Monday, March 15, 2010

N-TV లో మరొక... కాపురం కూల్చే లైవ్ కార్యక్రమం

కుటుంబం మీదనో, భర్త లేదా భార్య మీదనో కోపంతోనో..ఆవేశంతోనో..మానవహక్కుల సంఘం గడప తొక్కిన వారి కాపురాలు శాశ్వతంగా కూల్చే బృహత్ కార్యక్రమానికి N-TV అనే తెలుగు ఛానల్ శ్రీకారం చుట్టింది. హక్కుల సంఘం దగ్గర ఫిర్యాదు ఇచ్చే వారిని అటునుంచి అటు స్టూడియో కి తీసుకు వచ్చి ప్రత్యక్ష కార్యక్రమం (లైవ్) ద్వారా వారిని జనాలకు పరిచయం చేసి, ప్రేక్షకుల సాక్షిగా వారి పెళ్లి పెటాకులు చేయడం ఈ ఛానల్ పెట్టుకున్న మిలీనియం లక్ష్యాలలో ఒకటిగా కనిపిస్తున్నది.

మొన్నామధ్య ఒకడు భార్య మీద హక్కుల కమిషన్ దగ్గరకు ఫిర్యాదుతో వెళ్లి నరేంద్రనాథ్ చౌదరి గారి ఛానల్ స్టూడియోలో తేలాడు...తల్లితో సహా. ఆ స్టోరీతో  ఆ ఛానల్  పండగ చేసుకుంది. టీ.వీ.వారు అతని భార్యను కూడా ఫోన్ లైన్ లోకి తీసుకుని వారిద్దరి మధ్య ఇక జీవితంలో రాజీ పడలేనంతగా తగువుపెట్టి...వారిద్దరి పరువు పంచనామా చేశారు. బతుకు బజార్న పడేశారు. అంతకన్నా రొచ్చులాంటి మరొక స్టోరీ ని ఈ ఘనత వహించిన ఛానల్ ఈ రోజు రాత్రి ప్రసారం చేసింది..డిస్కషన్ పేరిట. దీని శీర్షిక "పతీ...పత్నీ..ఔర్..ఓ.." అనే ఒక సినిమా టైటిల్.

ఈ కథాక్రమం ఎట్టిదనిన. ఒకామెకు అమ్మానాన్న పెళ్లి చేశారు. ఆ ఆమ్మాయి కాపురానికి వెళ్ళకుండా చదువుకు ప్రాధాన్యత ఇచ్చింది. అక్కడ ఆమెకు ఒక స్నేహితుడు కలిసాడు. ఇంతలో ఆ అమ్మాయి కనిపించకుండా పోతే...తల్లిదండ్రులు ఆ స్నేహితుడి మీద ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ స్నేహితుడిని పట్టుకెళ్ళినట్లున్నారు. కేరళలో ఉన్న ఆమెకు ఈ విషయం తెలిసింది. స్నేహితుడిని రక్షించుకునేందుకు....హుటాహుటిన ఆమె కేరళ నుంచి వచ్చి...హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిందట. తనకు ఎం.సీ.ఏ.చేయాలని ఉందనీ, అది చేసే దాకా కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలని, తనకు సహాయం చేసిన తన స్నేహితుడిని విడిచిపెట్టాలని కోరింది...ఆ అమ్మాయి. 

అలా కమిషన్లో పిటిషన్ ఇచ్చి..ఇలా N-TV స్టూడియో లో ప్రత్యక్షమయ్యింది ఈ సోదరి. ఇక ఒక యాంకరమ్మ ఆమెను లైవ్ లో ప్రశ్నించడం మొదలెట్టింది. కథ రక్తి కట్టించాలి కదా! సహజ శైలిలో...ఈ ఛానల్ వారు...ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా ఫోన్ లైవ్ లో తీసుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య లైవ్ లో జరిగిన పంచాయితీ, తిట్ల దండకం...ఈ ఛానల్ కు కనువిందు కలిగించింది. ఆ యాంకర్ ప్రశ్నలు, ఆ మహాతల్లి జవాబులు...ఛీ..ఛీ...మనకన్నా బుద్ధి ఉండాలి. 


ఇదేమన్నా...పోజిటివ్ జర్నలిజమారా బాబూ? ఇదొక స్టోరీనా? కొంపలో కొట్టుకు ఛస్తుంటే...అది నీకు ఇంత పెద్ద వార్త ఎలా అవుతుందిరా బుద్ధితక్కువ జర్నలిస్టు? అసలు ఈ స్టోరీ ప్లాన్ చేసిన నీకు మనం మనుషులం, అమాయకంగా మనదగ్గరకు వచ్చిన వారి సమస్యలను జటిలం చేయకూడదు అన్న సోయి ఉందిరా నాయనా? నీ పెళ్ళామో, నీ కూతురో, నీ అక్కో, నీ చెల్లో ఆవేశంలో ఇలానే స్టూడియోకి ఎక్కి ఆ వెర్రిలో, వేడిలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నీ బతుకు ఏమవుతుంది? ఆ తర్వాత ఒక రాజీకి రావడానికి ఏమైనా వీలు ఉంటుందిరా బాబూ? 

అయినా...జర్నలిజంలో అక్షరాలు తెలియని ఎవడ్నో మెప్పించేందుకు...ఈ దిక్కుమాలిన చెత్త, చచ్చు స్టోరీలను పెద్ద స్టోరీలుగా ప్రసారం చేయడం, ఇంత ప్రాధాన్యం ఇవ్వడం దారుణం. మీకు టైం పాస్ వ్యవహారం...ఈ వెర్రిబాగుల వాళ్ళ జీవితంలో పెద్ద సంక్షోభం అవుతుంది. ఆత్మపరిశీలన చేసుకోండి. మీకు అన్నం పెడుతున్న, దండిగా డబ్బు తెచ్చి పెడుతున్న జర్నలిజాన్ని మరీ దిగాజార్చకండి. వాడు ఒట్టిగా ఒంగమంటే...మీరు గట్టిగా పాకుతున్నారేమిటి బ్రదర్స్? 

6 comments:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

దిక్కుమాలిన వెధవలు. సినిమాలకున్నట్లుగా వీళ్లకీ ఒక సెన్సారు బోర్డు పెట్టాలి.

Rajendra Devarapalli said...

అయ్యా,ఈ దిక్కుమాలిన కాపురాలు కూల్చే కధనాలు మనకిప్పట్లో తప్పవు గానీ ఆ పెయిడ్ న్యూస్ మీద మనవాళ్ళు తయారుచేసిన నివేదిక మీదో విశ్లేషణ కావాలిమాకు అర్జంట్ !

Anonymous said...

We go on crying and shouting at the channels which have sadistic in telecasting the programmes like last night's NTV live show but the news editors of the channels never change untill their wives,sisters, and other family members are brought to live shows for their family and personal problems.
Let us all send emails to these channels in good number against such programmes so that they can feel the pulse of the people.

UGADI SHUBHAKANKSHALU - Eee blog sabhyulandariki mariyu mee kutumba sabhyuandariki.

JP.

Unknown said...

ramu garu,,,

nenu ma vuru vellipothanu andi,akkada hayaga polam pani chesukuntu rendu gedalanu chuskuntu...pachati chettu nedana hayaga undachu,ee news chusey kanna,ee tv channels lo panichesey kanna, adey better sir,ninna naku mental yekkipoyendhi,aftral oka technical(me journalist drusti lo) person nakey intha irritaton vasthey inka me great great journlit li ki yela undali.idena meru nerchukunnadi,vellu ayetey 4 manchi cheyandi,kudaraka pothey iniki velli poye polam pani chesukondi ....(idi andari journalistr lani anadam ledu )

Vinay Datta said...

vennela rajyam garu,

I can understand your agony. But please donot use expressions like 'acid daadulu'. It is very unhealthy.

Anonymous said...

Meerannadi axara satyam. NTV conduct chese discussions 70% ilage vuntunnai... aa discussions chese Anchors feelings ela vuntayo telusukovalani vundi...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి