ఒక పక్క...ఓల్డ్ సిటీ అల్లర్లు దేశవ్యాప్తంగా అందరినీ వణికిస్తుంటే...N-TV చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు ఒంటిగంట ప్రాంతంలో ఒక ముస్లిం మత పెద్ద మౌలానా ససిరుద్దిన్ ను ఆ ఛానల్ క్రైం రిపోర్టర్ సూరజ్ చేసిన ఇంటర్వ్యూ ను ప్రసారం చేసింది. ఇది అభ్యంతరకరంగా, మత కలహాలను రెచ్చగొట్టేదిగా ఉంది.
అల్లర్ల కారణంగా శుక్రవారం ప్రార్ధనలు ఇళ్లలోనే జరుపుకోవాలని....కొందరు మత పెద్దలు ఎంతో బాధ్యతతో సూచించారు. సీనియర్ పోలీసు అధికారులు తెరవెనుక కృషి చేయడం వల్ల ఆ ప్రకటన సాధ్యమయ్యింది. ఆ నిర్ణయాన్ని కౌంటర్ చేస్తూ...ఈ మౌలానా గారు రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ఈ సమయంలో ఇలాంటి ప్రకటనలు....ప్రసారం చేయడం దారుణం. ఇంకొక పని లేకుండా మతాల మధ్య చిచ్చుపెడుతూ బతికే హిందూ, ముస్లిం మత పెద్దల, నేతల వ్యాఖ్యలు ప్రసారం చేయవద్దని ఈ ఛానెల్స్ కు వినమ్రంగా అర్ధిస్తున్నాం. అయ్యా....ఇక్కడి ప్రభావం చాలా చోట్ల పడే అవకాశం ఉంది. చాలా పల్లెలలో శాంతి సైతం దెబ్బతినే అవకాశం ఉంది. దయచేసి అర్ధం చేసుకుని...కాస్త బాధ్యతతో మెలగండి.
రూల్స్, గీల్స్ పట్టని మీకు ఎందుకైనా మంచిదని ఇక్కడ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా media కోసం విడుదల చేసిన నియమావళిని ఇస్తున్నాం. గుజరాత్ అల్లర్ల తర్వాత ఇది విడుదల అయ్యింది.
మత కల్లోలాల విషయంలో మీడియా జాగ్రత్తగా ఉండాలన్న కనీస స్పృహ ప్రధాన తెలుగు ఛానెల్స్ కు కొరవడడం దురదృష్టం. అభ్యంతరకరమైన దృశ్యాలను చూపిన March 30 నాడు ఆయా ఛానెల్స్ రేటింగ్స్ ఇలా ఉన్నాయి.
Channel------ March 23----- March 30
TV-9------------- 13-------------- 63
NTV------------- 8---------------- 21
Sakshi--------- 2-----------------18
(Note: The above figures are the GRPs in Hyderabad Market C&S 15 + all sections)
ఛానెల్స్ పెను పోకడపై బాధ పడుతున్న ఒక ఛానల్ హెడ్ ఈ రేటింగ్స్ పంపారు. వారికి థాంక్స్. అధిక సంఖ్యాక ప్రజలను ఆకర్షించేందుకు....ఛానెల్స్ ఛీప్ ట్రిక్స్ కు పాల్పడడం దారుణం. ఇది ఇప్పటికే రాష్ట్రాన్ని కుదిపిన సంక్షోభానికన్నా ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఛానల్ హెడ్స్ సొంత లాభం కొంత మానుకుని....జన హితం కోసం పాటు పడాల్సిన సమయం ఇది.
రూల్స్, గీల్స్ పట్టని మీకు ఎందుకైనా మంచిదని ఇక్కడ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా media కోసం విడుదల చేసిన నియమావళిని ఇస్తున్నాం. గుజరాత్ అల్లర్ల తర్వాత ఇది విడుదల అయ్యింది.
*The role of media in such situations (Gujarat Carnage/Crisis) is to be peacemakers and not abettors, to be troubleshooters and not troublemakers.
*Let the media play their noble role of promoting peace and harmony among the people in the present crisis in Gujarat. Any
trend to disrupt the same either directly or indirectly would be an anti-national act.
*There is a greater moral responsibility on the media to do their best to build up the national solidarity and to recement the communal harmony at all levels remembering the noble role they had
played during the pre-independence days.
రక్తపాతం సాక్షిగా టీ.ఆర్.పీ.రేటింగ్స్ పెంచుకుంటారా?
మత కల్లోలాల విషయంలో మీడియా జాగ్రత్తగా ఉండాలన్న కనీస స్పృహ ప్రధాన తెలుగు ఛానెల్స్ కు కొరవడడం దురదృష్టం. అభ్యంతరకరమైన దృశ్యాలను చూపిన March 30 నాడు ఆయా ఛానెల్స్ రేటింగ్స్ ఇలా ఉన్నాయి.
Channel------ March 23----- March 30
TV-9------------- 13-------------- 63
NTV------------- 8---------------- 21
Sakshi--------- 2-----------------18
(Note: The above figures are the GRPs in Hyderabad Market C&S 15 + all sections)
ఛానెల్స్ పెను పోకడపై బాధ పడుతున్న ఒక ఛానల్ హెడ్ ఈ రేటింగ్స్ పంపారు. వారికి థాంక్స్. అధిక సంఖ్యాక ప్రజలను ఆకర్షించేందుకు....ఛానెల్స్ ఛీప్ ట్రిక్స్ కు పాల్పడడం దారుణం. ఇది ఇప్పటికే రాష్ట్రాన్ని కుదిపిన సంక్షోభానికన్నా ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఛానల్ హెడ్స్ సొంత లాభం కొంత మానుకుని....జన హితం కోసం పాటు పడాల్సిన సమయం ఇది.
4 comments:
"ఛానెల్స్ పెను పోకడపై బాధ పడుతున్న.."
ఇక్కడ ’పెడపోక” అనాలి కదా ? పెను అంటే పెద్ద అని !
ముందు అన్ని టీవీ చానల్స్ ని ఆపివేయాలి ఇలాంటి అల్లరులు జరిగినప్పుడు.....ఎందుకంటే టీవీ heads కి విచక్షణ తెలియదు కనుక .
The police should have booked a case against the channel. The hard work of the police should not go waste.
I have never seen a news bulletin being telecasted in Vanita channel. But, they telecasted this interview on Vanita channel also... that too just before the afternoon prayer time. I really felt that Mr Narne should be prosecuted on criminal charges for provoking communal riots.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి