Sunday, March 14, 2010

Hm-TV వారి 'దశ-దిశ'పై ఉత్తరం సృష్టించింది ఎవరు?

Hm-TV చీఫ్ ఎడిటర్ కే.రామచంద్రమూర్తి గారికి TRS శాసన సభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ రాసినట్లు చెబుతున్న ఒక ఉత్తరం దుమారం లేపుతున్నది. 'దశ-దిశ' కార్యక్రమం ద్వారా తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర వాదాలను ప్రచారం చేస్తున్నందుకు మూర్తి గారిని కే.సీ.ఆర్.అభినందిస్తున్నారని, ఈ కార్యక్రమం కోసం అయ్యే ఖర్చును టీ.ఆర్.ఎస్.భరిస్తుందని, అందులో భాగంగా ఆ లేఖతో పాటు ఒక పాతిక లక్షలు పంపుతున్నట్లు అందులో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 16 న ఆ లేఖ రాసినట్లు ఉంది.

గుంటూరు లో Hm-TV ఆదివారం నిర్వహించిన 'దశ-దిశ' కార్యక్రమం ఆరంభం కావడానికి ముందు పుల్లారావు అనే నాయకుడు ఆ లేఖను చదివి వినిపించారు. ఇదే అంశం అసెంబ్లీ లో కూడా చర్చకు వచ్చినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాంబాబు గారు ఈ లేఖను పూర్తిగా కొట్టిపారేశారు. ఇది ఆకతాయి పనిగా తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు.


ఈ లేఖకు స్పందిస్తూ మూర్తి గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. "నలభై ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్న నా గురించి తెలుగు సమాజానికి తెలుసు. మేము విశ్వమానవులం. మాది పరిశుభ్రమైన ఛానల్. మేము అశ్లీలం, క్రైం చూపించం," అని ఆయన చెప్పారు.  పరిశుభ్రమైనదిగా తమ ఛానల్ ను నిర్వహించాలని సంకల్పం చెప్పుకున్నట్లు వివరిస్తూ....పదవీ విరమణ వయస్సులో కూడా...టీ.వీ.ఛానెల్స్ లో విలువల కోసం ఈ బాధ్యత చేపట్టినట్లు తెలిపారు. "జర్నలిజం ఒక తపస్సుగా చేస్తున్నాం," అని మూర్తి గారు ప్రకటించారు.


ఈ లేఖ ఎందుకు నమ్మకూడదో కూడా వివరిస్తూ...కొందరు నాయకులు దాని ప్రతులను పంచుకోవడం గురించి బాధను వ్యక్తం చేశారు. రాజేందర్ వంటి నేత మూర్తి గారికి ఇలాంటి లేఖ రాస్తారంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. పాతిక లక్షలు ఇవ్వాల్సివస్తే రాజేందర్ స్వయంగా వెళ్లి ఇస్తాడు కానీ...ఇలా లేఖలో ప్రకటిస్తాడని నాకు అనిపించడంలేదు. మరి ఎవరు ఈ లేఖ రాసారు?


నిజానికి 'దశ-దిశ' కార్యక్రమం తెలుగు ఛానెల్స్ లో బాగా క్లిక్ అయిన కార్యక్రమం. దీని టీ.ఆర్.పీ.రేటింగ్ కూడా బాగా ఉన్నదని విన్నాను. వానలు వరదలు వస్తే మొసలి కన్నీళ్ళు కారుస్తూ...సినిమా జనాన్ని వెంటేసుకుని విరాళాలు వసూలు చేసే సీ.ఈ.ఓ. లు, చీఫ్ ఎడిటర్ల హవా సాగుతున్న రోజుల్లో ఈ ఛానల్ జనాభిప్రాయానికి పెద్దపీట వేయాలని తలవడం ముదావహం. 

ఈ పరిస్థితిలో ఎవరో కావాలని ఇలాంటి లేఖను పుట్టించారేమో! టీ.ఆర్.పీ.లకోసం నానా గడ్డి కరిచే వాళ్ళు ఛానల్ యజమానులుగా వున్న రోజుల్లో ఏదైనా సంభవమే. స్టింగు ఆపరేషన్ స్పెషలిస్టులు పుష్కలంగా ఉన్న TV-9, N-TV, ABN-ఆంధ్రజ్యోతి, సాక్షి లలో ఏ విలేకరైనా ఈ లేఖపై పరిశోధనాత్మక జర్నలిజానికి పాల్పడి నిజాలు వెలికి తీస్తే బాగుండు. సార్, మంచి వాడిని మంచిగా బతకనిద్దాం...మంచిపని చేయనిద్దాం...బురద చల్లి మనలో కలుపుకొనే ప్రయత్నం మనకెందుకు చెప్పండి? 

6 comments:

Anonymous said...

murthy may be honest. still he is very much biased towards telangana. he is intelligently handpicking belligerent pro-telangana speakers who go hammer and tongs at the drop of a hat. At the same time, he is smart enough to call very weak-kneed andhra speakers. or jai andhra leaders.

jara said...

ramu garu nejga eadi bad news eavaro kavalni murthi gari meda abadam moputhunaru

SADASIVARAO said...

burada jalle vidhaname tappa marokati kadu.dasa disa karyakramam baga papular kavatam valla ila chesi vuntaru .dinni prajalu harshincharu.

Anonymous said...

In peples mind HM-TV is supporting telangana..
so those people may think about that letter in any way.
and HMTV TRP ratings are very bad.but 'dasa-disa' program is only the oxygen for that channel..

Anonymous said...

Dasha- Disha programme is intended to bring out the inherent feelings and opinions of a cross section of people on the dasha and disha of the state.If Murthy is pro Telangana there is no necesity for him to visit the entire state and would have confined to Hyderabad and Telangana dist to propogate his petrsonal feelings in his channel.It is but natural and human tendency to create hurdles,troubles and throw stones at any one who boldly initiates a programme which is to give voice to the people of their aspirations.Infact commercially HM TV may not benefit by bringing a programme of hours together whereas the programmes that are telecast in the same duration will get more revenue in other channels like Aaata,Dhee,Magadheera,etc.But Murthy is loosing much of revenue by restricting the ads in the breakS.Let us all support and encourage him for a good cause for bringing the inner feelings of many who have no platform to express boldly.Ofcourse there might be some commercial interest without which no one nothing will survive and maintained.He is far better than many CEOs of channels.

JP.

Srikanth said...

కొందరు మిత్రులు అంటున్నట్టుగా ఒకవేళ మూర్తి గారు లేదా HMTV కావాలనే తెలంగాణా కు సప్పొర్ట్ చేస్తుంటే తప్పు ఏంటి బ్రదర్స్? తెలంగాణా కు వ్యతిరేఖంగా పని చేస్తున్న ఎన్నో చానల్స్ ఉన్నాయి వాటిని ఏమీ అనరెందుకు. టీవీ యజమాన్యం తెలంగాణా కు చెందినదైనంత మాత్రాన ఇంకా బురద చల్లెయడమే...?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి