Monday, February 13, 2012

HM TV= High Morals Television: మూడో వార్షికోత్సవం

కపిల్ చిట్స్ వారి ఆధ్వర్యంలో, సీనియర్ మోస్ట్ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి గారి నేతృత్వంలో నడుస్తున్న హెచ్ ఎం టీవీ ఫిబ్రవరి పన్నెండో తేదీన మూడో వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా కపిల్ అధినేత వామన రావుగారికి, మూర్తిగారికి, టీవీ సిబ్బందికి శుభాకాంక్షలు. ‌HM TV  అంటే High Morals Television అని ఛానల్ పేరు తెచ్చుకోవడానికి ఇందులో ప్రతి ఒక్కరూ ప్రయత్నించడాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను.

కపిల్ చిట్స్ వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం లో పనిచేస్తున్నా కాబట్టి...ఛానల్ గురించి రాయడం సొంత డబ్బా అవుతుందన్న అభిప్రాయంతో మనసును కట్టడి చేసుకుని ముగిస్తున్నాను. ఛానల్ లో డైనమిజమ్ పెరగాలనీ, మిగిలిన ఛానల్స్ కూడా విలువలకు ప్రాధాన్యమివ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ నిర్వహించిన దశ-దిశ అనే కార్యక్రమం సంచలనం సృష్టించింది. డిసెంబరు 21, 2009 నాడు (
నేను ఐ.ఎస్. జే.లో చేరకముందు) ఒక పక్కన దశ-దిశ కార్యక్రమం జరుగుతుండగానే నేను రాసిన పోస్టు "దశ-దిశ కోసం hm-tv యత్నం..భేష్!" మరోసారి చదవండి.

6 comments:

ఓరుగల్లు పిల్లాడు said...

I too love HMTV but they need to improve in ....the quality of news reader presentation.....They look really dull in presenting....they sholud be confident in news raeding......its my opinion...

ddtv said...

రాము గారు, ప్రతి ఒక్క మీడియా హౌస్ ఏదో ఒక బిజినెస్ నడిపెవారే అయినా ఒక్క హెచ్ఎంటీవీ వాళ్ళే ఎందుకు భిన్నంగా ఉన్నారు. మీ అనాలిసిస్ ఏంటి? కపిల్ చిట్స్ వామన రావు చానల్ వ్యవహారాలలో వేలు పెట్టరా? (ఆర్ధిక వ్యవహారాలలో కాదు లెండి). అన్నింటికన్నా ముఖ్యంగా జనాలను మోసం చేసే మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ (లక్ష్మి యంత్రం, మోకాళ్ళ నొప్పులకు మందులు, సన్నబడే లోషన్లు వగైరా వగైరా) రావు. TRP రేటింగ్స్ కోసం వెంపర్లాడే డైనామిజం ఒక్కటే తక్కువ. హెచ్ఎంటీవీ చానల్ పై
రామచంద్ర మూర్తి గారి ముద్ర ప్రస్పుటం గా కనిపిస్తుంది. హాట్సాఫ్ టు హిమ్. బెస్ట్ విషెస్ టు ద టీం .

Ramu S said...

ddtv గారూ...
చాలా మంది నమ్మక పోవచ్చుగానీ, నేను పరిశీలించినంత వరకూ ఛానల్ ఎడిటోరియల్ వ్యవహారాల్లో వామనరావు గారు వేలుపెట్టరు. ఎడిటోరియల్ విషయాల్లో ఆయనగానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ తలదూర్చినట్లు నాకు తెలియదు. మూర్తి గారి నిర్ణయాలే ఫైనల్. పైగా వ్యాపార దృక్పథంతో ఛానల్, పేపర్ పెట్టలేదని, వాయిస్ లెస్ పీపుల్ కు మీరు వాయిస్ గా ఉండండని వామన రావు గారు జర్నలిస్టులకు చెబుతుంటారు. ఆయన ఎందుకు ఈ రంగంలో ఇంత భారీగా పెట్టుబడి పెట్టి నడుపుతున్నారో...నిజంగా నాకైతే అర్ధంకాని వ్యవహారం.
రాము

supraja said...

Dear Ramu,It doesn't augur well blowing trumpet for the organisation you work as you reiterated many times before that this blog for fair and like minded people.
Setting up a news channel and news paper at a huge cost and obviously incurring losses doesn't sound a good proposition to me,I even dare to allege that the promoter is simply trying to gain a political foothold and mileage and probably trying to cover up any financial irregularities like diverting funds to his sister& shell companies.
The media industry itself is an intensely competitive arena and other than established entities, many media houses are running in losses clamouring for available ad revenues which are falling.
It is well known fact that industrialists are establishing news channels only to gain political "power" and mileage.

I can only wish the head honcho of the organisation in which you are working has clear and noble intentions.

Seenu said...

Being in Chennai I dont have an opportunity to watch HMTV channel. But it seems that Ramu garu very much biased for that channel.

chikku said...

Unfortunately hmt is slowly drifting towards commercialism with more cinema oriented programmes like other channels.If you follow seriously the programmes of hmtv you can see change in the attitude of this channel.

JP

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి