Tuesday, April 20, 2010

తిక్క వార్తలు....చెత్త ఫోటోలు....పిచ్చి ప్రాధాన్యతలు

"ఇరువురి మధ్య ఘర్షణ"
"భర్తతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిన భార్య"

---ఇవి ఈ రోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్ మినీ లో పన్నెండో పేజీలో వచ్చిన వార్తలు. ఎంత జోనల్ పేజ్ అయితే మాత్రం...ఇవేమి వార్తలు? కథనాలు కూడా మరీ చెత్తగా ఉన్నాయి. మినీలు మొత్తం పార్టీలు/ సంస్థలు/వ్యక్తుల ప్రకటలతో, క్రైం వార్తలతో నిండిపోయాయి. 


దేశాన్ని ఒక కుదుపు కుదిపిన జస్సికా లాల్ కేసులో మనూ శర్మకు విధించిన శిక్షను సుప్రీం కోర్టు సమర్ధించడం ఇటు 'ఆంధ్ర జ్యోతి'కి అటు 'ఈనాడు'కు మొదటి పేజీ వార్త కాలేదు. 'ఈనాడు' అప్రాముఖ్యంగా ఆరో పేజీ మధ్యలో  దీన్ని ప్రచురించగా..."జ్యోతి" లో ఐదో పేజీలో దిగువన పడేసారు. 'సాక్షి' నాలుగో పేజీలో కిందిభాగంలో ఒక కలర్ బాక్స్ లో దీన్ని ప్రచురించింది. 


'ది హిందూ' మొదటి పేజీలో ప్రముఖంగా దీన్ని ప్రచురించింది. జెస్సిక తోబుట్టువు సబ్రిన లాల్ స్పందనను కూడా ఒక వార్త గా వాడింది. 
'ఈనాడు' అధిపతి రామోజీ రావు ను బద్నాం చేయడమే ప్రధాన అజెండాగా ఉన్న 'సాక్షి' వారు ''రామోజీ పై చర్య తీసుకోరూ.." అన్న శీర్షికతో విశాఖ ఈనాడు ఆఫీసు స్థల యజమాని ఫిర్యాదును ఒక వార్తగా పదో పేజీలో వేసారు. ఈ వార్త్ పదో పేజీలో ఉన్నదని సూచిస్తూ....రామోజీ మగ్ షాట్ తో ముందు పేజీలో పై భాగాన ఒక చిన్న బిట్ ప్రచురించారు.  ఇక 'జ్యోతి' వారు ఈరోజు చంద్రబాబు భజనలో నిమగ్నమై మొదటి పేజీలో సింహ భాగాన్ని నారా వారికి కేటాయించారు.

ఈ మధ్య 'ది హిందూ' కూడా బూతుపట్ల ఆకర్షితమవుతున్నది. కాస్త సంసార పక్షంగా ఉంటుందని మన్ననలు అందుకుంటున్న ఈ పత్రిక హైదరాబాద్ ఎడిషన్ రెండో పేజీలో ఈ కింది 'అందాల ఆరబోత' ఫోటో వేసి...."show-stealers"  అని కాప్షన్ ఇచ్చింది. నేనైతే 'ది హిందూ' ఇలాంటి ఫోటోలు వేస్తుందని ఊహించలేదు. ఇదేమి ఫోటోనో మీరే చూడండి...హవ్వ..హవ్వ..


ఇక వేమూరి వారి పత్రికలో వాడినట్లు చెత్త ఫోటోలు ఈ భూమండలంలో ఏ పత్రికలో వాడరని నేను రాసిస్తాను. ఇక్కడ పనిచేసే జర్నలిస్టులకు ఫోటోల వాడకం, ప్రభావం గురించి తెలియదు. పెద్ద ఫోటో వాడడం స్పేస్ వేస్ట్ అనుకునే ముతక ఆలోచన వారిది. ఈ రోజు పెద్ద పేజీలలో లోపల వాడిన ఫోటోలు అన్నీ చాలా చిన్నవిగా ఉన్నాయి. భూతద్దాలు పెట్టుకోనిదే అవి కనిపించవు. డబ్బులు పెట్టి కొన్నందుకు ఇదొక శిక్ష. రెండు రోజులు చూసి పేపర్ బంద్ చేయాలని అనుకుంటున్నా నా మటుకు నేను.

"జ్యోతి" మినీ ఏడో పేజీలో 'మీడియా పోలీసులకు సహకరించాలి' అన్న శీర్షికన ఒక పెద్ద ఫొటోనే వేసారు. 'చిత్రంలో కొమ్మినేని శ్రీనివాస రావు, రాము, మధుసూదన్ రావు...' అని ఫోటో కింద రాసారు. కానీ...అందులో ఒక్కరూ నామమాత్రంగా కాదు గదా...చీమమాత్రంగా అయినా కనిపించడం లేదు. కొమ్మినేని లాంటి సీనియర్ పాత్రికేయుడికి ఇచ్చే గౌరవం ఇదా?

12 comments:

Trader said...

actually, I dont agree with your argument on The Hindu. Hindu paper just wanted to focus on the event and they are sure the show stealers and the pic is worth posting on the paper. Moreover, i did not find anything vulgar in the picture. I dont mean to offend u..

Venu.

Anonymous said...

ఈనాడు పైత్యం చాలా వికృతంగా తయారయ్యింది. సెలీనా జైట్లీ బొమ్మను ఏ కధానానికి వాడారో చూడండి. పేపరు పిల్లల చేత చదివించటం ఒక్కప్పటి మంచి అలవాటు. ఇప్పుడు ఏ పేజీలో ఏముందో అని భయపడాల్సిన రోజులు. ముష్టి వెధవలు తయారయ్యారు మీడియాలో.

Anonymous said...

ఆంధ్రజ్యోతి ఓ పనికిమాలిన పత్రికే అందులో సందేహం లేదు. కానీ, సీనియర్లకు గౌరవాలు, లాంచనాలు , కిరీటాలు, తివాచీలు పరచి శాలువలేయడానికా పత్రికలుండేది? వార్త, దాని సందర్భానికి మాత్రమే ప్రాముఖ్య మివ్వాలి, సీనియారిటీ కి కాదేమో, కాదా? కాలం గడిచేకొద్దీ సీనియారిటీ వస్తుంది, ఆ మాత్రానికి పత్రికల్లో పాదపూజలు చేయాల్సిన అవసరం లేదనుకుంటా..

thinker said...

still hindu follows values

ఆ.సౌమ్య said...

అతనికంటే ఘనుడు ఆచంటమల్లన్న అన్నట్టు ఏ పత్రికకవే తీసిపోవు. కానీ హిందు, ఈనాడు కాస్తో కుస్తో తమ గౌరవాన్ని నిలుపుకుంటున్నాయి. కానీ ఇవాళ ఈనాడులో సెలీనా జైట్లీ బొమ్మ వేసి, రాసిన కథనం మాత్రం ఆశ్చర్యాని కలిగించింది నాకు కూడా.ఇలాంటి బొమ్మలు, కథనాలు ఈనాడు లో చాలా అరుదుగా కనిపిస్తాయి, కానీ ఇవాళ ఏమిటో మరి!

Anonymous said...

ఈనాడు సినిమా పేజీ మరీ అధ్వాన్నంగా తయారైంది. హీరోయిన్లు తీసుకునే వేసవి జాగ్రత్తల ఐటం లో కూడా ముప్పావు నగ్నం ఫొటోలు యధేచ్ఛగా వాడుతున్నారు.సెలీనా జైట్లో ఫొటో అయితే ఇవాళ అసలు అక్కర్లేదు.

వేమూరి వారి పత్రిక సాక్షాత్తూ బూతు బొమ్మల పత్రికే!

Malakpet Rowdy said...

The Hindu news paper has nothing to do with "Hindu" or "News" ... its more of a Views paper!

తెలుగు వెబ్ మీడియా said...

రాము గారు. నేను చదివేది "వార్త" పేపర్. ఈనాడు అప్పుడప్పుడు మాత్రమే చదువుతుంటాను. ఈనాడులో సెలీనా జైట్లీ ఫొటో నేను కూడా చూశాను. 1998లో మధు సప్రే ఫొటోలు ఇంత కంటే వల్గర్ గా ఉండేవి.

Anonymous said...

It looks every newspaper wants to attract the readers through hook or crook and it is nothing new to the management as well as readers.But in some instances the media houses are exceeding the limits and not bothered about moral values and they are interested in only one moral that is to attract the reader.
Ramu garu, Iam very sorry that the print and electronic media which always gives much importance to this day or that day of the year,has totally ignored thye Bhoodaan Jayanthi which falls on 18th April which was initiated by Acharya Vinobha BHave.There was only a mini item in the dist edition of Nalgonda of Saakshi and I donot know about other papers.The media,the government and the people have completely forgotten Vinobha BHave and his Bhoodan movement.What a tragedy?

JP.

Anonymous said...

సాక్షి లో రాయలవారి ఫోటో ఐటెం బాగుంది కదూ.

Anonymous said...

i am a producer in inews,the management of i News is playing games.From last six months ,management give the salary every 2 months...,ie.. only one month salary...,Here in office no one responcible for this.And one more thing and important one is PF money, i joined in the organizaton Feb 2009,from then...till now we have no PF no and other details.the management is doing its work..,ie cutting the money from employees salaries from Rs 1500/- onwards...so pls is there any solution for this..tell me.

Unknown said...

Ramu S గారూ...,"ఇరువురి మధ్య ఘర్షణ""భర్తతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిన భార్య"---ఇవి ఈ రోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్ మినీ లో పన్నెండో పేజీలో వచ్చిన వార్తలు. ఎంత జోనల్ పేజ్ అయితే మాత్రం...ఇవేమి వార్తలు? కథనాలు కూడా మరీ చ_____________________Interesting post! Thanks for posting.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి