Friday, March 19, 2010

నేడు...'వరల్డ్ స్లీప్ డే': అన్నీ మరిచి హాయిగా బజ్జోండి...

మీరు ఒప్పుకోరేమో  గానీ...మన TV-9 కొన్ని సార్లు మంచి స్టోరీలు ఇస్తుంది. ఈ రోజు 'World Sleep Day' అని ఆ ఛానల్ లో ఈ సాయంత్రం చూసి ఇది రాస్తున్నాను. ఇది ఆటలో అరటిపండు...కొంత స్వోత్కర్ష.

నేను ఏ బస్సు ఎక్కుతున్నా...మా అమ్మ...'జాగ్రత్త నాన్నా. స్టేజీ చూసుకో..." అని నవ్వుతుంది. ఆ జాగ్రత్త ఎందుకంటే...మన నిద్ర గురించి. ఏ బస్సు ఎక్కినా...పదకొండో నిమిషంలో నిద్రాదేవత ఒడిలోకి జారిపోవడం...మా నాన్నకు, నాకు అలవాటు. చిన్నప్పుడు ఒకసారి బస్సులో నిద్రపోయి పక్క స్టేజిలో దిగా కాబట్టి...అమ్మ ఆందోళనతో ఆ హెచ్చరిక చేస్తుంది.

ఎందుకో గానీ....ఇప్పటికీ నాకు...ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ అంటే అక్కడ నిద్ర వస్తుంది. దూర ప్రయాణాలలో రోడ్డు పక్క చెట్టుకింద...కారు ఆపి పదంటే పది నిమిషాలే సుఖంగా నిద్రపోయి లేచి మళ్ళీ డ్రైవింగ్ ఆరంభిస్తే....'బాబూ...నువ్వు  మనిషివి కాదు...' అని ఇంట్లో రెండు జీవులు దెప్పుతుంటాయి నన్ను. తమకు నిద్రపట్టడం లేదని ఎవరైనా అంటే...నాకు భలే జాలి వేస్తుంది.

 స్కూలు రోజుల్లో...అంతా నైట్ అవుట్లు చేస్తుంటే...గంట కొట్టినట్లు తొమ్మిది గంటలకు మనం బెడ్ హిట్టింగ్ చేయడం వల్ల ఇంట్లో అందరికీ మండేది. ఇప్పటికీ...నా అంత్యంత స్నేహితులు నన్ను రాత్రి పూట పార్టీలకు రమ్మనరు. కారణం...అక్కడే ఒక టైం అయ్యాక ఒక మూల మనం చేసే పవళింపు. 

నేను నిద్రను ఎంజాయ్ చేసినట్లు ఎవ్వరూ చెయ్యరని...ఈ బ్లాగ్ పెట్టక మునుపు దాకా అనుకునే వాడిని. ఈ బ్లాగ్ మూలంగా యేవో ఆలోచనలు...ఏదో రాయాలని, ఉద్ధరించాలని తలంపు. మెదడులో ఆలోచనా క్రమం, ధార దెబ్బతినకముందే కంపోజ్ చేయాలన్న పిచ్చి భావన వల్ల నిద్ర కొద్దిగా దూరమయ్యింది. ఈ వరల్డ్ స్లీప్ డే సందర్భంగా దీన్ని సవరించుకోవాలి. 


రాత్రి నిద్ర చేడిందా...చాలా మంది మర్నాడు ఉదయం కొంత బీభత్సం సృష్టిస్తారు. నిద్ర సరిగా లేని బాస్ లే ఉద్యోగులపై అకారణంగా విరుచుకుపడతారు. నిద్ర లేని వాళ్ళే ఇతరులపై చిర్రుబుర్రులాడుతుంటారు. నిద్రలేకపోతే...నరాల వ్యవస్థ సహకరించదు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.

కాలం గాయాన్ని మాన్పుతుందని అంటారు కానీ...ఏ గాయాన్నైనా...జోకొట్టి నిద్రపుచ్చి మాయం చేసేది నిద్రే. ఇంత మంచి నిద్ర కోసం...ఒక దినోత్సవం ఉండడం సంతోషకరం.ఈ ఒక్క రోజైనా ఆలోచనలు, ఒత్తిళ్ళు పక్కన దిండు కింద పెట్టి...హాయిగా గుర్రుపెట్టి నిద్రపోండి. నిద్రపొయ్యేవారిని నిద్రలేపకండి. 

మిత్రులకు నేను ఒక సలహా ఇస్తుంటాను....మంచి సీరియస్ నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటే...నిద్రపొయ్యే ముందు దాని గురించి ఆలోచించి...నిద్ర లేచాక డెసిషన్ తీసుకోండి. నిద్ర చాలా విషయాలను తేలిక పరుస్తుంది. కలల గురించి కూడా కొన్ని స్వానుభవాలు రాయాలని ఉంది గానీ...ఇప్పటికే థీంకు దూరంగా వెళ్తున్నావని అంటున్న మంచి మిత్రుల భయానికి జడిసి ఆగుతున్నాను.  

ఇక ఈ పై ఫోటో గురించి ఒక ముక్క. ఇది కాకినాడలో ఒక టేబుల్ టెన్నిస్ పోటీలకు నా కొడుకు ఫిదెల్ వెంటవెళ్లి...మధ్యాన్నం కొద్దిగా తిన్నాక ఎర్రటి ఎండలో చెట్టునీడన కుర్చీలో కూర్చుని హాయిగా ఒక కునుకు తీస్తుండగా...మా వాడి ఫ్రెండ్ తండ్రి శ్రీధర్ గారు నాకు తెలీకుండా తీసి నాకు పంపిన ఫోటో. ఒక మధుర ఘడియను చిత్రీకరించిన శ్రీధర్ గారికి థాంక్స్. 


ఈ సందర్భంగా...http://worldsleepday.wasmonline.org/ నుంచి కాపీ చేసిన ఈ తీర్మానాలు మీ కోసం...

The World Sleep Day declaration is as follows:
  • Whereas, sleepiness and sleeplessness constitute a global epidemic that threatens health and quality of life,

  • Whereas, much can be done to prevent and treat sleepiness and sleeplessness,

  • Whereas, professional and public awareness are the firsts steps to action,

  • We hereby DECLARE that the disorders of sleep are preventable and treatable medical conditions in every country of the world.

5 comments:

Anonymous said...

Reasonable sleep is essential to every human being rather to every living being.A sleepless person is a mentally imbalanced one as he or she behaves abnormally and becomes inactive without any freshness in his body language.Of course there are many scientists,politicians,doctors,media personnel and others who do the bull work till late nights and even on call at any time with restricted sleep but unfortunately they in the long run will be affected by a number of diseases like Hypertension,Diabetes,anxiety,depression etc which naturally affect the way of living.As we all know the age old saying "Early to bed and early rise....." is still to be remembered and followed.
Let us all have good sleep of required hours daily to become more active with freshness.One of the reasons for alcohol and drug addiction is sleeplessness particularly in the field of entertainment,film industry and the people working in essential services as they work without any time, proper rest or sleep and ultimately they succumb to many diseases in young life.
JP.

Anonymous said...

As there are no comments on World sleep day it looks every blogger of Ramu are really implementing the day practically by sleeping!.

Anonymous said...

well said second anonymous

Anonymous said...

I am also just like u.
My friends and family members asks me,how u will get sleep even there is so much noise around u.
If i am struggeling with any issue,i will just sleep for an hour,later i will take the decision.
Happy sleeping .. :)

భావన said...

నేను నిద్దరోయి లేచి రాస్తున్నానండి కామెంటు. బాగుంది మీకు నిద్దరమ్మ కు మంచి స్నేహమన్నమాట. అదృష్టవంతులు. :-)

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి