Friday, March 19, 2010

సినిమాల-జనాల బాగుకోసం అబ్రకదబ్ర బహిరంగ లేఖ....


హైదరాబాదు,
మార్చి 19, 2010

గౌరవనీయులైన మంత్రివర్యులు గీతారెడ్డి గారికి,

మేడం.. నమస్తే. నేను ఒక సగటు తెలుగోడిని. సినిమాలు చూసి కళాపోషణ చేస్తుంటా. పైరసీపై మీరు  ప్రత్యేక హామీలు ఇచ్చారని సినిమా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ అంశంపై నిరశన చేస్తున్న నిర్మాత యలమంచలి రవిచంద్ కి నిమ్మరసం కూడా తాగించారు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ మీద మీకు తెల్లారగట్ట ఈ లేఖ రాస్తున్నా...అర్థం చేసుకుంటారని మనవి. నేను పెద్దగా చదువుకున్నోడిని కాదు కాబట్టి...సమాజం కోసం మంచి కోసం ఇలా రాస్తున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి.   

1) మేడం, నా ఈ ఎదవ జీవితంలో నాకున్న ఏకైక వినోద సాధనం సినిమా, టీ.వీ. ఈ వార్తల చానళ్ళు రోజూ సగం సినిమా చూపుతాయి కాబట్టి అవి 'బుల్లి సినిమా' కిందికి వస్తాయి. నలుగురు హీరోలు, నిర్మాతల మండలి మహనీయులు వచ్చి అడగ్గానే టికెట్ ధర పెంచుతారు మీరు. మా పరిస్థితి ఏమిటి? నేను, నా భార్య, పిల్లలు కలిసి సినిమాకు వెళ్ళాలంటే....తడిసి మోపెడవుతున్నది. మల్టిప్లెక్స్ లో మాకు ఒక సినిమాకు అక్షరాలా వెయ్యి అవుతుంటే మాకు పట్టదా? 

ఇంత ఖర్చా? మాకు వినోదపు హక్కు లేదా? చిన్న హాల్ లోకి పోదామంటే పెళ్ళాం, బిడ్డలు ఊరుకోరాయే. మీరు ఖైరతాబాద్ నుంచి...లక్డి-కా-పూల్ దాకా పకడ్బందీగా రోడ్డుమధ్య గట్టి డివైడర్ పెట్టారు. అందుకే మధ్యలో మా జనం బొక్కేట్టేసి దూరుతూ రోడ్డు దాటుతున్నారు. మరి...పైరసీ సీ.డీ.కూడా మాకు అలాంటిదే.

2) సరే...ఈ సినిమా జనం దండం పెట్టి మరీ అడుగుతున్నట్లు హాలుకు వెళ్లి పాప్కార్న్ నవులుతూ సినిమా చూడాలని మాకు మాత్రం ఉండదా? అక్కడ హాల్లోకి ఆ నాయాళ్ళు మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకుపోనివ్వడం లేదు. ఇది మేము ఎవ్వడికి చెప్పుకోవాలి? వాడు అక్కడ ఎంత ధరకైనా ఏ బ్రాండ్ అమ్మినా మూసుకుని మేము కొనుక్కోవాలి. అది హక్కుల ఉల్లంఘన కాదా? మరది మావల్ల అవుద్దా? ఒక్క సీ.డీ. కొనుక్కుంటే...ఇంట్లోనే చాయ్, మిర్చి తింటూ ఛీప్ గా సినిమా చూడొచ్చుగద మేడం. ఏం...ఐడియాలు వీళ్ళు కాపీ కొట్టి సినిమాలు తీయడం లేదా? 

3) మేము హాల్ కు పోకుండా...బెడ్ రూమ్ లోనే కూచొని దొంగచాటుగా సీ.డీ. సినిమా చూడడానికి చెప్పుకోలేని ఒక కారణం ఉంది మేడం. మీకు తెలుసు...ఇప్పటి సినిమాలలో అన్నీ..బూతు సీన్లే. హీరోలు కూడా హీరోయిన్లను రేపు చేస్తున్నారు. మాటి మాటికీ వాటేసుకుని, ముద్దేట్టేసుకుంటున్నారు, మంచం మీదికి గుంజేస్తున్నారు. 

ఈ సీన్లన్నీ పిల్లలతో కలిసి చూడలేకపోతున్నాం మేడం. డబల్ మీనింగ్ డైలాగులు అర్థం కాక పిల్లలు వాటి అర్థం చెప్పమని అడుగుతుంటే చచ్చిపోతున్నాం. అందుకే...మా బామ్మర్ది చీపు రేటుకు తెచ్చే పైరసీ సీ.డీ.తెచ్చి పిల్లలు నిద్రపోయ్యక బెడ్ రూమ్లో గుట్టుగా సినిమా చూస్తున్నాం మేడం. ఈ జాగ్రత్త పాటించకుండా...దర్జాగా పిల్లలతో హాల్లో సినిమా చూసిన మా గవర్రాజు కొడుకు (పదేళ్లోడు) ఇల్లూడుస్తున్న పనిమనిషి  నడుము పట్టుకున్నాడు, టేచెరమ్మ ఒంక అదోలా చూస్తున్నాడంట.  

ఈ సినిమా వాళ్ళు పంతుళ్ళను పిచ్చోళ్ళను చేసి చూపిస్తున్నారు. అయ్యా అమ్మలను ఎగర్తించమని చెబుతున్నారు. పోలీసులను దొంగలంటూన్నారు. అందరినీ చులకన చేస్తున్నారు. లేచిపోవడం, పక్కింటి ఆంటీకి లైట్ కొట్టడం చానా గ్లామర్ గా చూపుతున్నారు. అయ్యబాబోయ్....పిల్లలను చేజేతులా పాడు చేసుకోమంటారా...హాలుకెళ్ళి సినిమా చూసి? మీరు ఒక లేడి మంత్రి కదా...మీరు చెప్పండి..టీ.వీ.వార్తా ఛానెల్స్ లాగా సినిమాలు కూడా సకుటుంబంగా చూసేటట్టు ఉన్నయ్యా?  

4) డబ్బులు లేక ఆగా కానీ ఈ రోజుల్లో సినిమా తీయడం ఏముంది మేడం? ఒక ప్రేమ కథ, మనోడు హీరో, తెలుగేతర బక్కపీచు పోరి హీరోయిన్, నాలుగు ఫైట్లు, ఒకటీ అరా విదేశీ షాట్లు, కొన్ని గ్రాఫిక్స్. ఇంతోటి దానికి హాల్ దాకా పొమ్మంటారా? బాగుందే.

5) పనిలో పనిగా మీకు కొన్ని సూచనలు చెయ్యాలని ఉంది మేడం...మీరేమి అనుకోవద్దు. ఈ సినిమా వాళ్ళు 'హై బడ్జట్' అంటూ ప్రెస్ ముందు ఓ..తెగ డబ్బా కొట్టుకుంటున్నారు కదా మేడం. పైరసీ అరికట్టేందుకు ఒక వంద మంది పోలీసోళ్ళతో స్పెషల్ టీం ఏర్పాటు చేసేముందు...మీరు వీళ్ళను ఒకటి అడగండి మేడం. సినిమా టైటిల్స్ తో పాటు...సినిమాకు అయిన ఖర్చు వివరాలు...ఎవరికెంత ఇచ్చింది..ఒక లిస్టు తెర మీద కాసేపు చూపించమని వీళ్ళకు ఆర్డర్ వెయ్యాలి మేడం. లైట్ బాయ్ కి వీళ్ళు ఎంత ఇచ్చారో కూడా చెప్పాలి. ఈ పారితోషకం తీసుకున్న వాళ్ళు ఎంత టాక్స్ కట్టారో కూడా చెప్పాలి మేడం. బట్టలిప్పి చూపిస్తారు గానీ లెక్కలిప్పి చూపించరా?

6) అసలు మీకు, రోశయ్య బాబాయికి  తెలియట్లేదు కానీ మేడం...మీరు జనాలకు సారా పోసి ఖజానా నింపుకుంటున్నట్లే...ఈ సినిమా వాళ్ళను టైట్ చేసి డబ్బు సంపాదించవచ్చు. ఆ టైట్ కాకుండా ఉండడానికే వీళ్ళు రాజకీయం వెంట, నాయకుల వెంట ఉరుకుతున్నారట. వీళ్ళలో చాలా మంది  పన్ను కట్టడం లేదట. కొందరు కట్టినా...మన రాష్ట్రంలో కాకుండా చెన్నై వెళ్లి కడుతున్నారట...ఎందుకు? వీళ్ళ లెక్కలు సరిగ్గా ఉన్నాయా? అని చూడడానికి ఈ ఫీల్డు లో ఏరులై పారుతున్న నల్లధనం అరికట్టడానికి ఆ పోలీసు టీం సేవలు ఉపయోగించుకోవాలి. అలాగే...బైటికి రావడం లేదు కానీ చిన్న ఉద్యోగులకు వీళ్ళు సరిగా జీతాలు ఇవ్వడం లేదట. ఈ సందర్భంగా ఇవన్నీ మనం చూడాలి మేడం.

7)  మనోళ్ళ బ్రైన్స్ అమెరికా వాడు ఐ.టీ.లో వాడుకుంటున్నాడు. మన తెలుగు బాడీ లు మాత్రం మన సినిమా వాళ్ళకు పనికిరావడం లేదు మేడం. హీరోయిన్ సహా అందరూ తెలుగు యాక్టర్లను పెట్టుకోండని, తెలుగు రాని డబ్బింగ్ భామలను తీసుకుంటే ఊరుకోబోమని ఒక ఆర్డినన్స్ తేవాలి మేడం...యమ అర్జంటుగా. మన తెలుగు అమ్మాయిలు ఎంత బాగుంటారో మీకు తెలియదా చెప్పండి.  ఆ బాపుగారినో, విశ్వనాథ్ గారినో అడగండి. ఏ.. టూ.. జడ్ లోకల్ టాలెంట్ వాడుకుని, సముద్రపు ఒడ్డు-భామల బొడ్డు చూపని సినిమాకు కొన్ని రాయితీలు ఎక్కువ ఇవ్వాలి. 

8) మానవ సంబంధాలు దెబ్బతీసే సినిమాలు, మహా చెడ్డ హారర్ మూవీలు తీసే నిర్మాతలను, నటీ నటులను 'గూండా యాక్ట్' కింద బుక్ చేయాలి లేదా ముంబాయ్ పంపెయ్యాలి మేడం. కొన్నేళ్ళ పాటు బీచ్ సీన్లు, ముద్దుల సీన్లు, ముంబాయ్-చెన్నై--బెంగాల్ భామల బుకింగులు నిషేధించాలి.  ఇతర రాష్ట్ర హీరోయిన్ను తీసుకుంటే...హీరో కూడా ఇతర రాష్ట్రం వాడి ఉండాలని ఒక క్లాజు పెట్టండి....అంతా సెట్టవుద్ది ఆటోమాటిగ్గా.
9) 'హై స్కూల్' లాంటి సినిమా తీసిన వాళ్ళకు ఎర్రగడ్డలో ప్రత్యేక చికిత్స ప్రభుత్వ ఖర్చుతో ఇప్పించాలి మేడం. దర్శకులకు అప్పుడప్పుడు మానసిక వైద్యులతో పరీక్షలు జరిపి...వాళ్ళు తదుపరి సినిమాకు పనికివస్తారో లేదో చూడాలి. తేడా వస్తే వాళ్ళను ఆపాలి. తెలీకుండా...వీళ్ళు సమాజాన్ని పాడు చేస్తున్నారు. మీ గొడవ మీది కాబట్టి మీకు ఈ ముఖ్య అంశం పట్టదు.

10) ఒక ఫ్యామిలిలో ఇద్దరికన్నా ఎక్కువ మంది హీరో వేషం వెయ్యకూడదని  కూడా ఒక రూల్ ఉండాలి మేడం. 

11) సినిమా మా లాంటి వాళ్లకు ఊపిరి మేడం. అందులో బట్టలే మా దుస్తులు, అందులో మాటలే మా పలుకులు. అందులో సంస్కృతి మాకు ఆదర్శం. మళ్ళా రాస్తున్నా అనుకోకండి కానీ...సినిమాలో బూతును అరికట్టడానికి ఏదైనా చేయండి మేడం. ప్లీజ్. 
అది మీ వల్ల కాకపోతే....ఒక్క హీరోయిన్, ఇతర ఆడ పాత్రధారులే కాకుండా....హీరోలు, విలన్లు, బ్రహ్మానందం సహా అంతా బోసిమొలతో సినిమా తీసుకునే పర్మిషన్ ఇవ్వండి మేడం. ఇది 'దిగంబర సినిమా' అని ఒక ముద్ర వేస్తే...పిల్లలను ఇంట్లో ఉంచి పెద్దోళ్ళం హాలుకెళ్ళి చూసొస్తాం. ఆ పనైనా చేసి పుణ్యం కట్టుకోండి మేడం.

12) ఇంకో చిన్న సజెషన్. ముందుగా దర్శక నిర్మాతలు నటీ నటులు అంతా వాళ్ళ అమ్మానాన్నలు, పిల్లాపాపలతో కూచొని చూశాక వాళ్ళ అభిప్రాయాలు పరిగణనలోకి తెసుకుని...సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వాలి. 
ప్రజలు ఈ సినిమా వద్దని కోరగానే...ఆ సినిమా ప్రదర్శన కూడా ఆపాలి. 'జనం చూస్తున్నారు...అందుకే చూపుతున్నాం," అని వాదించే అత్తెలివి సినీ జనాలను దేశద్రహం చట్టం కింద అరెస్టు చేసి అండమాన్ జైలుకు పంపాలి.
సారీ మేడం ఆవేశం ఎక్కువయ్యిందా?
నిజానికి ఇంకా చాలా చెప్పాలని ఉంది.
ఇప్పటికి ఈ డజను చాలు. సెలవ్, ఉంటాను
మీ
అబ్రకదబ్ర
ఫిలిం నగర్
హైదరాబాద్

31 comments:

Saahitya Abhimaani said...

అద్భుతం అబ్రకదబ్రగారూ. ఒక సామాన్య మానవుడు అనుకునే కాదు బాధపడే విషయాలు అన్ని వ్రాశారు. ప్రభుత్వం మీరు చెప్పిన విషయాలలో తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

Unknown said...

పాటించదగ్గ సలహాలు

Anonymous said...

:D
hhaa..haa.. Sankar

Anonymous said...

You have reflected very nicely the agony of the comon man about the films and the feelings of the people escept a few points which are against the rules.
But you have totally ignored a very vital issue of FANS of the film stars who are totally responsible for making a flop film into a so called blockbuster!They create all sorts of artificial hype for their hero and fill up the seats in the theatre to show to the common man that the film is running to full house.If the so called fans are eliminated I am sure the real quality of the fiuolm will come out.Infact a section of film industry is just fooling the commom man in the name of entertainment by resorting to all immoral and unethical ways of presenting a film.
TRAGICALLY THE SAME PEOPLE OF FILM INDUSTRY ARE BEING TREATED AS VIPs and sit with the Governor,CM,Ministers and other top officials as if they are serving the people.Ijust feel irritated if any film personality gets VIP treatment in ourt society.After all they are proffessionals of entertainment business earning their bread.are these better than a leading doctor,engineer,proffessor or any social activist who are serving the people at all times?These film personalities must be treated like any other citizen and should not be given VIP treatment or any special treatment.

JP.

simplesoul said...

Kudos Ramu garu.. good post!

Vasu said...

Well said Abracadabra.

jara said...

ya relly true

Alapati Ramesh Babu said...

dear sir , all of your opinion's are 100% correct. all are second with you. but please edit the name abrakadabra . keep your name first. this is our opnion . first start we want piracey movement. legalley is there any way for dvd's.

Prasad said...

Awesome Ramu garu....

Keep up the heat... May be some one will hear......

WitReal said...

కొంతకాలం క్రితం అబ్రకదబ్ర, "కందిపప్పు ధర పెరిగింది, సామన్యులమైన మేము కందిపప్పు కొనలేకపొతున్నం" అని మొర పెట్టుకున్నాడు.

దానికి వైయ్యెస్సార్, "కందిపప్పు ధర తగ్గే వరకు బఠాణీలు వండుకొమ్మన్నాడు"

మరి ఇప్పుడు ఆ వైయ్యెస్సార్ స్కూల్లో చదువుకున్న గీతారెడ్డి మీకు అలాంటి సమాధానమే ఇవ్వొచ్చు!! ;)


didnt feel like commenting on the post. you also know that those points are just absurd.

instead of all this, go on a hungerstrike at the same venue, demanding for strict censor rules & quality in the films. That is more constructive than writing absurd posts.

Ramu S said...

డియర్ WitReal,
నిజ్జంగా ఈ పొద్దున్నే నాకు ఈ నిరాహార దీక్ష ఆలోచన వచ్చింది. ఇది రాస్తే ఎవడు పట్టించుకుంటాడు...అదే స్పాట్ లో నిరశనకు కూచోవాలిగానీ అనుకున్నా. మీరు గానీ జాయిన్ అయ్యే అవకాశం ఉందా?
రాము

Anonymous said...

sir ur post is really gud....if our hon'ble minister sees it...she'd understand d pain n helplessness of a common man...truely its a nice post sir....

all d best

sri divya said...

really a very gud blog sir...it represent d agony of common man...about d present state of films...nice work sir....hope film producers n directors wud realize....

ఆ.సౌమ్య said...

భలే రాసారు అబ్రకదబ్ర గారూ
సినిమా డైలాగులలో బూతులతో పాటు, పాటలలో బూతులు కూడా తగ్గించమని రాయండి సార్, వినలేక చచ్చిపోతున్నాం. సినిమా డైలాగులు, హాల్ కి వెళ్తేనే వినిపిస్తాయి. ఈ పాటలు ఎక్కడబెడితే అక్కడే వినిపిస్తున్నాయి. చెవులు తుప్పట్టిపోతున్నాయనుకోండి.

Veerendra said...

hi abrakadabra garu

good post. naa full support meeke

Anonymous said...

బూతు దేవుళ్ళ బొమ్మల్లో కళను చూసే 'సుకుమారి నంట ' కళాకారులు, సినిమాల్లో ఆ కళాదృష్టితోనే బూతులు ఆస్వాదించవచ్చుకదా!

ఎందుకో ఈ నకరాగాలు ! :P

శంకర్

Anonymous said...

Ramu garu,
Forget about people like WitReal and donot bother about and continue to express the views which concerns every citizen.Suggestions to tackle any problem are most welcome but it should not be ironical,satirical and irritating to the people who are doing some thing , if not nothing, to fight against the ills of the society.The best way to help any one is not to hurt any one in any manner.

WitReal said...

@ ramu:

i'd join your hunger strike, if I agree with the cause.

Here, I dont agree with your cry that actors, actressess, bikini & beach are reasons for your plights.

You have the option of NOT going to movies (thats what I do). That way, a bad movie will anyway die.


@ to the above anony:
There is no satire in my argument. I just said, piracy is punishable. go back and read. infact the blog author was sarcastic by refering the slush of tollywood, in light of piracy.

Sashtri said...

తప్పు నిజంగా మీదేననిపిస్తోంది.
ఎవ్వరు వెళ్ళమన్నారు మిమ్మల్ను అసలు అలాంటి సినిమాలకు ?
పెళ్ళాం పిల్లలు ఊర్కోరు అంటున్నారే... ఆ మాత్రం అలాంటి సినిమాలను చూడగోరడం తప్పు అని మీ కుటుంబసభ్యులకు మీరే నచ్చజెప్పలేకపోతే ..ఏదీ వెయ్యి రూపాయల టికెట్ విషయమై... ఏదో వ్యాపారం చేసుకునేవాడెందుకు మీ పిల్లలగురించి ఆలోచించాలి?
అయినా హర్రర్ సినిమాలు తీయకూడాదా ? సెక్స్ ఉన్న సినిమాలూ ఒద్దా? నవరసాల్లో భీభత్సభయానకశృంగార రసాలు అసలు రసాలే కావా మీ ఉద్దేశ్యంలో ?
పిల్లలు భయపడతారు చెడిపోతారు అనుకుంటే అసలు వాళ్ళకు అవి చూపించడమెందుకని ? తెలుగులో కట్టేస్తే మాత్రం ఇంటర్నెట్‍లో పోర్న్ చూడరా , ఈవిల్ డెడ్ లాంటి ఇంగ్లీషువి చూడరా?
ఏమయినా ఆంధ్రప్రదేశ్‍ను తాలిబాన్‍లా చేద్దామనే ఆవేశం కనిపిస్తోంది మీలో. సినిమాగురించి అనే కాదు, ఏ కళల్లోనూ ఇలాంటి ద్వేషపూరిత అభిప్రాయాలు దేనికీ ఎవరికీ మంచినొల్పవు.
సినిమావాళ్ళు ఇన్కమ్‍ట్యాక్స్ కట్టకపోటే మనం పైరసీ సీడీలు చూడటమేంటి ? కూచిపూడి నాట్యకారులూ , కర్నాటిక్ విద్వాంసులు కూడా కట్టనివాళ్ళ లిస్టుల్లో ఉన్నారు. ఆ మాత్రాన వాళ్ళ కళా వ్యర్థమే ?!!
హరి హరీ.... ఒక సినిమా తీయండి అందులోని కష్టం , ఇష్టం , బాధ్యత, అలుపూసొలుపూ తెలుస్తాయి. సినిమానే

Ramu S said...

శాస్త్రి గారూ...
ఈ తాలిబాన్ ఎవ్వారం ఏమిటి సార్? నాకెందుకండీ ద్వేషం. మీ వ్యాఖ్యపై స్పందించమని ఈ అబ్రకదబ్రను కోరతాను.
రసాలు వేరు..ఈ జనం చూపుతున్న బూతు వేరు. ఇది శృంగార రసం కూడా కాదు. తమరు నిర్వచనాల విషయంలో గందరగోళంపడి నాకు ఏదేదో ఆపాదిస్తున్నారు...శాస్త్రిగారూ..మీకిది తగదు.
రాము

Shastri said...

రామరామ నేను ఆపాదించడం ఏమిటీ ?! అయినా అబ్రకదబ్రెవరో మీరెవరోకూడా నాకు తెలీదాయె
అయినా మీరు స్పంచించారు కాబట్టి నేను బదులిస్తున్నా...
పై వ్యాసంలో "డబ్బులు లేక ఆగా కానీ ఈ రోజుల్లో సినిమా తీయడం ఏముంది .. " అనే వాక్యంలో నాకు ఒక మోటివ్ కనిపిస్తోంది...వ్యాసకర్త సినిమావాళ్ళను ద్వేషిస్తున్నారు అనడానికి.
మనం చెయ్యలేనిది ఇంకోరు చేస్తున్నప్పుడు అసూయాద్వేషాలతో ఊరికే తప్పులుపట్టడం మానవసహజమే కదా.
పైగా వ్రాసినతనికి సినిమా నిర్మాణం గురించి తెలిసినట్లు కూడా లేదు. (నాకెలా తెలుసు అనకండి , మా పెదమామయ్యగారి ప్రొడక్షన్ కళ్ళారా చూసాను. ఆయన డబ్బులు పోగొట్టుకోవడమూ తెలుసు ) లైటుబోయ్ మాత్రమే కాదు , మేకప్ మ్యానూ , ఫుడ్ కాంట్రాక్టరూ ..అందరూ కూడా యూనియన్ వాళ్ళు నిర్దేశించిన ప్రకారమే జీతాలు పుచ్చుకుంటారు. ఒక లొకేషన్‍కు వెళ్ళేప్పుడు ఇరవైమందిని తీసుకువెళ్ళి భోజనాలు పెట్టి ఆ లొకేషన్ పర్మిషన్ తీసుకోవాలంటే ఎంత నరకమో , ఖర్చో అనుభవిస్తేనే తెలుస్తుంది. నిజానికి అంత ఖర్చు పెట్టినా కొన్ని చోట్ల ఫలితం ఉండదు. అందుకే మలేషియా/అమెరికా రోడ్లమీద తీసినంత సులభంగా ట్యాంక్‍బండ్ మీద పాట తీయలేరు. ( పోలీసోళ్ళకు ఎంత లంచమిచ్చినా జనాన్ని కంట్రోల్ చెయ్యలేం. ఆఫ్‍కోర్సు అంకుశంలోలా ఒక రౌడీని తన్నే సీను అయితే ఆ జనమే పనికివస్తారు కూడా )
"పిల్లలను చేజేతులా పాడు చేసుకోమంటారా...హాలుకెళ్ళి సినిమా చూసి ..."
దీనికీ పైరసీకీ సంబంధం ఏమిటీ ? పిల్లల్లేకుండా హాలుకెళ్ళి చూడొచ్చుగా. అయినా మగధీర , అరుంధతిలాంటి చిత్రాలకు తాటికాయంత్ ఏ సర్టిఫికేటు పోస్టరు మీద మెరిసిపోతున్నా స్వయంగా తల్లితండ్రులే పిల్లలను తీసుకెళ్ళట్లేదా ?!
"దర్జాగా పిల్లలతో హాల్లో సినిమా చూసిన మా గవర్రాజు కొడుకు (పదేళ్లోడు) ఇల్లూడుస్తున్న పనిమనిషి నడుము పట్టుకున్నాడు"..... అంటే సినిమాలన్నీ బూతులేనా ?! వాడెవడో మదమెక్కి కొట్టుకుంటే దానికి కారణం ఎవరో తీసిన సినిమాననడం ఎంత భావ్యం ? ఆ పిల్లాడి పెంపకం తప్పు లేదా ?
అయినా మన భావితరాలకు సద్భుద్దులు నేర్పాల్సిన మనం , ఊరకే ఎవరినో వేలెత్తి చూపుతూ , మళ్ళీ వాళ్ళమీదే రాళ్ళు వేయడం , వాళ్ళ వ్యాపారాన్ని "బ్లాక్" చేయడం , అంతా మన తప్పేలా లేదూ ?!!

Ramu S said...

శాస్త్రి గారూ...
రాసినాయన..ఒక ప్రముఖ ఫిలిం జర్నలిస్టు. మీకన్నా..మీ పెద మామ కన్నా సినిమాల గురించి చాలా ఎక్కువ తెలిసినాయన. సినిమాలన్నీ పచ్చి బూతులు. అందులో అనుమానం లేదు. ఈ సినీ కుటుంబాలు తీసే సినేమాలన్నీ బూతు మీద బతుకుతున్నవే. ఈ అభిప్రాయం మీకు తాలిబాన్ అనిపిస్తున్నట్లుంది. మీరు ముందు టపాలో వీరు రస పోషణ చేస్తున్నట్లు చెప్పారు, తర్వాత వీరి బాధల గురించి మాట్లాడారు. నీకేమీ బోధ పడలేదు. సినిమా సీను మనకు లేదుస్సార్.
తరచి ఆలోచిస్తే...ఏ విషయమైనా 'జనం తప్పు' దగ్గరే చర్చ ఆగుతుంది.
ఈ సినిమా గొడవ నాకెందుకు సార్..హాయిగా నిద్రపోదాం. జనం చావు జనం చస్తారు.
త్రీ చీర్స్
రాము

Ramu S said...

పై కామెంట్ లో..."నాకేమీ బోధపడలేదు" బదులు "నీకేమీ.." అని వచ్చింది. సవరించుకోగలరు.
రాము

Karlos said...

film journalist???
if he is gutsy enough , let him write in a printed magazine ..even if its a boothu cine patrikalu ...and get it published ...
There should be minimum shame.
Encouraging Piracy means encouraging an illegal thing.
So you can encourage prostitution next
and then ...Child abuse too ???

biggest boothu is in the brains of the people who cant differentiate sex, lust, romance , love...

I second with Sastri garu...
this is totally a "hate post"
may be the writer could not make it in films and hence he is spitting venom on people who could make it there

Anonymous said...

oho,
What is illegal boss? Illegal is synonym of this film and TV industry. Don't you know how this cine cartel works and manipulates?
I am saying that majority of the film people don't have an iota of shame. They are self-centric, casteist, irresponsible fellows.
Filth is in your brain. Who was talking about child abuse?
I am personally not for piracy but I am asking the film people to be responsible. No body talks about dirt in movies but they want concessions and stringent acts against piracy.

kvramana said...

anna
I completely failed to understand the link between that hunger strike by a producer and piracy. He wanted the government book those so called pirates under the goonda act. I never understood what that act was all about. I still dont know if we can equate pirates and goondas.
Secondly, it is interesting to track the piracy episode. In the earlier days of theatre prints, it was understandable that someone used to take a camera to a theatre and shoot the film. But, is there someone who can tell us how the DVD quality pirated CDs are available in market or for download?
Don't you think they are coming from a proper source than from a low quality video camera guy
it is a fact admitted by many of those in the industry that the rivalry between various groups is causing the leakage of prints from one of those many points of the film getting finalised.
Any additional info from your film journalist called abrakadabra?

Saahitya Abhimaani said...

రామూగారూ. ఈ లేఖ వ్రాసినది బ్లాగరు అబ్రకదబ్రగారా లేక మీ రహస్య గూఢచారి అబ్రకదబ్రనా? దయచేసి విపులీకరించండి. నేను నా బ్లాగులో ఇదే విషయం మీద వ్యాసం వ్రాసి మీ బ్లాగుకు లింకు ఇచ్చాను. చూసిన సుజాతగారు ఈ అనుమానం వెలిబుచ్చారు.

Ramu S said...

సార్...
బ్లాగర్ అబ్రకదబ్రకు నా కోసం ఈ లేఖ రాసిన అబ్రకదబ్రకు ఎలాంటి సంబంధం లేదు. ఈ అబ్రకదబ్ర అనే మనిషి టీ.వీ.లు సినిమాలలో చాలా మంది పెద్దమనుషులతో సంబంధం ఉన్న ఒక జర్నలిస్టు. ఆయనకు కాస్త ఆవేశం ఎక్కువే గానీ...నాకు మంచి ఇన్ పుట్ ఇస్తుంటారు.
రాము

శ్రీనివాస్ said...

greatandhra.com ki koodaa lekha raasaadu mee abrakadabra

http://telugu.greatandhra.com/cinema/20-03-2010/mant_20.php

Ramu S said...

వీడెవడండీ బాబూ..
కనీసం సోర్సు పేరు రాయకుండా వాడేసుకున్నాడు. I demand 'courtesy.' Please alert that guy.
ramu

Anonymous said...

1. ఏం...ఐడియాలు వీళ్ళు కాపీ కొట్టి సినిమాలు తీయడం లేదా?

2. బట్టలిప్పి చూపిస్తారు గానీ లెక్కలిప్పి చూపించరా?

These 2 are SUPER

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి