'ఆంధ్రజ్యోతి' అధిపతి వేమూరి రాధాకృష్ణ ఆలోచనా ధోరణిలోనే...ఒక మేజర్ సమస్య ఉందని....ఆదివారం రాత్రి ఆయన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె.' అనే కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ.టీజీ వెంకటేష్ గారిని చేసిన ఇంటర్వ్యూ లో మరొకమారు తేటతెల్లమయ్యింది. మచ్చుకు ఆయన ఈ రాయలసీమ పారిశ్రామికవేత్త కం పొలిటీషియన్ ను అడిగిన ఈ రెండు ప్రశ్నలు చూడండి.
1) మామూలుగా...మీ వాళ్ళు (వైశ్యులు) ఆంధ్రా, తెలంగాణా లతో పోలిస్తే...రాయలసీమ లో కాస్త మంచి రంగు లో ఉంటారు? ఇది మీరు గమనించారా? దీనికి కారణం ఏమిటి?
2) సహజంగా..మీకు (అంటే...వెంకటేష్ కులపోళ్ళకు) ధైర్యం తక్కువన్న అభిప్రాయం ఉంది. దానికి భిన్నంగా మీకు ధైర్యం ఎక్కువ. మీకు ఈ తెంపరితనం ఎక్కడి నుంచి వచ్చింది?
వారి యబ్బ...ఇవేమి ప్రశ్నలు అన్నయ్యా? ఆయన రాధాకృష్ణ ఎందుకు అయ్యారంటే....ఇలాంటి ప్రశ్నలు ఎలాంటి అదురూ బెదురూ...మొహమాటం లేకుండా కాజువల్ గా అడుగుతారు కాబట్టే. ప్రాంతాలబట్టి రంగులుంటాయని, అంతేకాకుండా...కులాల వారీగా రంగులుంటాయని ఆర్కే మనసులో పడిపోయింది. అదంతే.
ఈ మొదటి ప్రశ్న అడగ్గానే మన సారు మరొక బ్రహ్మాండం బద్దలయ్యే సబ్ ప్రశ్న గుంజుతారని నేను అలెర్ట్ అయిపోయి చెవులు రిక్కరించి విన్నా. ఎందుకో విషయం అక్కడే వదిలేశారు. ఇది అడుగుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో మెరుపు, మాటల ధోరణి చూస్తే...తాను ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని కనుక్కున్నానన్న తృప్తి, ఆనందం కనిపించాయి. "ఇది మీరు గమనించారా?" అని ఒకటికి రెండు సార్లు ఆర్కే అడగారు.
ఇంకొక సందర్భంలో వెంకటేష్ గారు పొలిటీషియన్ రసూల్ గారి గురించి మాట్లాడుతూ..."ఆయన కమ్యునల్ గా వ్యవహరించారు," అనంటే...రాధాకృష్ణ...."ఆగండాగండి...అయన ఒక్కరేనా? ఆ పార్టీ వాళ్ళు అందరూ అంతేనా?" అని కూడా అడిగారు.
సారు...కులాల గురించి...ఆలవోకగా ప్రశ్నలు సంధిస్తూ ప్రోగ్రాం ను సాగించారు. కానీ...ఒకందుకు ఒప్పుకోవాలి. ప్రశ్నలు మెరుగు పడుతున్నాయి. గతంలో మాదిరిగా....మోచెయ్యి గీరుకుంటూ....."యహ...చెప్పు....నువ్వు యవ్వనంలో ఉన్న రోజుల్లో...ఎవరితోనో తిరిగి ఉండడమో, మనసు పారేసుకోవడమో చేసి ఉండాలి కదా. దాని గురించి చెప్పేహ..." అని ఇంటర్వ్యూ లలో ఈ మధ్య అడగడం లేదు. ఇది రాష్ట్ర ప్రజలకు మంచి పరిణామం. మనుషులం మనుషులుగా రాటు తేలాలంటే....కొంత టైం పడుతుంది మరి.
వెంకటేష్ గారిని తన కులపోళ్ళ రంగు గురించి అడిగినా, లక్ష్మీ పార్వతి గారిని..."మరి గర్భం ఎందుకు రాలేదు?" అని అడిగినా అది మన వేమూరి రాధాకృష్ణ కే చెల్లింది. కానీ బ్రదర్....దంచుకో. మన జర్నలిజం, మనిష్టం.
Monday, April 5, 2010
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
*సహజంగా..మీకు (అంటే...వెంకటేష్ కులపోళ్ళకు) ధైర్యం తక్కువన్న అభిప్రాయం ఉంది. *
ఆ రెండు వర్గాలు తెలుగు సినేమాలు చూసి అలా అనుకుంట్టుంటారు. వైశ్యులు కష్టపడి పని/వ్యాపారం చాలా క్రమశిక్షణ తో చేస్తారు. వ్యాపార రంగం లో దూరిన ఆ రేండు వర్గాలు వ్యాపారం లో ఎక్కడ ప్రొఫెషన్లిసం అనేదే లేకుండా రాజకీయ పార్టీల అండదండలతో వ్యాపారం/కాంట్రక్ట్ పేరుతో దోచుకుంట్టున్నారు. ఈ వర్గాల వారిలో రాజకీయ పార్టిలు అండలేకపోతే అధిక శాతం వ్యాపారాలు కుప్ప కూలేవి. ఎందుకంటె వీరికి వ్యాపారం చేయటం అంటె పరోక్షం గా రౌడీజం చేయటం. మరి వైశ్యులు ఇన్ని తరాలుగా వ్యాపారం చేస్తున్నా ఎంత పోటీ ఉన్నా రౌడియిజం చేయలేదు, ఇది వారికి ఉన్న ఓపికా,విషన్, కమిట్మేంట్ లను సూచిస్తుంది. ఒక్క పత్రికా రంగాన్ని తీసుకుంటే ఈయన వర్గం 30సం|| లలో ఉన్న పేరు పోగొట్టుకొని జైల్ చుట్టు తిరుగుతున్నారు. జనం చేత ఇప్పటికే మీడీయా అంతా చీకొటుడుతున్నా, దున్న పోతు మీద వానలా, లెక్క చేయక పోవటాన్ని ఆయన దీనిని ధైర్యం అనుకుంట్టున్నాడేమొ మరి.

very well. what is this " vaari Abba" epithet in this blog. strange that you used abusive terms in your blog
To the anonymous above:
If radhakrishna asks some nonsense questions, why are you targeting those two castes?
There are professionally run business' by vysyas,kammas,reddi's and others. There are shabby business run by all the above castes.
If radhakrishna asks some shabby questions why are you targeting those two castes? There are professionally run business by vysyas,kammas, reddis. At there same time thre are unprofessionally run business by all the above castes. Please control your itch
వేమురి కి సరిగ్గా చరిత్ర తెలిసినట్లు లేదు అసలికి ఆ వర్గం లో వారికే ధైర్యం బాగా ఉంది ఒక గాంధి, రాం మనోహర్ లోహియా, పొట్టి శ్రీరాములు ఇలా ... మిగతా వాటిలో ధైర్యం లేక పోగా ఉందని తెగ ఫిలౌతుంట్టారు. వీరి ధైర్యం వీరి ఊరిలో/వీధి వరకు మాత్రం పరిమితం. నిరంతరం వేరొకరిని పైకి రానికుండా అడ్డుపడటాని ఆయన ధైర్యం అని అనుకునంట్టున్నాడు. వారికి తెలిదేమొ ఇటువంటి ధైర్యస్తులంతా తెల్ల వాడి మీద యుద్దం చేయక పోగా వాడు మనలను పాలిస్తున్నాడు అనే స్ప్రుహ కూడా లే కుండా భుస్వామ్యులు తెల్ల వాడి అడుగులకు మడుగులొత్తారు. వీరికి జమిందారులుగా,సామంత రాజులుగా ఉండి బీద బిక్కి ప్రజల మీద ప్రతాపమును చూపటానికి ఉన్న ఉత్సాహం మిగతా వాటిమీద ఉండెవి కావు. దీనిని ధైర్యం కాదు అనేది దౌర్జన్యం. ధైర్యం అంటె ఒక తిలక్, గాంధి, సుబాస్ చంద్ర బోస్, సర్దర్ పటెల్ లాంటి వారిది. ప్రజలలో ఇంత చైతన్యం వస్తున్నా ఈ రేండు వర్గాల వారే ఆంధ్రా ని ఏలడానికి అర్హులనుకునంట్టున్నారు. పేపర్ ని అడ్డంగా పెట్టుకొని వీరు చేసిన మోశాన్ని ప్రజలు బాగా గుర్తించారు. ఇప్పుడు వారిలో వారే నెత్తిన మట్టి చల్లు కుంట్టున్నారు.

పై అనానిమస్ కి,
ఎదుటి కులాన్ని ఆడి పోసుకోవటం కూడా కుల తత్వమే. గాంధీ జీ, పొట్టి శ్రీరాములు, లోహియా పుట్టిన కులం లో ఇలాంటి కుల పిచ్చ గాళ్ళు ఎలా పుడతారో అర్ధం కాదు.
*ఎదుటి కులాన్ని ఆడి పోసుకోవటం కూడా కుల తత్వమే. గాంధీ జీ, పొట్టి శ్రీరాములు, లోహియా పుట్టిన కులం లో ఇలాంటి కుల పిచ్చ గాళ్ళు ఎలా పుడతారో అర్ధం కాదు.*
మీకు ఆడి పోసుకుంట్లు గా అనిపిస్తుంది కాని ఉన్న మాట అంతే అంత ఉలుకు ఎందుకు. గత 30సం|| ల నుంచి ఆ రేండు కులాల వారి పోటి వలన మీకులాభిమానం ఉన్మాద స్థాయికి చేరింది. కుల పిచ్చి లేని వారు కూడా ఈ ఉన్నాదుల వలన ఆత్మ సం రక్ష్నార్థం కొరకు అంతో ఇంతో కులాభిమానం నెత్తికెత్తు కోవలసి వస్తున్నాది. రోశయ్య వైశ్యుడు కనుక ఆయన పాలించ లేడని, ఆయన వచ్చిన తరువాత వరదలు,తెలంగాణా గొడవలు మొ|| వచ్చాయి కనుక ఆయనది లక్కీ హాండ్ కాదని గాసిపులు ప్రజలలోకి వ్యాపింప చేయటం చూస్తునే ఉన్నాం.
--------------------------
ఆంధ్రా వాళ్ళు వ్యాప్రాన్ని ప్రొఫెషనల్ గా నడపటమా!! నాకు అలా నడిపెవారి వివరాలు తెలియజేస్తే ఆనందిస్తాను. నా వరకు 98% రాజకీయా పార్టీల మద్దతుతో /సహాయ సహకారాలతో వ్యాపారం చేస్తారని భావిస్తాను.
నా అదృష్టమో, దురదృష్టమో తెలియదు కాని ఇక్కడ బెంగుళూరులో ఒక్క తెలుగు న్యూస్ చానెల్ కూడా రాదు.
ఇంతవరకు నేను ప్రభు చావ్లా (ఆజ్ తక్ లో సీధీ బాత్) మాత్రమే పరమ చెత్త ప్రశ్నలు అడుగుతాడని అనుకునేవాణ్ణి.
మీ టపా చదివాకా అంతకంటే చెత్తగా అడిగేవాళ్ళున్నారని తెలిసింది.
vasthuvu lanu ammukune vaaru vyaaparulu daniki nizayiti kaavaali. valllu ammikune varu ade dairyam anukunte yala
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి