Tuesday, April 20, 2010

TV-9 లో ముందు భక్తిపై...తర్వాత రక్తిపై ప్రోగ్రామ్స్

ఛానెల్స్ అఘాయిత్యాలపై విసిగి...ఈ మధ్య ఒకాయన ఒక కామిడీ బిట్ పంపాడు. అది పోస్ట్ చేస్తే బాగుండదని, మర్యాదకాదని పోస్ట్ చేయలేదు. సుదీర్ఘంగా ఉన్న దాని సారాంశం ఏమిటంటే....

వివిధ పాపాలు (అంటే...భూ కబ్జాలు, తార్పుడు, పరభార్య అపహరణ, పరద్రవ్య తస్కరణ, అవినీతి, దొమ్మీ, దొంగతనం, కులగజ్జి...వగైరా) చేసి నరకంలో పడిన ఒక ఇరవై మంది ఒక సండే నాడు...షికారుకు వెళ్తారు. అది భగభగ మండే ఎండాకాలం. అక్కడ ఒక కొలను దగ్గర వీరు బీరు తాగుతూ సేద దీరి ఉండగా...దాహార్తితో మంచినీళ్ళు తాగడానికి బ్రహ్మ అక్కడకు వస్తాడు. 

పొరపాటున ఆయన కాలుజారి నీళ్ళలో పడతాడు. ఇరవై మందిలో ఇద్దరు వెంటనే...ప్రాణాలకు తెగించి దూకి బ్రహ్మను రక్షించి ఒడ్డుకు చేరుస్తారు. మిగిలిన వారంతా ఆయనకు సపర్యలు చేస్తారు. దీనికి కడు మిక్కిలి సంతసించి బ్రహ్మ ఆ ఇద్దరినీ ఏదైనా వరం కోరుకోండని అంటాడు. 

అందులో కాస్త చూడ చక్కని వాడు..'నేను తెలుగు దేశంలో పుట్టాలి. పెద్ద మీడియా బ్యారెన్ కావాలి,' అని కోరగా...ఇంకొకడు..'నేను ఇండియాను పాలించిన ఇంగ్లాండ్ లో మీడియా బ్యారెన్ కావాలి,' అని కోరుకుంటాడు. 

"తథాస్తు. ఒకడు ఆర్.ఎం.గా ఇంగ్లాండ్ లో, ఇంకొకడు ఆర్.పీ.గా ఆంధ్రాలో పుట్టుగాక. మీడియాను మీరు దున్నుకున్దురు గాక," అని వరం ఇచ్చి బ్రహ్మ అదృశ్యం అయిపోబోతాడు. "మరి మేమేమి పాపం చేసాం..." అని ఆ బ్యాచ్ లో మిగిలిన అందరూ బ్రహ్మను పట్టుకుని పోనివ్వకుండా గొడవ చేస్తారు. అప్పటికే నొప్పులతో బాధపడుతున్న బ్రహ్మ...వారిని కూడా...పాపాలు ఎక్కువైన తెలుగు నేల మీద పేపర్లు, ఛానళ్ళు పెట్టుకుని దున్నుకోండి...అని పంపాడు.

ఇదీ క్లుప్తంగా కథ. ఎర్రటి ఎండలో తిరిగి వచ్చి బుర్ర చెడి మధ్యాన్నం ఒక కునుకు తీసాక చివర్లో అప్రయత్నంగా ఈ కథ గుర్తుకు వచ్చింది. ఇక లాభం లేదని లేచి ఛానెల్స్ మారుస్తూ ఉంటే...TV-9 లో "పూజలు చేస్తే...పాస్ అవుతారా?" అన్న శీర్షికతో ఒక ప్రోగ్రాం వస్తున్నది. అక్కడ స్టూడియోలో గోగినేని బాబు అనే ఒక నాస్తికవాది కనిపించారు. ఆయన పక్కన 'హిందూ ఆలయ పరిరక్షణ సమితి' కి చెందిన కమల్ కుమార్ ఉన్నారు. 

ఛానల్ వాళ్ళు ఒక ఆలయం (బాసర అనుకుంటా) ఈ.ఓ.తో లైవ్ లో మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి నాకు అర్థమయ్యింది ఏమిటంటే..అమ్మవారిని దర్శించుకునేందుకు విద్యార్థులకు ఉచిత అనుమతి ఇస్తున్నారట. దాని మీద చర్చ. అప్పుడు బాబు గారు వ్యంగ్యమైన ప్రశ్నలు అడిగారు..అటువైపు ఉన్న ఆ ఈ.వో.ను.

"తమరు...పూజారి కాదు కదా..అధికారి కదా..పూజారి చెప్పాల్సింది మీరు చెబుతున్నరేమిటి?"
"మీకు religious responsibility ఏమి వుంది?"
"పుష్యమి నక్షత్రం ఎంత దూరంలో ఉంది...సార్?"

...వంటి ప్రశ్నలు గోగినేని బాబు గారు అడిగారు. నేను ఇది విని నవ్వుకున్నా. పొద్దున్నలేస్తే...నవరత్న ఉంగరాలు, జ్యోతిష్యం...వంటి వాణిజ్య ప్రకటనల మీద, బూతు తో పాటు భక్తి కార్యక్రమాల మీద బతికే ఛానెల్స్ వాళ్ళ రూం లో కూర్చుని "దేవుడు లేడండీ...ఇవేమి ప్రోగ్రామ్స్ అండీ..."అని వాదించడం దండగ మాలిన పని. (ఆ మధ్యన... ఎం.ఎల్.సీ. కం మా సారు డాక్టర్ కె.నాగేశ్వర్ కు , బాబు గారికి ఐ-న్యూస్ లో ఒక చర్చలో జరిగిన వాడివేడి మాటల యుద్ధం కూడా గుర్తుకు వచ్చిందీ సందర్భంగా...)

సరే...ఈ భక్తి పంచాయితీ..ముగియగానే..."FILMI GACHIPS" అనే కార్యక్రమం TV-9 ఛానల్ లోనే వచ్చింది. ఇది రక్తి టైం అన్నమాట. అందులో యాంకరమ్మ లేని ఎనర్జీని తెప్పించుకుని....నగ్మా గురించి అందమైన మాటలు చెప్పింది. ఇక నగ్మా పెళ్లి చేసుకోబోతున్నది అని చెబుతూ...ఆమె వివిధ సినిమాలలో చేసి చూపిన బూతు దృశ్యాలను చూపించారు.  

ఆ తర్వాత జాన్ అబ్రహం గురించి ఫక్తు నీలి బూమ్మలు వేసారు. బ్యాక్ గ్రౌండ్ లో పాటలు వస్తుండగా...అబ్రహం సముద్రపు ఒడ్డున...చొక్కా విప్పగానే...ఒక సుందరి వుర్రికి వచ్చి అతని మీదకు ఎక్కడం...ఆ తర్వాత ఇద్దరూ తమకంతో కిందపడి...ఇసుకలో పిచిపిచ్చిగా బిహేవ్ చేయడం...పదే పదే చూపారు. ఓ...బ్రహ్మా...నువ్వు కాలిజారి పడడం వల్లనే కదా...మాకీ శిక్ష!

9 comments:

sudhakar reddy said...

yado comedy bit antunaru kada adi naku mail chestara?naa id sudha.nikon@gmail.com

Nrahamthulla said...

టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.

తుంటరి said...

ఎవరికయినా డబ్బు ఒకటే ప్రదానం.ఎవరు ఎన్ని గంగివెర్రులెత్తినా అది డబ్బు కోసమే.అది టి వి చానల్లకు కూడా వర్తిస్తుంది. ఏ ఏ కార్యక్రమాలకి టి ఆర్ పి రేటింగ్స్ ఎక్కువ వస్తాయొ అలాంటి కార్యక్రమాలు మళ్ళి మళ్ళి వేస్తూనే ఉంటారు, జనాలు చూస్తూనే ఉంటారు. టి వి ల వాళ్ళు మరో వికారం తో మళ్ళి మరో కార్యక్రమం వేస్తూనే ఉంటారు. పిచ్చి జనాలు మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు. అది చూడలేనీ, చూస్తూ ఊరుకోలేని మీలాంటివాళ్ళు బ్లాగుల్లో రాస్తూనే ఉంటారు , మిమ్మలిని సపొర్టు చేసే మాలాంటి వాళ్ళు కామెంట్లు రాస్తూనే ఉంటారు. ఏం మారుతోంది? ఇక్కడ సమస్య జనాలలొనే ఉంది. ఏమయినా దిక్కుమాలిన ప్రోగ్రాం వేసినప్పుడు ఎవరూ చూడకపొతే మళ్ళి ఆ ప్రోగ్రాం ఎందుకు వేస్తాడు? ఇంక నైతికత సమస్య అంటారా డబ్బు ఉంటే చాలదా?

Ramu S said...

తుంటరి సోదరా...
పిచ్చి ప్రోగ్రామ్స్ ను ఖండిద్దాం...అలుపెరగకుండా. మనం ప్రజలను చైతన్య పరచలేము అనుకోవడం ఎందుకు. మన పరిధిలో మనం ఖండిద్దాం. నిజానికి ఈ చానల్స్ చేసేది మనపై మానసికమైన దాడి. దీనికి మనం బలికావద్దు. లొంగ వద్దు...
There is light at the end of the tunnel.
Ramu

పానీపూరి123 said...

> ఓ...బ్రహ్మా...నువ్వు కాలిజారి పడడం వల్లనే కదా...మాకీ శిక్ష!
:-))

Anonymous said...

@nrahmatullah:

Pls once again read the comment of Mr WitReal in the post on M F Hussain in this blog. You had a discussion with him.

Anonymous said...

Hello sir good morning how ru i want to know one thing from u actually i am working in mahaa tv why dont u post any comments on mahaa tv either bad or good wats the reason i came to know that u have a good opinion and good relationship with our editor i.venkatrao garu so how can i understand this is it ur respect on our editor or something else please clarify this thing to me thank u very much sir and finally i appreciate ur comments those comments on our media are very straight forward and interesting

Ramu S said...

మహా-టీ.వీ. గురించి రాయడంలేదు ఎందుకని చాలామంది రాస్తున్నారు. టైం కుదరక తప్ప వేరే ఏమీ లేదు. వెంకట రావు గారిని నేను కలవలేదు, చూడలేదు. రెండు మూడు సార్లు టీ.వీ.లో చూసాను. త్వరలో ఒక బిట్ దీనిమీద రాస్తాను.
ఇలా రాసే వాళ్ళు అక్కడి మంచి/పిచ్చి ప్రోగ్రామ్స్ గురించి కాస్త సమాచారం ఇవ్వండి.
రాము

tolly boy said...

very nice ramuji

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి