కోతికి కొబ్బరికాయ దొరికినట్లే... మన తెలుగు టెలివిజన్ ఛానెల్స్ కు మరొక గరం మసాల స్టోరీ దొరకడంతో పండగ చేసుకుంటున్నాయి. ఆ మధ్యన విజయవాడకు చెందిన ఒక వివాహిత...కార్తీక్ అనే కుర్రోడు తనపై సైబర్ క్రైం కు పాల్పడి మానసికంగా వేధిస్తున్నాడని ఛానెల్స్ గడప తొక్కి అల్లరి అల్లరి అయ్యింది. ఆమెను, కుర్రోడిని లైవ్ లో తీసుకుని...TV-9 రజనీకాంత్ లాంటి వాళ్ళు జడ్జి పాత్ర పోషించి నానా యాగీ చేసారు.
లేచిపోవడాలు, అక్రమ సంబంధాలు, ఆడవారి బాధలు, కన్నీళ్ళ తో వ్యాపారం చేసుకునే.... మన ఛానెల్స్ కు ఇలాంటి మరొక ఓవర్ డోస్ మాసాలా కథనం దొరికింది. ఈ కేసులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరొక వివాహిత...విశాఖపట్నం కు చెందిన ఒక సినిమా హాల్ యజమాని కొడుకును నవంబర్లో పెళ్లాడిందట. ఆ తర్వాత తెలుసుకుందట...సారుకు ఇది ఎనిమిదో పెళ్లి అని, అప్పటికే ఆయనకు ఒక పెళ్లీడు కూతురు కూడా వుందని. ఆమె కథనం ఎంతవరకూ నిజమో గానీ...న్యాయం కోసం ఆమె ఛానెల్స్ ని ఆశ్రయించింది.
ఇలాంటి కేసులలో బాధితులైన ఆడ పిల్లల ముఖాలు చూపకూడదన్నది జర్నలిజంలో మౌలిక సూత్రం. ఈ కథనం ముందుగా ప్రసారం చేసిన రవిప్రకాష్ బృందం మంగళవారం నాడు ఆ అమ్మాయి ముఖం చూపకుండా వార్త ప్రసారం చేసింది. అయినా...స్టోరీ కి ఊపు రాలేదని అనుకున్నదో ఏమో గానీ...ప్రైం టైం కల్లా ముసుగు తీసేసి...ఆ అమ్మాయిని డైరెక్టుగా చూపిస్తూ తన నైజం చాటుకుంది.
ఆ మర్నాడు, అంటే బుధవారం, మరికొన్ని ఛానెల్స్ ఈ స్టోరీని ఫాలో అప్ చేసాయి. నేను...ABN- ఆంధ్రజ్యోతి చూసినప్పుడు మూర్తి అతగాడిని (అంటే...ఆరోపణలు ఎదుర్కుంటున్న వైజాగ్ బాబును) లైవ్ లో తీసుకుని...ఆ అమ్మాయిని ఫోన్ లో పలకరిస్తూ....పంచనామా చేస్తున్నారు. తనకు తెలిసిన నైతిక ప్రమాణాలను పాటిస్తూ మూర్తి ఈ కేసును డీల్ చేసారు. మిగిలిన ఛానెల్స్ కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించి ఉంటాయి...తప్పకుండా. ఎందుకంటే...కోతికి కొబ్బరికాయ దొరికితే ఆగలేదు కదా!
బుధవారం రాత్రి పొద్దుపొయ్యాక...ఒక పాత మిత్రుడు అలర్ట్ ఎస్.ఎం.ఎస్. ఇస్తే..గబాగబా వెళ్లి N-TV పెట్టాను. అప్పటికే...నవ నాగరికుడు (అంటే ఇంగ్లిష్ ను తెలుగుగా మాట్లాడే సార్) పరితోష్ ప్రజంటర్ ఉన్నారు. తెర మధ్యలో ఆయన ఉండగా ప.గో.జిల్లా పూళ్ళ నుంచి తల పట్టుకుని దీనంగా ఆ అమ్మాయి...విజయవాడ నుంచి తన తండ్రి, మరో మిత్రుడుతో కలిసి ఆ సో కాల్డ్ రసిక రాజు గారు లైవ్ లో ఉన్నారు. ఇక పరితోష్...భయంకరమైన జడ్జి పాత్ర పోషిస్తున్నారు.
ఆ కార్యక్రమం...ఎలాంటి సెన్సార్ లేకుండా దారుణంగా నడిచింది. ఆ అమ్మాయి తమ ఇంట్లో 'హౌజ్ కీపర్' గా చేరి ఇప్పుడు యాగీ చేస్తున్నదని...అటు పక్క ఉన్న ముగ్గురు అంటుంటే..."కాదు...నేను..తాళి కట్టించుకున్న ఎనిమిదో భార్యను. మోసపోయిన దాన్ని," అని ఆమె వాదిస్తున్నారు. మధ్యమధ్య లో పరితోష్ ఒక జడ్జి లాగా తెలిసీ తెలియని వెర్రి ప్రశ్నలు వేస్తూ ప్రోగ్రాం రక్తికట్టించే ప్రయత్నం చేసారు.
"ఏమండీ...ఈమే మీ పనిమనిషి అంటున్నారు కదా. పని మనిషికి ఇన్ని వ్యక్తిగత సన్నిహిత విషయాలు ఎలా చెప్పారు? అంత ఫ్రీ టైం ఉండేదా మీకు?", "పెళ్లి అయినట్లు చెబుతున్న సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ ఏ కార్యకలాపాలు చేసారు?," "మీ వీపు మీద పుట్టు మచ్చ ఉందని ఆమె అంటున్నారు. అసలు పుట్టు మచ్చ ఎలా చూసింది?," వంటి...పలు రకాల ప్రశ్నలు న్యాయమూర్తి పరితోష్ సంధించారు. అంతకు ముందు..ఆ వ్యక్తి తనకు పంపిన ఎస్.ఎం.ఎస్.లు చూపిందట. "మెసేజ్ లు N-TV కి చూపిన....(బాధితురాలు)" అని స్క్రీన్ లో పైన వేసుకున్నారు.
మరొక పక్క...ఆమె...వాడు ఏనుగులా ఉన్నాడని...కోస్తే...పది ఊళ్లకు సరిపోతాడని...అతని తండ్రి తనను లంజ (బ్లాగర్ నోట్: చేయక తప్పని ఈ పదప్రయోగానికి క్షంతవ్యుడిని) అని అనే వాడని...ఏకరువు పెట్టింది.
"ఏమండీ..ఇప్పుడు కాపురం చేస్తానని ఆయన అంటే...వైజాగ్ వెళ్తారా?" అని కూడా పరితోష్ బాబు ప్రశ్నించాడు. ఇలా N-TV సుదీర్ఘ కాలం పాటు స్టూడియోలో పంచాయితీ చేసింది. "రేపు (గురువారం) సాయంత్రానికి వాళ్ళను అరెస్ట్ చేయకపోతే...వైజాగ్ లో నా డెడ్ బాడి చూస్తారు," అని ఆమె మూడు నాలుగు సార్లు హెచ్చరించింది. కాస్త నాగరికుడు కాబట్టి పరితోష్..."మీకు న్యాయం జరుగుతుంది. పోలీసుల మీద నమ్మకం ఉంచండి," అని ఒక మంచి సలహా ఇస్తూనే..."వారికి వ్యతిరేకంగా మంచి ఆధారాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి," అని కూడా సెలవిచ్చారు.
"ఇలా మాట్లాడితే మిమ్మల్ని బొక్కలో తోస్తారు," అని ఒక దశలో ఆ అమ్మాయి అంటే..."బొక్కా? బొక్క బొక్క అంటున్నావ్..బొక్క అంటే ఎలా వుంటుందసలు?," అని అబ్బాయి తండ్రి అతి తెలివితో వ్యంగ్యంగా అడిగారు. "శివ సుబ్రహ్మణ్యం (అమ్మాయి మొదటి భర్త) మెడలో వేసిన పుస్తెల తాడు ఎందుకు ఉంచుకున్నావ్? వెళ్లి అతనితో కాపురం చెయ్యి, పిల్లలను కను," అని ఆ ముసలోడు ఆ అమ్మాయికి సలహా ఇచ్చాడు.
ఏమిటండీ..ఈ దారుణం? ఆ చెత్త జనాలకు అవసరమా? మీవి 24 గంటల ఛానెల్స్ కాబట్టి, మీకు లైవ్ వ్యాన్స్ ఉన్నాయి కాబట్టి...ఈ చెత్త అంతా జనం భరించాలా? నిజంగా మీ 'స్టూడియో పంచాయితీ' వల్ల వాళ్లకు ఇసుమంత న్యాయమైనా జరుగుతుందా?
చానళ్ళ యజమానుల కూతుళ్ళకో, ఇతర కుటుంబీకులకో ఇలాంటి అన్యాయం జరిగితే...ఇలాగే...బహిరంగ విచారణ చేస్తారా? ఒక బాధితురాలిని ట్రీట్ చేసే విధానం ఇదేనా? పోలీసులు, కోర్టులు చేయాల్సిన పనిని వినోదం కోసం మనం ఎందుకు ఇలా డీల్ చెయ్యాలి? పరిణామాలతో సంబంధం లేకుండా...ఇలా బరితెగిస్తే...సమాజానికి మనం ఏమి మెస్సేజ్ పంపుతున్నట్లు? మానవత్వం మారిస్తే....సిగ్గుఎగ్గూ విడిస్తే ఎలా?
Thursday, February 18, 2010
Subscribe to:
Post Comments (Atom)
18 comments:
You are perfectly correct more than hundred percent.When Kareem of TV9 was attacked with acid due to his affairs with a news reader of same channel it totally ignored it and never interviewed the lover couple and not bothered to tell the informers what happened to the love story.There are many such interesting affairs among many of them but they are not dare enough to bring to the small screen whereas they never hesitate to give live coverages of the affairs of others 24 hours a day humiliating them and harassing mentally.
చానళ్ళ యజమానుల కూతుళ్ళకో, ఇతర కుటుంబీకులకో ఇలాంటి అన్యాయం జరిగితే...ఇలాగే...బహిరంగ విచారణ చేస్తారా? మంచి మాట.
కాని, ఇటువంటివి జరిగినప్పుడు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న ఇద్దరిని లైవులో ఇలా చానెళ్ళు చూపించకూడదని ఒక కోర్టు ఆర్డరు ఈ మధ్య చదివిన గుర్తు.
I think Ramu,there should be a mechanism to edit the live prograames like this.Paritosh should have cautioned the lady to mind her language.Filthy accent and language like this is not going to help any body.Also,when this casr goes to Police,NTV ( Paritosh) should be called to the scene as he might have done more harm,then good to the victims.
ABN షో చూసినపుడే జుగుప్స కలిగింది. NTV లో షో దానిని మించిపోయిందన్న మాట.
ఆయన పేరు పరితోషా?! ఆయన భలే వెరైటీగా చదువుతారండీ వార్తలు!
ఈ న్యాయమూర్తి గారు వేసిన ప్రశ్నలు నాక్కూడా మతి పోగొట్టాయి.ఆ అమ్మాయి కూడా చక్కగా ఏమీ అభ్యంతరం లేకుండా "ఓపెన్ గా" మాట్లాడింది.అదృష్టవశాత్తూ చీదరపుట్టి చివరి వరకూ చూడలేదు కాబట్టి అబ్బాయి గారి తండ్రిగారి అమృత వాణి వినలేదు. దేవుడా! థాంక్సులు!
ఈ చెత్తంతా జనాలకు అవసరం లేనే లేదు. ఆమెకు ఇది ఎన్నో పెళ్ళో, ఆయనకు పదహారో పెళ్ళో, ఇవన్నీ మేము తెలుసుకోవాలని అనుకోవడమే లేదు లేదు లేదు! అది పక్కాగా వాళ్ళ పర్సనల్ గొడవ. ఇదంతా జనాలకు చూపిస్తూ పంచాయితీ చెయ్యక్కర్లేదు.
ఛానెళ్ళ యాజమాన్యానికి అంత సరదాగా ఉంటే ఇద్దరినీ కూచోబెట్టి మాట్లాడమనండి.రెండు పార్టీల అత్యంత వ్యక్తిగత విషయాలను వాళ్ళను మాత్రమే వినమనండి!
ఇలాంటి పంచాయితీలు న్యూస్ ఛానెళ్ళు చెయ్యడానికి వీల్లేదు.పోనీ ఈ కేసును ఫాలో అప్ చేసి పోలీసుల ద్వారనో, మరో రకంగానో బాధితులకు (ఇంతకీ బాధితులెవరో ఇక్కడ! ప్రేక్షకులు కాకుండా...ఇంకా) న్యాయం జరిగేలా చూస్తామని ఏదైనా హామీ ఇస్తారా లేక పుట్టుమచ్చలు, కాపరాల గురించి ప్రశ్నలు వేయడమేనా?
"చానళ్ళ యజమానుల కూతుళ్ళకో, ఇతర కుటుంబీకులకో ఇలాంటి అన్యాయం జరిగితే...ఇలాగే...బహిరంగ విచారణ చేస్తారా? .." good question!
I hope there is rivalry between channels and one channel mounts a sting operation on the other as to how they are collecting news or not telecasting a news or sometimes creating news.
With the present day of professional courtesy channels are showing each other, the bad elements in journalism are proliferating.
A little bit of rivalry and sting operations on each other would put an end to this bad specimens in the field of TV journos who think that they cannot be touched for any thing and they came to planet Earth straight from Heaven themselves being Gandharvas.
బాధితురాలి ముఖం ప్రేక్షకులకు చూపించకూడదు, లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడేవారు ఎటువంటి అసభ్యమైన పదజాలం వాడినా దాన్ని వినిపించకూడదు. ఆ పదం లేక వాక్యం బీప్ సౌండుతో కవర్ చేసేవారు కొంతకాలం క్రితం వరకు. అంటే ఇప్పుడు ఈ రకమైన కనీస ప్రమాణాలు కూడా గాలికి వదిలేస్తున్నారన్నమాట.
Some demands from ethical journalists (a moron from the breed of ramu & co):
1. paritosh like reporters should be given bullet proof jackets, police protection. He is at the risk of thrashed by all the audience of that program
2. karim like reporters should be given bullet proof jackets, helmets etc.. to save themselves from acid attacks
3. reporters who involve in settlements of civil disputes, should be provided with adequate security (paid by public exchequer...those reporters are doing public service..)
Ee post bagundi. Ilanti kantalu vetikitey anni channels ninda avey. Sakrama sambandhalu vunna vallanu vetakatam kastam avutondi. NTVlo ila personal life lo bhrastulaku sambandhinchi oka nela program nadapa vacchu. Chowdari gurivenda..!
Vivek.
చానెల్స్ మారుస్తుంటే ABN లో ఈ ప్రోగ్రాం వస్తుంది. ...నేనయితే రెండు నిమిషాల్లోనే తేరుకుని చానెల్ మార్చేసాను. మీరెలా భరించారండీ బాబూ !
ఇటువంటి వీధి పంచాయితీలు, చీకటి భాగోతాలు ఎవరికయినా వినోదం కలిగిస్తాయా ? కంపరం కలిగిస్తాయికానీ
మీరు " బాధితురాలు" అన్నారుకానీ , నాకయితే బాధితులం మనమే అనిపిస్తుంది. ఏంచేస్తాం అంతా మన ఖర్మ
Hi Ramu garu,
na peru kuda RAMU,Media antey respect tho abhimanam tho na business vadulukoni mare ee media job lo join ayyanu, Ayyaka telisindhi media antha chetta rochu world lo yekkada undavu ani.ikkada unna rajakeyalu mare yekkada levu ani,nenu join ayyenapptai nunchi chusthunna media antha ladies chuttara matramey tiruguthundhi ,manshi chuttu yekkada tiragadam ledhu,"Rendu chetulu kaliptheney sound vasthundhi" tappa antha oka konam lonchi chusi daneney present chesthunaru asalu nija nirdarana satya anweshana lekunda stories yela present chestaru.prajalaki nijam matramey kavali Sodi vaddhu.
thanking you
ఈ మీడియా రాను రానూ మరీ చెత్తగా తయారౌతూంది.చచ్చిన కళేబరాన్ని పీక్కుతినే జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు.మన మీడియా మిత్రులకు నాదొక సలహా.దీన్ని ఫాలో అయితే టీ ఆర్ పీ పయింట్లు బాగా పెరుగుతాయి.మునిసిపాలిటీ కొళాయిల దగ్గర జరిగే గొడవలు లైవ్ చూపించి అక్కడి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే కావలసినంత మసాలా, మజా వస్తాయి.మీకు తెలెసిన వాళ్ళు ఎవరైనా వుంటే తెలెయచేయండి.వెంటనే వెళ్ళి వాలిపోతారు.
నేను అల్ రెడీ ... న్యూస్ చానల్స్ ని ఎంటర్ టైన్మెంట్ చానల్స్ లిస్టు లో పెట్టేసాను.. సో నేను ఎన్తెర్తిన్మేంట్ చానల్స్ పై కామెంట్ చెయ్యను.. అవి మనల్ని నవ్విన్చాదానికే..
That same Paritosh did another programme on Thursday with three innocent girls. Apparently there is a dispute between the girls' parents. The father of these children is not happy with his wife since she has some 'illicit' relationships. So, this anchor was keen on knowing what their mother used to do when the father was out on job. Not knowing that they were being used for entertainment purpose, the kids told the story.
Bloody *****
Ramana
One more masala story to our sadistic Telugu channels.A tenth class student and a 22 year old school teacher getting married and The Human Rights commission summoning the purohith who conducted marraige at Yadagiri gutta.PLEASE KEEP THE REMOTES READY TO SWITCH OFF THEM.
JP.
sir
very good quetionaire in the end
sir we should ban all these types of programmes
మొదటి అనానిమస్ కామెంట్ నాదే.మీరు చెప్పిన రోజు ప్రోగ్రాములు మాత్రమే చూస్తే నిజంగానే ఆ అమ్మాయి మీద, టి.వి చానళ్ళ మీద చిరాకు రావడం సహజమే.
ఈ కేసులో పోలీసులు కూడా తీసుకోని చొరవ పబ్లిసిటీ కోసమైతేనేమి, టి.ఆర్.పి కోసమైతేనేమి టి.వి చానళ్ళు తీసుకోవడం వల్లే ఆ అమ్మాయే కాకుండా, ఇంకో ఇద్దరు బాధిత అమ్మాయిలు కూడా బయటకొచ్చి వాడు వెధవని అందరికీ నిరూపించగలిగారు అనిపిస్తూంది. ఈ కోణంలో ఒక టపా రాయగలరా?
క్షమించాలి. మొదటి అనానిమస్ కామెంట్ కాదు. మూడవ అనానిమస్ కామెంట్ (ABN షో చూసినపుడే జుగుప్స కలిగింది. NTV లో షో దానిని మించిపోయిందన్న మాట.), 17వ కామెంట్ నాది. నా అభిప్రాయం మొదటి అనానిమస్ గారి అభిప్రాయం అన్నందుకు అపార్థం రాకుండా ఈ కామెంట్ ను కూడా ప్రచురించండి.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి