TV-9 లో అపుడప్పుడూ...బంపర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో..."కులం సంకెళ్ళు తెంచేద్దాం" అని ఒక ప్రకటన లా వస్తుంది.అలాగే..."కట్నం తీసుకున్న వాడు గాడిద" అని కూడా వస్తుంది. ఈ రెండూ చూసినప్పుడు...కులాన్ని అడ్డంపెట్టుకుని వృత్తిలో ఎదిగి...కట్నం బాగా కొట్టేసి వడ్డీ వ్యాపారం చేస్తూ...అదే ఛానల్ లో ఉజ్జోగం చేస్తున్న ఒక మిత్రుడు చటుక్కున గుర్తుకు వస్తాడు. సమాజోద్ధరణ ప్రకటనలు చూడడానికి, వినడానికి బాగుంటాయి. అసలు కథ ఏమిటంటే....
ముఖ్యమంత్రి కులానికి చెందిన ఒక జర్నలిస్టుని....మన రవి ప్రకాష్ గారు ఈ మధ్య ఉన్నపళంగా హైదరాబాద్ బదిలీ చేసి...సీ.ఎం.బీటు వేసారు. అప్పటి దాకా వై.ఎస్. బీటు చూసిన మురళీక్రిష్ణ అనే రిపోర్టర్ ను పక్కన బెట్టి సీ.ఎం. కులం జర్నలిస్టుకు రవి పెద్దపీటవేయడం పై మీడియా పరిశ్రమలో చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి.
రవి బాబు ఈ కులం కార్డు వాడడానికి కారణం....రోశయ్యను ప్రసన్నం చేసుకోడానికి అని కొందరు, మురళీకృష్ణ కు చెక్ పెట్టడానికని మరికొందరు చెబుతున్నారు. రోశయ్య వర్గం వారి కోరిక మీదనే రవి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా అంటున్నారు. నిజానిజాలు మనకు తెలియవు....ఆ సాయి రాముడికే తెలియాలి. ఎంత నీతివంతమైన జర్నలిజం చేద్దామన్నా....ఇలాంటి వార్తలకు అధికారిక వివరణ దొరకడం కష్టంగా ఉంది.
మురళీకృష్ణ ది వై.ఎస్.ఆర్.గారి కులం కాకపోయినా....చాలా బాగా పనిచేసారు. వై.ఎస్.ను గొప్పగా చూపించే ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని కూడా అతను నడిపాడు. అమాంబాపతు జర్నలిస్టులు...కూచుని...వై.ఎస్.ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు భ్రమ కలిగించే పక్కా మ్యాచ్ ఫిక్సింగ్ ప్రోగ్రాం అది అని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సీఎం కులపు రిపోర్టర్ సాయంతో ఆ తరహా ప్రోగ్రాం పునః ప్రారంభిస్తారేమో చూడాలి.
ఇప్పుడు...టీ.వీ.-నైన్ లో సీ.ఎం.బీటు చూడడానికి ఊడిపడ్డ రిపోర్టర్ సామర్ధ్యాన్ని కూడా శంకించడానికి వీలు లేదు. అతను...సూటి మాటలతో, సూటిపోటి మాటలతో...వ్యవహారాన్ని టీ.వీ.కి అనుకూలంగా గెలికి, వెలికితీసి, విశ్లేషించే దమ్ము ఉన్నవాడే. రవి కర్మాగారంలో రాటు దేలిన జర్నలిస్టు.
అయినా...సీ.ఎం.బీటు కు ఆయన కులం వాడిని వేయడం తప్పు అని వాదించడం...ఉడుకుమోతు తనమే. మన ఛానల్ కు కావలసిన ప్రకటనలు, ఎస్.ఈ.జెడ్. వ్యవహారాలు, చిన్నా చితకా పనులు చేయించుకోవడానికి ఏర్పాటు ఉండడం తప్పు ఎలా అవుతుంది? కాకపోతే...."కులం సంకెళ్ళు తెంచేద్దాం," అన్న యాడ్ ను తెసేయ్యడమో...."కులాన్ని బలం గా వాడుకుందాం..." అనో మార్చడమో చేస్తే బాగుంటుంది. 'మెరుగైన సమాజం' కోసం చేసే ప్రయత్నంలో చిన్న చిన్న సవరణలు చేసుకోవడం తప్పా!?
Thursday, April 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
TAM RANKINGS FOR THE WEEK 28-3-2010 to 3-4-2010 *(corrected)
1. TV9 49.86
2. TV5 25.12
3. NTV 19.38
4. ETV2 14.91
5. SAKSHITV 12.34
6. I NEWS 9.04
7. ZEE24 9.04
8. ABN AJ 7.99
9. HMTV 7.65
10. STUDIO N 5.96
11. MAHAA TV 3.75
12. GEMINI 1.43
Correct ga chepparandi... Cheppevi Sriranga neethulu doorevi avevo annattundi tv9 theeru. Neethulu eduti variki cheppadanike gani manam follow avvadaniki kadannattu behave cheyadam sadaru channel ki mundu nunchi vunna alavate kada...
నిజమేనండీ మురళీకృష్ణ ఏమైనట్టూ???
Murali krishna is the best among all the reporters of TV9 who has got command over the subject,the people and himself.Ravi prakash is a MEDI PANDU and every one knows about him and his way of earning money through various means and routes through electronic media.
The only best and lucrative business in these days is media business as any one is afraid of even an attender of a media house as he can create problems to any one at any time if he is not happy with any one and this the power of media personnel.Any one to save from these vultures?
రాము అన్నయ్యా
నేను 1990 లో ఒక స్ట్రింగర్ గా మొదలై ఈనాడు లో చేరి 600 రూపాయల వేతనంతో హైదరాబాద్ లో బతికి నా తండ్రి రిటైర్ అయిన తర్వాత నా తల్లి తండ్రులను ఇక్కడికి తీసుకొచ్చి నెల చివరలో అప్పు తేకుండ సరిపోను జీతం సంపదించడానికి ఇరవై సంవత్సరాలు కష్ట పడ్డాను. మధ్యలో నెను కూడ మురళిక్రుష్ణ చేసిన సి ఎం కార్యక్రమంలొ ఒక అర డజను సార్లు పాల్గొన్నాను. నేను ఒక జర్నలిస్ట్ గా నిల దొక్కుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకు నా తల్లితండ్రులకు మాత్రమే తెలుసు. ఎంత సులువుగా 'అమాంబాపతు జర్నలిస్టులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని అనేసావన్న. ఈ పద ప్రయొగం పట్ల నేను పూర్తి నిరసనను తెలియచేస్తున్నాను. చాల బాధాకరం. బాధ్యతారహితంగా ఆ పదాన్ని వాడావనిపిస్తొంది.
మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని కూడ అన్నావు. నేను చూసినంత వరకు ఆ కార్యక్రమంలో ప్రశ్నలు అడగాడానికి ఏనాడు ఎలాంటి షరతులు పెట్టలేదు.
అన్నయ్యా కొంచం ఈ పొస్ట్ ను సవరిస్తే బాగుంటుంది.
రమణ
రమణ అన్నయ్యా,
సారీ...అది మరీ స్వీపింగ్ గా, బ్లాంకెట్ స్టేట్ మెంట్ గా ఉంటే...ఆ పదాన్ని ఉప సంహరించుకుంటున్నా. ఈ విషయంలో నిన్ను హర్ట్ చేసి ఉంటే సారీ..
కానీ...ఆ ప్రోగ్రాం స్పొంసార్డ్ ప్రోగ్రాం. ప్రజా ధనంతో టీ.వీ.-నిన్ చేసుకున్న పండగ. దాని వెనుక డబ్బు వ్యవహారం ఉందని నీకు తెలియదా? తెలిసి ఎలా పాల్గోన్నావ్ అన్నయ్యా? అందులో...చాలా మంది కచ్చితంగా అమాం బాపతు గాళ్ళు, వై.ఎస్.ను ప్రసన్నం చేసుకోడానికి ట్రై చేసిన వాళ్ళే. నీ లాంటి వాళ్ళను కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. అందులో చాలా వై.ఎస్.కు అనుకూలమైన ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి ఆ ప్రోగ్రాం ఒక పెద్ద స్కాం అని నా ఉద్దేశ్యం.
రాము
వినేవాళ్లు ఉండాలే గానీ టీవీ 9 వాళ్లు ఎన్నైనా చెబుతారు. కుల గజ్జిని నిర్మూలించండి అంటూ సదరు చానళ్లు
వాళ్లు ప్రచారం చేయడం స్టార్ట్ చేయగానే నాకు నవ్వు వచ్చింది. కులం తోకలు కత్తిరిద్దాం అన్నది వాళ్ల ట్యాగ్.
సరే కదా అని వాళ్ల వెబ్ సైట్ ఓపెన్ చేసి చూశారు. అందులో పని చేస్తున్న ప్రముఖుల కులం ట్యాగులు అలాగే ఉన్నాయి. ఇదీ సంగతి. నీతులు చెప్పేది జనం కోసమే గానీ...వాళ్లు ఆచరించడానికి కాదు.
ఇప్పటి వరకు రాము పొగిడిన జర్నలిస్టులు
మురళి కృష్ణ
జి వి డి కృష్ణ మోహన్
లాంగ్ మూర్తి
రామచంద్ర మూర్తి
రామచంద్రం
సంతోష్
మహాత్మా
సుందర రామ శాస్త్రి
అద్దంలో చూసుకుంటే జాబితా పూర్తి అవుతుంది.
ramana babu... inka ee lokamlo unndu... kaneesam a programme gurinchi teliyakundane...ela vellaru? adi pakka ys baka. a baka kottindi muralikrishna. all maynot be, but muralikrishna settled well with the blessings of YS. NTV rajasekhar kuda ade bapatu. samajam mida nijamyna prema undadu. dabbu kosam natakalu... ee school of thought ki adyudu RP of tv9. Rajasekharni kuda ala tayaruchesi vadilesadu. puli tana pillalni ade tinnatlu chivariki rajasekharpi rp sting operation chesi pattukunnaru. anta mafia. Okadu NTVki ceo. marokadu tv9ki ceo.telugu prajala prarabdham kakapote emitidi cheppandi?
ఇప్పుడు...టీ.వీ.-నైన్ లో సీ.ఎం.బీటు చూడడానికి ఊడిపడ్డ రిపోర్టర్ సామర్ధ్యాన్ని కూడా శంకించడానికి వీలు లేదు......
అవును పాపం నూజివీదు మామిడి తోటల్ని టోకుగా కొనగలిగిన ఏకైక అతి పేద విలేకరి ఈ దేసం మొత్తం మీద సాయి ఒకే ఒక్కడు. మిల్లర్ల ఆప్త ముఖ్యమంత్రి రొశయ్యకు ఆస్థాన విలేఖరుల బ్రుందం ఏంత అవసరమో ఎవరికి తెలియదు???. టీవీ9 ఒక్కటే కాదు అత్యధిక విలేఖరులను,,,,, ఒకటో అరో తప్ప మిగతా మీడియా సంస్థలన్నీ రే మాపో కొణిజేటికి తూ తూగాళ్ళని నియమించకపోతే చూడండి. మురళి క్రిష్ణదీ అందెవేసిన హస్తమే. అయితే అందరినీ అదే గాటన కట్టి అమాంబాపతు అంటూ నిందిచటం మీకు తగదు కాక తగదు. కొన్నిసార్లు మీరు తొందరపౌతున్న విషయాన్ని మీరు గుర్తిస్తే మంచివాళ్ళందరికీ మేలు.
ధన్యవాదాలు
వెంకట సుబ్బారావు కావూరి
నేను పొగిడానో, తెగిడానో కూడా అర్థం చేసుకోలేని అమాయకపు మిత్రమా...
పొగడడంపై నీ పిచ్చి భాష్యం నిజమైతే...నేను ఫస్ట్ పొగిడింది...కరీం గారిని. తర్వాత పీ.భాస్కర్ ను. తర్వాత...బుడాన్ ను. లాంగ్ మూర్తి ను నేను కలలో కూడా పొగడను. రామచంద్రం ను నేను పొగిడానా? ఛీ..ఎందుకురా నాయనా అబద్ధాలు? మురళీకృష్ణ ను పొగిడానా? ఒక సారి ఆ పోస్టు చదువు.
నువ్వు...బంజారా హిల్స్ కులం కళ్ళజోడు తీసి చూడు, బాగు పడతావ్. ఒక కులాన్ని సమర్ధించే రాతలు రాసే పరిస్థితి వస్తే...బడ్డీ కొట్టు పెట్టుకునే వాడిన్రా నాయనా. పిచ్చి మాటలు కట్టిపెట్టు.
రాము
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి