Sunday, November 15, 2009

TV-5 కు కందుల గుడ్ బై....i-news లో చేరిక

తెలుగు జర్నలిజంలో ప్రొఫెషనలిజం వున్న అతి కొద్ది మందిలో ఒకరైన కందుల రమేష్ TV-5 కు గుడ్ బై చెప్పారు. ఆ ఛానల్ లో ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ గా వున్న రమేష్ గారు i-news లో న్యూస్ డైరెక్టర్ గా వెంటనే చేరిపోయారు. ఈ పరిణామం రెండు ఛానెల్స్ లో పెను పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తున్నది.

TV-5 కు ఒక పేరు రావడానికి కష్టపడిన టీంలో రమేష్ గారిది కీలక పాత్రగా చెప్పుకోవాలి. మరొక సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు గారు పాత గూడు అయిన N-TV కి వెళ్ళిపోయిన తర్వాత రమేష్ గారిపై పని భారం పెరిగింది. అయినా సమర్ధంగా చర్చలు సాగిస్తూ...నాణ్యత కోసం ఆయన ప్రయత్నించారు. 
మూడు రోజుల కిందటనే రమేష్ గారి నిర్ణయం తెలిసి నేను ఆయనకు నేరుగా  ఫోన్ చేసి మాట్లాడాను. "అలాంటి (వేరే ఛానల్ కు వెళ్ళే) ఆలోచన ఏమీలేదు. అలాంటిది వుంటే..మీకు చెప్తాను," అన్నారాయన కూల్ గా. చివరకు తెలిసింది...శనివారం సాయంత్రం రమేష్ గారు ఐ-న్యూస్ లో జాయిన్ అయ్యారు.

రమేష్ గారిని తీసుకోవడం ద్వారా ఐ-న్యూస్ యాజమాన్యం ఒక కీలకమైన బ్యాక్-అప్ వ్యవస్థను నెలకొల్పుకున్నది. ఐ-న్యూస్ కు కళ్ళూ, చెవులూ, కాళ్ళూ, గుండె... అన్నీ తనే అయిన రాజశేఖర్ కు ఇది కచ్చితంగా మింగుడుపడని వ్యవహారంగా భావిస్తున్నారు మీడియా విశ్లేషకులు. రాజశేఖర్ కు ఇప్పటి వరకూ ఆ ఛానల్ లో ప్రత్యామ్నాయం ఒక్కరూ లేరు. ఆ కొరతను తీర్చే సత్తా రమేష్ గారికి వుంది.

రాజశేఖర్ వాయు వేగం, రమేష్ ప్రొఫెషనలిజం కలగలిస్తే  ఐ-న్యూస్ కు ఎంతో మేలు జరుగుతుంది. కానీ...ఈ ఛానెల్స్ లో వ్యవహారం...'డాగ్ ఈట్స్ డాగ్ బిజినెస్' లాంటిది. ఎప్పుడు ఏమవుతుందో...చెప్పలేము. మొత్తానికి....గుడ్ లక్ రమేష్ జీ. 
ఒక వేళ ఆ రాజశేఖర్ అక్కడ అలిగి వచ్చి తమ ఛానల్ లో జాయిన్ అవుతాడన్న అనుమానం TV-5 లో కొందరికి అప్పుడే కలిగినట్లు సమాచారం. "అయ్యా...ఆయన వస్తే మాత్రం మేము వుండం," అని కొందరు యాజమాన్యానికి తెగేసి చెప్పారట. 

7 comments:

C.V.N. said...

Mr.Ramu, I had thought that you are a proffessional journalist. But, after viewing your over action in writing, "Kandula Ramesh garu"... "Kommineni Srinivasa Rao Garu"... I can say that you are a man of some prejudices. There is no need to say "garu" when you write in Telugu. You can express it in other words. You had worked in Telugu media for a long time. Hope that you will apologise.

-C.V.Narasimha Rao

Ramu S said...

Ayya C.V.N.Rao gaaroo,
senior journalistulanu alaane sambodhinchaalani anukumtunnanu. Telugulo raasetappudu 'garu' avasaram ledani meeku yevaru chepparo gaanee, mimmalni tappudova pattinchaaru anipistunnadi. ayinaa...gaaru annanduku apologies adugutunnaremitu guroo gaaroo?
--Ramu

Anonymous said...

Ramu gaaru,
journalist lanu meeku telisina midi midi gnanamtho judge cheyakandi.

dokka suddhi gurinchi maatlade mundhu konchem vaaritho panichesina vaallanu kuda adagandi. mukhyamgaa subordinates ni dagandi. anthegaani, athanu neethimanthudu, profesional, dokka suddhi vunnodu laanti certificates ivvakandi. meeku personal ga abhimanam vunte, daanni ilaanti blogs lo pettakandi. anavasara pogadthalaki vere blog pettandi. meeru media people ki sambandhinchi vaarthalu emaina vunte ivvandi, judgements kaadu. people can judge on their own knowledge and consciousness.

Anonymous said...

ramu garu,

I understand that you are not fully aware or informed about the great ''professionalism'' of kandula Ramesh garu. call him a good presenter, but not a good journalist or human being.If professionalism is the yard stick to compare, Rajasekhar is 100 times better than this fellow. Saying that he is the man behind tv5 success is like saying '' rahul is behind Eenadu success''.

Ramu S said...

అయ్యా/ అమ్మా,
ఒక చిన్న విన్నపం.
నేను అభిమానించే వ్యక్తుల గురించి ఒకటి రెండు మంచి మాటలు నా దృక్కోణం నుంచి రాసినప్పుడల్లా కొంత మంది నొచ్చుకుంటున్నారు. నేను వారు మంచి ప్రొఫెషనల్ అని రాస్తే...మీరు కూడా దాన్ని యథాతథంగా స్వీకరించాలని కాదు. నా దృష్టిలో వారు అలాంటి వారని గమనించండి. మీరూ అలానే భావించాలని నేను ఆశించడంలేదు.
వ్యక్తుల మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, మీ అభిప్రాయాన్ని నేను ఖండించడం లేదని గమనిచండి. నేను కందుల రమేష్ గారిని ఒక ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాను. నాకు ఆయన తీరు, పధ్ధతి నచ్చాయి. అలాగే వీ.ఎస్.ఆర్.శాస్త్రి గారు. ఆయన నాకు జర్నలిజంలో నాలుగు మంచి విషయాలు నేర్పారు. అయితే..కింది ఉద్యోగులను ఇబ్బంది పెట్టే వీళ్ళు మంచి వాళ్ళు ఎలా అవుతారు అని లేఖలు పంపుతున్నారు. నిజంగా వీరు అలా చేస్తే...అది వారికి తగని పనే. దాని మనం ఖండిద్దాం.
అంతమాత్రాన...నువ్వు ఎందుకు వాళ్ళ గురించి మంచిగా రాసావ్ అని అడిగితే నీనేమి చేయగలను? ఒక్క మంచి జర్నలిస్టు పేరు చెప్పండని ప్రాధేయపడినా పట్టించుకోని కొందరు...అనానిమస్ లేఖల్లో భలే రెచ్చిపోతున్నారు. అసలీ అనానిమస్ లేఖలు పెద్ద పెంట వ్యవహారంగా వున్నాయి. పేరు పెట్టి రాసే దమ్ములేనప్పుడు గమ్మున కూర్చోవడం బెటర్ సార్. అనానిమస్ తో రాయాల్సి వస్తే.. కాస్త పెద్ద మనసుతో తీరిక చేసుకుని...ఉదాహరణలతో విపులంగా మంచి ఐడియా లు రాయండి. Please don't create bad blood.
అలాగే కులం గురించి రాయవద్దని ఒక మహా తల్లి/తండ్రి సూచించారు. అది కుదిరే పని కాదు. నాకు తోచింది, నచ్చింది, నచ్చంది రాయడానికి ఎంతో కొంత టైం వెచ్చించి ఈ బ్లాగ్ నడుపుతున్నాను. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో రాయండి. చర్చించుకుందాం. మంచి ఐడియాలు ఇవ్వండి అంతే కానీ బ్లాంకెట్ స్టేట్మెంట్లు వద్దు. అలాంటివి రాసి మీ శ్రమ, నా టైం వృధా చేయకండి.
ప్రేమతో...రాము

Anonymous said...

ramesh and ankam ravi are metured journalists. New Management should give breathing space to them. They are great gate keepers of news. Ramesh missed good environment at tv5. Management kept him busy with dirty politics. That should not be repeated at rajus camp.

Ramesh is peer to Eenadu top brass. Those drag his chair at tv5 did not enter even rural journalism when ramesh run Eenadu general desk.


Ratings are different from quality viewership. very few people watch devils advocate. but cnn ibn respects that programme as it brings quality adds. I know one cbi officer watch Newstime at tv5 instead of tv9 for his AP updating. I never talked to ramesh. but know the worth.

wish him best of luck.

Srinivas

Anonymous said...

ramu garu, meeku munduga hrudayapoorvaka kruthagnathalu. tv5 ku good bye cheppina kandala gari proffesionalism gurinchi, tv5 success venuka aayana krushi chalaa unidi.nijanga aayana associate editorgaa tv5lo cheraru. out put editorgaa baaga ranincharu. aa tharuvaatha kandulaku senior executive editor badhyathalu yajamanyam appaginchindi. success sadhinchenduku kandula chesina krushi varnanaatheetham. channel prarambha samayamlo reporterlaku vaarthalu ela raayaali, storylaku visuals ela select chesukovalani vipulanga training icharu. electronic medialo paripoorna vignanamtho success kosam krushichesina kandula ramesh sevalanu tv5 yeppatikie maruvadu. tv5 channel prarambhamaina oka samvatsaraaniki gaani vijaaaniki cheruva kaleka poyindi. channel prarambhamlo kandula peddagaa pattinchukoledu gaani, aayanaku badhyathalu appaginchina tharvaatha thana satta emito niroopincharu. ivaala electronic medialo ancchor partnu sarigaa rayadaniki theliyani vaallu bureau chief gaa, desk inchargeluga chelamani avuthunnaru. kandula nirvahinche ye discussion ayinaa proffesionalism tho untundi. charchalo ekkada vethikinaa sollukaburlu undavu. charchalo naanyatha untundi. anthegakunda charchala naanyathake kaadu daily newsbulletinla quality teesukuravadaaniki kandula krushi enalenidi.kandula tv5lo unnatha sthanamlo untoo evarinee vyakthigathangaa okamaata annavaadu kaadu. vruthi paranga nirlaksyanni thappubattaru, kondarilo maarpu teesukocharu. enthamandi tv5lo panichesinaa... kandula leni lootu evvaroo theerchaleru. idi vaasthavam. kandulaku gittanivaariki aayanapatla eershya undochugaani... kandula 100% ethics gala proffesional journalist. ikkadi kullurajakeeyalu nachaka... manasthapam chendina kandula resign chesi velladam ayanatho panichesina maaku manasu badhagaa undi.ramu garu kandula gurinchi chakkati vaarthanu bloglo pettina vishayanni aalasyanga telusukuni naa spandana teluputhunnanu. vaarthallo garu ani sambhodinchina ramu gaarini vimarsinchatam maani vaasthavalu telusukunenduku prayatnisthe manchidi.
ika kommineni gaari vishayanikosthe... aayana manchi journalist. tv5 pragathiki kommineni krushi leka poledu. yaajamanyam thanaku pradhanyatha ivvaledani manasthapaniki gurai.... gathamlo avamaanam jarigina chotane... aalasyangaa ayinaa kommineni prathibha samarthyalu gurthinchina NTV saadaranga aahwaaninchi gowravinichindi. kommineni gaanie.... kandula gaanie tv5 samsthalo target chesi ibbandi pettaledu. cheep politicsku palpadaledu. kommineni, kandula gurinchi teliyanivallu.... vaari proffesionalism gittani vaaru mathi sthimitham lekundaa chesina commentlanu pattinchukovaddani raamu gaarini eesandharbhanga koruthunnanu. saadharanaga losogulake medialo panichese vaaru pradhanyatha isthunnaru. idi jagamerigina sathyam. manchi journalistlu gurinchi bloglo raavadam ramu gaari sincerityki niluvethu nidarshanam... kommineni , kandula vanti ethics unnavaarini tv5 pogottukovadam badhakaram. tv5lo konni cheeda purugulunnayi.... avi eppudu pothayoo mari vechi choodali.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి