Saturday, February 27, 2010

స్టూడియో-ఎన్ నుంచి ఐ.సత్యనారాయణ నిష్క్రమణ

ఇది నిజంగా దిగ్భ్రాంతి కలిగించే అంశం. తెలుగు జర్నలిజంలో (అటు ప్రింట్ లో, ఇటు ఎలెక్ట్రానిక్ లో) సుదీర్ఘ అనుభవం ఉన్న ఐ.సత్యనారాయణ గారు అనూహ్య పరిణామాల మధ్య స్టూడియో-ఎన్ నుంచి బైటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇది జరిగి వారం అయినా నిజ నిర్ధారణ కోసం మేము వేచి చూశాం. ఆయనపై వేటుకు యాజమాన్యం కారణంగా చూపిన ఒక ఆరోపణ పై విచారణ జరగలేదు కాబట్టి, పరిశ్రమలో ఐ.ఎస్.గారికి అందించడం సబబుకాదని భావిస్తున్నాం.


'ఈనాడు'లో కెరీర్ ఆరంభించి ఆ తర్వాత 'ఈ-టీ.వీ.'కి మారిన ఐ.ఎస్.అక్కడి నుంచి బైట పడిన తర్వాత చాలా చోట్ల పనిచేసారు. మీడియా బూమ్ ఇప్పించిన ఆకర్షణీయమైన జీతాలు కానీ, కొత్త గొప్ప హోదాలు కానీ, పని చేసే వాతావరణం బాగుండడం/ బాగుండకపోవడం గానీ సత్యనారాయణ గారిని పరుగులు పెట్టించాయి. 

'విస్సా' ఛానల్ లో ఒక మంచి టీం ఏర్పరిచిన ఆయన తర్వాత నరేంద్రనాథ్ చౌదరి గారి N-TV కి సంస్థాపక సభ్యుడిగా పనిచేసారు. ఆప్పటికే 'ఈ-టీ.వీ.' నుంచి బైటికి వచ్చి...ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్న ఒక సీనియర్ విషయంలో చౌదరి గారికి, ఐ.ఎస్.గారికి బెడిసింది. తప్పనిసరి పరిస్థితిలో ఐ.ఎస్.గారు బైటికి వచ్చి TV-5 లో పనిచేసారు. అక్కడ కూడా ఆ ఛానల్ ఆరంభంలో బాగా నిలదొక్కుకోవడానికి పాటుపడ్డారు. 

కొన్ని రోజులు 'ఆంధ్రజ్యోతి' పత్రికలో కూడా పనిచేశారని సమాచారం. తర్వాత zee- 24 గంటలు లో అవుట్ పుట్ ఎడిటర్ గా ఉన్నారు. శైలేష్ రెడ్డి బృందంలో ప్రశాంతంగా ఉండే ఆయన...ఉన్నట్టుండి ఇటీవలనే మంచి పదవి/జీతం తో నార్నే వారి Studio-N లో చేరారు. N-TV లో కీలక పదవిలో ఉన్న రామచంద్ర కూడా అక్కడ చేరడం, చంద్రబాబు తనయుడు ఈ ఛానల్ ను సీరియస్ గా తీసుకుని శ్రద్ధ పెట్టడం..వల్ల ఈ ఛానల్ ఇప్పుడిప్పుడే పైకి ఎగాబాకుతున్నది...టీ.ఆర్.పీ. రేటింగ్ లో. ఇంతలో ఈ పరిణామం.

"సార్ పై నార్నే వారు చేసిన ఆరోపణ విని నేను షాక్ తిన్నాను. ఆయనతో నేను చాలా ఏళ్ళు పనిచేసాను. ఆయన సౌమ్యుడు. జోవియల్గా ఉండే వ్యక్తి," అని ఒక సీనియర్ జర్నలిస్టు అన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని ఐ.ఎస్. చేరదీయడం నార్నే వార్కి నచ్చలేదని కొందరు, Studio-N లో ఉన్న ముఠాలు ఈయనకు వ్యతిరేకంగా కుట్ర చేశాయని మరికొందరు అంటున్నారు. ఐ.ఎస్.గారికి మేలు జరగాలని కోరుకుందాం.

HM-TV లో రామానుజం గారి శిక్షణ?

తెలుగు మీడియా గురించి ఎవరైనా సీరియస్ గా పుస్తకం రాస్తే...శ్రీనివాస రామానుజం అనే తమిళుడి గురించి ఒక చాప్టర్ రాయాల్సి ఉంటుంది. రామోజీ కుడి భుజంగా, ఇప్పుడు మూత పడిన 'News Time' అనే ఆంగ్ల పత్రిక ఎడిటర్ గా ఆయన పనిచేసారు. కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు, చాలా మంది ఉద్యోగాలు పీకి శాపనార్ధాలు మూట కట్టుకున్నారు. రామోజీ సలహా దారుల్లో ఈయన అత్యంత ముఖ్యులని చెబుతారు. 



ఈ-టీ.వీ., ఎన్.-టీ.వీ.లు నెలకొల్పడంలో కీలక భూమిక పోషించిన ఎస్.ఆర్.ఆర్. ఒక మంచి వెబ్ సైట్ (http://www.mediawhistle.org/) నిర్వహిస్తున్నారు. దాదాపు విశ్రాంత జీవితం గడుపుతున్న ఆయన కపిల్ చిట్ ఫండ్స్ వారు త్వరలో ఆరంభించబోయే జర్నలిజం కాలేజ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. 


ఒక ఈ-మెయిల్ లో దీన్ని సార్ నాకు నిర్ధారించారు. కానీ...నాకు నమ్మబుద్ధి కాలేదు. ఆ ఛానల్ వారి ఇంగ్లీష్ బులెటిన్ బాధ్యతలు ఎస్.ఆర్.గారు స్వీకరించే అవకాశం ఉంది. ఆ బాధ్యతలు చూసిన 'ది హిందూ' మాజీ న్యూస్ ఎడిటర్ కురియన్ అక్కడి నుంచి తప్పుకుని ఆ పత్రిక మాజీ జర్నలిస్టు సాయశేఖర్ మొదలెట్టిన ఒక బిజినెస్ పోర్టల్( http://www.andhrabusiness.com/) లో చేరారు. Wish you good luck Mr.SR.

6 comments:

Ramu S said...

Correction:
మొదటి పేరా చివరి వాక్యాన్ని
.".....పరిశ్రమలో ఐ.ఎస్.గారికి ఉన్న మంచి పేరు దృష్ట్యా...ఆ వివరాలు అందించడం సబబు కాదని భావిస్తున్నాం," అని చదువుకోగలరు. అది తొందరలో దొర్లిన పొరపాటు.
---రాము

jeevani said...

అన్నా IS గారితో నాలుగేళ్ళు పని చేశాము. ఎన్ని సమస్యలు బాధలున్నా ఆయన కనిపిస్తే అన్నీ మాయం. జీవితాన్ని, సమయం అనే కత్తి వేలాడే జర్నలిజాన్ని చాలా తేలిగ్గా తీసుకునేవారు. కానీ అద్భుతమైన ప్లానింగ్. ఆయనతో కలిసి షిఫ్ట్ లో ఉండటం సరదాగా చాలా బావుండేది. మా మంచి మనిషి IS గారికి మరో మంచి అవకాశం రావాలని మన్సారా కోరుకుంటున్నాను.

Unknown said...

ఆయనపై అనవసరంగా చేసిన ఆరోపణలను ప్రస్తావించనందుకు ధన్యవాదాలు. ఐ.ఎస్‌. లాంటి ఉన్నత వ్యక్తిపైన అలాంటి ఆరోపణ చేసిన వారు నిజంగా సిగ్గుపడాలి. ఆయనతో పనిచేసిన ఎవరికైనా.. ఆయన గురించి పూర్తిగా తెలుసు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన ఎంతో గుండెధైర్యంతో ఉండాల్సి ఉంది.
www.24gantalu.co.cc

Ramu S said...

పేరు తప్పు....
ఆయన పేరు 'శ్రీనివాస రామానుజం' కాదని 'శ్రీ రంగ రామానుజన్ (ఎస్.ఆర్.ఆర్.)' అని నాకు ఒక గురువు గారు మెయిల్ పంపారు. నిజానికి రాసే ముందు ఆయన వెబ్ సైట్ కూడా చెక్ చేశాను. అందులో 'రామానుజన్ శ్రీనివాస' అని ఉంది. దాని వల్ల పొరపాటు జరిగింది. అలెర్ట్ చేసినందుకు థాంక్స్ సర్. పేర్లు తప్పు రాయకూదదన్నది జర్నలిజంలో బేసిక్ రూల్ మరి. తప్పు చేస్తే ఒప్పుకో మన్నారు. సో...సారీ.
--రాము

రాజు said...

మహా టి.వి గురుంచి తెలుసుకోవాలని ఉంది. దాని గురుంచి కూడా చెప్పగలరు.

srinivas said...

అన్నా.....,
జర్నలిజం లో నాలుగేళ్ళ క్రితమే అడుగు పెట్టిన చిన్న జర్నలిస్టుని. ఐఎస్ గారు రేండేళ్ళగా తెలుసు.
ఆయన మంచి మనిషి, ఎవరికి హాని చేయాలనుకోరు.
స్టూడియో ఎన్ అయన మీద మొపినది నిరధార ఆరోపణ.
యాజమాన్యం నిజాన్ని త్వరగానే గ్రహించినట్లుంది.
ఐఎస్ గారిని తిరిగి తీసుకొచ్చారు...., సంతోషం.
ఆయన మీద చేసిన ఆరోపణ ప్రచురించనందుకు ధ న్యవాదాలు

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి