Wednesday, March 24, 2010

సెక్స్ పై సుప్రీంకోర్టు మాట-- ఛానెల్స్ బూతుసీన్ల తీట

పెళ్లి కాకుండా కలిసి జీవించడం, పెళ్ళికి ముందు సెక్స్ లపై సుప్రీంకోర్టు సమాజానికి కొంత క్లారిటీ ఇచ్చిన మరుసటి రోజు హిందువులు అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణాన్ని జరుపుకున్నారు. కోర్టు వారి మాటలపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
  

పెళ్లి తర్వాత భార్య/భర్తతో మాత్రమే కాకుండా ఇష్టపడే ఆమె/అతనుతో కూడా శారీరక సంబంధం కలిగి ఉండవచ్చా? అన్న కీలకాంశంపై కూడా అత్యున్నత న్యాయస్థానం ఓపెన్గా ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుంటుందని, అప్పుడు రాముడు చేసింది తప్పో వొప్పో తెలిపొయ్యేదని అబ్రకదబ్ర అత్తెలివి స్టేట్మెంట్ ఇచ్చాడు.

మా జిల్లాలో భద్రాచలం ఉండడం వల్లనో, మా అమ్మమ్మకు చాదస్తం ఎక్కువ కావడం వల్లనో రాముడంటే నాకు "మనోడే..." అన్న దగ్గరి ఫీలింగ్ ఉంది. రాముడి వల్ల ఈ కింది విషయాలు నేర్చుకోవాలని మా అమ్మమ్మ చెప్పింది.
1) సత్యవాక్కు
2) ఆడిన మాట తప్పక పోవడం
3) తండ్రి మాట జవదాటక పోవడం
4) గురుభక్తి
5) ఏక పత్నీవ్రతం
6) జనవాక్ పరిపాలన
ఇందులో పూర్తిగా అమలు చేసేందుకు వీలున్నది నాలుగో పాయింట్ ఒక్కటే అనీ...ఐదో పాయింట్ కూడా దాదాపు పూర్తిగా అమలుచేయవచ్చని అబ్రకదబ్ర వాదించాడు. "అబద్ధం చెప్పడం శిక్షార్హమని ఎక్కడ వుందో చూపండి...శ్రీ కృష్ణుడు అబద్ధాలు చెప్పలేదా?" అని కోర్టు అడిగితే సంసారపక్షపు జనం ఏమి
చేయాలని ప్రశ్నించాడు. మనోడు వేడి మీద ఉన్నాడు. గీతారెడ్డికి రాసినట్లే జడ్జిలను ఉద్దేశించి ఒక లెటర్ రాస్తానంటే....'వద్దు బాస్...నేను పై వాటిలో ఆరో పాయింట్ కూడా ముఖ్యమనే అనుకుంటున్నా'...అని చెప్పి...పండగ సందర్భంగా చేసిన పులిహోర, దద్ధోజనం, బియ్యపు పరవన్నం పెట్టి పంపించేసాను. 
 

అసలీ పోస్టు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే....ఆ సుప్రీంకోర్ట్ ఆ మాటలు చెప్పిందే తడవుగా...మన నీలి ఛానెల్స్ బాక్ డ్రాప్ లో బూతు బొమ్మలు తెగ చూపించాయి నిన్న అంతా. చౌదరి అంకుల్ చానెల్ అయితే...ఇందిరా పార్క్ లో ప్రేమ జంటలు చెలరేగిపోవడాన్ని కూడా ఈ వార్తలో భాగంగా చూపింది. ముద్దు సీన్లకు, ఈ తీర్పుకు సంబంధం ఏమిటి?

సరే..సుప్రీం వారి ఈ వ్యాఖ్యలలో ఉన్న మాంచి ఎలిమెంట్స్ నేపథ్యంలో...ఈ ఛానెల్స్ కనీసం ఒక మూడు రోజులపాటు మాసాలా సీన్లు చూపి చర్చలు జరిపి కాలక్షేపం చేసి ఉండేవి. కానీ...ఇంతలో రాములోరి పెళ్లి. అన్ని ఛానెల్స్ భక్తి శ్రద్ధలతో దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసాయి. ఇలా అంది వచ్చిన ఒక మంచి అవకాశాన్ని రామనవమి చెడకొట్టింది...ఈ మధ్యాన్నం వరకు. ఇక రాత్రికి చెలరేగిపోతారేమో చూడాలి. 

11 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

:)

WitReal said...

dragging lord rama into this nuisance is avoidable. atleast, i didnt understand, what your abracadabra meant by: రాముడు చేసింది తప్పో వొప్పో తెలిపొయ్యేదని. you are inviting lot of rant for this. i leave it to others..;)

next, just for info, per IPC, adultery is a punishable crime for men. women are exempt. they are always considered as the victims of men.

Anonymous said...

రాము గారు,

పెళ్లి తర్వాత భార్య/భర్తతో మాత్రమే కాకుండా ఇష్టపడే ఆమె/అతనుతో కూడా శారీరక సంబంధం (అదే సహజీవనం)కలిగి ఉండవచ్చని గత౦లో పవన్ కళ్యాణ్ కేసులో రెఫెర్ చేసినట్లు గుర్తు.

Ramu S said...

Dear WitReal,
This Abrakadabra is not happy with SC's remarks. Inviting lot of rant?
cheers
ramu

Anonymous said...

The judgement appears to reflect a fact that our constitution or laws did not take our customs & traditions (accepted & practiced by people) into account when they were written.

-kvn

Vinay Datta said...

You have done a mistake by offering abakadabra pulihora, dadyojanam and paayasam. Today's specials..paanakam and vadapappu...would have cooled him down better.

Pls note that SC said that it is not a crime ( neramu kaadu ) and at the same time commented that leaving moral ehics cannot be named 'crime'.They said straight forwardly that our laws have no clarity on such issues.The channels have given Breaking news as 'not wrong' instead of 'not a crime'.The subtle things involved in this matter have to be discussed elaborately.

Somehow Iam not comfortable with SC's comment on Sahajeevanam before marriage.

Anonymous said...

The judges should not have refered to epics of a religion. They should have used wisdom, if they have any.

Their knowledge is limited to mere interpretation of law. They can not comment on religious beliefs, epics without valid proofs.

It is stupid to compare present law to a law of 5000yrs old. They had their own law suitable to their society.

Saahitya Abhimaani said...

Whether any channel Editors (if any)or for that matter the Bloggers actually read the Supreme Court judgement in full? I doubt. Reacting in a very emotional manner just based on press reports,is not correct(despite our knowledge of illiteracy in the media and irresponsible reporting). There are many blogers writing extreme comments against Supreme Court without giving minimum courtesy to the Highest Court in India, which too is wrong.Ultimately, it may be construed as contempt of Court.

Lets read the judgment, understand it in its true perspective and then still if it is objectionable, react properly and file a proper petition for revision. Reacting against Supreme Court judgment and reacting against the irresponsible media or for that matter reacting against a politician's comment, cannot be equated.

If possible, let there be good discussion in a channel with legal luminaries giving full facts, not with vested interest groups.

Exploiting to their advantage, the media people should not see it an opportunity to find further lowest behavior in reporting.

Ramu S said...

Siva gaaru,
You are right sir.
In fact, its not court's judgment but an "observation."
Newspapers reported the essence of the courts well.
Madhuri gaaru,
You are also right. Panakam, vadapappu were missing.
Ramu

Anonymous said...

this is it. society is growing up. చానెల్లకు సంబరం. తిరుగుబోతులకు చుంబనం. సమ్మంధాలు గుంభనం. నైతికతకు తద్దినం. live-in జీన్స్ కు ఒహటే అమ్మకాలు.

Anonymous said...

Laws of the land should protect the society fabric and respect the traditions and beliefs of people. I think the judges did not show much(or any) consideration for our traditional values and went overboard to interpret the law in this matter (like using the names of epic characters). They didn't make any comments to recognize the strengths of our marriage system which could have been highlighted in this case.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి