa daggara booledanni vudaaharanalu vunnaayi.

venkata subbarao kavuri
edumudi. prakasam (dt)

Anonymous said...

పాత బస్తీలో అల్లర్లు మొదలయ్యాయి అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారే రోజులు దగ్గర పడ్డాయన్న మాట ... ముసలోడ్ని సాగనంపి ఏ గీతారెడ్డో లేక చంద్రబాబో తెర మీద కొస్తారన్న మాట

Indrasena Gangasani said...

Andhra jyothy kooda oka pathrikena..thu..thu..nechapu manishi raadha krishna gaadu..

Indrasena Gangasani said...

Andhra jyothy kooda oka pathrikena..thu..thu..nechapu manishi raadha krishna gaadu..

Vinay Datta said...

@Ramu:
I accept that caste is a boon for some people.Just because of that Abrakadabra cannot question a person belonging to any of those two castes about ' their own ' person becoming CM always. If he doesn't like it, let him work towards some other people becoming CM. If some people of CM's caste misuse his power, that should be taken up as an issue and fought against.
I donot belong to those two categories and am trying to evolve out of this system. But I donot mind any person of any caste becoming CM provided he is good and does justice to all sections of the society.

Anonymous said...

చిన్నతనంలో కిరోసిన్ స్మగ్లింగ్ చేసి, అదేదో ఘనకార్యం అన్నట్లుగా చెప్పుకున్న వేమూరి రాధాకృష్ణ నుంచి ఇంతకన్నా గొప్ప జర్నలిజం ఎలా ఆశిస్తాం?

-వార్తాహరుడు

kvramana said...

This is a nice and straight letter. But, I don't think anything that we are debating on was done out of ignorance.
Ramana

Anonymous said...

good article about the bad and ugly fellow, caste mental fellow radhakrishna

Anonymous said...

రాధాకృష్ణ జర్నలిసం ఎంత నీచంగా ఉందంటే, నిన్న రాత్రి ఆయన చానల్ లో ఓపెన్ హార్ట్ అట, లక్ష్మీ పార్వతితో. ఈయన గారు అదిగిన ప్రశ్నలు మచ్చుకి కొన్ని:
"మీకు గర్భం వచ్చిందా?"
"గర్భం రావాలని మీరే కోరుకున్నారా?"
"అవునూ, మీకు గర్భం ఎలా వచ్చింది?"
"ఆ గర్భం ఎలా పోయింది, మామూలుగానేనా?"
"మళ్ళీ మీరిద్దరూ ప్రయత్నించలేదా, గర్భం కోసం?"
"నేను మీకు అప్పట్లో పిల్లల్ని కనే ఆలోచనుంటే విరమిచుకోండి అని చెప్పాను గుర్తుందా?"

ఇదండీ వరస. ఈ ప్రశ్నలకి తోడు, అసహ్యమైన బాడీ లాంగ్వేజ్ ఒకటి. అది న్యూస్ చానెలా?, బూతు చానలా? ఛీ..

Anonymous said...

అబ్రకదబ్ర గారూ, రాము గారూ,
మీ మీ కులపోళ్ళని సీ ఎం గా చేసేద్దాం, అప్పుడు మీ సరదా తీరి, మీకు ఎంత లాభం కలుగుతుందొ తెలుస్తుంది.పబ్లిక్ గా ఒక కులాన్ని పేరుపెట్టి అనటం ఎంతవరకూ సంస్కారం? మనలో కుల స్పృహ లేక పోతె ఎదుటి వాడి కులతత్వం ఎలా అర్ధమౌతుంది? ఏ జపాన్ వాడో ఇండియా వస్తే వాడికి రెడ్లే పరిపాలిస్తున్నారని కోపం వస్తుందా? రాధాకృష్ణ మంచివాడు కాకపొవచ్చు, కానీ అతని మాటలకి కులతత్వం అంటగట్టటానికి, మీరెమైనా అతని బుర్రలోని ఆలోచనలని చదివేశారా? అన్ని కులాలలోనూ చాలీ చాలని బతుకుల వాళ్ళే ఎక్కువ. ఆయా కులాల లోని పెద్దవాళ్ళు చేసే పనులవలన లేని వాళ్ళకి చెడ్డపేరు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. రాజశెఖర రెడ్డి వలన అతని చుట్టూ ఉన్న వాళ్ళు లాభపడ్డారు. దానికి రెడ్డే కావలసిన అవసరం లేదు. అతని చుట్టూ ఉన్న రెడ్లు కొంచెం ఎక్కువ లాభ పడ్డారేమో.
రెడ్లకి కానీ కమ్మ వాళ్ళకె కానీ, సామాన్యమైన ప్రజలు బాగుపడేటట్లు, ప్రభుత్వం ఫార్మల్ గా ప్రకటించిన పధకాలు ఏమైనా ఉంటే చెప్తారా?
రెడ్లూ కమ్మలూ ముఖ్యమంత్రులు ఉండటం వలన ఏమైనా ఫేవర్ చెస్తే ఎక్కడ మిగిలిన కులాలు దూరం అవ్వుతాయో అని వాళ్ళు ఏమీ చెయ్యలేదు. చివరిగా వాళ్ళ వలన వాళ్ళ లో ఉన్న సామాన్య జనానికి చెడే కానీ మంచి తక్కువ జరిగింది.
ఇంకొక సారి ఆ రెండు కులాలు అని స్పందించే ముందు పైన చెప్పిన విషయాలని కూడా పరిగణన లోకి తీసుకొంటారని ఆశిస్తున్నాను.

Anonymous said...

అబ్రకదబ్ర గారూ, రాము గారూ,
మీ మీ కులపోళ్ళని సీ ఎం గా చేసేద్దాం, అప్పుడు మీ సరదా తీరి, మీకు ఎంత లాభం కలుగుతుందొ తెలుస్తుంది.పబ్లిక్ గా ఒక కులాన్ని పేరుపెట్టి అనటం ఎంతవరకూ సంస్కారం? మనలో కుల స్పృహ లేక పోతె ఎదుటి వాడి కులతత్వం ఎలా అర్ధమౌతుంది? ఏ జపాన్ వాడో ఇండియా వస్తే వాడికి రెడ్లే పరిపాలిస్తున్నారని కోపం వస్తుందా? రాధాకృష్ణ మంచివాడు కాకపొవచ్చు, కానీ అతని మాటలకి కులతత్వం అంటగట్టటానికి, మీరెమైనా అతని బుర్రలోని ఆలోచనలని చదివేశారా? అన్ని కులాలలోనూ చాలీ చాలని బతుకుల వాళ్ళే ఎక్కువ. ఆయా కులాల లోని పెద్దవాళ్ళు చేసే పనులవలన లేని వాళ్ళకి చెడ్డపేరు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. రాజశెఖర రెడ్డి వలన అతని చుట్టూ ఉన్న వాళ్ళు లాభపడ్డారు. దానికి రెడ్డే కావలసిన అవసరం లేదు. అతని చుట్టూ ఉన్న రెడ్లు కొంచెం ఎక్కువ లాభ పడ్డారేమో.
రెడ్లకి కానీ కమ్మ వాళ్ళకె కానీ, సామాన్యమైన ప్రజలు బాగుపడేటట్లు, ప్రభుత్వం ఫార్మల్ గా ప్రకటించిన పధకాలు ఏమైనా ఉంటే చెప్తారా?
రెడ్లూ కమ్మలూ ముఖ్యమంత్రులు ఉండటం వలన ఏమైనా ఫేవర్ చెస్తే ఎక్కడ మిగిలిన కులాలు దూరం అవ్వుతాయో అని వాళ్ళు ఏమీ చెయ్యలేదు. చివరిగా వాళ్ళ వలన వాళ్ళ లో ఉన్న సామాన్య జనానికి చెడే కానీ మంచి తక్కువ జరిగింది.
ఇంకొక సారి ఆ రెండు కులాలు అని స్పందించే ముందు పైన చెప్పిన విషయాలని కూడా పరిగణన లోకి తీసుకొంటారని ఆశిస్తున్నాను.

Ramu S said...

అనామిక గారూ..
మీ బాధ అర్ధం అయ్యింది. Your point has been taken.
thanks
ramu

Anonymous said...

అబ్రకదబ్ర గారూ,
రెడ్లూ కమ్మలూ సీ ఎంలు అవ్వటం రాష్ట్రం లోని రాజకీయ సామాజిక సమీకరణాల వలన. కేవలం రెడ్లో కమ్మలో వోట్లు వేస్తే వాళ్ళు పవర్ లోకి రారు. కిందటి ఎలక్షన్లలో చిరు కూడా, "ఆ రెండు కులాలేనా..సామాజిక న్యాయం కావాలి",అన్నాడు. అలా అన్నప్పుడు ఆ రెండు కులాలలోని నాయకులు కొంతమంది ఆయన పార్త్టీ లో చేరారు. ఐనా ఆయన గెలవ లేదు. అంత మాత్రాన ఆయనను ప్రజలు తిరస్కరించినట్లేనా? ఆయన తో పాటు ఉన్న ఆ రెండు కులాల వాళ్ళు కుల తత్వంలేని మహానుభావులా?
మీ కులపు వ్యక్తి ముక్యమంత్రి అయ్యి,మీ కులపు వాళ్ళ కి లాభం కలిగింది అనుకొందాం, అప్పుడు మీరు చాలా విచారిస్తారా?

Anonymous said...

anonymous garu,
కమ్మ కుల గజ్జి ఉన్న వాడు కమ్మ దేవతని(?) ఇలాంటి ప్రశ్నలు ఎలా అడిగాడబ్బా? :-)

Anonymous said...

రాధా క్రిష్ణ బుధ్ధిని బాగా ఎండగట్టారు. కామెంట్లలో ఒక విషయం తో ఏకీభవించను. రాధా క్రిష్ణ కుల పిచ్చి తో బురద జల్లుతున్నాడన్నారు. అలా అయితే అంతకు ముందు కొత్తలో చిరు ని సపోర్ట్ చేసేవాడు కాదు కదా?
రాధాక్రిష్న ది స్వార్ధం అనిపిస్తోంది. ముందు గా చిరు పాపులారిటీ ఉపయోగించుకొని పత్రిక సర్క్యులేషన్ పెంచుకొందామని చూశాడు. ఇప్పుడు ఏదో ఒక వివాదం సృష్టించి సర్క్యులేషన్ పెంచాలని చూస్తున్నాడు.

భాస్కర రామి రెడ్డి.

Anonymous said...

simply great

Anonymous said...

chaalaa baaga raashaaru fadhakrishna babu lanti vaallaku kulam lai kanna swaarthame yekkuva dani kosam vaaru yemaina chestaru avasaram aite kulamnu kuda upayoginchukuntaru

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి