భారతదేశంలో అత్యంత ప్రముఖుడైన యోగా గురు బాబా రాందేవ్ కొత్తగా ఒక రాజకీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నట్లు 'హిందూస్తాన్ టైమ్స్' ఈ రోజు మొదటి పేజీలో ఒక యాంకర్ స్టోరీ ప్రచురించింది.
ములాయం, లాలూ, శరద్ యాదవ్ తర్వాత భారత రాజకీయ యవనిక మీద మరొక యాదవ్ ప్రముఖ స్థానం ఆక్రమించబోతున్నారని....రాందేవ్ అసలు పేరు (రామకిషన్ యాదవ్)ను ప్రస్తావిస్తూ ఆ పత్రిక లీడ్ పేరాలో పేర్కొంది. ఆయన అజెండా...
1) టెర్రరిస్టులకు మరణ దండన
2) మన ధనిక స్వాములు దేశ, విదేశాల్లో దాచిన నల్లధనం వెలికితీత
3) మహిళలకు 50 శాతం రిజర్వేషన్
మూడేళ్ళలో తాను రాజకీయ పార్టీ పెడతాననీ, అప్పటి దాకా భారత్ ను బలోపేతం చేసేందుకు రాజకీయ శిక్షకులను తయారుచేస్తానని రాందేవ్ ప్రకటించారట. ఇప్పటికే ఆయన 'భారత్ స్వాభిమాన్' అనే సంస్థను నిర్వహిస్తున్నారు--అవినీతిపై పోరాడుతున్నారు. "మా ఆగమనంతో దేశంలో రాజకీయాల గతి మారిపోతుంది," అని ఆయన ప్రకటించారు.
యోగాతో ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు సాధించిన రాందేవ్ గారి ఆలోచన నాకు పెద్ద ఇబ్బందికరంగా అనిపించలేదు. జయప్రకాశ్, రవిప్రకాష్, రాందేవ్...ఎవరు రాజకీయాలలోకి వచ్చినా మంచిదే. ఇప్పుడున్న సన్నాసి రాజకీయ నేతలకన్నా వీళ్ళు బాగానే చేసే అవకాశం ఉంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే దమ్ము మొదట్లో వీళ్ళకు వుంటుంది.
మరీ హిందూ పిడివాదాన్ని పోషించకుండా...ముస్లిం వ్యతిరేకత విడనాడితే....బాబా రాందేవ్ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో లోక్ సత్తా కు గత ఎన్నికలలో ఓటు వేసిన నేను...ఇప్పుడు రాందేవ్ పార్టీకి ఆ వోటును బదలాయించేందుకు సిద్ధం. మీరేమంటారు?
Wednesday, March 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
19 comments:
ramu gaaru
its unfair to brand Baba Ramdev as anti muslim. No where he made an adverse comment about muslim. Some how I got a feeling that we journalists are tuned to see everything through a negative spectacle. Though I am not a big fan of ramdev I like his attitude towards every aspect of life.
ఈయనకి మతపిచ్చి లేదనుకుంటాను. అలాంటప్పుడు మంచిదే. కానీ నెమ్మదిగా చుట్టూ అతివాదుల కోటరీ ఏర్పడకుండా చూసుకుంటే చాలా మంచిది.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడే దమ్ము "మొదట్లో" వీళ్ళకు వుంటుంది.
అక్షరాలా నిజం.
హహ.. మీలాంటి వారు కూడా ఇలా అలోచిస్తే ఎలా. ఫ్రస్తుత రాజకీయానిపై మీ అవేదన అర్ధం చేసుకోదగినదే కాని అది ఒక తొందరపాటు చర్యకు కారణం కాకూడదు. అప్పుడే మీరు లోక్ సత్తా తో పోలిక మొదలు పెట్టేసారు. ఇప్పటికీ లోక్ సత్తా చెప్పే వాటిల్లో స్పష్టత, నిజాయితీ వుంది.
ఇంకా బాబా రాం దేవ్ చెయ్యాలనుకున్నవాటికి స్పష్టత లేదు. నాకైతే అపరికత్వత కనిపిస్తోంది. 50% మహిళా కోటా ఎలా సాధ్యం. (సుప్రీం కోర్టు తీర్పు వుంది 50% దాటకూడదని, SC/ST కోటా వుంది కాబట్టి అది కుదరదు). మీరు లోక్ సత్తా ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ బిల్లు చూసారా
No hurry, don't conclude, wait....wait... & Watch. :)
Many people thought Chiranjeevi would change everything. But, he did business with seats as usual and could not win power.
Sankar
*హిందూ పిడివాదాన్ని పోషించకుండా...ముస్లిం వ్యతిరేకత విడనాడితే*
ఈ వ్యాఖ్య మీ నర నరాల్లో పేరూకు పోయిన కుహనా లౌకిక మేధావి తనాన్ని సూచిస్తుంది. మొదట హిందువులకున్న పిడి వాదం ఎమిటో మీరు మాకు చెప్పండి. హిందువులు ముస్లిం లను వ్యతిరేకం గా చూసే పనైతె వారు ఇన్ని రోజులు ఈ దేశం లో ఉండెవారు కాదు కదా? అసలికి 85% ముస్లిం లు మతం మారిన వారు అని మీకు తెలుసో లేదో? త్లియక పొతే పేపర్ లో వచ్చినదానిని మీకు పంపిస్తాను. పిడి వాదం ఉంటె గింటె అది ముస్లిం నాయకుల ది. వారి వర్గం లో వారి బాగోగులు పట్టించుకోకుండా కొంతమంది నాయకులు శాశ్వతం గా అధికారం చేలాయిస్తూ ముస్లింలను అణగ త్రొక్కారు. ఉదా|| మైనారిటి పేరు తో విద్యా సంస్తలను స్థాపించి డబ్బున్న వారి దగ్గర బాగా డబ్బులు గుంజి సీట్లనిటి హిందూలకు అమ్ముకునంటారు. ఎవరైనా హిందువులు ముందుకు వచ్చి మీరు బాగా చదువు కోండి, అమ్మాయిలను చదివించండి అని చేపితె చాలు అంటు వంటి వారి మీదకు వివిధ రూపాలలో దాడికి దిగుతారు. ఇవ్వనిటిని వది లేసి మీరు చుమ్మా గా పై వ్యాఖ రాశారు. ఒక వైపు ఆధునిక విద్యలో హిందువులు ముందుకు పోతునంటె మరొక వైపు రాను రాను ముస్లిం చదువు కోవటానికి ముందుకు రావటం లేదు. కావలి వస్తె స్కూల్స్ లో వారి సంఖ్య ఒకసారి మీరు గమనించండి.
----------------------------------------------------------------------
పీడివాదం అనేది లేని ఎకైక మతం హిందూ మతం దానిని మిగతా మతాల వారి పిడివాదం వలన హిందువులు పిడివాదులు కావలసి వస్త్తున్నారు.
రాందేవ్ లాంటి సన్యాసులకు కూడా మీరు కులం పేరు రాయటం మీ అజ్ఞాన్నాన్ని సూచిస్తున్నాది.
iam alos agree withu ramu gar
ఈ విషయంలో మీరు తెగ తొందరపడ్డారు. అవగాహనా లోపం కనిపిస్తోంది. వ్యాయామానికి ఒకటి, రెండు రోగాలు తగ్గొచ్చు. భస్మాలకూ కొన్ని వ్యాధులు పోవచ్చు. రాచపుందు, ఎయిడ్స్ ఇలా సర్వ రోగలనూ తగ్గిస్తాననటం దగా, మోసం తప్ప మరొకటి కాదు. మతోన్మాదుల చాటున మానవ ఎముకలతో మందులు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్న దొంగ బాబా. అలాంటి వాడికి మీలాంటి వారు తొందరపడీ కితాబులు ఇస్తే ప్రమాదం ఇంతిత కాదయ్యా రామా.
ధన్యవాదాలు
వెంకత సుబ్బారావు కావూరి
రాము గారు
దైవత్వంతో సంబంధం లేకుండా,మాయ మర్మమనే మాటలతో మోసపుచ్చకుండా కేవలం మన శారీరక కదలికల, మానసిక ఏకాగ్రతల (యోగా) ప్రతిఫలంగానే మనకు కావల్సిన ఆరోగ్యం సమకూరుతుందని మొట్టమొదట, నిజాయితీగా యోగా నేర్పిస్తున్నవాడు బాబా రాందేవ్.కడుపు కాలు కదిలించకుండ కేవలం భగవంతున్ని ధ్యానించుకుంటూ కూర్చుంటే ఆరోగ్యం సమకూరుతుందని మొసగించే చాలామంది కంటే రాందేవ్ ప్రాక్టికల్.ఎవడికైతే ఈ ప్రాక్టికల్ థింకింగ్ ఉంటుందో మిగతా విషయాల్లో కూడా ఈ ప్రాక్టికల్ ఆలోచనా విధానాన్ని అమలు చేస్తూ ముందుకెల్లగలడు.అయితే మన భారత రాజకీయాలు పూర్తిగా అవినీతి జాడ్యంలో కూరుకుపొయాయి, వీటి చికిత్సకు ప్రాక్టికాలిటితో పాటు నిజాయితీ చాలా కీలకమైన అంశం.ఇప్పటికే ఈ బాబా, మొన్న బీహార్లో వరదలోస్తే-ప్రభుత్వం హెలికాప్టర్ నుంచి జారవిడిచే అన్నం పొట్లాలు పాచిపోయుంటయని, అక్కడిక్కడే వేలకొలది శిబిరాలు ఏర్పాటు చేసి వేడిగా అన్నం, చారు వండి వడ్డించే కార్యక్రమాలు చేసిచూపాడు.ఇలాంటి వ్యక్తి రాజకీయాల్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపడితే ఫలితముండొచ్చు."రాజకీయాలంటే యోగా చేయడం కాదు బాబా" అంటే చేయగలిందేమి లేదు. చూద్దాం బాబా ఏం చేస్తాడో!
నర్సిం
Now it is time for every good and law abiding citizen with moral and human values to enter the politics as the politics has become a proffession and all crimninals,rapists,murderers,scamsters etc are entering politics and becoming MLAs,MPs and ministers to rule us.Let us not bow our head and self respect infront of these leaders of doubtful character.Let us hope more people like Ram dev baba enter politics and clear the pollution of politics and bring the lost glory of politics of pre independent era.But can these good citizens face the crminminalised politics of India today and succeed ass the people are addicted to vote for note and liqour?This is not an easy task but it takes long years to clear
the the existing pollution in politics.
JP.
బాబా రాందేవ్గారిలో లోపాలెంచాలని ఏ విషయమూ దొరక్క ఆయన తయారుచేసే మందులలో మానవ ఎముకలు వాడుతున్నారన్న వాదనను బయలుదేరదీసారు.ఇక ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి ఆయన చెప్పినట్లు ఉగ్రవాదులకు మరణశిక్ష,విదేశాల్లో దాచిన నల్లధనం వెలికితీత వంటి కార్యక్రమాలు అమలుపరిస్తే అది ఇష్టంలేని వాళ్ళు ఆయనను మీడియా అన్నుదన్నుతో రాజకీయ ప్రవేశం ముందే ఆయనను ఎన్ని రకాలుగా తిప్పలుపెడతారో చూడండి ఇకముందు.
What Subba rao kavuri said above is correct. Ramdev claims his yoga prevents cancer, AIDS etc. This is a publicity overdrive. I am not bothered much about his secular credentials. But I do not think he can understand liberal values or think from the view point of minorities. So there are seeds of squalor now itself
జె పి ని ఈయన్ని ఎలా compare చెస్తారు. జె పి ప్రజల సమస్యలని మూలాల వరకు చూసిన మనిషి. ఎదో ఒకటి రెండు మాటలు మట్లాడినంత మత్రాన అంతని వెనుక పరుగెత్తేద్దాం అంటే ఎలా. పైగా ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్ల చదువుకున్న వాళ్ళు, ఆలొచనాపరులు ఓట్లు చీలుతాయి తప్పితే సారా కి, డబ్బు కి ఓటు వేసే వాళ్ళ ఓట్లు మళ్ళీ సంప్రదాయ రాజకీయ పార్టీల కే వెళ్తాయి. నాకయితే ఈయన రాజకీయాల్లొకి రావడం వల్ల వుపయొగం కనబడటం లేదు
బాబా రాందేవ్ ఎంతవరకు సెక్యులర్ అన్నది,ఎంతవరకు మైనర్టీల వైపు నుంచి ఆలోచిస్తాడన్నది ఇప్పటికిప్పుడే తేలే విషయం కాదు, కాకపోతే అతని యోగా పద్ధతి క్యాన్సర్ లాంటి జబ్బుల విషయంలో ఖచ్చితంగా పనిచేసిందని చెప్పగలను.మా అపార్ట్ మెంట్ లో, నా దగ్గరి మిత్రుడైన 35 ఏళ్ల వ్యక్తికి బాగా ముదిరిపోయిన స్తితిలో క్యాన్సరుందని గుర్తించారు.15 రోజుల్లో పోతాడని డాక్టర్లు చెప్పారు. ఈలోగా యోగా చేయమని బాబా రాందేవ్ సీడీ ఇచ్చారు.అతను చాలా దీక్షగా యోగా ప్రాక్టీస్ చేశాడు - ఆ రోజు నుంచి ఆరో నెల చివర్లో చనిపోయాడు.6 నెల్లు బతకగలిగాడు, డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఇది నిజం, నా కళ్ల ముందే జరిగిన సంఘటన. రాందేవ్ యోగాలో ఆ శక్తి ఉంది.ఇది పబ్లిసిటి స్టంట్ ఎంతమాత్రం కాదు. నేను నిజానికి ఈ బాబాలని,మాతల్ని, దేవుళ్లని నమ్మను.ఈ రాందేవ్ గురించి కూడా మాట్లాడుతుందెందుకంటే అతని యోగా రిజల్ట్ ఇస్తుంది కనుక.నేనూ అతని యోగా లాభాల్ని అనుభవిస్తున్నాను .మీరూ అతని యోగా ప్రాక్టిస్ చేసి చూడండి, మీకూ అతనిపట్ల మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇక రాజకీయాల విషయంలో కూడా మంచి రిజల్ట్స్ ఇస్తానంటే ఆహ్వానించడానికి నాకేమి అభ్యంతరం లేదు.
నర్సిం
క్యాన్సర్ తగ్గిస్తుందట... అయితే 6 నెలలకే ప్రాణం పోయిందట....జొక్ బాగుంది.
ధన్యవాదాలు
వెంకట సుబ్బారావు కావూరి
yoga vontiki manchide.. ramdev baba puttaka mundununchi yoga telusu.. yoga phalitalu telusu. patanjali eppudo cheppadu. propagation manchide.. antamatram cheta baba nu nettina pettukovalsina avasaram ledu. evado vastadu manchi chestadu ani inka manam eduru chustunnamante... maro vanchanaku siddam kavadame....avuna kada?
He may not have cure for cancer, I did read at a couple of places that a few exercises can help grow healthy cells that fight the cancer cells and that will extend the life of a patient.
Mr. Kavuri,
Do you have any proof about Ramdev using human bones?
Why he wants to jump in to filth(politics)?
Has he finished his present assignment? Let him clear dirty babas, first. Later he can clean-up politics.
అవును ఆధారాలు వున్నాయి. నిజాలు బయట పడితే మతోన్మాదం మొదలు బీజేపి, దాని అంగాంగాల బతుకు ప్రశ్నార్ధకం అవుతుందన్న భయంతో ఈ బాబా తన అనుయాయులను పొగేసి కాకి గొల చేయించిన వైనం మరచి పోయారా. అయినా బీజేపీ వుండగా ఈ బాబాకు మరొక పార్టీ యెందుకూ ఆలోచిచాలి మనమంతా.
వెంకట సుబ్బారావు కావూరి
I asked you whether YOU have that evidence. If YOU have it, could you please share it with us?
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి