ప్రతిదానికీ ఎగిరెగిరిపడడం, మనలో ప్రతిభ గోరంత అయితే...కొండంత ఫోజు కొట్టడం, ఏదో చిన్నపాటిది సాధించగానే ఆస్కార్ కొట్టినట్లు ఓవర్ యాక్షన్ చేయడం...మనకు అలవాటు. ఇలాంటివి ఏమీ లేకుండా...ఎంతో అణకువతో ఉండే ఒక మనిషిని నేను Maa టీ.వీ.వారి పుణ్యాన చూస్తున్నాను. ఈ రాత్రి జరిగిన 'సూపర్ సింగర్స్--4' గ్రాండ్ ఫినాలే లో ఆమెకు మూడు లక్షల రూపాయల బహుమతి వస్తే చూసి చాలా ఆనందం వేసింది.
ఆ అమ్మాయి పేరు అంజనా సౌమ్య. ఆమె వివరాలు పూర్తిగా తెలియవు కానీ...ఆమె పాటలో ఏదో మాధుర్యం ఉంది. ఏ పాటనైనా ఆలవోకగా అద్భుతంగా పాడుతుంటే మైమరచి పోవడం శ్రోతల వంతు. అన్నింటికీ మించి...ఆమె అణుకువ చూస్తే ముచ్చటేస్తుంది. ఈ అణకువ ఆచరిస్తే వచ్చేదేనా? జన్మతః రావలసిందా? ఏమో!?
కోటి, మను, సుద్దాల, సునీత వంటి వాళ్ళు ప్రశంసిస్తున్నా....అంజన సౌమ్యంగా నవ్వేదే తప్ప ఎగిరెగిరి పడలేదు. ఇదేదో మనమంతా నేర్చుకోవాల్సిన మంచి విషయం. గెలవగానే...హడావుడి లేకుండా...ఇతర పోటీదార్ల (participants) దగ్గరకు వెళ్లి ఆమె వినమ్రంగా కరచాలనం చేసింది. తల్లిదండ్రుల సహాయసహకారాలను ఆహూతులకు తెలిపింది.
రెండో బహుమతి పొందిన రవి కూడా తక్కువ తినలేదు. అతనికి ఒక రెండు లక్షలు వచ్చాయి. జానపదాలతో ఉర్రూతలూగించిన రవి...చివరకు మాట్లాడుతూ--"మా అమ్మను ఇక్కడ సత్కరించడం...ఈ బహుమతి కన్నా ఎక్కువ. ఏదో దేశాన్ని జయించినంత ఆనందంగా ఉంది," అన్నాడు.
ఈ కార్యక్రమంలో ఒక చిచ్చర పిడుగు షణ్ముఖ ప్రియ కూడా అద్భుతంగా పాడింది. తన గాత్రంతో ఫైనల్స్ దాకా వచ్చి...ఒక పాతిక వేలు కొట్టేసింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి అంజన, రవి లాంటి 'బెటర్ దాన్ ది బెస్ట్' ను ప్రపంచానికి అందించిన ఈ ఛానల్ కు అభినందనలు.
అంజన వివరాలు, ఆమె పాటల గురించి తెలిసిన వాళ్ళు తమ తమ అభిప్రాయాలు రాస్తే...అవన్నీ కలిపి ఒక మంచి పోస్ట్ చేయాలని ఉంది. అణకువగా ఉండడం ఎలానో కూడా తెలిపి పుణ్యం కట్టుకోండి.
Photo courtesy: tubeoli.com
Tuesday, March 9, 2010
Subscribe to:
Post Comments (Atom)
19 comments:
> అంజన వివరాలు, ఆమె పాటల గురించి తెలిసిన వాళ్ళు తమ తమ అభిప్రాయాలు రాస్తే
ఆ వివరాలు ఏ ID కి పంపాలి?
ఆజన గారి వివరాలు కామెంట్స్ లో పంపండి.
థాంక్స్
రాము
Anjana Soumya and Ravi are really role models for our pizza and pub phobia youth.The way Ravi had expressed his happines at the honour given to his beloved mother is indeed is the highlight of the programme.These are the youngsters who hail from the families which give importance to the human and moral values and they are not the children of any VIPs but VIPs of good culture and moral values.My hearty congratulations to these two winners and I hope they will be in the same attitude and frequency of life till the last breath irrespective of their position,status or wealth and adverse situations in the life.
JP Reddy.
Please Watch this video for Anjana soumya's interview on TV9
http://www.youtube.com/watch?v=e-Ka2AZax7U
అంజనా సౌమ్యలో స్థితప్రజ్ఞత కనిపిస్తుంది.(ఏడుపులూ, వివాదాలే కాన్సెప్టుగా సాగే రియాలిటీ షోల నిర్వాహకులు వారి ప్రోగ్రాంస్ లో ఈ అమ్మాయిని తీసుకునే సాహసం చేస్తారంటారా?)
నేను, మీరు ఉదహరించిన "చిచ్చర పిడుగు" కి ఫాన్ మాత్రమే కాదు,కూలరూ....ఏ.సీ,...అన్నీనూ.
తన పెర్ఫార్మెన్స్ అప్పుడు రెప్ప వేస్తే ఏమి మిస్ అవుతానో అనిపిస్తుంది. షణ్ముఖ ప్రియ పాటలూ, వివరాలూ తెలిసిన వారు దయచేసి తెలుపుతారని ఆశిస్తాను.ఆమె గురించి కూడా మీరొక పోస్ట్ వేశారంటే నాలాంటి అభిమానులకి విందే.
అంజనా సౌమ్య ఊరు మా కాకినాడ ఆమె ఫిజియొధెరపి చదివిందనుకొంటాను అణుకువ ఆమె పేరు లోనే ఉంది కొంత బ్లడ్ లో కూడ వస్తాది,పెంపకం చుట్టూ పరిస్తితులవలన కూడ వస్తాది
I congratulate anjana sowmya on her success. She is from Kakinada, East Godavari as far as I know.
Anjana paatake kaadu aame Anakuvaku kuda dakkina gouravamadi...
Anjana paatake kaadu aame Anakuvaku kuda dakkina gouravamadi...
she is best singer. she sing very plesent
http://watchtelugufreemovies.blogspot.com/2010/02/watch-xclusive-tv9-live-
Ramu garu
valla godava manakenduku
ee blog aim yenti a story yenti.
nenu technicians gurnchi rayamani adiga okkasari kuda meru prastavinchaledu yenduku chestaru meru journlistey kada...
I am told Anjana Sowmya is from Kakinada. She did her engineering and also MBA.
Anyway, Ramu anna, I sincerely feel that this post unnecessary and it only shows that you are becoming a typical, emotional TV viewer. Correct me if i am wrong.
ramana
అచ్చ తెలుగు సాంప్రదాయానికి స్వచ్చమైన ప్రతీక మన సౌమ్య
Shanmukha priya should take a break for sometime and clean up her voice clarity. Right now she is singing too much of Apashrutulu. These contests may make her career completely useless.
It looks Baby Shanmukhapriya is being strained too by her parents and others and it is better if a break is given to her as her age is not ripe for such a heavy strain of TV channels programmes.It is a pity that these live shows are unnecessarily bringing a lot of pressure on young children which is against their mental and physical health and if not selected they cry a lot which definetely affects them in various aspects.Unfortunately the channels are cashing on the tears of these kids by repeatedly showing the tearful and sad faces of the kids who get less marks or eliminated with a tragic background music which is uncalled for and unjustified.Let us hope the parents will not allow their very young children for these shows.There should be a minimum age for the child participants.
JP.
శివ గారూ...
టీ.ఆర్.పీ.అంశాన్ని ఒక నిపుణుడికి అప్పగించాను. ఆయన ఊరిస్తున్నాడు కానీ అది ఇవ్వడం లేదు. మరొక ప్రయత్నం చేసి నేనే చేయి చేసుకుంటాను.
రమణ అన్నా...
కొన్ని కొన్ని సార్లు మీరు ఇలాంటి పోస్ట్ లు భరించక తప్పదు. అంజన గురించి ఒక మాట చెప్పడానికి నాకు మరొక వేదిక లేదు. ఆ అమ్మాయి చాలా బాగా పాడుతున్నది. ఆమెలో అణుకువ, వినయం నాకు బాగా నచ్చాయి. అందుకే రాసాను. పని ఒత్తిడి వాళ్ళ టీ.వీ.చూడడం లేదు. అందుకే...మంచి పోస్టులు దొరకడం లేదు. ఇక ముందు చూద్దాం.
రాము
anjana sowmya patalu naku chala chala ishtam....she's a down to earth girl...i wish her all d best!!! may god bless her wid all the luck n good health...
anjana sowmya patalu naku chala chala ishtam....she's a down to earth girl...i wish her all d best!!! may god bless her wid all the luck n good health...
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి