Monday, March 29, 2010

విలేకరి-నేత-పోలీసు-అధికారి: ఇదీ నయా మాఫియా

రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు విలేకరులు ఒక టూరిస్టును వేధించి...ఆమెను దోచుకున్నట్లు వచ్చిన వార్త కలవరపెట్టింది. ఈ బాపతు దొంగనాయాళ్ళు ఈ వృత్తిలో ఉన్నారని తెలుసుగానీ...మరీ ఇలా బరితెగించి దోచుకుంటారని అనుకోలేదు. ఈ వార్త పెద్దగా బైటికి రాకుండా ఛానెల్స్, పేపర్స్ జాగ్రత్తలు తీసుకున్నాయి. 

ఒక డజను ఛానెల్స్, ఒక అర డజను పెద్ద పేపర్లు, వందలాది చిన్న పేపర్లకు కలిపి...రాష్ట్రంలో వేల సంఖ్యలో విలేకరులు ఉన్నారు. 1989 ప్రాంతంలో 'ఈనాడు' రామోజీ గారు మినీలు అన్న పిల్లపేపర్లను సృష్టించి...వాటికి విలేకరులను పెట్టారు. నెట్ వర్క్ ఉండాలని మండలానికి ఒక విలేకరిని నియమించారు. మొదట్లో ఈ విలేకరుల (stringers/ contributors) నియామకంలో కొంత నాణ్యత పాటించేవారు కానీ...కాలక్రమేణా...అన్ని పేపర్లు/ఛానెల్స్ ఆ నమూనాను కాపీ చేసి నాలుగు అక్షరం ముక్కలు రాయడం వచ్చిన వాడినల్లా విలేకరిగా తీసుకున్నాయి. రియల్టర్లు, చిట్ ఫండ్స్ వాళ్ళు, రాజకీయ కండూతి ఉన్న కోటీశ్వరులు... పెట్టిన ఛానెల్స్ గత రెండేళ్లుగా ప్రతి మండలంలో ఒక కేమేరామ్యాన్ ను పెట్టాయి. ఇది నిజానికి శ్రమ దోపిడీ అయినా...ఈ ఉజ్జోగాలకు బాగానే పోటీ ఉంటుంది. 

ఇవ్వాళ ప్రతి మండల కేంద్రంలో విలేకరి అన్న ముద్ర ఉన్న వాళ్ళు కనీసం 40 మంది తయారయ్యారు. వీళ్ళలో సగం మంది మంచోళ్ళు ఉన్నారనుకున్నా...ఒక 20 మంది ఏక్ దం అవినీతిపరులు, బేవార్స్ గాళ్ళు విలేకరులుగా అవతారం ఎత్తారనేది నిష్టురసత్యం. వీళ్ళు ప్రభుత్వం నుంచి బస్సు, రైల్ పాసులు పొందుతారు. వీళ్ళకు వాళ్ళ సంస్థలు సామాజిక హోదా ఇచ్చాయి, కానీ...ఆర్ధిక హోదా ఇవ్వలేదు. దాంతో...సోషల్ స్టేటస్ కోసం....వీళ్ళలో అత్యధికులు అవినీతికి పాల్పడుతున్నారు. 

కొందరు...విలేకర్లు...తమ ప్రాంతంలో రాజులుగా వెలుగొందుతున్నారు. వాళ్ళు ఏ పాపానికైనా ఒడిగట్టడానికైనా వెనుకాడరు. వీరి దగ్గర కలం బలం ఉంది కాబట్టి...ఆ ప్రాంతంలో రాజకీయ నేతలు, పోలీసులు, అధికారులు, కాంట్రాక్టర్లు వీరి అడుగులకు మడుగులొత్తడం ఆరంభించారు. ప్రచారం కోసం వీళ్ళ మీద ఆధారపడుతున్నారు. వీరంతా 'కలిసిమెలిసి' జీవిస్తున్నారు. ఇలా...రాష్ట్ర వ్యాప్తంగా విలేకరి-నేత-పోలీసు-అధికారితో కూడిన నయా మాఫియా ఏర్పడింది. ఇది ప్రమాద స్థాయిని ఎప్పుడో దాటింది. కానీ...ఎవ్వరూ దీనిపై బహిరంగ చర్చకు దిగడంలేదు. ఎవడి భయం వాడిది.

విలేకరుల దర్జా వ్యవహారం చూసిన...జేబు దొంగలు, దారి దోపిడీ గాళ్ళు కూడా...'అబ్బ విలేకరి ఉజ్జోగం ఉంటే చాలు..... పబ్లిగ్గా...గౌరవంగా...దంచుకోవచ్చు.." అని గుర్తించి....డబ్బు పెట్టో, కులాన్ని వాడుకునో విలేకరులు అయిపోయ్యారు. ఇప్పుడు రోజూ పేపర్లలో సుద్దులు చెప్పే యాజమాన్యాలు....ఈ విలేకరులను అడ్డంపెట్టుకుని....ప్రైం ప్రాంతాలలో స్థలాలు ఛీప్ గా కొనుకుని స్థిరాస్తులు సమకూర్చుకున్నాయి. ఫుల్ టైం ఉద్యోగులు అంతా పత్తిత్తులు అని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. ఈ పార్ట్ టైం వాళ్ళ వార్తలు ఎక్కువగా ప్రచురిస్తూ/ప్రసారం చేస్తూ....వారి నుంచి...సొరకాయలు, చేపలు, బీరుకాయలు కాజేసే వాళ్ళు చాలా మంది మాకు తెలుసు. ఇక్కడ క్వాలిఫికేషన్స్ తో పని లేదు...కాబట్టి...అమాం బాపతు గాళ్ళు విలేకరులయ్యారు. అందరూ...ఇలా ఉంటారని చెప్పడం తప్పు కానీ...చాలా మంది ఇలా ఉంటారని మా పరిశీలనలో తేలింది. 
మొత్తం మీద....రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ఈ మాఫియా విస్తరిస్తున్నది. ఇది అవినీతిని పెంచి పోషించే వ్యవస్థ. చాప కింద నీరులా విస్తరించింది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక...స్థానిక ప్రజలు చస్తున్నారు. ఈ విలేకరులు...చాలా చోట్ల భూ పంచాయితీలు చేస్తున్నారు. వీళ్ళకు ఇసుక వ్యాపారాలున్నాయి. కొందరు వివిధ కేసులలో మధ్యవర్తులుగా మారి తీర్పులు చెప్పి దండుకుంటున్నారు. ఇదేమిటని ఈ విలేకరులను మందలించామా....రేపు వీళ్ళు అంతా జమై ఏదో ఒక మిషతో వాళ్ళను పేపర్లోకి ఎక్కిస్తారు, అభూతకల్పనలు సృష్టించి....పరువు పంచనామా చేస్తారు. వీళ్ళ జోలికి పోతే...'పత్రికా స్వేచ్ఛ'కు సంకెళ్ళని అరిచి గోలపెడతారు. వీళ్ళు చాలా మంది నుంచి బలవంతానా....వ్యాపార ప్రకటనలు వసూలు చేస్తారు. ఆ ప్రకటనలలో కొంతభాగం మీడియా హౌజ్ లు వీళ్ళకు ఇస్తాయి...కాబట్టి...వీళ్ళు వార్తకు, ప్రకటనకు ముడి పెట్టి బాగా సంపాదిస్తారు.

ఈ విధంగా...అన్ని జిల్లాలో...అవినీతి వర్ధిల్లుతున్నది. గూండాగిరి సాగుతున్నది. తప్పులు ఎత్తి చూపాల్సిన విలేకరులు....కిమ్మనక పోవడం వల్ల..చాలా విషయాలు వెలుగులోకి రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇది సభ్య సమాజం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఇది రానున్న రోజుల్లో మరింత వెర్రి తలలు వేసి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన 'ఫోర్త్ ఎస్టేట్' మూలాలను నిర్వీర్యం చేయబోతున్నది.

నాకు అప్పోయింట్మెంట్ లెటర్ ఇస్తూ..."బాబూ...నువ్వు విలేకరివి కాదు. సమాజ సేవకుడివి...గుర్తు ఉంచుకో," అని 'ది హిందూ'లో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీ విరమణ చేసిన దాసు కేశవ రావు గారు నాకు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఆయన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చి...ఎప్పుడూ సన్మార్గంలో నిలిపాయి. ఇప్పుడు అలా మంచి చెప్పే నాథుడు లేదు, పాటించే వాడూ లేదు. మరెలా? మీకు తెలిసిన అవినీతి విలేకరుల గురించి రాయండి. రోజూ ఈ అంశం మీద కాసేపు కన్నీళ్ళు పెట్టుకుని....గుండె బరువు తీర్చుకుందాం. అంతకన్నా....మనం చేయదగినది ఏదీ లేదు.

14 comments:

Anonymous said...

eenadu diggajam d.n.prasad gariki sannihithudaina oka eenadu contributor karimnagar townlo panichesthadu. vayasu sumaru oka 45 yrs untundi. karimnagar jillalo eeyanevaro teliyani nayakudu gani, adhikari gaani undaru. antha strong. staff reporter evarochina eeyana kanusannallo melagali. ledhante manugada kashta,. ika eeyana sampadhane enthante ninnane oka function hall kuda open chesadu. kareedaina landlo vishalamaina function hall. koduku, kuthuru engeneering donationstho chadivaru. ippudu koduku americalo. eeyana neethi entha ante.. zilla parishadlo jarige prathi pani ki eeyanaku 10 % commission muttalsindhe. stationary contracts anni ayana thammudike. eeyana gurinchi cheppalante pedda liste undi. meeru rasina vyasaniki example ivvadaniki ee vivaralu isthunnannu. rashtravyapthanga ilanti vilekarulu kokollalu. meeru anumathisthe rojokoka example isthanu. nijalu mathrame..

Anonymous said...

You are right..most of them are black-mailers.

విశ్వామిత్ర said...

హమ్మయ్య! ఇన్నాళ్ళకి ఒక నిజాన్ని ఒప్పుకున్నారు.... విలేకరులలో వెధవలున్నారని!!

Prasad said...

రామూ గారూ,
గొంగట్లో తింటూ వెంట్రుకలు వెతకటం అనవసరం. సమాజం లోని అన్ని రంగాలలోనూ విలువలు దిగ జారాయి.
ఇలా అన్ని రంగాలలోనూ విలువలు దిగజారటానికి ముఖ్యకారణం మన ప్రజలకి స్వాతంత్ర్యం, ప్రజస్వామ్యమూ వారి లోని చైతన్యమూ, వారు చేసిన పోరాటాల ఫలితం గా కాకుండా, గాంధీ నెహ్రూ లాంటి నాయకుల ఉదార బహుమతులు గా రావటమే. బ్రిటీష్ వాళ్ళ నుంచీ వాళ్ళ్కు లాభసాటి అవ్వక పోవటం వలన వాళ్ళె వదిలి వెళ్ళిపోయారు.

దీనికి పరిస్కారం రెండు దసలలో ఉంటుంది.
1. చిన్నపిల్లల నుంచీ సరైన విలువలు బోధించే విద్యా వ్యవస్థ.
2. పిల్లలు పెద్ద వాళ్ళైన తరువాత ఆ విలువలు పాటిస్తే వారికి మన్ననలు ఇచ్చే సమాజం. ఇలాంటి వ్యవస్థను తయారు చేయటం మన నాయకుల బాధ్యత.

ఐతే ఇవన్నీ జనాల చొరవతో మొదలు కావాలి. లేకపోతే మళ్ళీ మొదటికే వెళ్తాయి.
జనాలకి కి చొరవ రావాలంటే ఈ వ్యవస్థ ఇంకా దిగజారాలి. నిత్యజీవనం నరకమైతే కానీ జనాలకు పట్టదు . అప్పుడే జనాలు తిరగబడి, తమకున్న స్వాతంత్ర్యం విలువ తెలుసుకొంటారు. పాశ్చాత్య దేశాలలో జరిగిన విప్లవాలన్నీ ఇలాంటివే.

Anonymous said...

పత్రిక మరియు వివిధ చానల్ల యాజమాన్యాలే బ్లాక్మైలర్లుగా ఉన్నప్పుడు విలేఖరుల నుంచి మంచితనం ఆశించడం ప్రజల అవివేకమే అవుతుంది.నాలుగు ఎస్టేట్స్ భ్రష్టు పట్టి పోయాయి.ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ప్రజలను అందరూ దోచుకుంటున్నారు.ప్రజలు కూడా రాజకీయ నాయకుల మీద , అధికార యంత్రాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద,నాలుగో ఎస్టేట్ అనబడే ప్రెస్ మీద నమ్మకం కోల్పోయారు. ప్రజలను వీరందరి బారి నుండి దేవుడే రక్షించాలి.

Anonymous said...

పత్రిక మరియు వివిధ చానల్ల యాజమాన్యాలే బ్లాక్మైలర్లుగా ఉన్నప్పుడు విలేఖరుల నుంచి మంచితనం ఆశించడం ప్రజల అవివేకమే అవుతుంది.నాలుగు ఎస్టేట్స్ భ్రష్టు పట్టి పోయాయి.ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ప్రజలను అందరూ దోచుకుంటున్నారు.ప్రజలు కూడా రాజకీయ నాయకుల మీద , అధికార యంత్రాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద,నాలుగో ఎస్టేట్ అనబడే ప్రెస్ మీద నమ్మకం కోల్పోయారు. ప్రజలను వీరందరి బారి నుండి దేవుడే రక్షించాలి.

young indian said...

రాము గారికి,
మీ టపాలలో మరో మైలురాయి ఇది. మీరు రాసింది అక్షర సత్యం. కలం బలంతొ అక్షరాలను కత్తులుగా వాడుతున్న ఈ దారి దొపిడిగాల్ల గురించి ఒక జర్నలిస్టు అయివుండి నిస్పక్షపాతంగా మీ అభిప్రాయాన్ని వెలిబుచిన్నందుకు మీకు ,మీ ధైర్యానికి జొహార్లు. సమాజంలొ అవినితి కి ప్రధానకారనం అధికార యంత్రాంగం,నేతలు మరియు వ్యాపరవెత్తలు అనే త్రికొనం అని చెప్తారు ఇప్పుదు వీల్ల సరసన కలాలు చెరడంతొ త్రికొనం కాస్త చతుర్భుజం అయిణ్ది. చైతన్యవంతులైన ప్రజలె వీరికి బుద్ది చెప్పాలి ఆరోజు త్వరగా రావలని కొరుకుంటు.....

Ramu S said...

Hi first anonymous,
I too came to know about the contributor you were referring to. Please pass on the information about corrupt correspondents. Please type it in Telugu. Please stick on to the TRUTH.
Cheers
Ramu

Anonymous said...

నేను ఉదయం లో కంట్రిబ్యూటర్ గాచేరాను డిగ్రీ ఫైనలియర్ చదువుతూనే .అప్పుడొక ఆవేశం. నిజాయితీగా వ్రాయటం మనబాధ్యత అనే నమ్మకం . తరువాత వార్తలో చేసాను. ఇక ఈరంగం లో నిష్ణాతులైన మీకు చెప్పేందుకేముంది. పొద్దున టిఫిన్ కాన్నుంచి సాయంత్రం మందు పార్టీ దాకా ఎవరెవరిని స్పాన్సర్ాచేయాలో నిర్ణయించుకునే సీనియర్స్ నుచూసి కడుపులో దేవినట్లుండేది . అడ్దగోలుగా వార్తలు వ్రాస్తావని నన్ను విమర్శించేవారు. ఏదైనా ప్రత్యేక కవరేజ్ లకు వెల్లినప్పుడు రిపోర్టర్ల కోసం ఏర్పాటుచేసిన వాహనలలో ఎక్కటానికి కూడా మావంటీవాల్లకు చోటుండదు. అలా అడుక్కోవాలసిన ఖర్మ మాకులేదని స్వంతంగానే వెల్లేవాళ్లం.
ఇక స్పెషల్ లు వెసేప్పుడు యాడ్ ఏజన్సీలకు సహకరించమని చెప్పేస్తాయినుంచి ,నేరుగా విలేకరులకే టార్గెట్ లు ఇచ్చే స్థాయికి దిగజారుతున్న ప్రమాదాన్ని కనిపెట్టి .ఆవృత్తికి ఒక నమస్కారం పెట్టి వచ్చేసాను . యాడ్ కోసం ఒక లీడర్నో మరొహడినో దేబిరించి .వాడిమీద మరుసటి రోజే ఏముఖం పెట్టుకుని వార్తవ్రాస్తాము ?

ఇక ఇప్పుడు కొందరు మండలస్థాయి విలేకర్లలో "బువ్వ"గాళ్లను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది.
కేరక్టర్ తో పనిలేదు. పేపర్లు బుక్ చేయగలిగితే చాలు . ఇహ నీతికి నిఖర్సైన చిరునామా అని మ్ ఆపేపర్లో విలేకరులపై నిఘాఉంచి ఆరోపణలను ప్రిశీలించే పత్రికగా గప్పాలుకొట్టుకునే దాని పరిస్థితి వేరుగాలేదు. ఇక్కడ దాని ప్రతినిధులకు ఇదొక ఆదాయవనరు .అంతే . పైన ఒక మితృడన్నట్లు గొంగట్లో అన్నంతింటూ వెంట్రుకలేరడం కుదరదేమో !

దుర్గేశ్వర

Anonymous said...

నేను ఉదయం లో కంట్రిబ్యూటర్ గాచేరాను డిగ్రీ ఫైనలియర్ చదువుతూనే .అప్పుడొక ఆవేశం. నిజాయితీగా వ్రాయటం మనబాధ్యత అనే నమ్మకం . తరువాత వార్తలో చేసాను. ఇక ఈరంగం లో నిష్ణాతులైన మీకు చెప్పేందుకేముంది. పొద్దున టిఫిన్ కాన్నుంచి సాయంత్రం మందు పార్టీ దాకా ఎవరెవరిని స్పాన్సర్ాచేయాలో నిర్ణయించుకునే సీనియర్స్ నుచూసి కడుపులో దేవినట్లుండేది . అడ్దగోలుగా వార్తలు వ్రాస్తావని నన్ను విమర్శించేవారు. ఏదైనా ప్రత్యేక కవరేజ్ లకు వెల్లినప్పుడు రిపోర్టర్ల కోసం ఏర్పాటుచేసిన వాహనలలో ఎక్కటానికి కూడా మావంటీవాల్లకు చోటుండదు. అలా అడుక్కోవాలసిన ఖర్మ మాకులేదని స్వంతంగానే వెల్లేవాళ్లం.
ఇక స్పెషల్ లు వెసేప్పుడు యాడ్ ఏజన్సీలకు సహకరించమని చెప్పేస్తాయినుంచి ,నేరుగా విలేకరులకే టార్గెట్ లు ఇచ్చే స్థాయికి దిగజారుతున్న ప్రమాదాన్ని కనిపెట్టి .ఆవృత్తికి ఒక నమస్కారం పెట్టి వచ్చేసాను . యాడ్ కోసం ఒక లీడర్నో మరొహడినో దేబిరించి .వాడిమీద మరుసటి రోజే ఏముఖం పెట్టుకుని వార్తవ్రాస్తాము ?

ఇక ఇప్పుడు కొందరు మండలస్థాయి విలేకర్లలో "బువ్వ"గాళ్లను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది.
కేరక్టర్ తో పనిలేదు. పేపర్లు బుక్ చేయగలిగితే చాలు . ఇహ నీతికి నిఖర్సైన చిరునామా అని మ్ ఆపేపర్లో విలేకరులపై నిఘాఉంచి ఆరోపణలను ప్రిశీలించే పత్రికగా గప్పాలుకొట్టుకునే దాని పరిస్థితి వేరుగాలేదు. ఇక్కడ దాని ప్రతినిధులకు ఇదొక ఆదాయవనరు .అంతే . పైన ఒక మితృడన్నట్లు గొంగట్లో అన్నంతింటూ వెంట్రుకలేరడం కుదరదేమో !

దుర్గేశ్వర

Ramu S said...

దుర్గేశ్వర గారూ...
మీ సున్నితత్వానికి అభినందనలు. మీరు త్వరగా ఈ రొచ్చు నుంచి తప్పుకున్నారన్నమాట. మీ భవిష్యత్తు ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. ఒకడు విదిల్చే సొమ్ము వద్దు సార్, కలోగంజో మనం సంపాదించింది తిందాం. మంచిని పెంచుదాం, పంచుదాం.
ఆల్ ది బెస్ట్
రాము

Unknown said...

andaru prajala nunchi marpu ravalai antaru prajalaku inkemi pani undada??
yevari family ni vallu chusukovadakey time saripodu inka ilanti vishyalu pattinchukoney terika vallaki(manaki) yekkadi....andukey oka solution ....

e solution jaragadu ani naku telusu kani cheppadaniki chala hayaga untadi

adi yenti antey

NENU INDIA SAINAKA ADYKSHUDUNI AUTHA APPUDU NO GOVERNMENT NENY NIYANHTA NI ANTHA NA ISTAM NENU KONNI RUKLES PASS CHESTA AVI

1.LANCHAM --- YEVADU AYETEY LANCHAM TESUKONTADO VADNI LANCHAM ICHINA VADI CHETA SHOOT CHEYSTA....,LANCHAM ICHINA VADU(SHOOT CHESIN VADU) TESUKELLI LLIFE LONG JAIL LO PEDATHA...
APPUDU LANCHAM TESUKODANIKI IVVADNIKI KUDA BAYAPADATAHRU.

2.ANNI RAJAKEEYA PARTYLANI RADDU CHESTA PARLAMENT,ASSEMBLY ANEVI LEKUNDA CHESTA...

3.RESERVATIONS ANEVI MANA DESHANI KI TB VYADHI LANTIVI,MOTTAM RESERVATIONS RADDU CHESTA.

4.CRICKET NI BAND CHESTA YENDUKANTY DESHAM LO SAGAM MANDI YVAKULU CRIKCET VALANA DESHAM GURNCHI KUTUMBAM GURNCHI PATTICNHUKORU SO ANDUKANI KONNI YEARS VARUKU CRICKET BAND CHESTA..

5.18 YRS, DATINA PRAIT OKKARU MILATARY CHERI KANISM 5 YRS AYENA SEVA CHEYALI ORDER PASS CHESTA.

6.MOTTAM LAW LO UNNA SIKSHALU INKA KATINAM CHESTA.

7.PRIVATE HOSPITALS ANNI GOVT(ANTEY NENU) NA ADHINAM LO KI TECHUKUTNA...

8.BEGGERS ANEY VARU LEKUNDA CHESTA.

9.PRATHI OKKALU YEDO OKA PANI CHEYALI KARANAM LEKUNDA 3 ROJULU KANTEY YEKKUVA REST LO UNNA VALLANI KALLU CHETULU NARIKESTA

10.MOTTAM CURRENCY ANEDY LEKUNDA CHESTA PRATHI OKKARU CARD SYSTEM VADEY LA CHESTA APPUDU NO BLACK MONWEY.

11. MOTTAM TV CHANNELS N papers ANNI BAND CHESTA OKEY OKA TV CHANNEL TAPPA
ANDULO YEPPUDU DESHAM GURNCHI NA GURNCHI TAPPU CHESINA VALLAKI NENU VESEY SISKDHALU GURNCHI MATRAMY PRSARAM AVUTHAYE.

12 LAST ga yevraina tapppuc chestey vallaki oka 1 year patu oka gadi lo petti mottam telugu news channels anni okey sari chuspista...



sorry friends
Sodi cheppi nandhuku ivi anni jaragavu kada ,jarugutaye ani manam uhanchukoni anandapadali tappa inthaku minchi manam matram yem cheyagalam cheppandi yemi cheyalemu cheyalemu cheyalemu...

Anonymous said...

journalist lu ee madhya chillara dongalu laaga tayaru ayyaru sir...

manchi vaalllu leru ani kaadu. kaani chaala mandi itlaage unnaru..

oka example.....
naaku telisna oka anna doctor gaa phc lo posting ki velithe andaru journalist lu vacchi kurchunnarantaa.
naaku inta kaavali ani ...mee gurinchi emi raayamani ....annayya vaallani lemmani annadantaa... modtham emunna court lo choosukuntaanani cheppi.,...

chaala sangathulu unnayi ippudu .
sir.

channels news papers kudaa anthe okari meeda okaru thittukovadamu..anthey.....

ramakanthudu

Anonymous said...

journalist lu ee madhya chillara dongalu laaga tayaru ayyaru sir...

manchi vaalllu leru ani kaadu. kaani chaala mandi itlaage unnaru..

oka example.....
naaku telisna oka anna doctor gaa phc lo posting ki velithe andaru journalist lu vacchi kurchunnarantaa.
naaku inta kaavali ani ...mee gurinchi emi raayamani ....annayya vaallani lemmani annadantaa... modtham emunna court lo choosukuntaanani cheppi.,...

chaala sangathulu unnayi ippudu .
sir.

channels news papers kudaa anthe okari meeda okaru thittukovadamu..anthey.....

ramakanthudu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి