Saturday, February 20, 2010

తెలుగు టీ.వీ.ఛానెల్స్ చేసే అతి వల్ల కీడా? మేలా?

ఒక క్రైం స్టోరీ విషయంలో N-TV ప్రజంటర్ పరితోష్ రెండు గంటలకు పైగా లైవ్ లో సృష్టించిన బీభత్సం గురించి...ఒక స్త్రీ, మరొక పురుషుడి మధ్య ఈ గొడవను మీడియా వినోదాత్మకంగా 'బహిరంగ విచారణ' జరపడం గురించి ఇంతకు ముందు "తెలుగు ఛానెల్స్ కు మరొక మాసాలా కేసు దొరికిన్దోచ్..." అన్న శీర్షికతో రాసాను. పరితోష్ ప్రశ్నలడిగిన తీరు పట్ల బైట చాలా చర్చ జరగడం నేను విన్నాను...పరాచకానికి ఆ అబ్బాయిని అనుకరిస్తూ (మిమిక్రీ) నేను కొందరు మిత్రులను ఆనంద పరిచాను. కానీ ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చి పడింది. నాది తప్పో, పరితోష్ ది తప్పో అర్ధం కావడం లేదు. 


మీడియా కనీస ప్రమాణాలు పాటించకుండా...ఒక బాధితురాలిని తెరకెక్కించి...పిచ్చి పిచ్చి ప్రశ్నలతో చాలా సేపు కథనాలు ప్రసారం చేయడం కదా మన ఏడుపు. మరి మీడియా చేసిన ఈ ఓవర్ యాక్షన్ (అతి) వల్లనో, కేసులో నిజంగా దమ్ము ఉండబట్టో...తీగ లాగితే డొంక అంతా కదిలింది. ఆ అమ్మాయి టీ.వీ.లకెక్కి నానా యాగీ చేయడం వల్ల మరికొంత మంది బాధితురాళ్ళు ముందుకు వచ్చి...ఆ ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి తమను కూడా పెళ్లి చేసుకున్నాడని, దారుణంగా వంచించడంతో పాటు...హింసించాడని...వారు బహిరంగంగా ప్రకటించారు. దీనివల్ల...ఇదేదో చిన్న కేసు అనుకున్న నా బోటి వాళ్ళు...అది తీరా పెద్ద స్కాం గా బైటపడే సరికి నివ్వెర పోవాల్సి వచ్చింది. 

ఈ కేసులో ఒక ప్యాట్రను కనిపిస్తున్నది. ఈ అమ్మాయిలు (నిజంగానే చిన్న వయస్సు ఉన్న పేదింటి పిల్లలు వీరు) చెబుతున్నది నిజం అయితే...ఆ పురుష పుంగవుడు...ఇప్పటికి ఏడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పేద పిల్లలను చూసి పెళ్ళాడడం...వారిని ఇంట్లోనే పెట్టుకుని...మరొకామెను చేసుకోవడం...ఇంతకుముందు చేసుకున్న ఆమెను పనిమనిషిగా నమ్మబలకడం...అయ్యగారు చేస్తున్న పనట. ఈ నేపథ్యంలో నా ఎదుట కొన్ని సందేహాలు నిలబడి నాట్యం చేస్తున్నాయి. అవి: 

1) ఈ కేసుకు అంతే ప్రాధాన్యత ఇచ్చి..మీడియా నానా యాగీ చేయడం నిజంగానే తప్పు అవుతుందా? తుది ఫలితం దృష్ట్యా చూస్తే...ఒక బాధిత మహిళకు విపరీతమైన వాయిస్ ఇవ్వడం వల్ల...మిగిలిన బాధితురాళ్ళు బైటికి వచ్చారు కదా! అదే మీడియా...రొటీన్ స్టోరీ గా దీన్ని చూపి...ఆ మొదటి మహిళను లైవ్ లో తీసుకోకపోతే మిగిలిన బాధితురాళ్ళు బైటికి వచ్చే వారు కాదా?


2) మీడియా...ఇలా ఒక కేసుని అప్పుడప్పుడు మాత్రమే హైలైట్ చేయడం సబబేనా? ఇప్పుడు...మీడియా యాగీ చేసిన కేసులు మాత్రమే టేకప్ చేద్దామని పోలీసు వ్యవస్థ అనుకునే ప్రమాదం ఉందా? అలాగే..ప్రతి సమస్య హై లైట్ కావడానికి మీడియాకు ఎక్కడం తప్ప మరొక గత్యంతరం లేదని బాధితులు కూడా భావిస్తారా?

3) నిజంగా ఇలాంటి ఎన్ని కేసులు మీడియా అంత చేటు..ఆ స్థాయిలో చూపగలదు? 

4) పోలీసు, న్యాయ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం వల్లనే మీడియా ఇలా బాధ్యతను నెత్తికి ఎత్తుకోవాల్సి వస్తోందా? మీడియా చేస్తున్నది మంచి పనేనా?
 
5) ఇంత పెద్ద కేసులో...మీడియా ఇంత హడావుడి చేసినా...మన సంధ్య అక్క స్టూడియో చర్చలకు ఎందుకు రాలేదు? (ఇదో సిల్లీ ప్రశ్న. అయినా...నాకు విచిత్రంగా అనిపించి రాస్తున్నా).

9 comments:

Sudhakar said...

Media does not own the prosecution like this. This kind of prosecution can weaken police investigation and sometimes can influence police as well. If you respect law and order, let them handle with their own style and focus.

Media can/should only bring the news out and track it further on the following things..

01. What is the story?
02. How police are responding to this?
03. Since how many days this case is being investigated?
04. Are there any forces being applied on police?

Our media doesnt care anyone beyond 3 days if they do not look like a good stuff to create controversy. This is the fact. We need media to be persistent on values and justice.

Sujata M said...

సంధ్యక్క తెలంగాణా పోరాటం లో బిజీ.

ఒక సారి టీ.వీ. లు వచ్చిన కొత్తలో ఒక కిడ్నాపయిన బాబు, టీ.వీ.లు ఫోటోలూ, వివరాలూ ఊదరగొట్టడం వల్ల (తద్వారా జనం లో కలిగిన చైతన్యం వలనా,) చక్కగా దొరికాడు. అప్పుడూ, టీ.వీ. ని సెహెభాష్ అన్నారు అంతా.

పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు అనడం తప్పు. ఒక వేళ మొదటి మహిళ పోలీసుల్ని ఆశ్రయించి ఉంటే, మిగతా వాళ్ళకి ఆ సంగతి తెలియక, ఇపుడున్న ఐకమత్యం రాకపోయి ఉండొచ్చు. అయితే, మీడియా యాగీ వల్ల మేలే జరిగింది ఈ కేసు లో. ఇంతకీ అబ్బాయిగారికి ఎంత శిక్ష పడుతుందో చూడాలి. బాధితులు కేసు పెడితే తప్ప వాళ్ళు కావాలనుకున్న న్యాయం జరగదు. (Bydway..పంచాయితీలు పెట్టడం వల్ల వాళ్ళకి కావల్సిన న్యాయం ఏమిటా (Compensation?) అని జనానికి డౌట్ వస్తుంది.)

Anonymous said...

సంధ్యగారు నిన్న వనిత టి.వి లో ఈ విషయం మీద చర్చించారండి. నేను మిమ్మల్ని అడిగింది ఈ విశ్లేషణే. ధన్యవాదాలు.
-3rd anonymous in previous post.

సుజాత వేల్పూరి said...

సరేం ఎన్ టీవీ ఈ విషయంలో ఒక మోసగాడి మోసాలన్నీ బయట పెట్టిందే అనుకుందామండీ! అది ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని అది నలుగురికీ తెలియజెప్పడం వరకే పరిమితం కావాలి! నిత్యపెళ్ళికొడుకు వీపు మీద పుట్టుమచ్చలున్నాయా, అవి ఈవిడ ఎలా చూసింది ఈ ఆర్నెల్ల బట్టీ ఏం చేశారు? ఇటువంటి పరువు తీసే ప్రశ్నలు,తెగించిన ప్రశ్నలు వేయకుండా కూడా విషయాన్ని రాబట్టొచ్చు!

విషయాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకురావడం తప్ప పంచాయితీ చేయడం మీడియా పని కాదనుకుంటున్నా!

Anonymous said...

0. dog & donkey have their roles defined in this society. they better dont try to change.

1. your argument is as follows: yesterday I peeped into my neighbor's bedroom. I found some extra marital affair happening there. I did my jasoosi & found a bigger story..........now put the title of your blog here....Nenu Chestunna Ati valla Keedaa?? Melaaa??


yawn...

Anonymous said...

Media shouldc play a constructive,humanitarian,moral and civilised role when the executive is a total inefficient and failure.But unfortnately media has become immoral without any human values as seen in the case of the interview of a girl(deceived) by NTV.Media personnel must be cultured without any obscene interview.Media can make miracles to teach lessons to the government provided it is well behaved with moral,proffessional and ethical values.

JP Reddy

Anonymous said...

I Agree with sujatha madam. Why do you think this was only possible because of "Athi" by the channels. Can the same effect can not be brought if TV channels behave in decent way?

చదువరి said...

"..మన సంధ్య అక్క స్టూడియో చర్చలకు ఎందుకు రాలేదు?" - :)

పరితోష్ నిర్వహించిన ఆ చర్చ కాస్త అతి అయిందని నాకు అనిపించింది. అయితే దానికంటే అభ్యంతరకరమైనది నాకింకొకటుంది.. సందర్భం కాకపోయినా, ప్రసక్తి వచ్చిందికాబట్టి చెబుతున్నాను, ఆ పరితోష్ మాట్టాడే విధానం యాడుల్లో నేపథ్యపు గొంతులాగా చిర్రెతిస్తూ ఉంటది. కాస్త మామూలుగా మాట్టాడాలని ఆయనకు మీద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్షా!

సుజాత వేల్పూరి said...

పరితోష్ గారు వార్తలు చదివే విధానం సినిమా పాత హాల్లో న్యూస్ రీల్ వెనక వ్యాఖ్యానంలాగా ఉంటుంది.:-))

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి