Friday, April 2, 2010

సాక్షి 'ఏది నిజం'లో రామోజీపై శృతిమించుతున్న దాడి

కాంగ్రెస్ ఎం.పీ. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న 'సాక్షి' దినపత్రిక....'ఈనాడు' పైనా, దాని అధిపతి చెరుకూరి రామోజీరావు గారి పైనా దాడి చేయడానికి తన సంపాదకీయం పేజీలో 'ఏది నిజం' అనే అద్భుతమైన కాలం నిర్వహిస్తున్నది. 'ఈనాడు' రెండు నాల్కల ధోరణిని ఎండగట్టడం, ఆ పత్రిక ప్రచురించే...టీ.డీ.పీ.అనుకూల కథనాలను తూర్పారబట్టడం, రామోజీ రావు గారి ధోరణిని దూదేకడం...ఈ కాలమ్ ఏకైక లక్ష్యం. 

ఈ కాలమ్ నిర్వహిస్తున్న జర్నలిస్టు...'ఈనాడు'లో రామోజీ కాబిన్ పక్కనే కెరీర్ ప్రారంభించి....'ఈనాడు' విషయాలన్నీ ఐదో ఫ్లోర్ నుంచి నిశితంగా గమనించి...అక్కడ ఉక్కపోత తట్టుకోలేక....'సాక్షి'లో చేరినతను. బుర్ర, భాష ఉన్నవాడు కనకనే...'ఏది నిజం?' సాక్షిలో అంతగా పండుతున్నది. ఈ కాలమ్ లో లేవనెత్తే అంశాలను లా పాయింట్లతో కౌంటర్ చేసే ధైర్యం, అంతే ఘాటుగా రాసే దమ్ము ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి 'ఈనాడు' లో దొరకడం కష్టమని అక్కడి మిత్రులే ఒప్పుకుంటారు.  

అయితే...ఈ రోజు "కాగ్ నివేదికతో...ఈనాడు రాజకీయం...సాక్షి పేరు చెబితే ఎందుకంత భయం?" అన్న శీర్షికతో ప్రచురితమైన 'ఏది నిజం?' కాలమ్ కొద్దిగా శృతిమించింది అనిపించింది. వై.ఎస్. హయాంలో 'సాక్షి' కి నిబంధనలు తోసిరాజని భారీగా వ్యాపార ప్రకటనలు గుప్పించడాన్ని కాగ్ తప్పుపట్టడంపై 'ఈనాడు' లోపలి పేజీలలో ప్రచురించిన ఒక వార్తకు, సంపాదకీయంలో రేఖామాత్రంగా ఆ పత్రిక చేసిన వ్యాఖ్యకు స్పందన ఇది. 

నిజానికి...'సాక్షి'కి ప్రకటనలు ఇవ్వడంపై కాగ్ రిపోర్ట్ ను 'ఈనాడు' ఒక వార్తగా ఇచ్చింది, కానీ...జర్నలిజం సూత్రాలు మార్చిపారేస్తున్న మన వేమూరి రాధాకృష్ణ గారి 'ఆంధ్రజ్యోతి' తీవ్ర వ్యాఖ్యలతో కూడిన కథనాన్ని మొదటి పేజీలో ప్రచురించింది. 'సాక్షి' వారు ఈ 'ఏది నిజం'లో ఆంధ్రజ్యోతి మాటైనా ఎత్తకుండా...'ఈనాడు'పై దాడి చేశారు. పైగా...'సాక్షి' సర్క్యులేషన్ చూసి రామోజీ ఏడుస్తున్నట్లు ఒక పెద్ద కార్టూన్ వేసారు. ఇది ఛీప్ ఎత్తుగడ. రామోజీ మీద గుడ్డి ద్వేషానికి నిదర్శనం. 'సాక్షి' ఓనర్ మహాత్మా గాంధీ గారో, ఫిరోజ్ గాంధీ గారో అయితే...ఇలా రెచ్చిపోవచ్చు కానీ....

నేటి 'ఏది నిజం' మొత్తం కథనంలో ఒక పెద్ద లోపం ఉంది. "చంద్రబాబు హయాం లో ఇలాంటి వ్యవహారం జరిగితే మాట్లాడని 'ఈనాడు' ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నది?" అన్న ప్రశ్నే ఎక్కడ చూసినా. తప్పు అప్పుడు జరిగినా తప్పే, ఇప్పుడు జరిగినా తప్పే. 

'ఈనాడు' పాపాలు చేయలేదని, పచ్చ పార్టి సహకారం తెసుకోలేదని అనడం లేదు కానీ...దాని మీద వ్యతిరేకతతో...సత్యాన్ని, కాగ్ లాంటి వ్యవస్థను నీరు కార్చకూడదు. ఇప్పుడున్న మేడిపండు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తప్పు చేసాయని లెక్కలతో సహా చూపే సంస్థ 'కాగ్' ఒక్కటే కనిపిస్తున్నది. దాన్ని చులకన చేసేలా అప్పుడెప్పుడో చంద్రబాబు బుద్ధి తక్కువగా చేసిన వ్యాఖ్యలకు ఈ వ్యాసంలో పెద్ద పీట వేయడం బాగో లేదు. 

ఈ 'ఏది నిజం' లో 'ఈనాడు' పై ఎప్పటిలా చర్వితచర్వణ ఆరోపణలు, పదబంధాలు వాడారు మొదటి కాలంలో...ఏదో నిడివి తగ్గకూదదన్నట్లు. నిజానికి అసలు కథనం రెండో కాలమ్ నుంచి మొదలై...ఒక ఏడు పాయింట్లతో ముగుస్తుంది. 

'సాక్షి' జననం, అందులో పెట్టుబడులు, అందులో బాసుల కుల గోత్రాలు, అది పుట్టీ పుట్టగానే కుప్పలు తెప్పలుగా వచ్చిన ప్రకటనలు, అది సర్క్యులేషన్ పెంచుకున్న తీరు....జర్నలిజం లో ఉన్నవాళ్ళకే కాకుండా....కాస్త నిశితంగా పరిశీలించే వారందరికీ తెలిసిందే. ఈ వాస్తవాలను కాదని ఈ వ్యాసకర్త.....వై.ఎస్. 'సాక్షి' కోసం నిబంధనలు సడలించడం వల్ల 'ఈనాడు'కు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా...అన్న వాదన చేశారు. 

రెండో పాయింట్ లో....'సాక్షి లక్ష్యం, దాని అవసరం పాఠకుల మనసుల నుంచి పుట్టినవి.." అని రాసారు. ఇది పెద్ద అబద్ధం. రాజకీయ లక్ష్యంతో పేపర్ పెట్టుకుని  పాఠకుల మనసుకు దాన్ని ముడివేస్తే ఎలా? 

నాలుగో పాయింట్ లో...."చంద్రబాబు హయాం లో మినహాయింపులు ఇవ్వడం తప్పు అని మేము భావించడం లేదు," అని రాసారు. హవ్వ...ఇదేమి లెక్క? వాళ్ళ వాళ్ళ కోసం బాబు గారు, తన పుత్రుడి కోసం రాజా వారు మినహాయిపులు ఇచ్చుకుంటారు. పొయ్యేది పన్నులు కట్టే వాళ్ళ డబ్బు కదా! ఇదేమి వాదన?

ఐదో పాయింట్ కింద మరొక పెద్ద అబద్ధం ఉంది...ఈ 'ఏది నిజం?' కాలమ్ లో. "ప్రభుత్వ ప్రకటనలు దండిగా ఉంటే...పత్రికను మెండుగా అమ్ముకోవచ్చు అనే సూత్రమే హాస్యాస్పదం.  ఇది పాఠకులను అవమానించే వెర్రి సాహసం." ప్రభుత్వ ప్రకటనలు దొడ్డి దోవన దొబ్బెయ్యడం వేరు, పేపర్లు అమ్ముకోవడం వేరు కదా! ఆరు నెలల్లో దాదాపు ఏడు కోట్ల రూపాయల ప్రకటనలు!!!


ఇక ఆరో పాయింట్...కాగ్ కు సంబంధించిన 4.6 రూల్. ఎలాంటి వ్యాఖ్యా చేయని ఈ పాయింట్ ఎలా వుందంటే....."అసలు...కాగ్ ను మనం పట్టించుకోవాల్సిన పనిలేదు" అని. అసలు...ఈ 'ఏది నిజాన్ని?' ఒక్క మాటలో ఇలా చెప్పుకోవచ్చు:


"ఓయ్...రామోజీ రావ్! అదో కాగ్...నీదో వార్త. ఒక సంపాదకీయం కూడా రాస్తావ? చంద్రబాబు హయాం లో సడలింపు ఇచ్చినట్లే...వై.ఎస్.హయాం లో సడలింపు ఇచ్చారు. మధ్యలో మీదేమీ పోయింది? గమ్మునుండు. 'సాక్షి' ఎదుగుదలను చూసి మీ ఏడుపు." 

11 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకొంటారు.మధ్యలో మనకి బొక్క.

Anonymous said...

nice story

ప్రేమిక said...

రాము గారు చాలా బాగుంది.
సాక్షి వాళ్లు ఎప్పుడు రామోజీ ని తిట్టాలన్నా ఆయనెవరో తోడల్లున్ని తెర మీదకి తీస్కొస్తారు. ఎవడా సిల్లీ ఫెలో? అసలు రామోజీ లేకపోతే ఆయనగారి పేరైనా తెలిసేదా మనకు? మన రాస్ట్రం లో జర్నలిజం చచ్చిపోయి సాన్నాలైంది.

Anonymous said...

You answered the point half way. You are right that they should not say that "It was happened to you in TDP ruling now it is happening to us in Cong ruling so what's the problem". But it should not be like, if we do it, it is right but if you do it we will tear you apart ;)

With these two news papers fighting, we will know both the faces, that is the good part for the reader.

Anonymous said...

అక్రమదారిలో సంపాదించిన పెట్టుబడులతో పత్రిక పెట్టి రామోజీరావులాంటి
వ్యక్తిని తిట్టడమే పనిగా పెట్టుకోన్న ఆ పత్ర్కను తలుచుకోడమే మహా పాపం!

Anonymous said...

Mr. Ramu,
Your analysis may be right except that 2nd paragraph. It clearly appears that you are in some preconceived notions about skills and capabilities of present Eenadu staff. You also seems to be of the opinion that all the staff who left Eenadu are highly capable. How many people participated in your survey on the skills of GVD Krishna Mohan? I am not questioning his / others skills but the way you are drawing conclusions is not acceptable. And I humbly suggest you not to discuss individual skills on this blog as it's nature may not support it. I also observed some downgrading comments on news anchors. There are so many legitimate factors that contributes for some journos being capable / incapable. They may not be incapable if they are not able ask proper questions. One should respect and analyze that factors than playing sarcasm.
Thanks
Chakri

Anonymous said...

'రెండో పాయింట్ లో....'సాక్షి లక్ష్యం, దాని అవసరం పాఠకుల మనసుల నుంచి పుట్టినవి.." అని రాసారు. ఇది పెద్ద అబద్ధం. రాజకీయ లక్ష్యంతో పేపర్ పెట్టుకుని పాఠకుల మనసుకు దాన్ని ముడివేస్తే ఎలా?' --ramuji, ఈ పేరాతో ఏకీభవించలేను. ఎందుకంటే రామోజీ నీచమైన జర్నలిజంనుండి విముక్తికోసం ఒక బలమైన పత్రిక కోసం పాఠకులు ఎదురుచూసిన మాట నిజం.

Ramu S said...

Hi Dear MR.Chakri.
1) Don't be silly, dear. You need not go for a survey to test the skills of MR.GVD Krishna Mohan. He has been proving his mettle for more than 15 years. I worked with him and I can tell you that he is a gem. I tried in vain to bring punch in sentences like him.

2) Please let me know a single person of his caliber in entire eenadu. I am not trying to belittle you or challenge you but I am requesting you to show me such journalists.

3) Generally I stay away from making comments on individual skills because I know the limitations in performing in media houses. I'll take your suggestion.
4) I can't agree with your objection about my comments on anchors. They will be the key subjects of our discussion. Please let me know where I had gone overboard.

మరొక అనామిక గారికి...
సర్....రామోజిది నీచమైన జర్నలిజం కాదని నేను చెప్పలేను కానీ..ఆయన జర్నలిజం నుంచి విముక్తి కావాలని,సాక్షి లాంటి పేపర్ రావాలని జనం కోరుకున్నారంటే నేను నమ్మ లేను.

థాంక్స్
రాము

Anonymous said...

ఈనాడు నుంచి బయటికి వెళ్లాకే వాళ్ళు పుడింగులని తెలిసింది. ఈ సెట్ అప్ లో ఇలాగే పని చేయాలి. బెల్ట్ లేని పుడింగులు చాలామంది ఉన్నారు. కొద్దిగా మనసు పెద్దది చేసుకొని చూడండి.

ఉన్నవాళ్ళు పని చేయ కుండానే ఈనాడు రామోజీ రావు డ్రైవర్ తో నడవటం లేదు.

ఈనాడు రాతగాళ్ళను అవమానించడం అంటే చదువరుల విచక్షణా జ్ఞానాన్ని అవమానించడమే.

Ramu S said...

నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈనాడులో బ్రెయిన్ ఉన్న పుడింగులు, బెల్ట్ లేని పుడింగులు, కులం కార్డు జాగ్రత్తగా వాడుకునే ఆడ పుడింగులు, మగ పుడింగులు చాలా మంది ఉన్నారు. అది మనకు తెలిసిన విషయమే. ఉన్నవాళ్ళు పని చేయడం లేదని నేను అనలేదు.
కాస్త డొక్కశుద్ధి, విలువలు ఉన్న జర్నలుస్ట్లు ఉన్నది 'ఈనాడు' లోనే. మీకు తెలుసో లేదో...తాను లిఫ్ట్ బాయ్ లతో 'ఈనాడు' నడుపుతానని పెద్ద సార్ అన్నారు.
ఈనాడు రాతగాళ్ళను నేను అనుమానించలేదు. దానికి...చదువరుల విచక్షణా జ్ఞానానికి సంబంధం లేదు. తప్పుగా అర్థం చేసుకోవద్దు.
రాము

Anonymous said...

what's wrong if sakshi reports about eenadu ramoji rao...if sakshi does not exist today..how do people get a chance to know all reports that sakshi is publishing on eenadu..journalism should always write and explore the facts and truth...but now a days..in ap print and electronic media..with all their own interests..it all goes with one tag line..."we report..you decide"...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి