Wednesday, April 14, 2010

"మీడియా వారు గంధర్వలోకం నుంచి రాలేదు"

మీడియా ధోరణులు, టీ.వీ.లలో పిచ్చి ప్రోగ్రామ్స్, తరిగిపోతున్న విలువల గురించి తరచూ చర్చించే బ్లాగర్స్ లో శివ గారు ఒకరు. ఏ.పీ. భవన్ దగ్గర విలేకరులు, కెమరా మెన్ పడుతున్న బాధల గురించి నేను మొన్న పోస్ట్ చేసిన దానికి స్పందనగా ఆయన ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. అది నాకు సమాచారం ఇచ్చిన ఒక ఢిల్లీ విలేకరికి కోపం కలిగించింది. 'ఈ శివ గారికి విలేకరులు అంటే ఎందుకు అంత మంట?" అని నా సోర్సు ప్రశ్న వేసారని నేను కామెంట్స్ కాలంలో రాసాను. దానికి స్పందనగా శివ గారు పంపిన కామెంట్ ను ఇక్కడ ఇస్తున్నాను---రాము 
---------------------------------------------------------------------
"....ఈ శివ గారికి విలేకరులంటే ఎందుకు అంత మంట?," అని ఆ పెద్దాయన నన్ను అడిగారు..."
మొట్టమొదట మీడియాలో ఉన్నవారు తామేదో గంధర్వలోకం నుంచి దిగివచ్చామన్న భ్రమలోనుంచి బయటపడాలి. ఒక చర్చలో తమకు ప్రతికూలమైన పాయింటు చెప్పిన వారిని "ఈ శివ" (This Siva?) అనే అలవాటు మానుకోవాలి.

ఇక విషయానికి వస్తే, నాకేమీ విలేఖరులమీద కక్ష లేదు కోపం లేదు. కాని విలేఖరులమని, మీడియా పేరుతొ నానా రభస చేస్తూ Press Freedom ను హాస్యాస్పదం చేస్తున్న వారిని చూస్తె "చీకాకు". ఇలాటి ఓవర్ ఏక్షన్ వల్ల Press Freedom ని మనం కోల్పోయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఇక్కడే (కామెంట్స్ కాలంలో) చూడండి దాదాపు అందరూ "విలేకరుల తిక్క కుదిరింది" అన్నట్లుగానే వ్యాఖ్యలు చేసారు.


ఇంతకు ముందు అనేక సార్లు నేను వ్యాఖ్యానించినట్టు, మీడియా మీద ప్రజలలో ప్రస్తుతం ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని దన్నుగా తీసుకుని, పత్రికా స్వాతంత్రం మీద ఆంక్షలు విధిస్తే ఏమి జరుగుతుంది. ప్రజలు వ్యతిరేకిస్తారా?? మన్ని విమర్శించిన వాళ్ళందరూ మన శత్రువులు కారు అన్న విషయం గమనించుకోవటం అతి చిన్న విషయం. కొంత ఆత్మవిమర్శ చేసుకుంటే, మీడియా అంటే సామాన్య జనానికి, ముఖ్యంగా ఈ న్యూస్ చానెళ్ళు వచ్చాక, ఎందుకు అంత "కోపమో" తెలుస్తుంది.

మీరు అన్న మరో విషయం ".. సమస్యను సమస్యగా తీసుకోకుండా విలేకరుల తిక్క కుదిరింది అన్నట్లు మాట్లాడితే ఎలా సార్?...."

ఇక్కడ సమస్య ఏమిటి?? పోలీసులకు ఒక సమాచారం వచ్చింది మీడియాను వాడుకుంటూ ఒక పెద్దాయన మీద దాడి జరిగే ఆవకాశం ఉన్నది అని. అటువంటి "Intelligence Input" వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి? పత్రికా విలేఖరులతో సంప్రదించి తాము తీసుకోబోయే కొత్త "Security Measures" అమలు చేయటానికి వారి అనుమతి తీసుకోవాలా? లేదా ఇలా చేద్దామని అనుకుంటున్నాము అని వారికి చెప్పెయాలా? అలా చేస్తే, ఈ విషయాలు అన్ని చేరకూడని చోటుకి చేరవని నమ్మకం ఏమిటి.

మీ వ్యాఖ్య మరొకటి, "..........నిజంగా విలేకరులలో నక్సల్స్ ఉంటె...చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి గానీ......"

ఎలా? ఎవరు ఏమిటో ఎలా తెలుస్తుంది. సామాన్య ప్రజలం రోడ్డు మీద వెడుతుంటే, ఒక ప్రముఖుని కారు ఆ దారిన వెళ్ళాలంటే, మమ్మల్ని అందరినీ ఆ కారు వెళ్ళేదాకా నిలబెట్టేయటం లేదా? అక్కడ కూడా ఇదేమి పని మేము సహకరించం మేమేమన్నా టెర్రరిస్టులమా? కావాలంటే దర్యాప్తు చేసి అలా ఉన్నవారిని నిలబెట్టండి అని ప్రజలు అంటే ఏమవుతుంది? అరాచకమే కదా. ఇప్పుడు దాదాపు అన్ని కార్యాలయాల్లోనూ మెటల్ డెటెక్టర్లు, బాగేజి స్కానర్లు ఏర్పాటు చేశారు, వారి వారి ఉద్యోగులను కూడ తనిఖీ చేసే పంపుతున్నారు, ఇదంతా మాకు "అవమానం", మమ్మల్నే శంకిస్తున్నారా మేము సహకరించము అంటే?
ఇక్కడ కూడా పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం ఎవరిని ఆపాలి? దర్యాప్తు జరిపి ఆపాలి, ఈలోగా?? కాబట్టి సెక్యూరిటీ ఏర్పాట్లను తప్పనిసరిగా ఎవరైనా సరే పాటించాలి, మనకు బాధ, అసౌకర్యం కలిగినా సరే.

ఒకవేళ పత్రికా విలేఖరుల కళ్ళ పడకుండా తమ అకృత్యాలను కొనసాగించుకోవటానికి ఈ సెక్యూరిటీ ఏర్పాట్లను వాడుకుంటూ ఉంటే, పూర్తి ఆధారాలతో ఒక మంచి రిపోర్టు వ్రాస్తే/చూపిస్తే అద్భుతంగా ఉంటుంది, ప్రజలకు తెలియ చేసిన వాళ్ళు అవుతారు, ప్రజలు హర్షిస్తారు. వ్యాఖ్యలలో ఒకరు పైవారికి చెబుతూ ఉన్నట్టుగా వ్రాసారు. మీడియాకు తెలిసినప్పుడు పైవారికి చెప్పటం ఎందుకు? పేపర్లో ప్రచురించ వచ్చు కదా లేదా టి వి లో చూపించ వచ్చుకదా. ఈ నాన్చుడు దేనికి.

ద్వంద్వ వైఖరి ఎప్పుడూ ప్రమాదమే. పోలీసులకు తెలిసిన సెక్యూరిటీ విషయం దర్యాప్తు చేసి చర్య తీసుకోవాలి మరి అదే విధంగా పత్రికా విలేఖరులకు ఎ పి భవన్లో జరిగే అకృత్యాల గురించి వ్రాసే బాధ్యత లేదా, ఇలా తమను బయటకు పంపగానే గొణుక్కునే బదులు. ఏ విషయానికి అయినా పలు కోణాలు ఉంటాయి
.

10 comments:

Anonymous said...

Is there any clause of FREEDOM OF PRESS in the clause of freedom of citizens in our constitution?If it is there can any one give me the number of the clause or quote the clause in which the freedom of press is mentioned.
The so called freedom of press has become freedom of journalists,editors etc as individual whims and fancies.

JP.

Ramu S said...

Sir,
there is no 'freedom of press' clause in our constitution. Like all citizens, we (media people) make use of 19(1)(a), that is freedom of expression.
Ramu

Anonymous said...

మీకు కే౦ద్ర సహాయక మ౦త్రి పల్ల౦రాజు మీకు తెలిసె వు౦టు౦ది.మొన్న జరిగిన ఒక స౦ఘటన లొ మ౦త్రి గారి కేన్వాయ్ ఒక ఆటొ ని డీ
కొట్టి౦ది.దాన్ని మరవక ము౦దే మళ్ళా నిన్న తూ.గొ.జిల్లా తుని లొ టివి క౦ట్రిభూటర్ కాన్వాయ్ దాటుతూ చనిపోవడ౦ జరిగి౦ది.మరి దానికి యలా స్ప౦దిస్తారొ?.

నండూరి సుబ్బారావు said...

మీడియా వాళ్ళు గంధర్వులు కాదు మామూలు మనుషులే అని ఒప్పుకున్నప్పుడు. అందరు మనుషులు చేస్తున్న తప్పులే వాళ్ళూ చేస్తున్నారు కదా. మిగిలిన ఉద్యోగాలూ, వృత్తులలో ఉన్నవారిలో ఎంత నిజాయితీ, నిబద్దతా, నైపుణ్యమూ ఉన్నాయో మీడియావాళ్ళల్లోనూ అంతే ఉన్నాయి. మీడియాకీ, రాజకీయనాయకులకీ, అధికారులకీ అవినీతిమప్పిందెవరు? ఇక్కడ వాళ్ళను తిడుతూ కామెంట్లు రాసేవాళ్ళల్లో ఎంతమంది తమ స్వార్థాలకు నష్టం కలిగినా సరే అనుకొని అవినీతిపరులకూ, అవినీతిపనులకూ దూరంగా ఉంటున్నారు? తమ చుట్టుపక్కల అందరూ సమయానుకూలంగా నైతికవిలువలను మార్చుకుంటున్నప్పుడు, వారికి అవసరమైనప్పుడు నైతికవిలువను మర్చిపోమని, కనీసం చూసీచూడనట్టు పొమ్మని బలవంతం చేస్తున్నప్పుడు పవిత్రంగా ఉండి, పస్తులు పడుకొనేంత మహాత్ములు ఇప్పుడు ఎవరున్నారు? మీడియా వాళ్ళంటే విరుచుకుపడేవాళ్ళు మరి నాయకుల మీదా, అధికారుల మీదా ఎందుకు విరుచుకుపడలేరు? ఎందుకంటే నిజంగా మీడియా వాళ్ళు మొరిగే కుక్కలే కనుక. వాళ్ళకు కరిచే సామర్త్య్హం తక్కువ కనుక. అదే అధికారంలో ఉన్నవారితో పెట్టుకుంటే తేడాలొస్తాయని భయం కనుక. మీడియాలో ఉన్నదీ సామాన్యులే. వాళ్ళకీ అందరికీ ఉన్నట్లు అపోహలూ, అహంకారాలూ ఉంటాయి. మళ్ళీ చెపుతున్నాను. మీడియాకన్నా ముఖ్యమైన పవిత్రమైన వృత్తులలో ఉన్న ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు ఎంత బాగున్నారో, ఎంత నిబద్ధంగా ఉన్నారో మీడియా వాళ్ళూ అలాగే ఉన్నారు. మార్పు అందరిలో రావాలి. ఇంకా ఈ వాదనను బలపరుస్తూ పెద్ద వ్యాసమే వ్రాయొచ్చు. అయినా నా వాదన ఇప్పటికే విజ్ఞులకు అర్థమయ్యే ఉంటుందని విరమిస్తున్నాను. మీ ఆశలనూ, ఆశయాలను మీడియాపై రుద్దకండి. వాళ్ళనుంచి ఎక్కువ ఆశించకండి.

Anonymous said...

సుబ్బారావు గారూ,

వాడు దొ౦గ కాబట్టి నేను కూడా దొ౦గతన౦ చేస్తే తప్పేమిటి అన్న ఈ వాదన మన సమాజ౦లో బాగా చలామణి ఆవుతో౦దీ మద్య. అసె౦బ్లీలో అధికార పార్టి కూడా ఇలాగె వాదనలు చేస్తో౦ది.

అదే నిజమైతే ఈ వాదనలె౦దుకు. మీడియా మాత్ర౦ పతివ్రతా వేషమె౦దుకు వేయాలి? వారు కూడా దొ౦దూ దొ౦దే కాబట్టి మిన్నకు౦డి పోవాలి మరి.

మీడియా సమాజానికి అద్ద౦ వ౦టిది. అద్దమే అపద్దన్ని చూపిస్తే ఏ౦చేయాలి?

Saahitya Abhimaani said...

చూడండి సుబ్బారావుగారూ. ఇక్కడ వాదన ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన గురంచి. దాన్ని ఎక్కడెక్కడికో తీసికేడుతున్నారు మీరు. నేను చాలా సామాన్యంగా వ్రాసిన వ్యాఖ్యకు, నేను తగిన జవాబు ఇచ్చాను.

స్థూలంగా చెప్పాలంటే, "మేము మీడియా మమ్మలి ఎవరూ అడ్డు పెట్టకూడదు, సెక్యూరిటీ పరంగా కూడ మా మీద ఆంక్షలు ఉండటానికి వీల్లేదు, మమ్మల్ని ఎవరూ ఏమీ అనకూడదు, విమర్శించకూడదు, మమ్మల్ని ఏమైనా అంటే పత్రికా స్వాతంత్రానికి భంగం కలిగించినట్టే అన్న ఆలోచనా ధోరణులు పెరిగిపోవటం వల్లనే మీడియా ఈరోజున విమర్శలు ఎదుర్కొంటోంది. విజ్ఞులైన మీకు తెలియని విషయం కాదు ఇది. పైన చెప్పిన అహంకారపూర్విత ప్రవర్తన పత్రికా రంగానికి, పత్రికా స్వాతంత్రానికి (ఇంకా ఏమైనా ఈరోజున మిగిలి ఉంటే) గొడ్డలిపెట్టు. పత్రికా రంగాన్ని అభిమానించే విజ్ఞులంతా తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం . ఈరోజున పత్రికా స్వాతంత్రం అంటే, ఆ పత్రికాధిపతి లేదా ఆ చానెల్ అధిపతికి ఉన్న స్వాతంత్రమే కాని, సామాన్య ప్రజలకు జరిగే విషయాలు ఏవిధమైన రంగులూ కలపకుండా తెలుసుకునే స్వాతంత్రం కాదు.

ఇతర రంగాలలో అవినీతి లేదా? మీడియాలో కూడా మనుషులే, వంటి వాదనలలో పసలేదు. ఎందుకు అంటే అలాంటి అవినీతిని మీడియా పేరుతొ కొంతమంది వ్యక్తులు, సొంత లాభానికి వాడుకుని, వ్రాస్తే డబ్బు-వ్రాయకుంటే డబ్బుగా ఉందని లోకం కోడై కూస్తోంది. ఒకానొకప్పుడు జర్నలిజం అన్నది ఒక పవిత్రమైన వృత్తిగా పరిగణించబడేది. సంఘ సంస్కరణే ధ్యేయంగా పెట్టుకుని పత్రికలు నడిపిన మహానుభావులైన జర్నలిస్టులు తెలుగులోనే ఉండేవారు.. ఇప్పుడు? పార్టీ బాకా పత్రికలు, ఆ పత్రికలలో పనిచేస్తూ, పైవారు చెప్పిన పధ్ధతులలో ఆ బాకాలు ఊదటం. వీలైనంతవరకూ వీళ్ళ బుర్రల్లో ఉన్న లెఫ్టిస్టు భావనలో, రైటిస్టు భావనలో, లేదా వేర్పాటు/సమైక్య వాదాలో జనం మీదకు స్లో పాయిజన్‌లాగ ఎక్కించె ప్రయత్నాలు. అస్సలు ప్రజలకు నిస్పక్షపాతమైన వార్తలను తెలుసుకునే హక్కు ఉందని గమనించరే. ప్రతిదీ వీళ్ళ పత్రికాధిపతి/చానెల్ అధిపతి కోణం లేదా వీరి "ప్రెజ్యుడీస్" భావనల కోణం నుండే వార్తలను మేము తెలుసుకోవాలా? ఇది ఒక సామాన్యుడు పడే ఆవేదన ఇది అంతేకాని, పత్రికా రంగంలో పనిచేసే వారిని అనవసరంగా దూషించి, విమర్శించే ప్రయత్నం కాదు. ఎందుకంటే, సామాన్య పాఠకులమైన మాకు అంత సమయం లేదని తెలుసుకో ప్రార్ధన.

నండూరి సుబ్బారావు said...

ఢిల్లీ సంఘటనలో జెపీగారి అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తాను. నా ఎదురుదాడి విలేకరులంటే మంట , కోపం, చికాకు గురించి. ఇవన్నీ మీరు వాళ్ళనుంచి ఎక్కువ ఆశించడంతోనే వస్తున్నాయి. మరోటి ఇక్కడ చాలామందికి పొట్టకూటికోసం పాత్రికేయ ఉద్యోగాలు చేస్తున్నవారికీ, పత్రికాధిపతులకూ తేడా తెలియడం లేదు. మిగిలిన వృత్తినిపుణులకన్నా ఉద్యోగభద్రత తక్కువగా ఉన్నది పాత్రికేయులకే. విలేకరులుగా మా కష్టాలు మాకే తెలుస్తాయి. కరణము సాధై యున్నను అని సుమతీశతకంలో పద్యముంది. కచ్చితంగా అలాగే పోలీసుగానీ, విలేకరిగానీ కొంత హడావుడి చెయ్యకపోతే వాళ్ళ వృత్తిధర్మం చెయ్యలేరు. దాన్నే కొంతమంది తప్పుడు పనులకు ఉపయోగిస్తూ ఉంటే ఉండవచ్చు. విలేకరులలో అవినీతిపరులు లేరని ఎవరూ అనడంలేదు. అసలు ఏ విలేకరైనా ఇవాళ పరిస్థితులలో నేను సమాజం కోసం ఈ వృత్తిలో ఉన్నానని చెప్పే పరిస్థితి ఉందా? పాత్రికేయ వృత్తితో పోల్చినపుడు ఉపాధ్యాయ, వైద్య, ఇతర ప్రభుత్వోద్యోగాలలో (కొన్ని శాఖలు/ పైస్థాయి పోస్టులు తప్ప) ఒత్తిడి తక్కువ. కానీ అక్కడ పరిస్థితి ఎంత బాగుంది. మూడు రూపాయలిచ్చి పేపరు కొనుకున్నాం కనుక దాన్ని తయారుచేసిన వాళ్ళు మనసావాచా కర్మణా పవిత్రం ఉండాలి. అన్నీ నిజాలే చెప్పాలి అని ఆశించడం ప్రస్తుత పరిస్థితులలో తప్పే.దీనివల్ల సదుద్దేశ్యం సత్ప్రవర్తన ఉన్నవారి మధ్య, (మీరూ మేమూ) కూడా తగాదాలు వస్తాయి. ఇప్పటికే "ఎలాంటి వార్తలకోసం ఈనాడు చదవాలి? ఎలాంటి వాటి కోసం సాక్షి వదవాలి? ఏ ఛానల్ ఎలాంటి న్యూస్ ప్రసారం చేస్తుంది అనేది స్ద్సామన్యులక్కూడా అర్థమ్మై పోయింది కదా. let them bulid their grave. don't get panic about their behaviour.

Anonymous said...

One can understand the feelings of Nanduri garu as the people are hitting the press personnel with brickbats due to various reasons.There is good,bad and ugly in every proffession,individual and society.But being ugly one should not comment or expose the ugliness of others posing themselves as good and that is what is going on in the media.The journalists got their own problems,issues,financial insecurity,poor and late payments from the management,late night duties and standing toes for stories for the targets fixed by the management etc.I know personally one reporter of Andhra prabha who wassuffering from hypertension and later kidney failure resulting in kidney transplantation but unfortunately we lost him.The friends of the reporter had to beg each every one for financial assistance for his medical expenditure as he belongs to very poor family with unmarried sisters and the friends collected money for the marraige of his sister and later kidney transplantation.He was very young but did not earn much atleast to support his family as he was sincere,dedicated,ethical and never expected anything nor demanded anything for writing or for avoiding stories in the newspaper and we used to discuss how his other colleagues had aquired vehicles,buildings etc through various unethical means in the various departments.But he is a symbol of proffessionalism with ethics,moral and human values and we all remember him for his personality which can be seen rarely in these days.
Most of the reporters behave as if they are super citizens and can write anything on any one at any time irrespective of truth of the story as they want utilise the media for setlling for personal and financial scores and in these days every news has become a paid news and without payment nothing comes out except a few.They behave very awkwardly without any basic manners of a proffessional or a citizen towards fellow citizen.These reporters require refresher courses on ethical,proffessional,moral and human values through senior,sincere and dedicated journalists from a stringer of a village to the Editor in chief as every one is sailing in the same boat.

JP.

Ramu S said...

JP sir,
thanks for your comment.
I know that you are talking about Srinivas. I too felt bad to see his family's condition. I promised some help to his family members but the local journalists didn't cooperate.

Saahitya Abhimaani said...

మెము కొనే పేపరు ఏదో మూడురూపాయలే కాదండి! (మూడు రూపయలెట్టి కొని పెద్ద ఫోజు అనేకదా మీ వ్యంగ్యం). అలాగే మేము కేబుల్ టి.వి కి ఇచ్చేది రెండోందలో మూడొందలే కాదండి. పేపరు, కేబులు కలిపి మాకు చూడటానికి మూదువందల పది రూపయలు ఖర్చు లాగ కనిపిస్తుండి. కాని, అసలు ఖర్చు దానికి ఎన్ని రెట్లో లెక్క కట్టాలి. కారణం అందులొ కావల్సినవి అక్కర్లేనివి ప్రచురించే వ్యాపార ప్రకటనలు. ఆ ప్రకటనలు మీకు ఇచ్చేవారేమీ చారిటీ చెయ్యటంలేదు కదా. వారు ఈ ఖర్చు మొత్తాన్ని మా మీద, మేము, ఆ వ్యాపార ప్రకటన చూసి కొన్నా, చూడక కొన్నా, కొన్న పాపానికి మా నెత్తినే వేసి రుద్దుతారు. కాబట్టి మాకు ఇంత ఖర్చుతో కూడిన విషయమైన ఈ పేపర్లు, టి వి చానెళ్ళలో మాకు కావలిసినవి, ఈ ప్రకటనల మధ్య వెతుక్కోవలిసిన ఖర్మ మాది. ఏమి చేస్తాం! మరొక అవకాశం లేదు కదా మరి. ఇది తెలిసి పూర్తి సమాజాన్ని ప్రకటనల పేరుతో మానసిక కాలుష్యానికి గురిచేస్తున్నారు. చెప్పుకోవటానికి వేరే గతిలేదు. సమాజంలో ఇంకెవరన్న మనకు బాధ కలిగిస్తే చెప్పుకోవటాంకి మీడియా ఉండేది. ఆ మీడియానే బాధ కలిగిస్తే, గ్రీవెన్సు సెల్లులు లేవు కదా. ఏదో ఈ బ్లాగులు రావటం వల్ల ఈ మాత్రం మేము అనుకునేవి వ్రాయగలుగుతున్నాం. లేకుంటే మా అభిప్రాయాలను వ్యక్త పరిస్తే సంపాదకునికి లేఖలలో ప్రచురిస్తారా? పైగా పత్రికా స్వేచ్చ అంటూ పెద్ద పెద్ద మాటలు చిన్న చిన్న విషయాలను కూడ (ఏ. ఫి భన్లోకి సెక్యూరిటీ కారణాల వల్ల రానివ్వట్లేదని) పెద్ద అల్లరి చేసే ప్రయత్నం. ఆ పైగా ఇదంతా మేము అక్కడ ఉండటం వల్ల అక్కడ జరిగే ఘోరాలు జరుపుకోవటానికి వీలు లేదని ఇలా చేస్తున్నరు అని అరోపణ. అరోపణ దేనికి? మీ దగ్గర ఉన్న అధారలను చూపిస్తూ ఒక స్కూప్ చేసెయ్యండి. ఇటు పత్రికకూ మంచి పేరు లేదా టి.వికి మంచి రేటింగు. కొన్ని విషయాలు అలా చెయ్యి మెలి తిప్పడానికి ఉంచుకుంటూ ఉంటారా మరి?? మాకైతే తెలియదు!!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి