Wednesday, March 17, 2010

పైరసీ పై బూతు సినీపరిశ్రమ పోరుబాట...


జనాలకు కళ పేరిట పచ్చి బూతు చూపిస్తూ...సమాజంలో  సభ్యత, సంస్కారం పలచన పడేలా చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమ పైరసీ పై పోరాటం ప్రకటించింది. ఒకాయన ఫిలిం చాంబర్ దగ్గర నిరసన చేస్తున్నారు..."ప్రభుత్వం కళ్ళు తెరిచి" పైరసీని అరికట్టాలని. 
అక్కడ వాళ్ళొక బ్యానర్ కట్టారు-- "పైరసీ చేసిన వారిని గూండా యాక్ట్" కింద అరెస్ట్ చేయాలని. ఇది పెద్ద వింత, చోద్యం. ఇంతకూ అరెస్టు చేయాల్సింది ఎవరిని? డబ్బు కోసం...సమాజంలో విలువలను మంటగలుపుతున్న వాళ్లనా? కళాపోషణ పేరిట మహిళల పట్ల ఎవ్వరికీ గౌరవం లేకుండా చేస్తున్న వాళ్లనా? సమాజ హితం పట్టని నిర్మాతలనా? దర్శకులనా? 

చిన్న ఎన్.టీ.ఆర్.కొద్ది నిమిషాల కిందట అక్కడ మీడియాతో మాట్లాడుతూ...ఎంతో మందికి అన్నం పెడుతున్న పరిశ్రమను పైరసీ దెబ్బ తీస్తున్నదని, ప్రభుత్వం స్పందించకపోతే పరిశ్రమ అంతా పనిచేయడం మానేస్తుందని సారు సెలవిచ్చారు. బాబూ...ఆ పనిచేసి పుణ్యం కట్టుకోండి. మీ బాధ్యతా రహిత బూతు సినిమాలు చూడడం కన్నా...అలాంటివి లేకపోవడం మంచిది. 'హై స్కూల్' లాంటి సినిమాలు మీ పైరసీ కన్నా దాని తాతంత నష్టం చేస్తున్నాయి సమాజానికి. ఇది మాత్రం మీకు పట్టదు. సమాజం ఎటు పోయినా పర్వాలేదు కానీ...మీ కాసులు మాత్రం మీకు కురవాలి.

పచ్చి నీలి సినిమాలు తీసి...కులం కొమ్ము కాస్తూ...రాజకీయ అండతో....ఇండస్ట్రీలో కొన్ని బలిసిన కుటుంబాల వారు కోట్లు సంపాదిస్తుంటే....ఈ కళాకారులు, టెక్నీషియన్లు పడరాని పాట్లు పడుతూ బతుకు భారంగా జీవిస్తున్నారు. పై వాళ్ళు చేసేది "సినీ సేవ".....వీళ్ళు చేసేది...ఉద్యోగం. 

కడుపునిండిన ఈ కుటుంబాలలో...వారి ఇళ్ళలో పుట్టిన ప్రతొక్కడిని హీరోని చేస్తున్నారు. ఈ సినీ రారాజులు... తమ ఇళ్ళలో పుట్టిన ఆడపిల్లలను మాత్రం ఈ రొచ్చులోకి దింపరు. ఎందుకంటే....ఇది ఒక బూతు ప్రపంచం. వలువలు, విలువలు లేని వాళ్ళ కళాసేవ. ఆ సంగతి వాళ్లకు తెలుసు.

చట్టాల కింద, నిబంధనల కింద పైరసీ ఘోర తప్పిదమే. కానీ...అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ...."జనం చూస్తున్నారు...కాబట్టి మేం  చూపిస్తున్నాం" అని పిచ్చి వాదన చేస్తున్న ఈ సినీ జనాన్ని స్పేర్ చేయాల్సిన పనిలేదు. "పైరసీ భూతం ఇలాంటి నిర్మాతల పుట్టి మున్చాల్సిందే. మంచి సినిమాలు తీసే వారిని జనం ఆదరించాలి. పైరసీ బాబులూ....మీరు బూతు సినిమాలను వదలకుండా బాగా ముద్రేసుకోండి," అని అబ్రకదబ్ర ఆవేశంగా అన్నాడు.

తాము సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుంటామని, ముంబాయ్ భామలను కాకుండా లోకల్ టాలెంట్ ను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చే వరకు ప్రజలు ఈ పైరసీ సమరంలో వీళ్ళకు మద్దతు పలక కూడదు. ప్రభుత్వం కూడా స్పందించకూడదు. 
బ్రదర్స్, సాధారణ జనాలకు మీరు పిచ్చి బొమ్మలు చూపుతున్నారు...జనం బలహీనత కొద్దీ చూస్తున్నారు. ఇప్పుడు పైరసీ వాళ్ళు కారు చౌకకు సినిమాలు ఇస్తున్నారు. జనాలకు డబ్బు బలహీనత ఉంది...అందుకే చూస్తున్నారు. ఇప్పుడేమి చేద్దాం? 

25 comments:

ప్రేమిక said...

మీ బ్లాగులో నా మొదటి కామెంట్...
మీరన్నది నిజమే కాని మంచి సినిమాలు కూడా వస్తున్నాయిగా... అప్పుడప్పుడు..
పైరసీ వల్ల నిర్మాతకు మాత్రమే నష్టం కాదు కదా?
exhibitors. distributors, technicians
ఇంతమంది ఉన్నారు

Bhama said...

కరెక్టే!
అంత చెపుతున్నారు కదా ఈ సినిమావాళ్ళు..." ప్రొడ్యుసర్లకు నష్టం కలుగుతుందనీ"...అసలు ప్రొడ్యుసర్లకు నష్టం కలిగించేది కోట్ల రూపాయలు వసూలు చేసే ఎందుకూ పనికిరాని, నటనా సామర్థ్యం కలగనిహీరోలు, హీరొయిన్లు!

Ramu S said...

ప్రేమిక గారూ..
మొదటి వ్యాఖ్యకు థాంక్స్.
గత ఐదు ఏళ్ళలో వచ్చిన నాలుగు ఐదు 'మంచి సినిమాలు' ఏమిటో తడుముకోకుండా చెప్పగలరా?
--రాము

Anonymous said...

జనాలు ఆదరిస్తున్నారు కాబట్టే పైరసీ జరుగుతో౦ది.
జనాలు చూస్తున్నారు కాబట్టే చూపిస్తున్నామన్న(ఏదని అడగక౦డి) నిర్మాతలు ఇప్పుడె౦డుకు కయ్యిమని లేస్తున్నారో!!

Prasad said...

you said it correctly. Because of the weekness of sex they are watching your movies. Now, they have the weekness of money. So they'll buy pirated CDs. If it is criminal to encourage the weekness of money by piracy, it is criminal to encourage the weekness of sex through movies. Movie producers may say "We are doing it legally..censor blah...blah...". You bribe authorities and get legal sanctity..pirates do it by bribing police authorities

Kathi Mahesh Kumar said...

పైరసీ...ఇండస్ట్రీలో అదో పెద్ద జోకు.

WitReal said...

this is an irresponsible writeup.

going by your argument, media covering boothu. All media should be banned.

but, you dont agree with that. you accuse that owners are showing boothu but journo brothers are good.

remember when you wrote abt that JP comment that media be banned for sometime?

your angst is abt upper castes who are ruling the tollywood

so, you want them be damned.

as a teacher, as a responsible journalist, you need to keep your personal emotions away while reporting/analyzing

this article is a time/space waste.

piracy should be punishable crime.


period.

Alapati Ramesh Babu said...

yes.what you said all the correct.here one more reson who will not get money on thier movie those person become assitaters no big shots like ramanaidu, geetha arts like these persons are kept quite. those all the things.

Ramu S said...

Hey dear Period,
piracy should be a punishable crime, I don't have any issues. I was only asking them to be responsible.
As a teacher, what else can I do, dear?
Cheers
Ramu

రాధిక(నాని ) said...

చాలా బాగా చెప్పారు.

Prasad said...

నన్ను అడిగితే , సినిమా శ్రోతలు కూడా దీక్ష చేయాలి. ఈ సినిమా distributors , writers కూడా కాపీ చేయ వద్దు. మంచి కథ వుంటే వాళ్ళు కూడా లెగల్ గ కథ ని కొనాలి. ఎన్ని సినిమాలు చూడలేదు .... కథ, పాటలు అన్ని సిగ్గు లీకుండ కాపీ చేస్తారు ... ఒరిజినల్ writer ని acknowledge కూడా చేయరు.

శరత్ కాలమ్ said...

మీరు చెప్పింది సరి అయినదే. ప్రజలు కూడా రోజూ బూతు చేస్తుంటారు కాబట్టి అందరినీ ఉరితియ్యాలి. పీడా వదిలిపోతుంది.

VENKATA SUBA RAO KAVURI said...

i vote ramu sir.
venkata subba rao kavuri

Anonymous said...

Sarath kalam gaaru uriteeyalsina prajala line lo first untaaru.aayana taravatha...migathaa vaallu...

Ramu S said...

శరత్ గారూ...
వాళ్ళను ఉరితీయమని నేను చెప్పలేదే! కాస్తంత బాధ్యతతో మనం అందరం ఉండాలన్నది ఆకాంక్ష.
నాకు మాదిరిగానే సూర్యాపేట, ఖమ్మంలలో మీరు కూడా తిరిగినట్టు ఉన్నారు? ఇప్పుడు అమెరికాలో ఎక్కడ?
రాము

Anonymous said...

రాము గారు, మాములుగా మీ టపాలు కాస్తో కూస్తో బ్యాలన్స్ గా ఉంటాయి, ఇది మాత్రం extreme అని పిస్తున్నది నా వరకు.

సినేమా వాళ్లు సరిగా తీయటం లేదు అంటున్నారు, నిజమే వాళ్లు తీస్తుంటే వాళ్లను కంట్రొల్ చేయాల్సిన సెన్సారు వాళ్ళు ఏమిచేస్తున్నట్లు, ప్రబుత్వాలు ఏమి చెస్తున్నట్లు, పౌరులుగా/ప్రెక్షకులుగా మన పాత్ర లేదా?
కొద్ది మంది ఏమి ఖర్మ, ఇప్పుడు చాలామంది ప్రబుత్వ టీచర్లు సరిగా పాఠాలు చెప్పట్లేదు అందుకని పంతుళ్లను పీకేద్దమా?
అలాగే ప్రతి ఇండస్ట్రీ బాధ్యాతాయుతం గా మెలగటం లేదు, అందుకని అన్ని ఇండస్ట్రీలను హోటళ్ల దగ్గరనుండి, కాలేజీలవరకు పీకేద్దామా?
ముందు పీకటమో, వీధిలోకి పట్టుకొచ్చి, పిచ్చి కొట్టుడు కొట్టాలంటే మీడియా వాళ్లకంటే దరిద్రులు ఇంకేవరైనా ఉన్నరా, ప్రస్తుత సమాజం లో? అందుకని ముందు అన్ని TV చాన్నెల్స్ బ్యాన్ చేద్దమా?
పైరసీ అనేది సినెమా పరిశ్రమకు దెబ్బే, దానిని కంట్రొల్ చేయమని ఆ ఇండస్ట్రీలో వాళ్లు పోరాడుతుంటుంటే, ఎందుకీ దుగ్ద? వాళ్లు పిచ్చి సెనేమాలు తీసుంటే వాటిని కంట్రొల్ చేయమని ఓ పౌరుడుగా ప్రబుత్వాన్ని అడిగే హక్కు మనకి మాత్రం లేదా? మనకు ఉన్న హక్కు, ప్రతి పరిశ్రమకు ఉండకూడదు అంటే ఎలా?

jara said...

you said it correctly ramu garu thnks andi meru chala chkaga chyparu

Anonymous said...

ఛాల బాగా చెప్పారు.ఈ బూతు సీనిమాల నిర్మాతలే పెద్ద పైరసీ గాళ్ళు.వీళ్ళు నీతులు చెపుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.పచ్చి బూతులు కళ గా చెల్లుబాటు చెయ్యడం తెలుగు సీనిమాల కే చెల్లింది.వాళ్ళ అమ్మల్తొ ఈ బూతు సీనిమాలు చూపించాలి .అప్పుడు కూడా బుద్ది రాదు వెథవలకి.జాతీయ స్థాయిలొ ఏ అవార్డ్ రాకపొతే సిగ్గు లేకుండా బూతు సీనిమాలే జనం చూస్తారు అని అందుకే తీస్తున్నాం అని డబ్బా. ఉరి తీయాలి ఈ బూతు పైరసీ గాళ్ళని.

sreerama

ప్రేమిక said...

dont think that i am supporting film industry,, but piracy is a crime. dont u agree sir?

WitReal said...

your argument & comment lacks coherence.

read your last paragraph.

1. filmi people are working with-in the legal framework. you are suggesting that Govt should not respond to a legally correct requisition.

2. piracy goons are illegal. people who are watching piracy are abetting the crime. it is illegal.

next comes period!

one reader katti mahesh kumar commented above, that piracy is a joke...
indeed true...
and, then, robbery is a joke. a capitalist robs common man. so, if common man commits robbery, it should not be crime...
then, rape is joke..it was just a desire..
and then one fine day sutti naresh kumar proved that katti mahesh kumar is a joke on internet

SADASIVARAO said...

nirmohamatanga dairyanga cheppinduku thanks .ee article chusaina cinima industry variki buddostundemo chuddam.SADASIVARAO

శరత్ కాలమ్ said...

రాము గారూ,
నేనన్నది ప్రజలు రోజూ బూతు 'చే'స్తుంటారు కనుక (సర్కాస్టిక్కుగా) ఉరితియ్యమన్నాను. మీరేమో 'చూ'స్తున్నారు కనుక అనుకున్నట్లున్నారు :)

సరే, అది వదిలేద్దాం. మాది సూర్యాపేటేనండి. కెనడా పౌరుడిని అయ్యాను. ప్రస్తుతం షికాగోలొ వుంటున్నాను. మీ నేటివ్ ఎక్కడ?

Ramu S said...

ఓకే.
నీను ఒక ఏడున్నరేళ్ళు నల్గొండ జిల్లాకు 'ది హిందూ' రిపోర్టర్ గా పనిచేసాను. సూర్యాపేట సహా జిల్లా అంతా బాగా తిరిగాను. వందలాది స్టొరీ లు రాసాను. మాది ఖమ్మం జిల్లాలోని గొల్లపూడి గ్రామం. చదివింది...వైరా, కొత్తగూడెం, హైదరాబాద్, చెన్నై.
మీ అన్ని బ్లాగ్స్ చూస్తుంటాను. మీరు టైం బాగానే కేటాయిస్తున్నారు.
చీర్స్
రాము

శరత్ చంద్ర said...

రాము గారు, నిజానికి ఈ సినీ ప్రముఖులు పైరసీ తగ్గడానికి ప్రజలు, ప్రభుత్వము ఏమి చెయ్యాలో చెప్పడ౦ క౦టే పరిశ్రమ వాళ్ళు ఏమి చెయ్య గలరో కూడా ఓ సారి పరిశీలు౦చుకు౦టే మ౦చిది. పట్టుమని పది హిట్లు కూడా లేని నటులని తారల్ని చేసి సినిమాకి పదేసి కోట్లు ఇవ్వడ౦, దా౦తో స్టార్ బడ్జెట్ పాతిక కోట్లు అయిన౦దుకు, అ౦త పెట్టుబడి వెనక్కి రావాలని ఎక్కువ రేట్లకి ప౦పిణిదారులకి అమ్మడ౦, వాళ్ళు టికెట్టు రేట్లు పె౦చెయ్యడ౦, ఇద౦తా సినీ పరిశ్రమ స్వయ౦కృతాపరాధ౦ కాదా? ఇ౦తోటి సీమ సినిమాని సిడిలో చూసెస్తే పోలా అనుకోరా మరి జన౦? పైరసీపై పోరాట౦ చెయ్యాల్సిన అవసర౦ ఉ౦ది అన్నమాట నిర్వివాదా౦శ౦. అయితే పైరసీ వలన సినీ పెద్దల జేబులకి మాత్రమే చిల్లులు పడుతు౦టే చిన్న సినిమా జీవితానికే చిల్లు పడుతో౦దన్న నిజ౦ గ్రహి౦చాల్సిన అవసర౦ ఎ౦తైనా ఉ౦ది.

chakri said...

ఎవరెంత అరచి గోల పెట్టి , నిరాహార దీక్షలు చేసినా పైరసీ ఆగదు.అగొద్దు కూడాను.

theater లో రేటు పెరిగే కొద్ది,

బూతు సినిమాలు తీసేకొద్దీ

చెత్త వేషాలు వేసే కొద్ది

కళ తగ్గిన కొద్దీ

కాపి పెరిగిన కొద్దీ

నిజాయితీ లేకపోయిన కొద్దీ ..............పైరసీ పెరిగుతుంది..పెరగాలి .

ఇలా అన్నందుకు కసే అనుకోండి, కోపమే అనుకోండి, జెలసి అనుకోండి.

కాలం మారింది, మనుషులు మారారు, technology మారింది. మన సినిమాలు మారాయా ???
ఒకటా రెండా కారణాలనేకం. జనం సినిమా హాలుకి వొచ్చి సినిమా చూడాలి అని అనుకోకపోటానికి.
ఇంట్లోనే ac వేసుకొని, సోఫాలో మిరపకాయి బజ్జీలు తింటూ హోం theator సిస్టం లో సినిమాలు చూడక (చెత్త సినిమాకోసం ..theater కి వెళ్లి...వెధవది టైం వేస్ట్ , మనీ వేస్ట్. పార్కింగ్ డబ్బు వేస్ట్ సినిమా బాలేకపోతే చాయ్ సమోసా సాఫ్ట్ డ్రింక్స్ అంత కంటె వేస్ట్..

GF దొరికితే, .......restorent then ... then park ....then సినిమా .... then .....

.సినిమాకి వెళ్లి కార్నెర్ లో సీటొకటి పట్టి.. బబుల్ గుమ్ము చిరుపెదవులు మారుస్తూ టైం పాస్ చేయటానికి .. తప్ప..theater లో సినిమా అవసరమా ??

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి