Saturday, April 10, 2010

షోయబ్-సానియా నిఖా: ఇన్షా అల్లా...తథాస్తు!

షోయబ్ మాలిక్- సానియా మిర్జాల పెళ్లి సజావుగా సాగడం తెలుగు టెలివిజన్ ఛానెల్స్ కు ఇష్టం ఉన్నట్లు లేదు. వీళ్ళ వ్యవహారం లో ఎంత రచ్చ జరిగితే, అన్ని వివాదాలు తెలెత్తితే మీడియాకు అంత పండగ. అయ్యిందేదో అయిపోయింది...తలాక్ తర్వాత ఆయేషా కుటుంబం పక్కకు జరిగింది, సానియా కూడా ఖుషీగానే ఉంది. షోయబ్ అమ్మాయిలతో జోష్ లో దిగిన ఫోటోలు బైటికి వచ్చినా సానియా లైట్ తీసుకుని అంతనితో నిఖాకు సిద్ధమయ్యింది. ఇక ఈ విషయం అంతటితో వదిలెయ్యకుండా...TV-9 ఈ ఉదయం మరొక అంశం లేవనెత్తింది. 

షోయబ్ తలాక్నామా లో తన తండ్రి పేరు తప్పుగా రాసాడని....తమ ఛానల్ దర్యాప్తులో తేలిందని TV-9 విలేకరి సగం ఉర్దూ, సగం తెలుగులో ఫోన్ ఇన్ లో చెప్పాడు. కాసేపట్లే...ఈ వార్తా దానావాలం లా వ్యాపించి...అన్ని ఛానెల్స్ లో ఎడతెరిపి లేకుండా స్క్రోల్ల్స్ మొదలయ్యాయి. తండ్రి పేరే కాదు...షోయబ్ తన పేరు కూడా తప్పు రాసినట్లు...ఆ పత్రాలను తరచి చూస్తే అర్ధమవుతుంది. ఛానెల్స్ ఉదయాన్నే కొత్త ఫిటింగ్ (ఫైటింగ్) పెట్టి సాయంత్రం దాకా దాని మీద పలు కార్యక్రమాలు జరుపుతాయి. చర్చలు, వాదోపవాదాలు, తగువులు, సిగపట్లు....రాత్రి దాకా నడిస్తే...రేప్పొద్దున మరొక అంశం దొరక్కపోతుందా! గమనార్హం ఏమిటంటే...దాదాపు అన్ని ఛానెల్స్...ఈ వివాదాన్ని కవర్ చేయడానికి ముస్లిం రిపోర్టర్లను రంగం లోకి దింపడం. 

లైవ్ లో ఒక మహిళా జెర్నలిస్టు TV-9 లో దడదడా...గడగడా...మాట్లాడుతూ ఒక సందర్భంలో..."ఈ సమస్యకు సాల్వేషన్..." అని అన్నారు. మంచి మసాలా దొరికిన ఆనందంలో 'సొల్యూషన్' ను 'సాల్వేషన్' చేసారామె. "ఇప్పుడు డెఫినెట్గా సానియా వాళ్ళ వాళ్ళు టీ.వీ.ల ముందు ఉండి ఉంటారు. వాళ్ళు TV-9 చూస్తూ ఉంటారు కాబట్టి....వాళ్ళు దీనిపై ఏమనుకునేది...మనకు తర్వాత తెలుస్తుంది," అని ఆమె కాన్ఫిడెంట్గా చెప్పారు.


ఈ మధ్య ఒక ఇద్దరు ప్రముఖ జర్నలిస్టులను గెస్టు లెక్చెర్స్ కోసం యూనివెర్సిటీ కి ఆహ్వానించాం. ఉదయం ఒక సెషన్, సాయంత్రం మరొక సెషన్. ఇద్దరూ సానియా విషయంలో మీడియా కవరేజ్ ను చీల్చి చెండాడారు. "ఇండియన్ ఎక్స్ ప్రెస్ వరసగా...మూడు రోజులు దీనిపై బ్యానర్ ప్రచురించింది. అదృష్టవశాత్తూ/ దురదృష్టవశాత్తూ...దంతేవాడ సంఘటన జరగబట్టి సరిపోయింది...," అని ఒక మాజీ ఎడిటర్ అన్నారు. ఒకటి రెండు పత్రికలు...ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా...'షోసానియా' అనే పదం వాడాయని ఆయన చెప్పారు. 

ఒక ఛానల్ వాడు...షోయబ్, సానియా, అయేషాల ఫోటో వాడి....షోయబ్, సానియా మధ్య నుంచి ఆయేషా ఫోటో చటుక్కున జారిపొయ్యేలా చూపించాడు...చాలా సేపు. ఈ బుర్రలకు...ఇంత మంచి ఆలోచనలు ఇచ్చిన ఆ దేవుడు వీళ్ళకు...పరువు, మానమర్యాదలు, సిగ్గూ ఎగ్గూ ఎందుకు ఇవ్వలేదో అర్థం కాదు.   


ఈ ఉదయం ఒక సీనియర్ జర్నలిస్టు మిత్రుడు ఫోన్ లో మాట్లాడుతూ..."ఒక ఛానల్ వాడు...'దొంగ నా అల్లుడు' అన్న స్లగ్ తో కథ నడిపాడు. 'దొంగ నా కొడుకు' అన్న మాటకు ప్యారడి అది," అని వాపోయాడు. సానియా కుటుంబం ఈ అంశానికి మతం రంగు పులమకపోవడం ఆనంద దాయకమని ఒకరిద్దరు అన్నారు.

ఇంకొక స్పోర్ట్స్ అనలిస్టు కూడా ఇలాంటి వ్యాఖ్యనే చేశారు. "అబ్బ...ఈ టీ.వీ.లను చూడబుద్ధి కావడం లేదండి. అసహ్యం వేస్తోంది," అన్నారాయన. సానియా విషయంలో మీడియా తీరు జనంలో రోత పుట్టించింది. ఇప్పుడు మనమంతా...ఆ రాముడ్ని, అల్లాను కోరుకోవాల్సింది ఒక్కటే: వీళ్ళిద్దరికీ అర్జెంటుగా పెళ్లి జరిగి...నరమానవుడి కంట పడకుండా...వీళ్ళు ఎటైనా పారిపోయ్యేలా చేయండి. అప్పుడు వాళ్ళకూ హాయి, టీ.వీ.ల ముందు కూచున్నందుకు మాకూ హాయి. ఇన్షాఅల్లా...తథాస్తు!

6 comments:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

నేను చెన్నైలో ఉన్నందుకు ఇప్పుడు చాలా సంతోషిస్తున్నా. ఇలాంటి దిక్కుమాలిన టీవీ చానల్స్ చూసే బాధ తప్పింది.

Wit Real said...

>> నరమానవుడి కంట పడకుండా...


జస్టు, "జర్నలిస్టుల కంట పడకుండా" అంటె సరిపొయెదేమో? ;) ;)

Anonymous said...

emo naku matram anta asahyam anipinchaledu. sania edagadanki ide media help tiskundi. ipudu velli dubailo velli settle autanantondi. Nijame idi too personal vyvaharame. kani malik lanti vedhava tappa ameki marokaru dorakka povadame badhakaram. Oka adapillani addamga mosam cheyadame kakunda publicga humiliate chesina idiotni sania enduku enchukundo ameke teliyali. repu pelli aina tarvata duradrushta vasattu ame lavu aite em chestado papam malik babu? Malik attitude valle sania bhrastu padutondi tappu, evaru sania pellini addukune prayatnam chestunnaranukodam ledu nenu vyaktigatamga. ika tvlu antara? ilati vati mide channels batukutunnay manam chustunnam avi chupistunnay. Vatilone kadu manalo kuda ravaliga marpu? pakkinti vyvaharam anagane asakti chupe mind set unnantavaraku channels e pandhanu manavu. Andulo public ki celebrities mida maree asakti. Danne channels cash cheskuntunnayi. kadantara?

kvramana said...

http://epaper.dnaindia.com/dnabangalore/epapermain.aspx?queryed=20&username=&useremailid=&parenteditioncode=9&eddate=4%2f11%2f2010

Anonymous said...

@ Lakshmi Narayana Sunil VaidyaBhushana:

Happy to know that you are free from Telugu media. Can you please give a link to your blog or mail ID?

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

@Anonymous

I don't have any blog.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి