Thursday, March 25, 2010

తారాస్థాయికి చేరిన 'ఈనాడు'--'సాక్షి' యుద్ధం

ఒక పత్రిక తప్పుడు వార్తలు ప్రచురిస్తే...ఆ పత్రికకే ఒక ఖండన (రిజాయిన్డెర్) పంపే వారు...గతంలో. ఇప్పుడు అలా కాదు...'ఈనాడు' ఒక ప్రభుత్వ వ్యతిరేక వార్త రాస్తే ఆ మర్నాడే కాంగ్రెస్ ఎం.పీ. జగన్మోహన్ రెడ్డి పత్రిక 'సాక్షి' లో మొదటి పేజీలో ఒక ఖండన లాంటి వార్త వస్తుంది. అదే వై.ఎస్.కుటుంబం మీద వచ్చిన వ్యాసం అయితే...'సాక్షి' విశ్వరూపం చూపుతుంది. 'బక్క రైతు డొక్క చించిన...లీజు మారాజులు' అన్న శీర్షికతో బుధవారం 'ఈనాడు' పతాక శీర్షికన ప్రచురించిన ఒక కథనం రెండు మీడియా హౌజుల మధ్య మరొక తాజా యుద్ధానికి తెరలేపింది.

 (విచిత్రంగా...మా పేపర్ ఏజెంట్...నిన్న 'ఈనాడు' వేయకుండా 'సాక్షి' వేశాడు. నేను నిజానికి 'సాక్షి' తెప్పించుకోను. నెట్లో చదువుతా. 'ఈనాడు' లో వై.ఎస్. కుటుంబ వ్యతిరేక వార్తలు వచ్చిన ఒకటి రెండు సార్లు...మా పేపర్ బాయ్ 'ఈనాడు' వేయలేదని నా విశ్లేషణలో తేలింది. రేప్పొద్దున వాడి డొక్క చించి డోలు కట్టాలి. మీకు కూడా అలానే జరిగితే మాకు రాయండి.)

ఇక గ'లీజు' వ్యవహారానికి వద్దాం. కర్నూలు జిల్లాలో వందలాది ఎకరాల భూమి విజయలక్ష్మి ఇండస్ట్రీస్ కు కట్టబెట్టడం, అందులో వై.ఎస్. కుటుంబ సభ్యులకు వాటా వుండడం...వంటి ఆరోపణలు ఉన్నాయి ఆ వార్తలో. ఈ వార్త లో భాగంగా వై.ఎస్.జగన్, ఆయన మామ రవీందర్ రెడ్డి, కే.వీ.పీ.రామచంద్ర రావు ఫోటోలు వాడారు. కథనానికి బలం చేకూర్చే విధంగా...'ఈనాడు' చాలా సోర్సులను ఉటంకించింది. రైతుల వివరణ తీసుకుంది. ఈ ఎవ్వరంపై విచారణ జరపాలని అన్ని పార్టీలు డిమాండ్చేసాయి. 


దీనిపై ఈ రాజీ 'సాక్షి' విరుచుకుపడింది.  మొదటి పేజీలో..."'పెన్ కాదు..డ్రాగన్'....అక్షర రాక్షసం--గ'లీజు' డొక్కనిండా  పచ్చి అబద్దాలే"...అంటూ మొదటి పేజీలో పెద్ద వార్త ప్రచురించింది. దానికి...ఈ పైన  వేసిన 'డ్రాగన్--రామోజీ' ఫోటో వాడారు.  


'బురద చల్లడమే రామోజీ పని' అన్న శీర్షికతో రవీంద్రనాథ్ రెడ్డి వివరణతో ఐదో పేజీలో ఒక వార్త ఇవ్వడమే కాక...ఎడిటోరియల్ పేజీలో...'ఈనాడు' వార్తను 'సాక్షి' ఉతికి ఆరేసింది. దానికి పెట్టిన శీర్షిక..."రామోజీ పత్రిక అంటేనే...పాలసీ నడక...తప్పుల తడక." అందులో...రామోజీ మీద ఒక కార్టూన్ కూడా వాడారు. 


ఆ పేజీలోనే "ఈనాడు గ'లీజు' రాతలు" శీర్షికన..కొందరు రైతుల వ్యాఖ్యలు ఇచ్చారు. ఈరోజు 'ఈనాడు' కూడా "గ'లీజు' బుకాయింపు" శీర్షికన రవీంద్రనాథ్ రెడ్డి వివరణ ప్రముఖంగా ప్రచురించింది. "'పెన్నా'వేసుకున్న బంధం!..ఖైమా నుంచి సాక్షి దాకా" అన్న మరొక వార్తను కూడా రెండో పేజీలో 'ఈనాడు'ప్రచురించింది. రేపు కచ్చితంగా 'సాక్షి' దీని మీద విరుచుకుపడుతుంది.

రెండు పత్రికలూ వార్తలలో ఎడిటోరియల్ భాషను వాడాయి. వీటి అక్షరాలలో నిజానిజాల మాట..ఏమోగానీ....తెలుగు నాట ఈ 'కౌంటర్ జర్నలిజం' కొత్తపుంతలు తొక్కుతున్నదన్న విషయం స్పష్టమవుతున్నది. ఈ క్రమంలో వార్తలకున్న విలువ, విశ్వసనీయత గాల్లో కలిసి పోతున్నాయేమో! రీడర్ గందరగోళ పడుతున్నాడేమో!!

14 comments:

Ramu S said...

సవరణలు
ఒకటి) మూడో పేరాలో 'ఎవ్వరం' అని వచ్చింది. అది 'వ్యవహారం'
రెండు)ఆ పేరాలోనే...'డిమాండ్ చేశాయి" బదులు "డిమాండ్చేసాయి" అని వచ్చింది.
మూడు) నాలుగో పేరాలో...'దీనిపై ఈ రాజీ 'సాక్షి'..." అని వచ్చింది. అది..."దీనిపై ఈ రోజు 'సాక్షి'..."

chandu said...

ఈనాడు పేపెర్ లొ వార్త రైతుల భూములను వై.ఎస్ బంధు వర్గానికి కట్ట బెట్టారు అని రాసారు. అది కరక్టొ కాదొ రాయల్సింది పోయి ఈ సాక్షి వాడు రామోజి మీద పడి ఏడుస్తాడు. నిజంగా తప్పుగా ఏమి భూములు కట్టబెట్టక పోతె సాక్ష్యాలతొ అది వార్త లాగా వ్రాయచ్చుగా. బురద చల్లటం అంటే యెమిటొ సాక్షి వాళ్ళని చూసి నేర్చుకోవాలి.

Anonymous said...

(విచిత్రంగా...మా పేపర్ ఏజెంట్...నిన్న 'ఈనాడు' వేయకుండా 'సాక్షి' వేశాడు. నేను నిజానికి 'సాక్షి' తెప్పించుకోను. నెట్లో చదువుతా. 'ఈనాడు' లో వై.ఎస్. కుటుంబ వ్యతిరేక వార్తలు వచ్చిన ఒకటి రెండు సార్లు...మా పేపర్ బాయ్ 'ఈనాడు' వేయలేదని నా విశ్లేషణలో తేలింది. రేప్పొద్దున వాడి డొక్క చించి డోలు కట్టాలి. మీకు కూడా అలానే జరిగితే మాకు రాయండి.)

మీడియా హౌజ్ ల వరకూ బాగుంది. బాయ్ లను కూడా లాగుతారేంటి. బహుశా మీ బాయ్ జగన్ మనిషి అయి ఉంటాడు. ఇంకొకడి బాయ్ రామోజీ మనిషి అయి ఉంటాడు. ఎవడు మనిషి అయినా వాడి పని వాడు చేయాలి. నిజంగానే మీరన్నది నిజమనుకుందాం. ఓ మీడియా హౌజ్ బాయ్ లను మేనేజ్ చేస్తుందనే అనుకుందాం. రెండో మీడియా ఇల్లు ఊరుకుంటుందా. మీ విశ్లేషణలో తేలేవరకు ఆగుతుందా.

Anonymous said...

Reader is going to benefit a lot from this fight. Let the people know how these people are fighting for their own ends and take the newspapers lightly. This is what these stupids are doing under the guise of journalism, freedom of press and fourth estate. It is people's right to know the real face of media houses. Let us encourage these type of fights between media houses and leave their fate to readers.
- Chakri

Anonymous said...

మీ పేపర్ కుర్రాడికున్న ఇంగితజ్ఞానం కూడా బూచి బాబు రామోజీకీ లేదు. one has to note that సాక్షి is only reacting. ఎవరూ పవిత్రులు కారు. రామోజీ తెలుగుమీడియాను అత్యంత జుగుప్సాకరంగా మార్చి వే్శాడు. బాబోయ్ ఈ కులపిచ్చి వెధవలు సంపక తింటున్నారు.

Anonymous said...

Ramu gaaru,

Meeru post lo typos ni savaranalu gaa vraase badulu, post ni edit chesi maralaa publish cheyyochu kada! blogspot lo aa soulabhyam vundi.

Anonymous said...

రీడర్లేమీ గందరగోలపడడం లేదు.వార్తలు చదివే వారందరికీ తెలుసు ...ఎవరు ఏంటో?
సాక్షి ఈరోజు ఈనాడు పై పడకుండా ఆ వార్త పై మంచి వివరణలు ఇస్తే బావుండేదేమో..
sakshi హెడ్డింగులు దరిద్రంగావున్నాయి...బజారు రాతలు మానుకుంటే మంచిది...

Anonymous said...

అసలు జగన్ కు కులపిచ్చే వుండదు...సాక్షి పేపర్ ను ,న్యూస్ ఛానల్ ను చూస్తే మీకు బా....గా అర్థమౌతుంది ...ఛీ ...ఛీ ...ఇలాంటి సిగ్గులేని వెధవల్ని ఓబులాపురం ఖనిజం లో కరిగించాలి ....అప్పుడే మారతారు...

Anonymous said...

Saakshi - Eenadu kalakaalam ilagey kottukovali. Endukante veeriddharoo Dhongaley. Dhongalu iddharoo kottukoni, okari bandaraanni inkokaru byta pettukunte prajalaku kaneesam vaasthavaalu thelusthaye.So, prajalanu alert cheyataniki, "journalism" musugulo jarugutunna kullu, rocchu panula gurinchi andariki teliyalante Eenadu and Saakshi madhya ee vyram permanentga konasaagali.

---Gumpulo Govindaiah

Anonymous said...

Ee media groupla papam pandindi boss. Eenadu, TV9, Andhra Jyothy, Sakshi chudandi veella pani. Andari meeda rahasyanga pedda check start avuthundi thvaralo...

Srikanth said...

Ramu garu, though this is not the right place to ask you..

Can you put some insight on new channel, RAJ NEWS?

Anonymous said...

It is most unfortunate that the Telugu media has degenerated it's values and are just fooling the people for their own survival and existence as Ramoji Rao wants to survive on Margardarsi scandal and mining scandals.Infact the average is least bothered about the scandals as every politician survives on these scandals only.A proffession of journalism and the personal things of the owners of the media are nothing to with one another and they are quite different but unfortunately the owners of the media publishing houses want to survive and escape the scandals with the mask of media and want protection through media and that is what is being done by Ramoji and Jagan and this is very peculiar in AP.GOD BLESS AP MEDIA AND SAVE THE COMMON MAN FROM THEM.

JP.

Anonymous said...

Radha krishan ni chusi chala mandi sampadinchadam modalu pettaru. Ika Ravi Prakash ni chusi entha mandi start chestharo? Prathi journalist oka paper, oka channel pettadaniki try chestharu... atleast 1% success aina chalu media pani govinda... Aina medialo pani chese vallu enduku thamanu thamu goppaga vuhinchukovadam? Anni rangallo manchi vallu, chedda vallu vunnatte medialo kuda vuntaru. Ravi Prakash paper success avuthundi, athanu oka Hero avuthadu... kani evariki prayojanam? Paper success kavadaniki cheyyalsina sanchalanalu Ravi daggara fullga vuntayi... kastha differentga chupinchi, koncham chorava chupithe chalu easyga success avochu. Peddaga peekalsina avasaram ledu kani danike pedda greatga feel avuthadu Ravi Prakash.

Unknown said...

Ramoji is white collar criminal.veedu AP media ni brastu pattinchadu.
veediki asalu neeti , niyamalu vundavu.
ilanti valla valle society nashanam ayi potunnai..
Friends, please avoid reading Eenadu and save AP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి