Thursday, April 1, 2010

అందరం ఫూల్స్ మే....హ్యాపీ ఆల్ ఫూల్స్ డే...

ఈ రోజు మనమంతా ఖుషీగా పండగ చేసుకోవాల్సిన రోజు. ఇది మన ఆల్ ఫూల్స్ డే. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, మనం ఫూలిష్ గా బతకడం లేదా?

"నేను చేసేది కరెక్టు, నేనే గొప్ప, మిగిలిన వాళ్ళు పనికిరాని చచ్చు సన్నాసులు..." అన్న ఫూలిష్ ఫీలింగ్ తో మనమంతా బతికేస్తున్నాం. కేవలం ఈ చెత్త భావన వల్లనే ఒకడికి ఒకడు మనశ్శాంతి లేకుండా చేస్తూ...ఫూలిష్ గా అదే ఆనందంగా భావిస్తున్నాడు. ఒకడిని మరొకడు తొక్కిపారేయ్యడమే కదా...నేటి జీవితం! సాటి మనిషి పట్ల సానుభూతి, గౌరవం శూన్యం. అబద్ధాల మధ్య, అభద్రతతో బతుకుతూ....ఇది నాణ్యమైన జీవనమని ఫూలిష్ గా నమ్ముతున్నాం.

ఈ క్రమంలో అమూల్యమైన మానవ వనరులు, సృజనాత్మకత గంగలో కలిసిపోతున్నాయి. మనమంతా....ఎంత బుర్ర తక్కువగా బతుకుతున్నామో ఆలోచించుకోవడానికి ఇదే సరైన రోజు.   

నా పొట్ట, నా కుటుంబం, నా ఆస్తి, నా కులం, నా మతం...అన్న మరీ ఫూలిష్ ఫీలింగ్ నరనరాన పట్టించుకున్నాం. కుటుంబంలో, సమాజంలో అశాంతి కలిగిస్తున్నది ఈ ధోరణే. మతాలన్నీ...తోటి వాడిని దేవుడిలా ట్రీట్ చేయమని బోధిస్తున్నాయి. మతం మాట ఎత్తితే ఊగిపోయ్యే మనోళ్ళకు ఇది పట్టడం లేదు. ఇది ఎంత ఫూలిష్ వ్యవహారం!

 సమాజానికి మన కాంట్రిబ్యూషన్ ఏమిటి? మనం ఎంత ప్రశాంతంగా బతుకుతున్నాం? ఎందరిని ఆదుకుంటున్నాం? అని ప్రశ్నించుకోకుండా...మనం ఎంత సంపాదించాం? అన్న ప్రశ్నే అందరికీ ముఖ్యమై పోయింది. అందరం ఒక మ్యాడ్ రేసులో పడి ఫూలిష్ గా కొట్టుకు పోతున్నాం. మనలను లాలించి జోకొట్టడానికి సినిమాలు, టీ.వీ.లు ఉండనే ఉన్నాయి. అవి అనుక్షణం మనలను ఫూల్ చేస్తుంటే...అదే మనకు హాయిగా ఉంది.  

అన్ని రంగాల కన్నా ఎక్కువగా మీడియా ఫూలిష్ గా ప్రవర్తిస్తున్నది. ఈ ధోరణి ప్రభావం సమాజం మీద పడి వ్యవస్థను దెబ్బ తీస్తున్నది. ఇదొక తిమ్మిరి, ఒక తీట, ఒక దురద, ఒక అంగవైకల్యం. దీనికే..ఈ మీడియా బ్యారేన్లు 'సృజనాత్మకత', 'వ్యాపారం'...వంటి పిచ్చి పేర్లు పెట్టుకుని సమాజంపై అక్షరాలతో, బొమ్మలతో దాడి చేస్తున్నారు. దావూద్ ఇబ్రహీం లాగా వీళ్ళు చేసిది..కుట్రపూరిత దాడి. కనిపించని ఉపద్రవం.


ఒక పెద్దాయన...కష్టపడి పెద్ద మీడియా సామ్రాజ్యం నెలకొల్పాడు. పేపర్, టీ.వీ, సినిమా రంగాలలో సంచలనాలు సృష్టించాడు. వేలాది ఎకరాలు పోగేసాడు. రాజకీయ రంగాన్ని శాసిస్తున్నాడు. తానే మేధావి అనుకున్నాడు. ఉద్యోగాలు పీకి పారేసి చాలా కుటుంబాలను ఇబ్బందుల పాల్జేసాడు. కొడుకును కుంగదీసిన క్యాన్సర్, తన గుండెల మీద దెబ్బ తీసిన కొడుకు...వెరసి మనశ్శాంతి లేని జీవితం! ఇప్పుడు పెద్దాయన ఒక్కసారి జీవితాన్ని అవలోకనం చేసుకుంటే....'ఏంటీ...ఇంత ఫూలిష్ జీవనం గడిపా' అని అనిపించకమానదు.  ఆయనకు మనసున్నా, ఆయన ఆత్మవంచన లేకుండా అవలోకనం చేసుకున్నా...వెనక పెద్ద శూన్యం కనిపిస్తుంది.

ఇంతకన్నా ఉదాహరణ ఏమికావాలి మనకు? ఇది సజీవ నిదర్శనం. ఇది ఆధ్యాత్మికంగా తోస్తుంది, కానీ...ఇది జీవిత సత్యం. ఇది తెలుసుకునే లోపు సగజీవితం ఖతమై...బీ.పీ., షుగర్ రానే వస్తున్నాయి.   

అబద్దాలతో మేడలు కట్టి, ఇతరులను బాధపెట్టి, సమాజాన్ని చెడగొట్టి...ఇదే గొప్ప పని అనుకుని బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మురుస్తూ బతికితే...అంతకన్నా ఫూలిష్ పని ఏమి వుంటుంది చెప్పండి? మన చుట్టూ ఉన్న అందరూ కోరుకుంటున్నది....ఒక్క.... ఒకే ఒక్క....అవకాశం. నిష్పక్షపాతంగా ఆ అవకాశం ఇచ్చి చూడండి. ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటుకుంటారు. మీకెంతో తృప్తి కలుగుతుంది.  

మీ జీవన యానం ఆరంభంలో...మీకు ఎవరో చేయి అందించి సాయపడి  వుంటారు. మీరు ఫూలిష్ గా ఎన్నో తప్పులు చేసి ఈ స్థాయికి వచ్చి వుంటారు. అది మరిచి మీరు ఇప్పుడు 'వాడు పనికి రాడు...వీడు పనికి రాడు' అని ప్రకటనలు ఇస్తే...నిజంగా మనం ఫూల్స్ కింద లెక్క కాదా?

6 comments:

తుంటరి said...

Excellent one. I really Appreciate your effort.

Anonymous said...

Super...

నిజం said...

Super

sadasivarao said...

ప్రస్తుత సమాజపోకడను కళ్ళకు కట్టినట్టు చూపారు. ఈ వ్యాసం చదివి కొందరిలోనైనా మార్పు వస్తే సార్దకత చేకూరినట్లే...........సదాశివరావు

Anonymous said...

రామోజీని మెత్తటి చెప్పుతో కొట్టారు. it is very good. he deserves it.

Anonymous said...

మీరు రాసిన మంచిముక్కల్ని సమర్ధించుకోడానికి రామోజీరావ్ కుటుంబ వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించడం నీచసంస్కారం. నేనేదో రామోజీరావ్ అభిమానిని కాదు. కానీ ప్రొఫెషనల్ విమర్శని - ఒక వ్యక్తిగత జీవితంలో జరిగిన నష్టానికి ముడి వేసి అపహాస్యం చేయడం- అది చూసి ఇతరులు బుద్ధి తెచ్చుకోవాలనడం- ఇదేనా మీరు నేర్చుకున్న జర్నలిజపు విలువలు ? మీకు కుటుంబ పరంగా వ్యక్తిగత జీవితంలో ఏ కష్టనష్టాలు జరగలేదా ? కొడుక్కి కేన్సర్ వస్తే తగిన శాస్తి జరిగింది అన్న రీతిలో మీరు ప్రబోధం చేయడం హేయం.