Wednesday, March 24, 2010

జీతం, పీ.ఎఫ్. కోసం i-news సిబ్బంది మెరుపు సమ్మె

ఎం.ఎన్.ఆర్. విద్యాసంస్థల వారి i-news లో రెండు నెలలుగా జీతాలు అందని జర్నలిస్టులు, టెక్నీషియన్లు మంగళవారం మెరుపు సమ్మె చేశారు. కాసేపు విధులు నిర్వహించకుండా....ఆఫీసు బైటికి వచ్చి తమ నిరసన తెలిపారు. సాయంత్రానికి యాజమాన్యం హామీతో విధులు నిర్వహించారు. తెలుగు మీడియా విస్తరించిన తర్వాత జరిగిన తొలి సమ్మె గా ఈ నిరసన చరిత్రలో నిలిచిపోతుంది. 



చాలా రోజులుగా ఐ-న్యూస్ ఆర్ధిక పరిస్థితి బాగాలేదని, జీతాలు సకాలంలో అందక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని గతంలో మనం చర్చించాం. రెండు నెలలైనా జీతాలు పడకపోవడం, అంతకు మించి పీ.ఎఫ్.జమ కాకపోవడంతో దాదాపు 250 మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. 
నిన్న ఉదయం సంస్థ యజమాని వాసు రాజుతో సమావేశమైన హెడ్స్ కొద్దిగా చల్లపడినా...తర్వాత విధులు బహిష్కరించారు. ఈ నెల ఆఖరుకల్లా జీతాలు వచ్చేలా చూస్తామని యాజమాన్యం చెప్పడంతో మళ్ళీ విధులకు హాజరయ్యారు. "ఎన్.ఆర్.ఐ.లది ఈ సంస్థ" అని నమ్మబలకడం వల్ల ఐ.న్యూస్ లో చేరామని, ఈ ప్రచారం చేసిన జర్నలిస్టు మాత్రం కీలక సమయంలో చల్లగా జారుకుని N-TV లో చేరి, తన చేలాలను తెసుకుపోయి సేఫ్ సైడ్ లో పెట్టుకున్నాడని పలువురు ఆరోపించారు. 
సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ ఈ ఛానల్ లో చేరకపోయినా..రాజశేఖర్ నిష్క్రమణ తర్వాత తాము ఇక్కడ ఉండేవారం కాదని...రమేష్ లేనిపోని ఆశలు కల్పించారని... మరికొందరు ఐ-న్యూస్ సిబ్బంది చెప్పారు.

ఆరంభంలో డీ.ఎస్.ఎన్.జీ.వ్యాన్లు, తదితర కొనుగోళ్ళలో గోల్ మాల్ జరగడం వల్ల కూడా సంస్థ బాగా నష్టపోయిందని యాజమాన్యం తరఫు వ్యక్తులు సిబ్బందికి వివరిస్తున్నారు. యాజమాన్యం వాదనే నిజమైతే...మొత్తం కొనుగోళ్ళపై దర్యాప్తు జరిపి...వాటాలు మింగేసి ఉడాయించిన వారిపై కేసు పెట్టాలని కొందరు పిచ్చాపాటి చర్చలలో వాదిస్తున్నారు.  మరి యాజమాన్యం దీనిపై ఏమి నిర్ణయం తీసుకున్నదీ  తెలియరాలేదు.

మొత్తం మీద....ఇన్నాళ్ళకు గళం ఎత్తిన i-news సిబ్బందికి అభినందనలు. అన్ని ఛానెల్స్ లో ఉద్యోగులు మరీ బతుకు భయంతో వణికిపోకుండా..జీతాలు, హక్కుల సాధన కోసం క్రమశిక్షణతో పోరాడడంలో తప్పులేదు. ఈ స్ఫూర్తి అన్ని ఛానెల్స్ కు పాకాలని, వీరికి ఉమ్మడి వేదిక ఒకటి ఉండాలని ఆశిద్దాం. 

7 comments:

King said...

i news vadu velainantha thvaraga dukanam close cheyadam better. appudu employees vere channel lo ki velli hayiga untaru..

resign chesina employees ki kuda settlements cheyatledanta. adi inews paristiti.

suppliers evvadu equipment supply cheyamu ani chepparu.

Anonymous said...

RAMU GARU,
MEERU NINNA 7.40 PM KI N TV CHUUDALEDHA

Anonymous said...

అసలు ఇన్ని బుచికి బుచికి చానల్లు ఏమిటికి బయ్యా. ఒకటె జొల్లు వాగుడుతోని సంపకతింటున్నారు చానెలోల్లు. తొక్కలో చానెల్లు పోతేనే మంచిది.

Ramu S said...

నేను యెన్-టీవీ చూడలేదు. దీన్ని వార్తగా ప్రసారం చేసారా? అలాంటి వివరాలు ఉంటే...కాస్త ఉప్పు అందించండి. మీరే మా రిపోర్టర్లు
థాంక్స్
రాము

Anonymous said...

No not this news
Operation puppi club ani maro boothu program

Anonymous said...

anni channels lonu ila golmal chese vallu chala mandi unnaru.avasaram unna lekunna equipement kondam valla management chala loss ayyaru.Mahaa tvlo ivr lanti peddayana ni chalamosam chesaru.daadapu akkada 5 cr waste equipment konnaru i mean upayogam lekunda padi unnavi.channel technical ga strong aithe gani ilanti mosalu jaragavu.adento gani ila mosam chesina variki jobs anni channels lo chala easyga dorukutahi.

Anonymous said...

vasu now reminds emperor Nero. he is not willing to sell total stake. No one is willing for 40%. Better he sells else boat sinks. The only way out is tv9,ntv should come forward not to touch mnr institutes, then he sells. Or what could be the strong reason behind 60% holding? he might have tasted the big benefits of electronic media. learnt he is planning to pinch the employees behind flash strike.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి