Thursday, June 5, 2014

కే సీ ఆర్ కు సీ ఎల్ రాజం ఝలక్!!!

తెలంగాణా వాణి గా వెలిగిన "నమస్తే తెలంగాణ" దినపత్రికను తెలంగాణా రాష్ట్ర సమితి మౌత్ పీస్ గా, ప్రభుత్వ ప్రచార కర్తగా మార్చాలని అనుకున్న కొత్త ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంచనా తప్పేట్లు ఉంది. 


బ్రాహ్మణ కోటాలో టీ ఆర్ ఎస్ తరఫున రాజ్య సభకు వెళ్ళడం ఖాయమని అనుకున్న ఆ పత్రిక చైర్మన్ అండ్ మానేజింగ్ డైరెక్టర్ సీఎల్ రాజం ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఆయన బీ జే పీ తీర్థం పుచ్చుకున్నట్లు 'నమస్తే తెలంగాణా' వెబ్ సైట్ లో ప్రముఖంగా పేర్కొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ స్ఫూర్తితోనే బీజేపీలో చేరినట్లు రాజం ప్రకటించారట. బీజేపీ ద్వారా దేశానికి సేవ చేయనున్నట్లు వెల్లడించారు.

ఏ రకంగా చూసుకున్నా రాజం ఎత్తు అనూహ్యమైనది, అద్భుతమైనది. పత్రిక ద్వారా సేవ చేయడం కన్నా.... తనకంటూ ఒక మీడియా యజమాని ముద్ర ఉండాలని, వివిధ రాష్ట్రాల్లో ఉన్న తన వ్యాపారాల విస్తరణకు మంచిదని ఆయన నమ్ముతారన్న ప్రచారం ఉంది. 

ఇంత దెబ్బతీసిన రాజం ను కే సీ ఆర్ ఎలా డీల్ చేస్తారు? 
మోడీ అంటే హిట్లర్ అని నమ్మే అక్కడి జర్నలిస్టులు ఎలా ఫీల్ అవుతారు? 
గులాబీ సేవలో ఉన్న ఎడిటర్ అల్లం నారాయణ అన్న, సీ ఈ ఓ కట్టా శేఖర్ రెడ్డి గారు తదితరులు...రాజం గారితో కలిసి కమల పూజ కానిస్తారా?
వేచి చూడాలి. 

ఈ లొల్లి మనకెందుకని... కే సీ ఆర్ ఒక పత్రిక పెడితే మంచిది. తెలంగాణా కు ఒక మంచి పత్రిక అవసరం ఉంది. ఇంతకాలం... కనిపించకుండా ప్రాంతీయవాద ఉన్మాదంతో జర్నలిజం ముసుగులో ఒక కులానికి ప్రాధాన్యం ఇస్తూ వ్యాపారాభివృద్ది చేసుకున్న పత్రికలలో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు, అలాంటి పత్రికల్లో ఆత్మాభిమానం చంపుకుని పనిచేస్తున్న తెలంగాణా జర్నలిస్టులకు బాగుంటుంది. 

12 comments:

Trader said...

mee prathi post lo nu antharleenam ga eenadu meedha visham kakkatam, kamma kulam meedha mee hatred clear ga thelisipothu unnayi..

elections appudu kuda kavalsinantha varaku jagan ki baaka oodhaaru. odipogane janalu verri vallu annatlu post vesaaru.

ila musugu lo oka kulam meedha dwesham ni chupinche meeku vere vallani kulam peru meedha vimarsinche naithika hakku ledhu anedhi naa uddesam.

Trader said...

మీరు ప్రతి పొస్ట్ లొ నూ ఈనాడు మీద విషం కక్కటం, అంతర్లీనం గా కమ్మ కులం మీధ ద్వెషం చుపించటం చాల ఎక్కువ అయిపొయింది ఈ మధ్య.

Elections అప్పుడు జగన్ కి మీరు చెసిన భజన చుసక మీ మీధ ఉన్న గౌరవం పాలు కొంచెం థగ్గింది. ఇంక మీరు ఇలాగె కులం కులం అని ఒక కులం మీధ ద్వెషం బయట పెట్టుకొని అసలు వెరె వాళ్ళని కులం పెరు మీద వెలెత్తి చుపించే నైతిక హక్కు ని కుద కొల్పొతున్నారు. సిగ్గు సిగ్గు.

Unknown said...

మీకిలా అనిపిస్తోందా ? నేను ఇంకోలా అనుకుంటున్నాను .మోడీని నానా తిట్లు తిట్టిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రంలో అధికార పార్టీకి దగ్గరయ్యే వ్యూహంలో  భాగంగానే  ఇలాంటి`రాజ`మార్గాన్ని ఎంచుకున్నారని నాకు అనిపిస్తోంది. 

Prashant said...

After so much of caste hatred that you venomously spill in your blog,it is time that you reveal your caste.To start with, I am Reddy.

చంద్రశేఖర్ కాటుబోయిన said...

Sir,

trader gaaru cheppindaaniki nenu ekeebhavisthunnaanu.maaku TDP vaalante saripokunnanoo..o manchi blog follow avudaamani mee blog ni kramam thappaka follow avuthunnaanu.kaanee pratisaari eenadunu kummeyyadam,jagan ni paiketteydam chesthunnaaru.ee vivakshavalla mee peru debba tintundi sir..gamaninchaalani manavi..

Sitaram said...

సార్లూ... మేము సాధ్యమైనంత వరకూ నిష్పాక్షపాతంగా ఉండడానికి ప్రయత్నిస్తాము. ఈనాడు అయినా సాక్షి అయినా మాకు ఒకటే. సాక్షి కన్నా ఈనాడు చాలా చాలా నయమని మా అభిప్రాయం. ఈనాడు ను మాత్రమే తిట్టాలంటే రోజుకో పోస్టు రాయవచ్చు. అంత సమాచారం మా దగ్గరకు వస్తుంది.
దయచేసి మీరు రాజకీయ, ప్రాంతీయ, కుల దృక్కోణాల నుంచి చూడకండి.
ఒక వ్యక్తి ఈ బ్లాగ్ రన్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నట్లున్నారు. ఇక్కడ అన్ని కులాల వారూ కులాలకు అతీతంగా ఉంటారు. పిచ్చి ఆలోచనలు మాని మంచి చర్చకు సహకరించండి. లేదంటే... పొరపాట్నైనా ఈ బ్లాగ్ జోలికి రాకండి.
చీర్స్

CV said...

Sir, Nenu mee blog ni regular ga follow avutunna. Mee lanti vari valla konta quality news vastundani nammutunna. kaani ee roju mee comments lo mee blog vimarsa chesina oka follower ni meeru follow ayithe avvandi lekapothe ledu anna paddatilo cheppatam naaku chala ibbandi ga vundhi. Dayachesi mee lanti manchi journalists ee vishayam ni grahistarani anukontunna.

Sitaram said...

CV గారూ...
నమస్తే.
నిజమే సార్, ఆ మాట రాసేటప్పుడు కొంత ఆలోచించాము. కానీ, మీ కులం ఏమిటి? మీ గోత్రం ఏమిటి? 'ఈనాడు' అంటే కోపం... అన్న వ్యాఖ్యలు చేస్తుంటే ఏమి చేయాలి చెప్పండి? 'ఈనాడు' ప్రస్తావన చేయకపోయినా... మా ప్రతి కామెంట్ కు ఏదో ఒకటి ఆపాదిస్తే... సహించడం కష్టం.
మీలాంటి సహృదయులు మా బాధ అర్థం చేసుకుంటే చాలు. మిమ్మల్ని బాధిస్తే సారీ.

venu madhav said...

nice comment ramu tit for tat

Anonymous said...

Evarikaina doubt vundaa.....
modi ki daggara kaavadaanike Rajam ni BJP lo ki pampaadu ka cha ra.....
entha neecha raajakeeyam...ituvanti durmargudiki puttagathulu vuntaaya?
Vaari bhashalone cheppalante veellani bondapettala vadda....?

hari.S.babu said...

మీకిలా అనిపిస్తోందా ? నేను ఇంకోలా అనుకుంటున్నాను .మోడీని నానా తిట్లు తిట్టిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రంలో అధికార పార్టీకి దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే ఇలాంటి`రాజ`మార్గాన్ని ఎంచుకున్నారని నాకు అనిపిస్తోంది.
>>
I ama laso supporting this openion.K.C.R is very calculated in such moves?!

Unknown said...

Rajam is a business man and heavily interested and invested in polavaram project contract activities...

I do find it as a business strategy of Rajam to move to BJP so that his move will bring money to him and his business partner KCR

This matter is completely wrapped down by mere analysis that there is a dispute between KCR and Rajam , I cannot agree with you guys about it

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి