ఈ రోజు (November 12) కాస్త తీరిక ఉండి...రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల దాకా...తెలుగు ఛానెల్స్ మార్చి మార్చి గిరిగిరా తిప్పుతూ రంధ్రాన్వేషణ కార్యక్రమం చేశాను. దాని వివరాల మాలికే ఈ పోస్టు...
"పెద్ద ఛానెల్స్" గురించి రాస్తూ...చిన్న వాటి గురించి పట్టించుకోవడంలేదని ఒక సోదరుడు కామెంట్స్ లో నసిగిన విషయం గుర్తుకు వచ్చి..."స్టూడియో-ఎన్"తో పయనం ఆరంభించాను. "ఫోకస్" అనే పేరిట...త్వరలో నిర్వాసితులు కానున్న ఒక మత్స్యకారుల గ్రామంపై ప్రత్యేక కథనం అది. యాంకరమ్మ మొదలెట్టింది.
"అక్కడి జనం అనువనువునా వనికి పోతున్నారు....వారికి అనుబాంబు భయం పట్టుకుంది"...అని గడగడా చదివారామె. అన్ని పదాలూ సరిగ్గానే పలికారు కానీ..."ణ" వచ్చినప్పుడు మాత్రమే దాన్ని "న" చేసారు. "అను విద్యుత్ కేంద్రానికి...ఈ గ్రామం ఎందుకు అనువుగా వుంది?" అని కూడా ఒక సారి చదివారు. ఈ స్టోరీకి మంచి విజువల్స్ వాడారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాపీ బాగా రాసారు కానీ "న"తోనే చిక్కు వచ్చింది.
"అక్కడి జనం అనువనువునా వనికి పోతున్నారు....వారికి అనుబాంబు భయం పట్టుకుంది"...అని గడగడా చదివారామె. అన్ని పదాలూ సరిగ్గానే పలికారు కానీ..."ణ" వచ్చినప్పుడు మాత్రమే దాన్ని "న" చేసారు. "అను విద్యుత్ కేంద్రానికి...ఈ గ్రామం ఎందుకు అనువుగా వుంది?" అని కూడా ఒక సారి చదివారు. ఈ స్టోరీకి మంచి విజువల్స్ వాడారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా కాపీ బాగా రాసారు కానీ "న"తోనే చిక్కు వచ్చింది.
పక్కనే వున్న TV-9 కు ఛానల్ మార్చాను. "సిటీ జెన్స్" పేరిట ఒక సీనియర్ రిపోర్టర్ చేస్తున్న కథనం వచ్చింది. ఆమె "మౌళిక సదుపాయాల" గురించి మాట్లాడారు. ఇంగ్లీషును గుప్పించారు. ఆ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక మహిళా మ తల్లి గడగడా మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే...ఆమెకు మంచి రిపోర్టర్ అయ్యే లక్షణాలు వున్నాయనిపించింది.
"Zee-24 గంటలు"కు వెళ్లి అక్కడ ఒక యాంకర్ "ఎంటర్ టైన్మెంట్ టాప్ టెన్" లో "మళ్ళీ" కి బదులు "మల్లీ" అనడంతో కంగుతిని మళ్ళీ "TV-9" కు వచ్చాను. అప్పటికి అక్కడ రిపోర్టర్లు దడ దడా వార్తలు చదివే "news express" అనే కార్యక్రమం సాగుతున్నది. ఏదో రాహుల్, రాజ్ బబ్బర్ ల వార్త చదివిన ఒక మోడరన్ రిపోర్టర్ "సక్సెస్ కాగలడా?" అన్న ప్రశ్నతో తన వంతు వార్తను ముగించారు. "విజయం సాధించ గలడా?" అనో "సక్సెస్ సాధించగలడా?" అనో సెటిల్ అయిపోతే బాగుండేదేమో?
అప్పుడే తొమ్మిది గంటల వార్తలకు వేళయింది.
"N-TV" లో హిమబిందు, వరప్రసాద్ లు ముఖ్యాంశాలు చదవడానికి భలే ఇబ్బంది పడ్డారు. ప్రాంటర్ పనిచేయలేదేమో...సగం చూసి సగం చూడకుండా..చదివేందుకు వారు చేసిన ప్రయత్నం తెరపై ప్రస్ఫుటమయ్యింది.
"I-News" వారి స్టార్ యాంకర్ రవి అన్న తెర మీద అప్పటికే సిద్ధంగా వున్నాడు. "మజ్జం" ధరల గురించి ఆయన మంచి చర్చ పెట్టాడు.
"ఈనాడు" లో చాలా చాలా కీలమైన పదవిలో ఉండి ... "ఈ-టీవీ" వారి "ప్రతిధ్వని" భారాన్ని ఇటీవలనే..భుజానికి ఎత్తుకున్న...డీ.ఎన్. ప్రసాద్ గారి మొడరేషన్ విని ఆంగ్ల భాషా పిపాసి అయిన నా రిమోట్ పనిచేయడం మానేసింది."నియో రిచ్", "రిచ్" ల దగ్గర డీ.ఎన్. గారి మొదటి ప్రశ్న మొదలయ్యింది. "డెమోక్రాటిక్ ఇన్ స్టిట్యూషన్"ల గురించి రెండో ప్రశ్న వేసారు. "ఇది సమాజం మీద ఎలాంటి దుశ్చర్య వుంటుంది" అని ఒక దశలో ఆయన అడిగినట్లు నాకు వినిపించింది. అను నిచ్చం...మల్లీ మల్లీ...థిస్ టైప్ ఆఫ్ పోస్ట్లు రాయమని నాకు రిక్వెస్ట్ చాయకండే!?
-------------
నోట్: వల్లి గారు సహృదయంతో పంపిన కొన్ని సవరణలు చేర్చి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. వల్లి గారికి మళ్ళీ మళ్ళీ కృతఙ్ఞతలు. వల్లి గారు, 'కంగుతిని" సరైనదని 'ఈనాడు' మిత్రులు అంటున్నారు. వీలున్నప్పుడల్లా ఇలా నా బ్లాగ్ లో రంధ్రాన్వేషణ చేసి పుణ్యం కట్టుకోండి. --ramu
4 comments:
Dear Ramu,
The whistle-blowers' job is really thankless. These selfless martyrs are first derided to be snitches.
When you come up with a media blog, the first media blog in Telugu with blogger’s sign, I, like many of our journos, was skeptical of blogger’s uprightness. According to the reliable feedback I got, u r undoubtedly an honest journalist with spotless professional record. I was also told that u have a childlike honesty, besides a tinge of innocence. On and off, I also found some moralistic tendencies in ur postings. Probably u owe them to ur immense devotion to the Victorian values.
Coming to the crux, this post on the language- spam of the manic motormouths of News presenters, Anchors, is hilarious. I expect more from ur elbow… Could u provide ur personal Mail id, for a direct interaction?
Thanks a lot.
my mail id: mittu1996@gmail.com
--Ramu
ramu garu,
idi chala kalanga jarugutunna thanthe. telugu nu tenglish ga marchi chadive vare ivalti channels lo adhikam. annattu alanti posh anchorammaluntene thama channel nadustundane bhramalo news channels lo unna koddipati medhavulaina rao laku, murty laku kuda nammakam... ade dourbhagyam... spashtamga chadive varu "migata" panulaku paniki raru kada anduke... tenglish gummalake chancelu...
i am sorry to post like this
thanks ramu garu keep it all the best
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి