నరేంద్రనాథ్ చౌదరి గారి N-TV లో ఒక అరగంట కిందట 'నలుపే శాపమా...' అన్న శీర్షికన ఒక లైవ్ ప్రోగ్రాం ప్రసారమయ్యింది. ఇది చూశాక....'ఈ ఛానల్ లో ఇంతమంది మంచి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు....వీళ్ళ బుర్ర ఖరాబ్ అయ్యిందా?' అని అనిపించింది.
ఎవడో వెంకట రమణ అనే వాడు ఈ రోజు మానవ హక్కుల సంఘం దగ్గరకు వెళ్లి..."నా భార్య కాపురానికి రావడం లేదు...నేను నల్లగా ఉన్నానని నాతో కాపురం చేయడం లేదు"...అని ఫిర్యాదు చేశాడు. అక్కడ N-TV రిపోర్టర్ కు మన వెంకట రమణ దొరికాడు. దొరికాడో...మన రాజన్న వాడిని పట్టుకోమని రిపోర్టర్ ను పురమాయిన్చాడో తెలియదు. ఇంకేముంది...అతన్ని, అతని అమ్మను, ఒక న్యాయవాదిని స్టూడియోలో కూచోబెట్టి...వరప్రసాద్ అనే ఒక యాంకర్ తో కార్యక్రమం నడిపారు.
మొగుడు పెళ్ళాం పంచాయితీ...విచిత్ర మలుపులు తిరిగింది. ఇందులో మొదటి ఆఫ్ లో వెంకట రమణ...తన భార్య మీద ఆరోపణలు చేశాడు. ఆ ఆడ లాయర్...పురుషులకు అనుకూలంగా అస్సలు చట్టాలు లేవని బాధపడ్డారు. ఇంతలో...'భార్యా బాధితుల సంఘం' నేత సీ.వీ.ఎల్.ఎన్.నరసింహ రావు గారు ఫోన్ లైన్లో వచ్చారు. 'ఇప్పుడు మీరు చెప్పండి...వెంకట రమణ ఇక్కడ ఉన్నాడు," అని యాంకర్ గారు అడిగారు. సగం ఇంగ్లిష్, సగం తెలుగు యాంకర్ ఈయన.
ఇక నరసింహా రావు గారు (లోక్ సత్తా ఈయనకే కదా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది) ...కాసేపు ప్రసంగించి ఒక్క సైడు కథనం విని...'ఈ మీడియా లేకపోతే...ఇలాంటి గొంతులు మూగ పోయ్యేవి," అని ఒక నిట్టూర్పు విడిచారు. ఇంతలో...వెంకట రమణ భార్య ప్రమీల ఫోన్ లైన్ లోకి వచ్చారు.
'చూడు హేమా..ఇప్పుడు కథ పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది,' అని నేను అంటూ ఉన్నానో లేదో...ప్రమీల (అసెంబ్లీ లో ఉద్యోగి అట) వెంకట రమణ పై ఆరోపణలు గుప్పించింది. నలుపు అసలొక అంశమే కాదని...అతనికి డబ్బు, బంగారం పిచ్చి అని చెప్పింది. తనను తిట్టాడని, కొట్టాడని తెలిపింది. ఆమెకు అండగా ఆమె పైఉద్యోగి నరసమ్మ గారు అనుకుంటా...కూడా ఫోన్ లైన్ లో వచ్చారు. ఇద్దరూ కలిసి వెంకట రమణ ప్రమీల ను ఎలా వేధించేది...వివరించారు. ఈ నరసమ్మ గారు ప్రమీల తనకు 'కూతురు కన్నా...చాలా ఎక్కువ' అని ఎమోషనల్ గా మాట్లాడారు.
తాను పక్కన పడుకుంటే...ప్రమీల ఎలా చీదరించుకునేది....వెంకట రమణ వివరించగా...తనను 'ఎవరితో తిరిగావే ఇప్పటిదాకా' అని అడిగేవాడని ప్రమీల సభకు తెలియజేసింది. యాంకర్ గారు....న్యాయ మూర్తి పాత్ర పోషించారు...మధ్యమధ్యలో ఎస్...కరెక్ట్ అంటూ.
చివరాఖరికి...యాంకర్ గారు...కార్యక్రమం ముగుస్తున్నామని చెబుతూ ఉండగానే...'ఒక్క క్షణం సార్...మా బస్తీ లో వాళ్ళు ఆయన గురించి చెబుతారు," అని ప్రమీల మరొక అమ్మకు ఫోన్ పాస్ చేసింది.
"నిజమే సార్...ఆయన పద్దతి బాగా లేదు," అంటూనే ఆమెను ఆయన ఏ ఏ బూతు మాటలు అనేది అని వినిపించింది. నేను ఆ మాటలు కూడా పోస్టులో రాస్తానంటే..."ఛీ అవి రాస్తావా...బుద్ధిలేకుండా," అని హేమ వారించింది.
ఛీ....ఇదేమి ఖర్మండీ మనకు..ఈ ఛానెల్స్ వల్ల. ఇక లాభం లేదు...మనం కూడా ఖతారో, దుబాయో వెళ్ళాలి లేదా ఈ N-TV బ్యాచ్ ను ఎర్రగడ్డ కో, ఎర్రుపాలానికో పంపాలి.
Friday, March 5, 2010
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
I am very fortunate to miss that programme.
If you go through the various programmes of all the Telugu channels don't you think that ETV is still the most dignified and well telecast channel.But unfortunately due to fear of low TRPs ETV too some times following the route of other channels which is unwarranted to it.
JP.
inka TV channels A family coourt gano,counciling ichey institute gano maripoyenatly,
sari ayena news inka TV channels ki dorakada, ratings kosam yelanti panimalina issue ayena swekaristhara?
naku mathipothundhi yenduku ra e tv channels wrk chesthunna anukuntunna,
Nenu Intermediate lo unnapudu ma teacher andarani aduguthunadu nuvvu yemi authavu ani appudu okkaru lechi nialabadi chepthunaru software engeneer, police,IAS like that na vanthu vachey sariki nenu TV channel lo wrk chesta ani annanu
adenti ani sir adigithey veeti anni ti kanna media ney samjaniki seva yekkuva chesthundi kada annanu,
kani ala cheppadam nadi tappu ani ippdu anukuntunna...
Dear Ramu
Pl discourage very long posts in the blog. Three of four are using this blog to bore people. See that brief and to the point posted
I am lucky. I don't watch TV.
Long Posts....గురించి...
ఇకపై మరీ సుదీర్ఘంగా రాయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. అయినా...'హమ్మయ్య...చెప్పాలనుకున్న విషయం చెప్పాను'...అని మనసుకు అనిపించేంత వరకూ కొనసాగించక తప్పదు కదండీ. ఈ బ్లాగ్ నిర్వహించేదే...గుండె మంట చల్లార్చుకోడానికి ప్లస్ రాయాలాన్న తీట తీర్చుకోడానికి. బోర్ కొడుతున్నట్లు మొదటి సారి మీ కామెంట్ ఒక్కటే వచ్చింది. రాతల మీద సమీక్ష తప్పక చేసుకుంటాను.
Sorry, I couldn't understand..'three of four' thing in your comment. please explain.
థాంక్స్
రాము
పేరు వేయని వారు అనేది వ్యాఖ్య వ్రాసే వారి గురించి.
తరువాత, ఇలా ఒక వివాదంలో ఉన్నవారిని టి.వి లో ఫోన్లద్వారానో ప్రత్యక్షంగానో ఒకరి మీద మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే వీలు కల్పించటం ఈ మధ్య హైకోర్టు అనుకుంటాను తీవ్రంగా ఆక్షేపణ తెలిపింది. మారి ఈ కార్యక్రమం ఎలా వచ్చిందో కదా.
నాకున్న సుఖం ఏమంటే, మా ఏరియాలో ఈ దిక్కుమాల్ని టివి రాదు.
The blogs are meant for bringing out individual opinions on various matters for whom there is no chance to express them elsewhere routinely.The blogs of Amiatab,Shobhaa De and the responses to them are lengthy and some replies include poems too.If any one is bored it is better to skip it for a very shorter blog and response.I feel it does not take more than a few minutes to go through the blog and the responses.Anyhow one has to respect the view of others and take a decision on majority of people responding to these blogs.
A Citizen.
వెర్రి వెయ్యి రకాలు.
I dont think this post is too long. It is lengthy enough to discuss the topic.
Please keep up with the good work. Its good to see insider talk about media.
Annayya Ramu
I saw that post on discouraging long posts. Before that, I request you to consider one more thing. Please discourage anonymous posts. Also block people using pseudonyms. At least you should know who is writing it. If he wants his name be blocked due to some sensitive reason, you are free to do it. But, I don't see any reason in allowing anonymous posts. It is only to add more authenticity to the forum. There were some objectionable responses for some of your earlier responses from 'anonymous' friends.
Ramana
i saw that program yestester day...
these type of programs gives bad values to the society..
but in my opinion the most degnified chanel is etv2
do not watch those type of channels..
watch degnified chanels
వెర్రి వేయి విధాలూ...అలాగే ఆ వేర్రోళ్ళ నందరినీ చేర్చుకోవటానికి ఖాళీ లేకపోవటంతో ---అటు హైదరాబాద్ ఎర్రగడ్డ, ఇటు వైజాగ్ మెంటల్ ఆస్పత్రి డాక్టర్స్ ఒక నిర్ణయానికి వచ్చి...ఇబ్బడి ముబ్బడిగా పుట్టు కోస్తున్న కొత్త చానల్స్ మేనేజ్ మెంట్స్ తో ఒక అవగాహనకు వచినట్టు సమాచారం. అందులో భాగంగానే...తమ దగ్గరున్న కొందరు మానసిక రోగులని..వారు కాస్తంత చదువుకుని అప్పటికే ఓ మాదిరి అందంగా ఉన్న వారైతే ---తక్షణం న్యూస్ యాంకర్స్ గా చేర్చుకో వలసిందిగా వివిధ చానల్స్ మేనేజ్ మెంట్స్ తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
అందుకనే...ఇలాంటి పిచ్చ తలకెక్కిన వాళ్ళ స్టోరీస్ ...వీలైతే..మధ్యలో సందేశం కోసం మహిళా సంఘాల వారిని ఇన్ వాల్వ్ చేస్తూ ...మెరుగైన సమాజం కోసం అనే పేరిట...లేదా.. సమాజ ఉద్దరణ కోసం పుట్టిన హితకారిణీ సమాజం బరువు బాధ్యతలన్నీ తామే భుజాల కేత్తుకున్నట్టు పోజులు కొడుతూ.. ఇలాంటి తలకు మాసిన ప్రోగ్రామ్స్ ను జనం మీదకు విచ్చలవిడిగా వదులుతున్న టీ వీ చానల్స్ తిక్క కుదిర్చే ఒక మహాద్భుతాన్ని మనం మన లైఫ్ టైం లో చూడాలంటే ఒకటే పని చేయాల్సింది...లోక్సత్తా జయప్రకాశ్ గారన్నట్టు ఈ వెర్రి చానల్స్ ను కొన్నాళ్ళు మూయించాలి. ఆ పని చేయాలంటే లీగల్ గా ఏం చేయాలో నిపుణులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది...రాము గారూ..దీనికోసం మీరు ఎం చేయగలరో చెప్పండి..మీ వెంట కాదు...మీతోటే ఉద్యమిస్తాం........బెస్ట్ అఫ్ లక్...
Dear Ramu,I did not mean you about long posts. three or four people are writing very long posts. I agree that most of our friends are posting brief and direct posts. About rejecting anonymous posts it is upto you to decide. But it certainly limit participants. thanks for your wonderful response.
న్యూస్ చానెల్స్ ని కుడా వినోదపు చానెల్ గా చూడండి... గొడవ ఉండదు..
మనం బ్లాగ్స్ లో ఎంత గోల పెట్టినా వాళ్ళు మారారు.. దున్న పోతు మీద వర్షం కురిసినట్ట్టే..
వాళ్ళ ఆడ్స్ వాళ్ళికి వచాయ. లేదా అన్నదే పాయింట్..
జాస్మిన్
రాజముండ్రి
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి