Monday, April 26, 2010

పిల్లల డాన్సులపై రచ్చ: ఛానెల్స్ సిగ్గుమాలినతనం

సినిమాలలో ముద్దులు హద్దు మీరుతున్నాయంటూ...అన్నిసినిమాలలో ఉన్న ముద్దు సీన్లన్నీ చూపి సిగ్గూ ఎగ్గూ లేకుండా కుతి తీర్చుకునే...తెలుగు ఛానెల్స్ చిన్న పిల్లలను కూడా వదలలేదు. జీ-ఛానల్ లో వచ్చే 'ఆట' అనే రియాల్టీ షో లో చిన్నారుల చేత అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారంటూ...కొన్ని ఛానెల్స్ అలాంటి పిచ్చి సీన్లను ఏరికోరి ప్రసారం చేసాయి. 'డాన్స్ బేబీ డాన్స్..' టైటిల్ కు ప్యారడీ గా సభ్యతను మరిచి 'వాంప్ బేబీ వాంప్..' అన్న శీర్షికను వాడాయి. 

ఈ డ్యాన్స్ ప్రోగ్రాంకు అత్యంత ప్రేక్షకాదరణ తెచ్చిన ఓంకార్ పై పగబట్టినట్లు తన TV-1 లో ప్యారడి ప్రోగ్రామ్స్ చేసిన రవి ప్రకాష్ గారి TV-9 ఈ అంశానికి మితిమీరిన ప్రాధాన్యత ఇచ్చి హంగామా చేసింది. చర్చ మధ్యలో మగ యాంకర్ ను మార్చి ఆడ యాంకర్ ను రంగంలోకి దింపిన N-TV దాదాపు మూడు గంటల పాటు గందరగోళంగా ఒక చర్చ నిర్వహించి ఈ పంచాయితీ నుంచి ఏమైనా లబ్ది చేకూరుతుందేమో అని యత్నించింది. 

Zee ఛానల్ లో పిల్లల డాన్స్ పోటీలకు వేదికగా నిలిచిన ఓంకార్ గారి 'ఆట' ప్రోగ్రాం వివాదాస్పదంగా మారింది. ఆరంభంలో వినూత్నంగా అనిపించిన ఈ కార్యక్రమం తర్వాత శృతిమించి రాగాన పడింది. పట్టుమని పది పన్నెండు సంవత్సరాలైనా లేని చిన్న పిల్లలతో తిక్క డాన్సులు వేయించడం, ఏమి మాట్లాడుతున్నారో తెలియని జడ్జిలతో వెర్రి మాటలు మాట్లాడించడం ఎక్కువయ్యింది. మన వెర్రి జనం...ఎంత బూతు ఉంటే, ఎంత చెత్త ఉంటే...అంతగా ఆస్వాదిస్తారు కాబట్టి...ఈ కార్యక్రమానికి సహజంగానే టీ.ఆర్.పీ.రేటింగ్ పెరిగింది. అది తమ సృజనాత్మకత గొప్పతనం అని ఓంకార్ బృందం మరింత రెచ్చిపోవడంతో వ్యవహారం బెడిసింది. 


ఇలాంటి నృత్యాలు ప్రమాదం అంటూ...ఒక కార్యకర్త (దేవి గారు అనుకుంటా) మానవహక్కుల సంఘానికి ఎక్కడంతో ఈ అంశంపై చర్చ ఆరంభం అయ్యింది. ఓంకార్ కు బాసటగా కొందరు బాల డ్యాన్సర్ల తల్లులు కూడా సంఘం ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారిని కలవడం, ఆయన డజను కెమెరాల సాక్షిగా ఆ తల్లులకు క్లాస్ పీకడంతో కథ రక్తికట్టింది. టైం పాస్ కావడానికి ఇంతకన్నా మసాలా ఏమికావాలి...మన ఛానల్ బాసులకు? 

TV-9 ఈ అంశంపై చర్చ జరిపి పిల్లలను కించపరిచిందని ఆ తల్లిదండ్రుల ఆరోపణ. "అవును...నేను కూడా చూశాను. ఈ ఛానెల్స్ దారుణంగా వ్యవహరించాయి. ఆ పసికూనల పిచ్చి డాన్స్ లను వ్యతిరేకిస్తూ....వాటినే చూపించాయి. ఇది ఘోరం," అని ఈ పరిణామాలు గమనించిన ఒక మిత్రుడు అన్నాడు. "ఈ ప్రోగ్రాం లో ప్రతిభ కనబరిచిన ఒక బాలికను స్ఫూర్తి ప్రదాతగా చూపిన ఛానల్ ఇప్పుడు ఈ ప్రోగ్రాం ను వ్యతిరేకించి పిల్లలను వాంప్ లుగా చూపడం ఏమిటి?" అన్న ప్రశ్నకు ఛానెల్స్ సమాధానం చెప్పాలి.


వుమెన్ ఎలిమెంట్ ఉంటే పై నుంచి కింది దాకా పులకించి...గంటల తరబడి చూపే N-టీవీ ఇదే అదనుగా దాదాపు మూడు గంటల పాటు లైవ్ లో చర్చ జరిపింది. ఒక చలాకీ డాన్సర్ శ్రీ విద్యతో పాటు మరో ఇద్దరు తల్లులు, మన సంధ్య అక్కా స్టూడియోలో దర్శనం ఇచ్చారు. ఎప్పుడూ "మగ వెధవల" దుమ్ము దులిపేసే సంధ్యక్క...మొట్టమొదటి సారిగా పరమ భయంకరమైన దాడికి గురయ్యారు...సాటి స్త్రీల నుంచి. శ్రీ విద్య, సంధ్య కొట్టుకున్నంత పనిచేసారు. 'యే..నువ్వు..ఓయ్...నువ్వు.." అని మాట్లాడుకున్నారు. ఆ తల్లులు సంధ్యక్కను మాట్లాడకుండా నొక్కిపట్టారు. మరొక మహిళా నేత దేవి గారిని, కొందరు కాలర్స్ ను వారు కడిగిపారేశారు.  వాళ్ళ వాదనా మరీ తప్పుపట్టేదిగా లేదు.

"అమ్మా..నువ్వు ఘనంగా మాట్లాడు తున్నావు. చిన్న పిల్లల గురించి ఇష్టం వచ్చినట్లు బూతు మాట్లాడిన ప్రోగ్రాం లో ఎలా పాల్గొన్నావు? నీకు కనీసం ఇది (బుర్ర) ఉండాలి," అని ఒక తల్లి దుమ్మెత్తిపోసింది. 

ఈ ప్రోగ్రాం ఆరంభించిన N-TV యాంకర్ వరప్రసాద్ తలనొప్పితోనో/ వీరితో వేగలేకనో మధ్యలో వెళ్ళిపోగా....'టిన్ గ్లిష్' సుందరి శ్వేత ఒక బ్రేక్ మధ్యలో యాంకర్ గా ప్రత్యక్షమయ్యారు. విషయం సరిగా తెలిసీ, తెలియక శ్వేత తడబడుతూ, పొరబడుతూ, ఆరాటపడుతూ....హాట్ హాట్ చర్చ జరిపారు. ఈ ప్రోగ్రాం ఊళ్ళో బోరింగు దగ్గర అమ్మలక్కలు ఆవేశంగా జుట్టు పీక్కున్నట్టు ఉంది. అయినా...N-TV ఆ పంచాయితీ లో మజా ఆస్వాదించింది.

అసలీ వ్యవహారం చూస్తే....ఈ తెలుగు ఛానెల్స్ కు చిన్న పిల్లల గురించి బాధకన్నా ఓంకార్ మీద ఏడుపు ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. ఓంకార్ గారూ....మరీ వెర్రి ఆలోచనలకు తావుఇవ్వకుండా...సినిమా బిట్స్ పిచ్చ తగ్గించుకొని...కాస్త పిల్లలతో మంచి ప్రోగ్రామ్స్ ఇప్పించండి. పిల్లల్లో.... సృజనాత్మకత వెలికి తీయండి.

21 comments:

Anonymous said...

ఈ ఓంకార్ ఈ మధ్య చాలా ఎక్కువ/ఓవర్ చేస్తున్నాడు

kittu said...

నెనూ ఈ ప్రొగ్రాం చూసిన ప్రతిసారి అనుకునెవాడిని, వాల్ల డాన్స్ గురించి కాదు గాని, వాల్లు మాట్లాడె విధానం సరైనది కాదెమో అని నా అభిప్రాయం. అంటీ నా వుద్దెశం ఆ మాట్లాడె విధానం ఆ వయసుకి కరెక్ట్ కాదెమో.................

Anonymous said...

good informative.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఈ దేశంలో డబ్బూ పదవీ ఉంటే ఏదైనా జరుగుతుంది.వాళ్ళలో ఎవరైనా నడిచి లోపలికి పోలేని వాళ్ళు ఉండి ఉంటే ఆది సాక్షాత్తూ దేవ దేవుడినే వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్ళి ఉండే వాడు.

Saahitya Abhimaani said...

అసలు 14 వయస్సులోపల బాల బాలికల చేత ఇటువంటి కార్యక్రమాలు జరిపించటం నిషేధించాలి. అమెరికాలో Baby's Day out అనే సినిమా తీస్తున్నాపుడు ఆ సినీ దర్శక నిర్మాతలు నా నా చావులు చచ్చారుట, అక్కడ బాలలను వాడుకుని సినిమాలు తీస్తే పాటించ వలసిన నియమ నిబంధనలతో. అయినాగాని వాళ్ళు ఆ నియమాలను పాటించే సినిమాను తీసారుట.

ఇంత పెద్ద దేశం, రెండో పెద్ద ప్రజాస్వామ్యం అని జబ్బలు చరుచుకుంటున్నాము, మనకేవి అటువంటి ఆరోగ్యకరమైన విధానాలు? డబ్బు, పేరు వస్తే చాలు వాళ్ళ పిల్లలను దేనికైనా సరే సై అన్నట్టుగా తయారు చేయటమే కాదా ఇది?

కొన్ని నెలల క్రితం ఒక చిన్న పిల్ల దలైలామా నా స్నేహితుడు అదీ ఇదీ అని మాట్లాడుతూ ఉంది ఆ పిల్ల తల్లి అది ఆసరాగా తీసుకుని ఆమెను దేవతగా చేయబోతే రకరకాల సంఘాల వాళ్ళు పెద్ద ఆల్లరి చేసి తమవరకు పబ్లిసిటీ సంపాయించుకున్నారు. అది ఎక్కడో జరిగిన ఒక కార్యక్రమం.

ఇక్కడ అందరూ చూసే తెలుగు చానేళ్ళల్లో పిల్లల్ని వాడుకుంటూ ఇటువంటి చెత్త చూపిస్తుంటే, ఆ సంఘాలన్నీ మెదలకుండా ఊరుకోవటమేమిటి.

అసలీ చెత్త చూపించే చానేళ్ళతోనే వేగలేక చస్తుంటే చూసారా వాళ్ళు ఎలా చూపిస్తున్నారో అని మరి కొన్ని చానెల్స్ దాన్ని విమర్శ చేస్తున్నట్టుగా నటిస్తూ చెత్తలో పరమ చెత్తను ఏరి మరీ చూపించటం మరో వ్యాపారపు చిట్కానే కాని వీళ్ళకు పిల్లల మీద ప్రేమ కానే కాదు. చెడ్డపేరు ఇతర చానెళ్లకు, అదేదో చెత్త రేటింగుట, అది వీళ్ళకు.

అయినా చూసే మనందరికీ ఉండాలి బుద్ధి.

Anonymous said...

The way Omkaar is managing the Aata for the juniors is controversial as the kids are exposed to many mental tensions and they are dancing to thecinema tunes without knowing the meaning of the lyrics.Romantic songs are different with club dances.Though there is a mixture of various types of songs the club and provocative songs are being prefered.Aata is the bread and butter of Omkaar.It is true he has played a big role in bringing recognition to a number of dancers and choreographers to enter the film industry for recognition for rthe adults.But as far as children are concerned it is too early for them to keep such a heavy burden of Aata type programmes on them which definetely affects their studies.I think most of the child participants of Aatta jr are not going to schools but attending Aata shooting regularly.Does it hold for parents and their kids?
I donot know how the programmes are sponsored.Who is financing the expenditure of dresses of the kids?
Who is bearing the expenditure of the kids during their stay in Hyderabad? It looks Clinic All Clear is sponsoring the studio decoration.If the Aata continues for months together how can the parents from outside Hyd bear the expenditure to stay in city?These arevall my doubts.Can any one clear them?

JP.

sudhakar reddy said...

మొక్కె వ౦గనిది మానై వొ౦గునా?.
అవును నెను చెప్పెది సత్య౦. చిన్ని చిన్ని పిల్లల చేత అలా డేన్స్లు చెఇన్చదమ్ అది తప్పు.
ఇది తప్పు అని చెప్పితె దాన్ని అర్ధ౦ చెసుకొనె స్టేజ్ లొ లెరు వాల్ల పేరె౦ట్స్
చిన్న పిల్లలను మన౦ ఏలా పె౦చితే వాల్లకు పెద్ద ఏదిగిన తరువాత అదే అబ్బుతు౦ది.
వాళ్ళు నేటి భావి భారత పొరులు....వాళ్ళకు నేర్పేది ఈదేనా?.
ఎవరొ దన దాహానికి వాల్లు య౦దుకు బలి కావాలి.
అసలు నన్ను అడిగితె ఆ డేన్స్ లు బ్యాన్ చెయ్యలి.
ఒక పరిమిత వయ్యస్సు లొ వున్న చిన్న పిల్లలకు యది నెర్పినా అది విద్యతొ అ౦తే చదువు తో పాటు మిలిత౦ గా వు౦డాలి.
అ౦దులొ ఏది ఏక్కువ వున్న వల్ల జీవిత౦ అగమ్యగోచర౦ అవుతు౦ది.
ఈ విషయ౦ వల్ల తల్లిద౦డ్రులు తెలుసుకొ౦టే మ౦చిది.
ఇప్పటి ఐనా ఈ రియాలిటీ షొ ల లొ చాలా వరకు సైన్స్ లా౦టి క్విజ్ పోటీలు వు౦టీ పిల్లలకు మేదో వికాసానికి బాగు౦టు౦ది.

Anonymous said...

I havent seen any judges worser than Aata judges. That teena always sounds like she is drunken or something. Omkar is a good person and supporting kids talent but he should know the limits for a healthy business. Aate naa jeevitam...aataku nenankitam is not the right motto for kids.

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

"అసలీ వ్యవహారం చూస్తే....ఈ తెలుగు ఛానెల్స్ కు చిన్న పిల్లల గురించి బాధకన్నా ఓంకార్ మీద ఏడుపు ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. ఓంకార్ గారూ....మరీ వెర్రి ఆలోచనలకు తావుఇవ్వకుండా...సినిమా బిట్స్ పిచ్చ తగ్గించుకొని...కాస్త పిల్లలతో మంచి ప్రోగ్రామ్స్ ఇప్పించండి. పిల్లల్లో.... సృజనాత్మకత వెలికి తీయండి. "

చెత్త కార్యక్రమాలను సమర్పిస్తున్న ఓంకార్ ని మీరు వెనకేసుకురావటం చూస్తుంటే, మీరు కూడ ఆ తాను లో ముక్కేనని, Tv9 చెప్పే "మెరుగైన సమాజం కోసం" లా మీ మీద భ్రమలు పెట్టుకోనవసరం లేదని నిరూపిస్తున్నారు..!!

Anonymous said...

emi teliyani pellala badulu, valla thallithandrulanu ala battalu vesukoni dance cheyamanedi...

appudukaani buddi raadu vallaku

Ramu S said...

డియర్ కొల్లి,
తానులో ముక్కనా? ఇప్పుడు జరుగుతున్నా గొడవ వెనుక ఒక కుట్ర వుంది బ్రదర్. ఓంకార్ వి మరీ చెత్త కార్యక్రమాలు కావని నా అభిప్రాయం. నా మీద మీరు భ్రమలు పెట్టుకోకండి. భ్రమలు ఎప్పటికీ భ్రమలే..
రాము

venkata subba rao kavuri said...

అది ఆట కాదు ఓంకారుకు పట్టిన తీట. బుల్లి నాట్యగత్తెల మమ్మీ, డాడీల బతుకు వారిస్టం. బజార్లోకి వచ్చి భాగోతాలాదితే బదితె పూజ తప్పదు. తన బిద్దా చాక్లెట్ తింటే వాడెవడో దుకాణదారు డబ్బు తీసుకోడని ఓ తల్లి తెగ తెగ తబ్బిబ్బవటం అమాయకత్యమ? అతి తెలివా?. అయినా ఈ ఓంకార్ ఇటీవలే ప్రకాసం జిల్లా కనిగిరి దగ్గర 250 ఎకరాల భూమి కొన్నాడు తెలుసా? రూ. 1.50 కోట్లు + రిజిస్ట్రేషన్ మరి కొన్ని లక్షలు అదనం. ఇంత మొత్తం పిల్లల దేహాల నుంచి దొబ్బిందే కదా? ఆటతోపాటు పసి పిల్లలతో మసక మసక పాటలు పాడించే మరో నాసి కార్యక్రమం కూడా ఓంకార్ కు కోట్లు తెస్తోంది. అంతా డబ్బుకు లోకం దాసోహం.
వెంకట సుబ్బారావు కావూరి, ఈదుమూడి

Anonymous said...

Ramu garu,

You said that Omkar's programmes are not too chetta. This is too much. If it's true, why is AATA Jrs so horrible? Why should children wear those too small clothes and dance for cheap lyrics (cheap atleast for their age)? Children who could not say anything except their name also participated in the programme. Then how do we expect them to understand what they are doing?

My little son watched a few episodes with a lot of interest but I took efforts and gradually diverted his attention. He also expressed a desire to participate in the programme after 1 or 2 years and tried to assure me that he would study well and get good marks. Iam not interested only in 'marks'. I donot mind even if he is 'just pass' provided his behaviour is good. If he is still firm about his participation...I can definitely guide him regarding his clothes, songs that suit his age, his dance master, etc. Let him be disqualified if he doesn't satisfy the (masala) taste of the programme.

Even if a conspiracy is happening behind Omkar, one cannot support him in the case of AATA Jrs. Nobody is commenting about his show in MAA TV where older girls and boys are participating. Though his behaviour is good, there, too, he entertains a LOT of praises and jeehuzoori from the participants. I watched the programme twice and stopped. Iam fed up with these shows, either junior or senior.

The private channels are making a furrore about all this now.But some bloggers have expressed their restlessness and distress over the matter. Several years back, Classical Dancer Shobha Naidu said in an interview on DD that she felt like tying to a tree and hitting those who make children wear indecent dresses and dance for meaningless songs.

Omkar did a wonderful show 'MaayaaDweepam' with children in last summer. He also handled the children very well with lot of affection and warmth. Why not stick to similar programmes in case of children?

A mother of a ten year old kid.

Ramu S said...

I still feel some of the shows done by Omkar were not too bad, ma'am. I agree that he went overboard in recent times. Parents of the budding dancers should have objected to vulgar postures, gestures and dialogues.
I share your concern.
thanks
Ramu

Anonymous said...

Aataa was the foundation of the entertainment career of Omkar with which he is known to every in these days and he was none before Aataa as far viewers are concerned.Though he may be a good proffessional,the way he is handling the Aataa jrs programmes is objectionable as he has been exposing the children to the songs for which the innocent kids donot know any meaning but just follow the recorded song with dances

A few days back Omkaar was physically assaulted and handed over to police station of Choutuppal in Nalgonda dist as his car hit a person on the highway and he avoided the injured and was proceeding without any halt but the local people chased the car and was beaten and handed over to police inspite of telling the people that he is Omkaar, the producer
of Aataa programme of ZEE TV.That was Omkaar,s behaviour in the society and his reputation in the society and the people's response to him.
JP.

Anonymous said...

i watched aata a couple of times. I did not like the programme. It is trash totally. The success of the programme shows the poor taste of the people or either they might not have choice. No space for such pro., in this sensible world.

Anonymous said...

I don't know what Ramu's standards are for what is bad and what is not too bad.

A few months ago Omkar produced and anchored a program on MAA TV (adrushTam, I think) in which the participants have to guess which box contains a singificant prize. The show initially started with some celebrities and was moderately entertaining. After a while, it started featuring small kids from poor families, and it was heart wrenching to see these people vacillate through emotional highs and lows. I actually complained to MAA TV management. For whatever reason, thankfully, the show stopped after a short run.

Unfortunately, it was replaced by another show of Omkar called Challenge, a dance show for older people. Judging by the promo clips and the few bits and pieces I have seen, that seems to be another example of Trash TV where people don't seem to be behaving within norms for public behavior.

తెలుగు వెబ్ మీడియా said...

ఒక ఊర్లో పిల్లలు రియాలిటీ షోకి వెళ్ళడానికి తల్లితండ్రులు ఒప్పుకోకపోతే ఇంట్లో 50 వేలు క్యాష్ పట్టుకుని పారిపోయారు. ఈ కేసుల్లో పారిపోయిన పిల్లల్ని పట్టుకోవడం సులభమే. టి.వి. చానెల్ ఆఫీసుల దగ్గర నిఘా వేస్తే దొరుకుతారు. కొంత మంది పిల్లలు చదువు కంటే రికార్డింగ్ డాన్సులు ముఖ్యమనుకుంటున్నారు.

Ramu S said...

Hi
I am also joining in condemning Omakar's reality show in MAA-TV in which he tortured poor kids. I was appreciating some of his shows he anchored in the initial stages. I appreciate those who made a complaint to MAA management.

Omkar is a talented guy and he can learn from the present controversy to come up with good shows. Its unfair to demand for a ban on his shows. I strongly condemn vulgar and obscene scenes in reality shows, TV news and films.
cheers
ramu

Naagarikuda Vinu said...

I firmly believe that freedom without responsibility is disastrous. I sincerely condemn the attitude of Omkar. After all, TRP isn't everything. Telecast porn on television and I bet it would have the highest TRP any show ever had.The attitude of the parents of aata jr participants is the best example of degrading human values. The attitude of parents has completely changed. I'd like to quote an example here. Hansika was of 16 yrs when she acted in deshamuduru. Now look at the paedophile nature of people in the society, every one enjoyed that poor girl whereas she doesn't have the privilege of enjoying her child/teen hood. The same is the case with shweta basu prasad. The primary points are: 1) Please don't spoil the innocence of child hood by making them to wear such skimpy clothes and participate in such stupid shows. We have several lot of ways to encourage creativity.
2)Parents: Your attitude should change first. By exploiting the childhood, you are nothing dangerous than a broker who does a flesh trade.
3)Audience: Give up your evil nature, for God's sake! Of all creatures on earth, the humans have a separate distinction. Be civilized.

Ramu S said...

Naagarikuda vinu..
Very well said.
thanks for your good words
Ramu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి