రాత్రి సానియా నిద్రలేకుండా గడిపిందా? నిద్రపోకుండా ఏమిచేసింది?
అయేషా సిద్దిఖికి షోయబ్ విడాకులు ఇస్తాడా?
షోయబ్, సానియా పెళ్లి అవుతుందా? కాదా?
వీళ్ళ రాశి ఫలాలు ఏమిటి? అవేమి సూచిస్తున్నాయి?
పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?
వీళ్ళ శోభనం ఎక్కడ?
వీళ్ళు ఎక్కడికి హనీమూన్ కోసం వెళ్తారు?
వీళ్ళకు బాబో, పాపో పుడితే....ఏమి పేరు పెడతారు?
ఆ పుట్టుని బాబు/పాప ఏ దేశం తరఫున ఆడతారు?
---ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు వెదకడంలో మీడియా పూర్తిగా తలమునకలై ఉంది. ఈ పెళ్లిపై సాధ్యమైనన్ని వార్తలు వేస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. అన్ని ఛానెల్స్ సానియా ఇంటిముందు....విలేకరులను కాపలా పెట్టాయి. ఆ ఇంట్లో ఏమి జరుగుతుందో ఛానెల్స్ కు అర్జెంటుగా తెలియాలి. ఇందుకోసం స్టింగ్ ఆపరేషన్ చేసేందుకు కూడా సిద్ధమవుతారు. పూలు అమ్మే వాడిగానో, బాత్ రూం క్లీన్ చేసే వాడిగానో ఒక రిపోర్టర్ సానియా ఇంట్లోకి వెళ్లి..."యక్స్ క్లూసివ్" వీడియో ఫూటేజ్ తెస్తారు..చూస్తూ ఉండండి.
ఈ షోయబ్, సానియా పెళ్లి ప్రతిపాదన నేపథ్యంలో నాకు ఓ ఇద్దరిని చూస్తే జాలి వేస్తున్నది.
1) అయేషా సిద్దిఖి: పాపం, ఈ అమ్మాయి షోయబ్ కోసం చాలా కలలు కని నిఖా చేసుకున్నదట. ఆ మధ్య పాక్ టీం వచ్చి వీళ్ళ ఇంట్లో సుష్టుగా విందు ఆరగించడం, ఆయేషా ఖుషీగా చానెల్స్ కు ఇంటర్ వ్యూలు ఇవ్వడం చూసాం. లావున్నావని వాడు రోజూ సతాయిస్తుంటే..మా అమ్మాయి దుబాయ్ వెళ్లి ప్రాణాంతకమైన సర్జరీ చేయించుకుందని ఆ అమ్మాయి తల్లి దండ్రులు చెబుతుంటే చాలా బాధవేసింది.
ఫోన్ లో వాడితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఏడ్చేదని వారు నిస్సహాయంగా చెప్పారు. ఇదేమి దారుణం? ఇంత జరిగినా...వీళ్ళు ఇంత కాలం కిమ్మనకుండా ఎందుకు ఉన్నారు? పాపం..ఇలాంటి బాధ మరొకరికి రాకూడదు. సానియాతో ఎంగేజ్మెంట్ జరిగిన కుర్రోడు ఈ పరిణామాల గురించి ఏమనుకుంటూ ఉన్నాడో కదా!
2) జూ.ఎన్టీఆర్: ఒకవేళ షోయబ్-సానియా ల ఎవ్వరం తెరమీదికి రాకపోతే...
తెలుగు ఛానెల్స్ అన్నీ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు పడి కాపులు కాసేవి. ఏ రకంగా చూసిన ఈ చిన్నోడు నార్నే వారి అమ్మాయిని పెళ్ళాడడం ఛానెల్స్ కు మంచి మేత. పూర్ ఫేలో....మంచి ప్రచారం కోల్పోయాడు. మొన్న జరిగిన ఎంగేజ్మెంట్ పై తెలుగు ఛానెల్స్ అనుకున్నంత హడావుడి చేయలేకపొయ్యాయి.
అయినా...పాక్ లో వివాదాస్పదుడైన క్రికెటర్ పై సానియా మనసు పారేసుకుని జాగ్రత్తగా నరుక్కు రావడం...ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకుని...అతన్ని పెళ్ళాడాలని కోరుకోవడం కొంత విడ్డూరంగా ఉంది.
"జనం ఈ పెళ్లి ప్రతిపాదన గురించి ఏమి అనుకుంటూ ఉన్నారో తెలియదు కానీ...నాకైతే ఆమె నిర్ణయం సరైనది కాదని అనిపిస్తున్నది," అని ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కుర్రోడిని చూసుకున్నా...కాస్త క్లీన్ ఇమేజ్ ఉన్న వాడిని చూసుకోకుండా....షోయబ్ ను ఎంచుకోవడం నాకూ కొద్దిగా బాధగానే ఉంది. ఎనీ వే, సానియా...గుడ్ లక్.
కొస మెరుపు
ఇది మీరు గమనించారా? ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వివాదాస్పద సెక్రటరీ చాముండేశ్వర్‌నాథ్ షోయబ్-సానియా వ్యవహారంలో మళ్ళీ తెరమీదికి వస్తున్నాడు. క్రికెట్లో ఎదగాలని అనుకుంటున్న అమ్మాయిలను లైంగికంగా వేధించిన కేసులో విచారణ ఎదుర్కుంటూ ఉన్న ఆయన ఉన్నట్టుండి బైట కనిపిస్తున్నారు. ABN- ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈయనను నిన్న ఒక చర్చకు కూడా పిలిచారు. ఇక్కడ చాముండి...ముంబాయ్ లో బాల్ థాకరే హడావుడి చేస్తున్నారు. ఎవడి గోల వాడిది.
12 comments:
I fail to understand he Sania mania of our channels as if it is an essential item for the people.It is purely her personal affair and let her marry any Tom and Dick of her choice and go anywhere in the world as she is more interested in her personal affair than the nation and her mother land though she is willing to play for India staying in Dubai which looks awkward and she wants to follow painter Hussain who surrendered his passport of mother India.I appeal to the channels to save the viewer from Sania mania.
JP.
పూర్వం మందాకిని అని ఓ నటి ఉండేది. అదేదో రాజ్ కపూర్ సినిమాలో తన అందాలు ఒలకపోసుకుంది. ఆ పిల్లి కళ్ళ సుందరి పోయి పోయి అదేదో దేశంలో దాక్కున్న ఒక మాఫియా గాడి జనానాలో పడిందట అని అప్పుడు బాలీవుడ్లో ఒకళ్ళ చెవులు ఒకళ్ళు తినేశారు. ఇప్పుడు ఈ పిల్ల పోయి పాకిస్తానీ వాణ్ని కట్టుకోబోతోంది. ఇవన్ని ఇదివరకు "కాగడా" ఒక సినీ పత్రిక ఎల్లో జర్నలిజానికి ఒక తీవ్రమైన ఉదాహరణగా వచ్చేది. అటువంటి పత్రికల్లో పడే వి ఇలాంటి నేలబారు వార్తలు. ఇప్పుడు "మెయిన్ లైను మీడియా" 'ట' ఇది ప్రతివాడూ ఒక్కో కెమారా వాణ్ని సానియా ఇంటి గోడేక్కించారు. మళ్ళి ఇప్పుడు ఆ కాగడా పత్రిక మొదలుపెడితే విపరీతంగా అమ్ముడు పోతుంది అనుకుంటాను. మీడియానే అనుకోక్కర్లేదు, ప్రజల టేస్టు కూడా అలానే ఉన్నది. దొందూ దొందే.
I agree that it is Sania's personal matter and that the media is focussing too much on this matter. But it is a unique case. An Indian celebrity player marrying a Pakistani celebrity player.
It is of interest to the people of both the nations..the way they get married, live together, and still play for their respective countries. It is like a case study for those youngsters who may get married in similar lines.( A person from Navy, who married a foreigner, went to the court asking why he couldn't do so when the PM's son, Rajiv Gandhi, could marry a foreigner. And he won the case.) But the couple in question should put in their best and make their marriage a success. Let's wish them a happy and ideal married life.
AS for Sania's choice, we can't feel bad about it. All this happened before it's too late. She was supposed to quit Tennis if she were to marry Sohrab. Looks like it was painful for her to quit the game. Now she has the support of Shoab. ( Iam not a fan of Shoab. Personally, I felt she should continue her sports career, even after marriage.)
ఏమైనా మీరు కూడా ఈ విషయానికి ప్రాధాన్యం ఇస్తూ ఇంతగా వ్రాయటం మంచి శకునం కాదు అని అభిప్రాయం. ఇలాంటివి నచ్చవంటూనే వాటిని ఆసక్తిగా గమనిస్తున్నాం (follow అవుతున్నాం) అని చెప్పడం ద్వంద్వ వైఖరిగా వుంటుందేమో ఆలోచించండి.
It is purely personal/family matter and we are noone to judge. and reg. living in dubai and playing for india is also her choice. many of russian atheletes and tennis stars like sharapova are residing in america from a long time but playing for India. even viswanathan anand has a residence in spain and he spends most of his life there. media should better stay away from hypothetical issues, where there is no public impact
నేను విజయ వర్ధన్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చెత్త చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాము అని ఈ మీడియా వాళ్ళు గట్టిగా వాదించటానికి కారణం పెరిగిన వాళ్ళ టి ఫై ఆర్ రేటింగులే నిదర్శనమాట. వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాము అని ప్రేక్షకుల గోల. మొత్తం మీద Cath 22 పరిస్థితి. పిచ్చి తగ్గితే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని పిచ్చి తగ్గదు!!
టి పి ఆర్ రేటింగులు ఎలా కొలుస్తారో ఒక సారి పరిశీలించి, అందులో పెను మార్పులు చేసి తీరాలి అప్పటికి గాని ఈ వెర్రి తగ్గదు. ప్రకటనలను మానసిక కాలుష్యంగా గుర్తించాలి, వాతావరణ కాలుష్యాన్ని ఎలా అరికట్టటానికి అనేక మంది కృషి చేస్తున్నారో, అలాగే ఈ మానసిక కాలుష్య నియంత్రణకు కూడా అందరూ నడుం కట్టాల్సిన తరుణం వచ్చింది. ఆలశ్యం చేస్తే గ్రీన్ హౌసు వాయువులను తలతన్నే చెత్త ఆలోచనలను మన బుర్రల్లోకి ఎక్కింఛి విషపూరితం చేస్తారు ఈ ప్రకటనా రాక్షసులు. ఇప్పటికే పరిస్తితి చేయి దాటి పోయిందని నా ఊహ.
సానియమ్మ ఎవడిని పెల్లిని చేసుకున్నా మనకొచ్చే నష్టమేమీ లేదుకానీ, కొంతమంది కామెడీ జనాలు ఇది భారత్ పాకిస్తానుల మధ్య ఉన్న అంతరాలను తగ్గించడానికి ఉపయోగ పడుతుందని చెప్ప్పడం చూస్తే నవ్వొస్తోంది
Ramu Garu...! Meeku inko joke cheppana... ninna NTV story board lo Sania meeda negative story icharu. Deenilo haasyaspadamaina vishayam entante road pakkana vegetables ammukune Oka 50 ella mahila byte ni pade pade vesharu. nijam cheppalante ameku Asalu Sania evaro teluso, ledo gani... Sania Showeb ni pelli chesukovadam chala pedda neram annattu ame matladindi. Ninna story board chusina prathi okkariki ame byte navvu teppinche vuntundi. Stars vishayamlo ilanti bytes veyakudado ledo managements okasari Alochinchukovali mari...
@Ramu:
You were right. They did a stupid sting operation forcibly peeping into Sania's 'home'.
ramu gaaru..
ayesha innaallu kimmanakunda enduku vurukundi.. ani prashninchaaru. pak ex-captain ni edurkonentha shaksthi ameku lekapoyi undochu. money, palukubadi ameku levu kadha.
ee comment pai subjectki sambandinchinadi kadhu.
karimnagar jilla godavarikhani lo oka vilekhari varusaga 5 kirayi hatyalu chesaadu.veetilo police officers ki kuda hastham undhi. chivariki police ne champesadu. media-mafiaki idoka taja udaharana
సానియా ఒక పిచ్చితల్లి.
అవ్వాలి సానియా షోయబ్ పెల్లి
మల్లి మల్లీ.
గల్లి గల్లీ లల్ల లొల్లి లొల్లి.
బుల్లి తెర ఒక రాక్షస బల్లి.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి