Thursday, April 15, 2010

ఈ రాజకీయ మీడియాలో..విలువలు ఒక మిథ్య?

'సాక్షి' (పేపర్, ఛానల్)---కాంగ్రెస్ ఆత్మ (సోల్), గళం (మౌత్ పీసు)
ఎన్-టీవీ (ఛానల్)---కాంగ్రెస్ ఆత్మ, గళం
టీ.వీ.-5 (ఛానల్)-- కాంగ్రెస్ ఆత్మ 

వార్త (పేపర్)---కాంగ్రెస్ ఆత్మ, గళం 
ఆంధ్రభూమి (పేపర్)---కాంగ్రెస్ ఆత్మ, గళం
ఆంధ్రప్రభ (పేపర్)---కాంగ్రెస్ ఆత్మ
------------------------------------------------------------
'ఈనాడు' (పేపర్, ఛానల్)---తెలుగుదేశం ఆత్మ, గళం 
'ఆంధ్రజ్యోతి' (పేపర్, ఛానల్)---తెలుగుదేశం ఆత్మ
స్టూడియో-ఎన్ (ఛానల్)--తెలుగుదేశం ఆత్మ, గళం

------------------------------------------------------------
రాజ్ (ఛానల్)---తెలంగాణా రాష్ట్ర సమితి ఆత్మ, గళం
జీ-24 gantalu (ఛానల్)---తెలంగాణా ఆత్మ
హెచ్.ఎం.టీ.వీ. (ఛానల్)---తెలంగాణా ఆత్మ

-----------------------------------------------------------
ప్రజాశక్తి (పేపర్)---సీ.పీ.ఎం.ఆత్మ, గళం
విశాలాంధ్ర (పేపర్)---సీ.పీ.ఐ. ఆత్మ, గళం

------------------------------------------------------------------------------------------------
Operational definitions:

ఆత్మ: సదరు పార్టీ పై గుండెలో భక్తి కలిగి ఉండడం. ఆ పార్టీ లేదా దాని అధినేత అర్జెంటుగా అధికారంలోకి రావాలని కోరిక ఉన్నా...మరీ అంతగా బైటపడకుండా...ఒక రకంగా వ్యవహరించడం. కథనాలు తమ అభిమతానికి అనుగుణంగా ఉండీ ఉండనట్లు చూసుకోవడం. యజమాన్లు వారంలో మూడున్నర రోజులు సదరు పార్టీకి బాకా ఊది, మరొక మూడున్నర రోజులు తమది నిష్పాక్షిక మీడియా అని పోజు కొట్టడం.


గళం: సదరు పార్టీ/ నేత మాటలో మాటై, గుండెలో గుండె అయి, ఆత్మలో ఆత్మ అయి...నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా బాకా ఊదడం. వీలయితే...పార్టీ అధినేత కు మీడియా తెలివిని రంగరించి సలహాలు ఇవ్వడం. వైరి పార్టీల వారిని, తమ పార్టీ నేతకు పడని వారిని ఇరుకునపెట్ట కథనాలు అల్లి పారెయ్యడం.

-------------------------------------------------------------------------------------------------
ఈ లిస్టులో మేము కొన్ని ఛానెల్స్ ను ఇప్పుడే చేర్చలేకపోయాము. గ్రాహకశక్తి లోపం వల్లగానీ, పరిశీలనాశక్తి కొరవడడం వల్లగానీ అది జరిగి ఉండవచ్చు. మా అజ్ఞానాన్ని మీరు ఖండిచవచ్చు లేదా ఈ జాబితాలో మిస్ అయిన వాటిని ప్రస్తావిస్తూ ఎందువల్ల మీరు అలా అనుకుంటున్నారో తెలియజేయవచ్చు. మీడియా ముసుగు వేసుకుని, రాజకీయ అజెండాతో జర్నలిజాన్ని పలచన చేస్తున్నవారి వల్ల మనకీ సమస్య. దాని బదులు...కమ్యునిస్టు పత్రికల్లా తమ  పేపర్స్/ఛానెల్స్ ను ఈ యుగపురుషులు అధికారికంగా తమ రాజకీయ పార్టీల మౌత్ పీసులుగా ప్రకటిస్తే ఈ సమస్యే ఉండదు. రీడర్స్/వ్యూయర్స్ కు ఒక స్పష్టత ఉంటుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు పగ్గాలు చేపట్టాక 'స్టూడియో-ఎన్' ఈనాడును మించిన ఫక్తు 'రాజకీయ జర్నలిజం' ఆరంభించింది. దీని ప్రధాన అజెండా...అర్జెంటుగా చిరంజీవిని బద్నాం చేయడం. ఉదాహరణకు--నిన్న రాత్రి "దుకాణం బంద్" అన్న శీర్షికన 'ఫోకస్' అనే అతి జుగుప్సాకరమైన కార్యక్రమం ప్రసారం చేశారు. అలాగే...ఒక పక్క జగన్ 'ఆత్మీయ యాత్ర' ను 'సాక్షి,' 'ఎన్.టీ.వీ.' అనుక్షణం చూపుతుంటే...'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' తక్కువ చేసి చూపుతున్నాయి. యువ కాంగ్రెస్ ఎం.పీ. టూరుకు సంబంధించి నెగటివ్ షేడ్ ఉన్న కథనాలు మాత్రమే వీటిలో వస్తున్నాయన్న ఆరోపణ ఉంది.  


డబ్బుకు గడ్డి కరిచే ఛానెల్స్/ పేపర్స్ జాబితా తయారవుతున్నది. పైన  జాబితాలో లేని పేపర్స్/ ఛానెల్స్ పత్తిత్తులని కాదని గమనించగలరు. మరి నంబర్ వన్ ఛానల్ TV-9 గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా తెలియజెయ్యండి.  ఇప్పటికే ఒకటీ అర ఎస్.ఈ.జెడ్./ విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చిన వాళ్ళు ఒకరకంగా, వస్తుందని ఆశ పడే వాళ్ళు మరొకరకంగా ఆపరేట్ చేస్తున్నారిక్కడ. 

ఇప్పుడు రోశయ్య గారు పిలిచి....మీకో ఎస్.ఈ.జడ్. ఇస్తానన్నా, భారీ లాభం కలిగేలా చూస్తానన్నా ఈ ఛానెల్స్ రెచ్చిపోయి కార్యకర్తలా పనిచేస్తాయి. విలేకరులను కూడా యాక్టివిస్ట్ లుగా మార్చి వాడుకుంటాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు....పత్రికా స్వేచ్ఛ, విలువలు, నీతీ నిజాయితీ ల గురించి మాట్లాడుకోవడం నిజంగానే గొంగళిలో లంచ్ చేస్తూ వెంట్రుక వచ్చిందని భార్య మీద ఎగిరినట్లే. అయినా....మనం పట్టు వదల కూడదు. సత్యమే వజయతే.

రోశయ్య గారికీ ఒక ఛానల్?

ఇప్పుడే అందిన వార్త...ముఖ్యమంత్రి రోశయ్య గారి అనుయాయులు (ముఖ్యంగా వారి కుమారరత్నం) కూడా మీడియా మీద ఒక కన్నేసారని ఒక మిత్రుడు చెప్పాడు. దీన్ని అధికారికంగా దృవీకరించుకోవాల్సి ఉంది. ఇప్పటికే...తప్పుడు సలహాలు విని ఛానల్ పెట్టి...చేతులు కాల్చుకుని...ఉజ్జోగులకు సకాలంలో జీతాలైనా ఇవ్వలేకపోతున్న i-news లో వాటా కోరితే ఎలా ఉంటుందా! అని ఆ వర్గం అనుకుంటూ ఉన్నదని సమాచారం. ఇది త్వరలో తేలుతుంది, అప్పటిదాకా...ఈ అంశాన్ని మీరు ఎవరితో అనకండి. ఇది మనలో మన మాట. 

21 comments:

Unknown said...

ramu garu mee articles chala bagunay...can u pls publish the current circulation figures of our newspapers ?

పుల్లాయన said...

good one

Anonymous said...

చిరంజీవి గారు కూడా త్వరలో ఒక ఛానల్ పెట్టాలని, లేద అరవింద్ గారిని పురమాయించాలని మేము డిమాండు చేస్తున్నాము. అలానే మంద క్రిష్న మాదిగ గారు కూడా దండోరా అన్న పేరుతోనో లేక తనకు నచ్చిన పేరుతోనో మరో ఛానల్ ప్రాఆరంభించాలని కూడా ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాం.

Anonymous said...

When gujarat riots happened, entire english and hindi media stood by the minorities (muslims) can they be called the 'atma' of muslims, No. The role of the media is to stand by those who are seeking justice. Why does the media stand by those who are lathicharged, despite the fact that it is they who provoked the police to lathi charge. The media stands by them because they have taken the streets for justice. in case of the channels that have 'presumably' taken stand in favor of Telangana means they are in support of those seeking justice. what zee and HMTV have done is just that. Why are you not calling, TV9, Saakshi, NTV, TV5,ETV2, Studio N, ABN AJ, maha tv and other channels as ATMA of Seema-Andhra.
I sincerely belive that this is not your post. It is a comment sent in by somebody and you have converted it into a post.

Vasuki said...

మీరు ఆంధ్రభూమి పేరు చెప్పారు. ఆ పేపరు కూడా కాంగ్రెస్ పక్షమేనా. నేను ఇప్పటి వరకు అది రాజకీయంగా తటస్థంగా ఉండేదేమో అనుకొంటున్నాను. నిజమేనా ఇది.

శ్రీవాసుకి

Anonymous said...

zee, hmtv telangana atma aite, migata channels seemandhra daiyyala?

ANALYSIS//అనాలిసిస్ said...

tv-9 - మెరుగైన సమాజం కోసం ఏ ఎండకా గొడుగు ... అహ్ అహ్ అహ్హ

Anonymous said...

TV-9 evaritho labham vunte valla baka vudalsinde... Andithe juttu lekapothe kallu. Meeru cheppina channels, pathrikala valla antha problem ledu... endukante jananiki antho intho thelusu vati gurinchi. TV9 chala dangerous. ea endaku aa godugu patte rakam.

Anonymous said...

అవును..హెచ్ఎంటీవీ తెలంగాణ ఆత్మ అన్నది
శుద్ధ తప్పు..

తెలంగాణ ఆత్మ,గళం,కళ్ళు,ముక్కు,చెవులు,నొరు,
ఆపాద మస్తకం అని వుండాలి.

Anonymous said...

nijam, tv9 is most dangerous, endukante dabbulu tisukoni elanti vaarthani iena adi telecast cheyyagaladu. nenu chupinde vaartha ani tv9 nammutondi, janalu kuda.

Anonymous said...

TV 5 and NTV ..congress aathma emi tandi ...comedy kakapote ..both are owned by kammas ...how come they are atmas of congress.

AB is neutral paper...even though it is partially inclined to congress.
I have been reading it for a while.

Anonymous said...

" మరి నంబర్ వన్ ఛానల్ TV-9 గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా తెలియజెయ్యండి. "
What..., No.1...!! ??
Definitely not in standards..., probably in collections..!!

Saahitya Abhimaani said...

విలువలా??? వి లు వ లా!!!!!!!!!! మరీ జోకులు వెయ్యకండి సార్.

మీరే అన్నారుగా ".............పత్రికా స్వేచ్ఛ, విలువలు, నీతీ నిజాయితీ ల గురించి మాట్లాడుకోవడం నిజంగానే గొంగళిలో లంచ్ చేస్తూ వెంట్రుక వచ్చిందని......."

అదే నిజం.

అన్నీ బాగానే వ్రాసారు కాని, టి వి 9 మీ దృష్టిలో ఏ పార్టీ కాకుండా పోయిందా? వాళ్ళు అందరికంటే తెలివైన చానెల్ అందుకనే దొరకరు. మిగిలిన వాళ్లకి లౌక్యం లేదు అందుకనే దొరికి పొయ్యారు.

Anonymous said...

HMTV dasa disa debate has been showing and projecting all the views of different regions and of all the stakeholders( all the voices andhra, telangana and rayalaseema). I see it has done and kept doing a great deal in this regard. I can say this kind of public debate (going to people) has never been tried in the television history. I heard more andhra and seema voices in HMTV than in the so called andhra channels.

మంచు said...

Good one.. especially definitions of atma and galam

First Anonymous : Entire English media is atma of muslims and christians.. infact they can become atma of anyone other than Hindus.. no Doubt about that..

శ్రీవాసుకి : కాంగ్రెస్స్ కి మొదట్నుండి వున్న ఎకైక సపొర్ట్ ఆంధ్రభూమే నండి :-))

Anonymous said...

ys rajasekhar unnanta varaku tv9 congress atmane.. ippudu dabbulu evariste... varike... jindabad. kakpote teliviga chestaru dorakkunda. monnati electionslo... anni tvla varu (etv2 tappa)congress daggara 3 kotlu puchukuni congressku nyayam chesaru.

పానీపూరి123 said...

శ్రీవాసుకి: ఆ ఆంధ్రభూమి యం.డి ఇంతకుముందు కాంగ్రేసు నుండి ఎంపికైన రాజ్యసభ సభ్యుడు కూడాను

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

పరమచెత్త Tv9 ని మీరేమీ అనలేదంటే మీ నిజాయితీ కూడ ప్రశ్నార్ధకమే..!!
ఒకవేళ మీరు దాంట్లో పని చేస్తుంటే దాని గురించి రాయటం కష్టమే..., అర్ధం చేసుకోగలం లెండి..!

jara said...

ramu garu good but hmtv not only support tg

Ramu S said...

ఆర్ ఏం కొల్లి గారు...
నాకు టీ.వీ-నైన్ కు ఎలాంటి సంబంధం లేదు. నేను అక్కడ పని చేయను. నా పోస్టులలో సగం ఆ ఛానల్లో అంశాలకు వ్యతిరేకంగా ఉంటాయి. నిజానికి వాళ్ళు political affiliation మారుస్తుంటారు. అందుకే...వారి విషయం రీడర్స్ కు వదిలాను.
రాము

Anonymous said...

HMTV is not totally a tv. It is a
tvpaper. see they are presenting poetry on screen. I wonder there could be any tv in the world like this? The writer could have been given another job under "food for work" if editor loves him verymuch. thanks to the hmtv management for their big heart.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి