Monday, April 12, 2010

రచ్చంతా చూపి...మీడియాపై టీవీ ఛానెల్స్ చర్చ!!

మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందట ఒక అమ్మడు. అలాగుంది మన తెలుగు ఛానెల్స్ వ్యవహారం. ఆయేషా-షోయబ్-సానియా ల వ్యవహారాన్ని అన్ని ఛానెల్స్ పోటీ పడి మరీ చూపించాయి. తీరా వీళ్ళ పెళ్లి అయ్యేసరికి..."అసలీ వ్యవహారం పై మీడియా ఇంత రచ్చ చేయడం ఇంత అవసరమా? హమ్మా..." అని చర్చ మొదలుపెట్టాయి. రెండు వైపులా పదునున్న కత్తులు సుమండీ...


ఐ-న్యూస్ లో చాలా సార్లు బాగుండే ప్రోగ్రాం హార్డ్ కోర్ న్యూస్. అంకం రవి అనే జర్నలిస్టు మంచి టాపిక్స్ మీద ఈ చర్చ జరుపుతారు. TV-9 సహా అన్ని ఛానెల్స్ సానియా పెళ్లి, విందు మీద దృష్టిపెట్టి....తాజ్ క్రిష్ణ ముందు నానా చావులు చస్తుంటే...రవి మీడియా ఓవర్ యాక్షన్ మీద చర్చ జరిపాడు. 

ఇందులో పాశం యాదగిరి, డాక్టర్ నాగేశ్వర్ తో పాటు సిటిజెన్ జర్నలిస్టు ఉమా గారు పాల్గొన్నారు. ఈ ముగ్గురూ....మీడియాను ఏకి పారేశారు. మన తోలుమందం మీడియా బాస్ లు ఇది చూసి మారతారనీ, సిగ్గూ ఎగ్గూ మళ్ళీ తెచ్చుకుని ప్రవర్తిస్తారని అనుకోవడం అమాయకత్వం. 

కాకపోతే...మొట్టమొదటి సారిగా...ఈ అంశంపై మీడియా కవరేజ్ గురించి ప్రజలు ఏమని అనుకుంటున్నారో...ఐ-న్యూస్ వాళ్ళు చూపించారు. అందుకు వారిని అభినందించాలి. 

zee- 24 gantalu లో కూడా ఎనిమిది గంటల ప్రాంతంలో మీడియా పై ఒక చర్చ జరుపుతామని బ్రోమో చూపితే పనులు అన్నీ ముగించుకుని....టీ.వీ.ముందు కూచుంటే..కరెంట్ పోయింది. బహుశా ఆ ఛానల్ కూడా ఘాటుగానే దీనిపై చర్చ జరిపి ఉంటుంది. నిజంగానే మీడియా ధోరణిపై ఆవేదన చెంది వీరు ఈ కార్యక్రమాలు జరిపి వుంటే....వీరిని అభినందించవచ్చు. 


నిజానికి సానియా విషయంలో....ఈ రెండు ఛానెల్స్ కూడా ఆ మ్యాడ్ రేసులో పాల్గొనకుండా...భిన్నంగా వ్యవహరించి వుంటే...ఈ చర్చలకు ఒక అర్థం ఉండేది. TV-9, N-TV, TV-5, ABN అంత ఓవర్ యాక్షన్ ఈ రెండు ఛానెల్స్ చేసినట్లు లేవు.  అయినా..భుక్తి పెట్టే టీ.ఆర్.పీ. గొడవ సంగతి చూసుకోవాలి కాబట్టి...ఇవి కూడా సానియా పెళ్ళికి పెద్ద పీటే వేసాయి. నిరుపమ అక్కలా కాకపోయినా...ఈ ఛానెల్స్ విలేకరులు కూడా...శక్తివంచన లేకుండా వివిధ కోణాలను చూపే ప్రయత్నం చేశారు. 


అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే...ఎక్స్ క్లూసివ్స్ దగ్గర. TV-9, ABN-AJ వాళ్ళు ఈ కేసులో ఎక్స్ క్లూసివ్స్ విషయంలో కక్కూర్తిగా వ్యవహరించారు. వేమూరి గారి ఛానల్ మనుషులు మరీ...మాటి మాటికీ...'పక్కా సమాచారం తో...పెళ్లి ఒంటిగంటకు అని ముందే చెప్పాం..." అని బాకా కొట్టుకున్నారు. వాళ్ళు ముందే చెబితే...మిగిలిన ఛానెల్స్ ఖండించాయని కూడా చెప్పుకున్నారు.

ఇలా మీడియా తలతిక్కలగా వ్యవహరించే పరిణామాలు జరిగినప్పుడు...ప్రధాన ఛానల్ రిపోర్టర్ లను, కెమెరా మెన్ లను ఒక గదిలో వేసి బంధిస్తే...బాగు. వీళ్ళు ఈ పిచ్చి కుక్కల రేసు ప్రారంభించకపోతే...మిగిలిన ఛానెల్స్ కూడా పట్టించుకోవు. ఛానెల్స్ బాసులూ...మొత్తానికి వాళ్ళ పెళ్లి రిపోర్టర్ ల, కెమెరామెన్  చావుకు వచ్చింది. ఇప్పటికైనా అటు వాళ్ళకు, ఇటు వీళ్ళకు సంసారాలు చేసుకునే...వెసులుబాటు కల్పించండి. లేకపోతే..కొంపలు కొల్లేరయ్యే ప్రమాదం ఉంది. 

11 comments:

kvsv said...

వూళ్ళో పెళ్ళికి **** హడావిడి అంటారు..అలా వుంది..ఇక జగన్ గారి టూర్ సాక్షి లో చూడలేక చస్తున్నాం, ఎంత వాళ్ళ పెట్టుబడి ఐనా చూడాల్సింది జనాలు కదా...

Anonymous said...

ABN AJ has shown opinions of a few citizens, young and old, on Sunday morning in their programme 'coffee with kantham'.All those citizens expressed their anguish over the over enthusiasm of the entire media. They said that we have enough problems to focus on.The channel which is first in the worst race ..bradcasting this programme is the irony.

Saahitya Abhimaani said...

ఈ చానెళ్ళన్ని కూడా ఒక చానేలు మరొక చానేలు వార్తలు ఎలా సేకరిస్తోంది అని స్టింగ్ ఆపరేషన్లు చెయ్యటం మొదలుపెడితే కాని ఈ జాడ్యం మరింత వెర్రెక్కి నశించదు.

లేదా మరొక చక్కటి బిజినెస్ ఆలోచన. ఎవరైనా కోటీశ్వరుడు ఒక చానెల్ పెట్టి, అందులో మరేమీ చూపకూడదు, మిగిలిన చానెళ్ళు చేసే అకృత్యాలు, వాళ్ళ ఓవర్ ఏక్షన్, రిపోర్టింగు పేర కొంతమంది డబ్బులు ఎలా దండుకుంటున్నారు మీద స్టింగు ఆపరేషన్లు చేయటం మొదలెట్టాలి. ప్రస్తుతం న్యూస్ చానెళ్ళ మీద ఉన్న ఆగ్రహం, అసహ్యం వల్ల ఈ కొత్త చానెల్ కి టి ఫై ఆర్ రేటింగు అద్భుతంగా(!!!) ఉండే అవకాశం ఉన్నది.

నా ఇంటి చుట్టూ మా ఇంట్లో జరిగే కార్యక్రమానికి అదీ మా అమ్మాయి పెళ్లి విషయంలో ఇలా **ల్లా విలేఖరులు కెమెరాలు తీసుకుని మూగితే, ఏమైనా కాని వాళ్ళందరినీ చితక్కోట్టించే వాణ్ని అంతేకాని సానియా సిగ్గులేని తండ్రిలా ముసి ముసి నవ్వులు నవ్వుతూ తిరిగే వాణ్ని కాదు.

సుజాత వేల్పూరి said...

పిచ్చి కుక్కలైనా కొంత దూరం తరిమి విసుగేసి వీధి చివర్లో ఆగిపోతాయి. అంతకంటే ఘనులే ఇక్కడుంది.

అసలు నవగ్రహాల పెట్టు అయిన ఒక ప్రధాన ఛానెల్ చేసిన హడావుడితో మిగతా ఛానెల్స్ పోటీ పడలేకపోయాయి. ఒక పక్క దంతెవాడ రక్తం వెచ్చగా ప్రవహిస్తున్న సమయంలో, మిగతా ఛానెల్స్ అదే వార్తను చూపిస్తున్నా "ఇంట్లో ఒక పక్క పిల్ల పెళ్లవుతోంటే ఈ చావు కబుర్లేంటి" అని విసుక్కున్నట్లు, వీళ్ళు మాత్రం షోయబ్ బట్టల బిల్లు ఎంతయిందో, ఎప్పుడెప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటాడో చెప్తున్నారు.

టీవీ పెట్టాలంటే భయం, సానియా సానియా అని ఎక్కడ పట్టుకుంటారో అని! ఎవరండీ ఈమె, దేశమాతా,స్వాతంత్ర సమర యోధురాలా?

మీరు చెప్పిన కార్యక్రమం చాలా రిలీఫ్ ని ఇచ్చింది!

శివ ప్రసాద్ గారు చెప్పినట్లు ఒక ఛానెల్ మొదలవ్వాలి.
ఆవిడ నిశ్చితార్థానికీ వీళ్ళు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

కొన్నాళ్ళకి "ఎలక్ట్రానిక్ మీడియా"అనే మాట వింటేనే పగలబడి నవ్వే రోజులు వస్తాయి చూస్తుండండి.(సినిమాలో బ్రహ్మానందం కనపడగానే నవ్వొచ్చినట్లు)

Saahitya Abhimaani said...

పాపం బ్రహ్మానందాన్ని ఎందుకు అవమానిస్తారు ఈ వెర్రి మీడియాతో పోల్చి.

sri said...

g 24 gantalu, inews channels ki live vehicles levu..anduke revers lo vellaru...oka vela vunte vallu sania news kakunda emisthiro cheppamanadi...andaru anthe...copy kings....different kosam try chese paristhithi chanels ku ledu... chuse opika viewers ki ledu..public mind marithe anni correct gane vasthayi brother..

satya

kvsv said...

నేను 5 లేదా 6 వ తరగతి చదూతు ఉన్డేటప్పుడు[75-78ల మద్య అనుకుంటా] vizag లో సీతమ్మదార వెళితే అక్కడి ఈనాడు వారి బిల్డింగ్ బయట నిలబడి చూస్తూ వుండిపోయేవాణ్ణ్..అక్కడే ఈనాడు ప్రింట్ అయేది ..చెప్పలేని ఫీల్ వుండేది[? passion}.జర్నలిసం అంటే..ఇప్పుడు పేపర్ చూస్తే చాలు irritation మొదలయిపోతుంది..టివి న్యూస్ చూడ్డమ్ మానేశా..ఈ మద్య జగన్ గారి ప్రసంగాలు వినడానికి మాత్రం సాక్షి చూస్తున్నా..very entertaining..మిమిక్రీ కూడా చేసుకోవచ్చు బాత్ రూంలో..

Anonymous said...

శివగారు, మ౦చి ఆలోచన.

అసలు మీడియా బ్రష్టు పట్టట౦ వల్లే సమాజ౦ నాశనమై పోతో౦డి. అపరిపక్వ, అత్రగాళ్ళ౦తా బాధ్యతాయుతమైన జర్నలిస్టులుగా మారితే ఇలాగె వు౦టు౦ది.

Vinay Datta said...

Desa Maatha and Freedom Fighter have never been given such importance. Last night there was a repeat programme on Zee 24 hrs. The anchor rightly asked the guests..Sania never reached even quarter finals in any match, recently she lost many tournaments and Shoaib has been banned from playing for 1 yr....Why didn't the media not focus on this? Why should they be given such importance?

Out of the answers a guest had given in the programme was true.He said that Shoaib, a foreigner, had challenged in India through the Indian media that he would prove wrong the integrity of an Indian girl and put her to humiliation. This lead to the police case and finally he stooped only to prove himself fraud.

Rajendra Devarapalli said...

(ఇంతకు ముందు ఎక్కడో ఈ కామెంటురాసా అయినా సరే మళ్ళీ)కేంద్రప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని,అనుమతి కొరకు ఎదురుచూస్తున్న ఆ పద్నాలుగు(14)ఛానళ్ళూ వచ్చాక కదా కధ మరింతపసందుగా ఉండేది?? !!! :)

Anonymous said...

sri garu zee 24gantalu i news gurinchi live vehicles levu ani rasaru...papam ayanaku live vehicles ante ela untayo teliyademo...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి