Sunday, November 8, 2009

ఈ.జే.ఎస్.--1994 బ్యాచ్ సభ్యుల సమావేశం

జర్నలిజం స్కూల్ నుంచి బైటికి వచ్చిన తర్వాత ఉద్యోగాలలో చేరితే అక్కడి  మన మిత్రులను మళ్ళీ కలుసుకోవడం చాలా అరుదు. ఒకరిద్దరు లేఖలు, ఫోన్ ల ద్వారా సంబంధాలు కొనసాగిస్తారు. మళ్ళీ ఆ పాత మిత్రులను చాలా రోజుల తర్వాత కలుసుకుంటే! అప్పట్లో పాఠాలు చెప్పిన మాస్టార్లను గౌరవించి  అందరూ కలిసి సరదాగా పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ లంచ్ చేస్తే?
1994 లో బూదరాజు రాధాకృష్ణ గారు ప్రిన్సిపాల్ గా  వున్నప్పుడు 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో  చదువుకుని జీవితంలో స్థిరపడిన 14 మంది ఈ రోజు (November 4) ఉదయం సోమాజిగూడ లో 'ఈనాడు' కు రాయివేత లేదా కూతవేటు దూరంలో  వున్న  "క్షేత్ర' రెస్టారెంట్లో కలుసుకున్నారు. బూదరాజు గారు లేని లోటు ఉన్నా.. అప్పటి తమ టీచర్లు పోరంకి దక్షిణామూర్తి, టీ.ఎస్.ఎన్. మూర్తి, రామచంద్ర రావు లను  ఈ పూర్వ విద్యార్థులు ఆప్యాయంగా సత్కరించుకున్నారు.



తమ జర్నలిజం జీవితం ఎవరివల్ల, ఎలా, ఎన్ని మలుపులు తిరిగిందీ పెద్దగా చర్చకు పెట్టకుండా ..యిప్పుడు ఏమి చేస్తున్నది...ఎలా వున్నదీ..వంటి విషయాలు వీరు మాట్లాడుకున్నారు. కలసి భోజనం చేసారు. కుటుంబం, పిల్లలు...వంటి అంశాలు మాట్లాడుకున్నాక కాస్త భారమైన హృదయాలతో ఇళ్ళకు తిరుగు పయనమయ్యారు.  
బూదరాజు గారి జ్ఞాపకార్ధం ఇక మరీ తాత్సారం చేయకుండా కార్యక్రమాలు జరపాలని వీరు నిర్ణయించారు.  పై ఫోటోలో ఉన్నవారు వరుసగా (ఎడమ నుంచి కుడికి)
ఏ.మల్లేశం ('ఈనాడు' జనరల్ బ్యూరో), టీ.కృష్ణమూర్తి ('ఆంధ్రజ్యోతి' సెంట్రల్ డెస్క్),  వై.తిమ్మప్ప ('ఈనాడు' సెంట్రల్ డెస్క్), కే.మహేష్ (ప్రిన్సిపల్ కరస్పాండెంట్, టైమ్స్ అఫ్ ఇండియా), వి.కిషోర్ ('సాక్షి' ఇంటర్నెట్ డెస్క్), వి. రమణ ('ఆంధ్రజ్యోతి' క్వాలిటి సెల్ హెడ్), ఎస్.కే.జిలాని (ఏ.బి.ఎన్.-ఫీచర్స్), జి.వి.డి.కృష్ణమోహన్ (అసిస్టెంట్ ఎడిటర్, 'సాక్షి'), ఆర్.సంతోష్ (స్పోర్ట్స్ ఎడిటర్, 'ఈనాడు'), వెంకూ (చీఫ్ సబ్ ఎడిటర్, 'ఈనాడు'), మూర్తి (జోరాలి సొల్యుషన్స్), శ్రీనివాస్ ('ఈనాడు' సెంట్రల్ డెస్క్) , విశేష్ ('సాక్షి' సెంట్రల్ డెస్క్), శ్రీరామ్ (రక్షణ శాఖ).

1 comments:

shankar panthangi said...

ramuji mee blog chushanu. opika unnantha varaku chadivanu. nee aalochanalaku anugunanga raasthunnavu. nee 20 samvastharala anubhvaalanu pradarshinchavu. medialo officelo panichesevari gurinche adhikanga rashavu. reporter perulo samaajanni peedusthunna varini kuda therakekkisthe baguntunhi. entho kastapadi memu apwjf conference jaripamu. anni patrikalu baaga rasayi. kaani neevendhuku maraichavu. eppatikyna oka lakysham kosam nijaayithiga poratam chesevari gurichi, vaari udyamam gurinhi rasthey baguntundi...shankar

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి