Wednesday, March 31, 2010

తెలుగునాట సహకార రంగంలో న్యూస్ పేపర్ ఆవశ్యకత....?

ఆంధ్రప్రదేశ్ లో మీడియా మరీ గబ్బుపట్టిపోయిందని చాలా మంది అభిప్రాయం. ఇది నూటికి తొంభై పాళ్ళు నిజమే అని నాకు అనిపిస్తున్నది. ఈ తెలుగు చానళ్ళ సంఖ్య పెరిగాక...పరిస్థితి  మరీ దారుణంగా తయారయ్యింది. ప్రతి ఒక్కడూ..జర్నలిస్టు అయిపొయ్యాడు...ఛానెల్స్ లో అభిప్రాయాలు ఇస్తూ హార్డ్ కోర్ చర్చలు ఆలవోకగా జరిపేస్తున్నారు. జర్నలిజం విలువ, ప్రభావం, ఉపయోగం తెలియని వాళ్ళు,  యాజమాన్యం అడుగులకు మడుగులొత్తే వాళ్ళు, మాటల గారడీ చేసే వాళ్ళు, బూతును మార్కెట్ చేయడంలో తలపండిన అల్పబుద్ధులు...మీడియాను దున్నేస్తున్నారు. 

ఈ క్రమంలో ఫ్రాన్స్ దినపత్రిక   Le Monde తరహాలో...సహకార రంగంలో ఒక తెలుగు దినపత్రిక పెడితే ఎలా ఉంటుందని...ఒక సన్నిహిత మిత్రుడు ప్రతిపాదన చేశాడు. వేలాది మంది నామమాత్రపు డబ్బు వేసుకుని....నిష్పాక్షికంగా పత్రిక నడపవచ్చని ఆ సీనియర్ జర్నలిస్టు మిత్రుడు  చెప్పాడు. ఆ పత్రిక గురించి వికిపెడియాలో ఈ కింది సమాచారం ఉంది.
  The paper's journalistic side has a collegial form of organization, in which most journalists are not only tenured, but financial stakeholders in the enterprise as well, and participate in the elections of upper management and senior executives. In contrast to other world newspapers such as The New York Times, Le Monde was traditionally focused on offering analysis and opinion, as opposed to being a newspaper of record. Hence, it was considered less important for the paper to cover "all the news that's fit to print" (the motto of The New York Times) than to offer thoughtful interpretation of current events. Writers of lead reporting articles did not hesitate to provide commentary or venture predictions. In recent years, however, the paper has established a greater distinction between fact and opinion.

నిజమే, పత్రికలలో-ఛానెల్స్ లో నిజాన్ని నిజంగా చూపాలి, అభిప్రాయాన్ని అభిప్రాయంగా చూపాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న రేఖ చెరిపేసి...మన మీడియా యజమానులు జర్నలిజాన్ని ఆగమాగంచేస్తున్నారు. జనాలను గొర్రెలుగా భావించి అజెండాలు సెట్ చేస్తున్నారు. చాలా తక్కువ విలువలు, బాగా ఎక్కువ డబ్బున్న యజమానులు, డబ్బు కోసం ఏపనైనా చేసే జర్నలిస్టుల వల్ల సమస్య వచ్చిపడింది. వృత్తి పట్ల నిబద్ధత లేకుండా..."అంతా చూపుతున్నారు..మనమూ చూపుదామ"ని అనుకునే బాపతు గాళ్ళు పెరిగి పొయ్యారు. ఇదేంటి సార్ అంటే...కోపానికి వస్తున్నారు. రాళ్ళు రువ్వుతున్నారు.

మీడియా హౌజులు, రాజకీయ పార్టీ కార్యాలయాల మధ్య హాట్ లైన్ ఏర్పడడంతో...మూడు నాలుగు రూపాయలు పెట్టి పేపర్ కొనుకునే రీడర్, నెలకు మూడు నాలుగొందలు పెట్టి కేబుల్ కనెక్షన్ పొందిన వీక్షకుడు ఏది నిజమో తెలియక సతమతమవుతున్నాడు. అన్ని ప్రధాన పత్రికలు ప్రధాన పార్టీల బాకాలు గానో, ఏజెంట్లుగానో మారాయి. ఎడిటర్లు పార్టీలకు సలహాదార్లు అయ్యారు. ఈ పరిస్థితిలో జనం గందరగోళపడుతున్నారు. ఈ పరిస్థితిలో  సహకార రంగంలో ఒక పత్రిక ఆలోచన ఎలావుందంటారు?

16 comments:

విజయవర్ధన్ (Vijayavardhan) said...

చాలా బాగుంది. ఇంకా కొంచెం వివరంగా వ్రాయండి. వీలైతే పాలుపంచుకోవాలనుకునేవారి అర్హతలు, బాధ్యతలు, విధులు మొ|| వివరాలు జతచేయండి.

రవిచంద్ర said...

ఈ ఆలోచన బహుబాగు. ఆసక్తికరంగా ఉంది. అమల్లోకి వస్తే మాత్రం మాధ్యమాల రంగంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేపవచ్చు.

Anonymous said...

It is a great thought! I will definitely switch to this. I am sick and tired of Eenadu and Sakshi.

- Janakiram

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సాధారణ పాఠకులు పాలుపంచుకోవాలంటే ఇందులో వీలవుతుందా?

Anonymous said...

*నిజమే, పత్రికలలో-ఛానెల్స్ లో నిజాన్ని నిజంగా చూపాలి, అభిప్రాయాన్ని అభిప్రాయంగా చూపాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న రేఖ చెరిపేసి...మన మీడియా యజమానులు జర్నలిజాన్ని ఆగమాగంచేస్తున్నారు.*
మీరు మాటి మాటికి నిజాన్ని నిజంగా చూపాలి, అభిప్రాయాన్ని అభిప్రాయంగా చూపాలి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పేపర్ చదివేవారు 90% ఎక్కడా దానిని తప్పు పట్ట లేరు ఎందుకంటె వారు నిజాన్ని నిజంగా,అభిప్రాయాన్ని అభిప్రాయంగా రాస్తున్నట్లు గా ఉంట్టుంది. ఒక 10 సం|| చదివితె ఆ పేపర్ సంగతి మనకు బాగా అర్థమౌతుంది. ఆయన రాసేవన్ని నిజలాగా అనిపిస్తున్నా అవి మన దేశనికి ఉపయోగపడని నిజాలు. వాస్తవానికి ప్రజలకు ఏమాత్రం ఉపయోగ పడవు. వార్తలు దేశ అభిమానము /దేశ భక్తి ని పెంపొందించేది గా ఉండాలి.

ఉదాహరణకు ఈ రోజు సానియ మిర్జా పేళ్లి సంగతి తీసుకొంటె, ఆమేకు ఈ దేశం లో ఎవ్వరూ పెళ్ళి చేసుకోవటానికి చిక్కలేదా ? సరే అది ఆమే వ్యక్తిగత మైతే మీడియా వారు అభినందనలు తెలిపి అంతటి తో వదిలి వేయాలి. కాని ఆమే పెళ్ళిని ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు పెనుతాయి అది ఇది అని వాగడం మొదలు పెట్టి ఎంత వరకు వెళతారంటే ప్రపంచ ప్రజలంతా ఒకటె అనే విధంగా రాస్తారు. వాస్తవానికి ఈ పెళ్ళి వలన పాకిస్తాన్ పాలసిలో ఒక్క మార్పు కూడా ఉండదు. కనుక ఇటువంటి వార్తలను ఒక్క రోజు ప్రచూరించి వదిలి వేయాలి కాని ప్రస్తుత కాలంలో మీడియా వారు ఇటువంటి వివరాలు రోజూ పేపర్ లో ఆకట్టుకునే విధంగా రాస్తూ దేశాన్ని జనాన్ని మోసం చేస్తున్నరు. ఈ ధోరణి ని మనం వ్యతిరేకించాలి.

Shiva Bandaru said...

మనదేశం లో ఇది ఖచ్చితంగా విఫలం అవుతుంది.

యూరప్ దేశాలలో దిన పత్రికల ధర 1 యూరో (60 రూపాయలు) ఉన్నా జనం ఆదరిస్తారు.

అంతేకాక రెండు మూడు కేంద్రాల నుంచి పబిలిష్ అవుతాయి . అదే మనరాష్ట్రం లో అయితే 15 - 20 కేంద్రాలనుంచి పబ్లిష్ అవుతున్నాయి.

ఇక్కడ ఒక రూపాయి దర పెంచినా సర్కులేషన్ లక్షల్లో పడిపోద్ది.

నిజానికి ఒక దినపత్రికకు అయ్యేకర్చు రూ 7 నుంచి 20 రూపాయలు అవుతుంది. అది 3 రూ కి ఇవ్వాలి. మిగిలిన డబ్బును ప్రకటనదారుల వద్దనుంచి రావాలి.

ప్రకతన దారులు ప్రకతనలు ఇవ్వాలంతే ౩ లక్షలు కనీసం సర్క్యులేషన్ ఉండాలి.

తెలుగులో ఈనాడు,సాక్సి,ఆంద్రజ్యోతిలు మాత్రమే ౩ laks circulation దాటాయి.

మిగిలినవి one laksh circulation లోపే.

కాబట్టి పత్రిక మనుగడ సాగించాలంటే రాజకీయ నాయకులకు కలాన్ని అమ్ముకోక తప్పదు. అవినీతి డబ్బుతో ముందుకు పోక తప్పదు. ఒక పక్క సర్క్యులేషన్ కోసం అడ్డదార్లు తొక్కక తప్పదు.

Sujata M said...

మీ ఆలోచన బావుంది. కానీ అది ఎంత వరకూ ప్రాక్టికల్ అని కూడా చూడాలి కదా. శివ బండారు తో నేనూ ఏకీభవిస్తాను. ఎవరన్నా చానెల్ వాళ్ళు గానీ, పత్రిక వాళ్ళుగానీ ఈ ప్రజాకర్షక కార్యకలాపాల్లో పడి తమ వ్యాపారాన్ని పెంచుకోవడాన్నే లక్స్యంగా పెట్టుకుంటున్నారని కదా మన బాధ. కానీ అది Struggle for (their) existence.

అభిప్రాయాల, వార్తా సమీక్షల విషయానికొస్తే ప్రభుత్వ రంగ సంస్థలయిన ఆల్ ఇండియా రేడియో, (రాత్రి తొమ్మిదిన్నరకొచ్చే స్పాట్ లైట్ దగ్గర్నుంచీ) దూర్ దర్శన్ (లోక్ సభా / రాజ్య సభా / ఇండియా / భారతీ లలో వచ్చే చర్చా కార్యక్రమాలు), యోజనా - వగైరా జర్నళ్ళు , ఇతోధిక సేవలనే అందిస్తున్నాయి. కాకపోతే అవి ప్రభుత్వ విధానాల్ని ఎదిరించవు అని తెలుసు కాబట్టి, ప్రస్తుతం నిజమయిన వార్తల కోసం ఆంగ్ల జాతీయ వార్తా పత్రికల ను నమ్ముకోవచ్చు.

ఏమయినా, లోకంలో 'అసాధ్యం' అంటూ ఏదీ లేదు. ఎవరు చూడొచ్చారు ? రేప్పొద్దున్న మీ ఐడియాకే రెక్కలొచ్చి - అదిచాలా successful గా రూపాంతరం చెందొచ్చేమో ! భారత దేశం కాస్తో కూస్తో మారుతోంది. I wish you all the very best.

Vinay Datta said...

The idea is wonderful. It may not publish interviews with political heads and celebrities. It can publish the needs of the commons in their own words. Every issue should be elaborately discussed involving the general public in good number. This can help the governments move forcibly towards necessary action and constructive work. The Right To Information Act should be used regularly by this newspaper. Atleast hundred people from the public should participate in making use of this act. It is usually done by individuals. Collective work on this matter can do miracles.Community work should be encouraged.

How are the taxes utilized...non payers of tax...information on why certain regions are not developed...the importance given to farmers...health...these should be given top priority.

@Sutatha:
Do you think all the national newspapers ( english ) are impartial in publishing news? The bosses of most of these newspapers are foreigners.

అర్క said...

ఇంత మంచి ఆలోచనని ఇలా ఇతర సంచలనటపాల మధ్య ఉంచడం బాగాలేదు. సహకారరంగంలో దినపత్రిక అధ్బుతమైన ఆలోచన. తక్కువ ఖర్చుతో
ఇంటర్నెట్ సంచిక తేవచ్చు. ఎవరికి కావాస్లిన వార్తని వాళ్ళ ప్రింటర్ మీద ప్రింట్ చెసుకుంటారు. ఇవాళ ప్రతిగ్రామానికీ ఇంటర్నెట్ సౌకర్యం ఉంది కనుక సరిగ్గా ప్రచారం చేస్తే అందరికీ పరిచయం కావడం పెద్ద కష్టం కాదు.ఆదరణను బట్టి ప్రింట్ ఎడిషన్ సంగతి ఆలోచించవచ్చు. నిజానికి పేజీకి ఇరవై పైసలలోపే ఖర్చయ్యే డిజిటల్ సాంకేతిక నైపుణ్యం ఇప్పటికే అందుబాటులో ఉంది. వెంటనే కార్యరంగంలోకి దిగుదాం. ముందడుగుకు ముందడుగు ఎలా వేయాలో ఆలోచించండి. ఇంటర్ నెట్ ఎడిషన్ చాలా ఆచరణాత్మక పరిష్కారం అనిపిస్తోంది. చేయగలిగిన వాళ్ళు స్వచ్ఛందంగా, లేదా కనీస పారితోషకాలతో ఎవరిచోటునుంచే వారే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు.ఆదాయవ్యయాల గురించి నాకన్నా బాగా తెలిసిన మిత్రులు సహాయం అందిస్తారని ఆశిస్తున్నాను.

మీరు గనుక సహకార రంగంలో ఆన్లైన్ న్యూస్ పోర్టల్ / వెబ్ సైట్ ప్రారంబించాలనుకుంటే , నాతరుపునుండి పూర్తి ఉచితంగా వెబ్ సైట్ చేసి ఇస్తాను .(డొమైన్ , హోస్టింగ్ , సైట్ డెవలపమెంట్ తో సహా)

దీని కోసం ఒక ప్రణాలిక ఆలోచించండి. ఇది క్లిక్ అయితే ఒక వార్తా వార పత్రిక అదీ క్లిక్ అయితే దినపత్రిక ఆలోచించవచ్చు.

Ramu S said...

బండారు శివ గారు...
థాంక్స్ అండి. మీ మెయిల్ అడ్రెస్స్, ఫోన్ నంబర్, వ్రుత్తి వివరాలు ఈ కింది మెయిల్ కు పంపగలరా?

srsethicalmedia@gmail.com

thanks for your response

Ramu

venkata subba rao kavuri said...

web vaara patrika peditae takkuva ibbaamdulato vijayam saadhimcha vachchu. 15 samvatsaraalugaa patrikaa ramgamlo (eenaadu, prajasakti, andhra jyoti, maa teevea) pani caestunna naenu koodaa ee panilo bhadhyatalu teesukumtaanu. naa cell idee 9963427519.

bobby said...

look for "Citizen Journalism". You'll get lot of Sites/blogs doing it worldwide. This can also be created for Telugu people. I can help.. rebachi@gmail.com

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి