'ఆంధ్రజ్యోతి', 'సాక్షి' వంటి పత్రికలు ఎన్ని ఉన్నా...'ఈనాడు' చదివితే తృప్తిగా ఉండేది--చాలా రోజుల కిందటి వరకు. కొన్ని రోజులుగా ఈ పత్రిక మొదటి పేజీ చూస్తే...అక్కడ 'సం థింగ్ ఈజ్ సీరియస్లీ గోయింగ్ రాంగ్' అని అనిపిస్తున్నది.
మొన్ననే 'ముస్లిం కోటా' పై రిజర్వేషన్ల వార్త ప్రచురిస్తూ...మొదటి పేజీ లో ప్రముఖంగా జడ్జిల ఫోటోలు (చట్టాన్ని సమర్ధించిన వారు, వ్యతిరేకించిన వారు అని) తెలివితక్కువగా ప్రచురించారు. ఈ రోజు "మాతో ఆటలొద్దు" అన్న శీర్షిక కింద మొదటి పేజీలో ప్రచురించిన వార్తకు ఛీర్ లీడర్స్ గ్రూప్ ఫోటో ఒకటి వాడారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిజం, రవి బాబు జర్నలిజం....రామోజీ జర్నలిజం కాదు.
రామోజీ స్థానంలో ఇప్పుడు ఆ పత్రికను నడుపుతున్న కిరణ్ బాబు మార్కు జర్నలిజమేమో తెలియడం లేదు. గతంలో 'ఈనాడు' ఏదో పచ్చ పార్టీ భజన చేసేది కానీ...ఇలా ఛీప్ ట్రిక్స్ కు పాల్పడలేదు. సినిమా పేజీలో నిన్న వేసిన శివమణి ఫోటో, అంతకు ముందు వాడిన మరొక నటీమణి ఫోటో బరితెగింపు గా ఉన్నాయి. దీన్ని అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదనుకుంటా.
ఇప్పుడున్న పోటీ లో ఆడవాళ్ళ శరీరాలు చూపకుండా వ్యాపారం చేయలేమని కిరణ్ గారు తాను నమ్మే తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నమ్మితే ఆంధ్ర జనం ఏమీ చేయలేరు. కానీ....సార్..మీ నాన్న గారు ఈ పిచ్చి ఫోటోలు వాడకుండానే...పత్రికను చాలా ఏళ్ళు అగ్రస్థానంలో నిలిపారే! ఇది ఫోటోల వ్యవహారం. ఇక ప్రాధాన్యతలు.
కావాలనో, ప్రయారిటీలు తెలిచ్చావకనో...ఈ మధ్య 'ఈనాడు' మొదటి పీజీని మన రోశయ్య బాబాయ్ తో నింపేస్తున్నారు. మీడియా రంగంలో ఏకు మేకై కూర్చున్న వై.ఎస్.ఆర్. కుమారుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అడ్డుకోవడానికి రోశయ్యని 'ఈనాడు' గ్రూపు భుజానవేసుకున్నదన్న మాట జనంలో నలుగుతున్నది.
ఇది నిజమేనా అన్నట్లు....నిన్న, ఇవ్వాళ రోశయ్య గారు మొదటి పేజీ శీర్షికను ఆక్రమించారు. 'సమష్టి బాధ్యత లేదా?' అని రోశయ్య మంత్రులపై గరం గరం అయినట్లు శీర్షిక ఇస్తూ..."అధికార పార్టీ ఎం.పీ.పత్రిక తీరుపై అసంతృప్తి" వెలిబుచ్చినట్లు ఒక డెక్ పాయింట్ పెట్టారు ఈ రోజు. రోశయ్య గారి ఫోటో పెద్దది ఒకటి, చిన్నది ఒకటి మొదటి పేజీలో వాడారు.
ఇక నిన్న..."ఢిల్లీ చూస్తోంది" శీర్షికతో రోశయ్య మంత్రివర్గ సహచరులతో మాట్లాడుతున్న ఫోటో..ఒక పెద్ద వార్త మొదటి పేజీలో ప్రచురించారు. మొన్న, నిన్న మంత్రులతో ఆయన మాట్లాడిందే...'ఈనాడు'కు మొదటి పేజీ వార్త అయ్యింది. మరీ ఘరంగా "మందుల్లేని రోగం" అనే శీర్షికతో...దవాఖానాల మీద "న్యూస్ టుడే" యంత్రాంగం చేసిన ఒక మంచి ప్రజోపయోగమైన వార్తను నిన్న రోశయ్య వార్త కింద వ్యాపార ప్రకటనల నడుమ సమాధి చేశారు. ప్చ్..'ఈనాడు.'
నాణ్యమైన సీనియర్లను నాజూగ్గా సాగనంపి...ఉన్నవారికి ప్రమోషన్లు, అవకాశాలు ఇవ్వకుండా...మన కులం గోత్రం ఉన్న నయా మేధావి వర్గాన్ని కోర్ టీం గా ఏర్పరిచి...సరుకున్నా... లేక పోయినా పెద్ద పదవులు కట్టబెట్టి...వారే మహా మేధావులుగా నమ్ముతూ... మీడియా నడిపితే...జరిగే నష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి 'ఈనాడు' ఇప్పుడు ఒక మంచి కేస్ స్టడీ.
-----------------------------------------------
నోట్: "ఈనాడు" సంపాదకీయం (ఎడిటోరియల్) లో పడిగట్టు పదాల భాషా విన్యాసంపై ప్రత్యేక కథనం...త్వరలో...
Thursday, February 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
17 comments:
మీరింకో విషయం గమనించారా! సండే స్పెషల్ లో కొత్తగా జాతక ఫలాలు అందిస్తున్నారు, ఇంతవర్కు ఎన్ని పత్రికలు ఈ కాలమ్ నిర్వహించినా కూడా ఈనాడు ఎప్పుడు జాతకాలు ప్రచురించలేదు.
ఆ నలుగురు సినిమాలో రాజేంద్రప్రసాద్ డైలాగొకటుంటుంది, "కష్టేఫలి అన్నారు కాని రాశేఫలి అని ఎవరు అనలేదు". ఈ సినిమా చూసినప్పుడల్లా ఈనాడు గుర్తుకొచ్చేది. ఇప్పుడు ఇంక గుర్తు రావడానికి ఇంకేం లేదు.
@కన్నగాడు:
ఇదే సంగతి నేను రాయబోయాను, తీరా చూస్తే మీరు రాసేశారు.
కమ్యూనిస్టు పత్రికలతో సహా అన్ని పత్రికలూ రాశి ఫలాలు వేస్తునా ఈనాడు వెయ్యకపోవటం చాలా గొప్పగా అనిపించేది మొన్నటిదాకా. రామోజీకి ఏమయ్యిందో!
చాలా బాగుంది మీ శైలి. pl. continue the good work.
శివమణి కాడండి. ప్రియమణి. ఈనాడు విలువలు వదిలేస్తూందనిపిస్తూంది.
Oh...sorry. yes she is Priyamani. Have you seen the sexy picture of this lady on Eenadu film page? She did some film with Jagapathi Babu recently. Thanks for the correction.
Cheers
Ramu
ఎన్ని పత్రికలు మారినా రాశిఫలాల విషయంలో ఈనాడుని అభినందించాలనిపిస్తుండేది,అన్నమాటకు కట్టుబడి ఉందని. ఈ దెబ్బతో అదీ పోయిందన్నమాట. సెబాసూ!
అసలు ఆ సినిమా పేజీ మా అమ్మాయి ముందు చూడాలంటే చచ్చే భయం నాకు. ఏ హీరోయిన్ ఫొటో చూసి ఏం ప్రశ్నలేస్తుందో అని! హీరోయిన్ ముప్పావు నగ్నంగా ఉన్న ఫొటో లేని రోజు ఉండదంటే నమ్మండి.
గాసిప్ పత్రికలతో పోటీపడే శీర్షికలు!
ee sexy photos veyadam almost 1-2 years nundi jaruguthundhi.
I remember Eenadu printing sexy photos of heroines even in older days. May be frequecy of publishing might have increased now a days
నేను చదివేది "వార్త" పేపర్. సినిమా గాసిప్స్ పత్రికలలో వేసినటువంటి ఫొటోస్ వార్త పేపర్ లో వెయ్యరు కానీ నేను సినిమా పేజిలు చూడను. సౌందర్య గారు తప్ప దాదాపు అందరు హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ తో డబ్బు చేసుకున్నవాళ్ళే.
రాశి ఫలాలు వేస్తే తప్పేమిటి, కొంతమందికి అవి అభిరుచి. చదువుకుని ఆనందిస్తారు. సినిమా వాళ్ళ బూతు బొమ్మలను రాశిఫలాలను ఒకే గాటను కట్టడం..........
1. the article "maato aataloddu" wasted my time. looking at the photo, i thot that was some masala news from cheer leaders. :)
but it turned out to be some T crap
2. priyamani photo was really artistic. that should beat any playboy photo anyday! ;)
ramu garu prajala abiruchi anugunaga athrikulu maradam thapukadu eenadu kuda rasipalau easthudi tv channls tv9 etv2 thapa megatha ani chanalls estunaye valani eanduku thapu pataru sakshi paper lo kuda expo phots eakavaga vastneee mari vati gurchi matladu mana mithru eandu ko.......... mari
Ramu garu... 100% correct... I began my career with eenadu (now I am in another media)... and had been a hard core fan of Ramoji Rao garu. Once I decided to read eenadu lifelong but longback, after eenadu's tryst with tdp, I stopped reading it. Now, it has even become a junk matter. Rightly said sir... keep it up..
ఈనాడును నడిపేది అప్పుడు, ఇప్పుడు ఆ కర్మాగారంలో తయారైన జర్నలిస్టులే. ఈనాడుకు ఉన్న పరిమితులు అందులో గడ్డాలు నెరిసే వరకు పని చేసి బయటికి వచ్చి కామెంట్ చేస్తున్న పెద్దలకు తెలుసు. రామోజీ అయినా, కిరణ్ అయినా ఏమేరకు జోక్యం చేసుకుంటారోఅందరికి తెలుసు. అయినా వాళ్లిద్దరే ఎడిషన్ ఇస్తున్నట్లు, అందులో చేదు మార్పులకు వాళ్లిద్దరే కారణమైనట్లు విమర్శకులు కలర్ ఇస్తుంటారు. నిజానికి మార్పు శాశ్వతం. 1970 ల నాటి పత్రికా భాష ఇస్తే చదువుతారా. మీరు పని చేసిన తొంభై ల నాటి రచనా ఎత్తుగడలతో నేటి తరాన్ని మెప్పించ గలమా. నిండైన చీరలు ఇస్తున్న వసుందరకు ఆడవాళ్లలోనే ఆదరణ లేదు.
మెరుగైన అవుట్ పుట్(సాపేక్ష సిద్దాంతం) ఇవ్వ లేక పొతే ఘనత వహించిన ఏ పత్రిక అయినా ఇండియన్ ఎక్స్ ప్రెస్ లాగా మరుగుజ్జు అవుతుంది. ఈనాడుకు ప్రత్యామ్నాయంగా ఏమి పత్రిక చదువుతున్నారు చెప్పండి.
రాము గారి లాంటి అనుభవజ్ఞులు మెరుగైన, ఒత్తిడి లేని జీవితాలను వెతుక్కొని బయటికి వెళితే వాళ్ళ కళ్ళముందు పుట్టిన పిల్ల జర్నలిస్ట్ లు ఇప్పుడు ఆ బండికి చోదక శక్తి అయ్యారు. వాళ్ళను చూస్తె ముచట వేస్తుంది.
ఇక వంకలు పెడుతున్న పెద్దలందరిని బ్యురోలోనో డెస్క్ లోనో కూర్చో పెడితే సిద్దాంత చర్చల్లోనే తెల్లారుతుంది. తెల్ల కాగితంతో చక్కని ఎడిషన్ ఇవ్వోచ్చు.
ప్రింట్ అంతరిస్తున్న మీడియా. కొత్త టెక్నాలజీ కోసం ఇన్వెస్ట్ మెంట్ రాదు. టివి తో పోటి పడాలి. రాత్రి మీరు రిమోట్ ఆఫ్ చేసే వరకు వచ్చిన వార్తల్ని కొత్తగా ఇవాలి. ఇన్ని పరిమితుల మద్య కొత్త టెక్నాలజీ పత్రిక కన్నా బెటర్ అవుట్ పుట్ ఇస్తున్నది కాబట్టే ఇంకా ఈనాడు లీడర్ గా నిలబడింది. మీరు సినియర్ జర్నలిస్ట్ యే గానీ కొత్త తరం ఒత్తిడుల మద్య పని చేయలేదు. చేయలేరు. చేసినా పని దొర్లించ గలరే గాని మీ బ్లాగ్ లో చేబుతున్నంత గొప్ప ఎడిషన్ తేలేరు. తేగలిగినా అంత తక్కువ జీతానికి అన్ని గంటలు వళ్ళు, కళ్ళు నాశనం చేసుకోరు.
ఇందు మూలంగా మీకు చెప్పేదేమిటంటే చక్కని ఎడిషన్ అన్ని విలువలతో రావాలంటే శ్రీ కృష్ణ దేవరాయలు పేపర్ పెట్టాలి.
ఆయన పట్టబిషక్తుడై 500 ఏళ్ళు అయ్యయిట. వారసులు బతికి ఉంటె అడిగి చూడండి. లేదా మరో యువరాజుకు రాష్ట్రాన్ని దోచి పెట్టండి.
సుదీర్ఘంగా రాసిన సోదరా,
1) రామోజీ, కిరణ్ ఏ మేరకు జోక్యం చేసుకుంటారో మీకు తెలిసినట్లు లేదు. మీకు ఇప్పుడు ఛైర్మన్ తో పదిహేను రోజులకొకసారి మీటింగ్స్ ఉన్నట్లు లేవు. అమాయకంగా మాట్లాడకండి...మీ డెస్క్ ఇన్ చార్జో, మీ పై వాడో మిమ్మల్ని నమ్మితే మీకు తెలియని విషయాలు చాలా చెబుతారు. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి
2) 90 ల నాటి రచన ఎత్తుగడా? అదేమిటి? అప్పటికన్నా...పరిస్థితి మెరుగుపడితే ఎవరూ బాధపడరు సార్/ మేడం. ఎన్నడూ మట్టసంగా పనిచేయని నయా మేధావుల వల్ల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని 'ఈనాడు' మిత్రులే వాపోతారు.
3) indian express మాట చెబుతున్నారు...మరి The Hindu గురించి కూడా మాట్లాడరేం? ఇదే 'ఈనాడు' బ్రాండ్ తో సమస్య. తనకు అనుకూలమైన వాదన చేయడం, సమస్య చెబితే...చెప్పిన వాడి గడ్డంలో తెల్లవెంట్రుకలు లెక్కబెట్టడం....అది మెరుగైన అవుట్ పుటా? ఎంత పెద్ద అబద్ధం!
4) ఒత్తిడి లేని జీవితాలు? ఇదే 'ఈనాడు' బుద్దే బ్రదర్/సిస్టర్. 'ఈనాడు' ప్రెషర్ కుక్కర్ నుంచి బైటికి వచ్చి ఒత్తిడి లేని 'ది హిందూ' లో కూడా పనిచేసా నేను. నా బాధ జూనియర్ల గురించే. సీనియర్లు...రామోజికో...కిరణ్ కో మస్కా కొట్టి నెట్టుకొస్తారు. ఈ పిల్లలకు మేలు జరగాలన్నదే నా అభిలాష. సిద్ధాంత చర్చ...తెల్ల ఎడిషన్..? అంతా ఒట్టి పద డామ్భీకం, అభూతకల్పన.
5) మేము ఒత్తిడి మధ్య పని చేయలేదని మీరు అనుకుంటే ఎలా? ఆ మాటకొస్తే...ఆ జనరల్ డెస్క్ లో ఉండి..ఒత్తిడి లేని జర్నలిస్టు ఎవరు ఉంటారు? 'ఈనాడు' ఇంకా లీడర్ గా ఉండాలని...మిగిలిన పత్రికలు మరింత దరిద్రంగా ఏడ్చాయి కాబట్టి...ఈ పత్రిక మరింత నాణ్యంగా రావాలనే నేను కోరుకొనేది. 'ఈనాడు' కలకాలం నిలవాలన్నది నా ఆకాంక్ష.
6) విలువలతో కూడిన పత్రిక కోసం శ్రీ క్రిష్ణ దేవరాయలు పేపర్ పెట్టాలా? ఒద్దండీ...మీ పని మీరు చేయండి. చాలు. "ఆ మూలా..ఈ మూలా..మూడు దిక్కులా తిష్ట వేసి...గ్రూపులు కట్టి...మా ఫేటు డిసైడ్ చేసే ఒకే ప్రాంతపు, ఒకే కులపు మనుషులు మారితే చాలు...వ్యవస్థ అదే మారుతుంది," అని 'ఈనాడు' మిత్రుడొకడు అన్నాడు. మరి ఈ మాటల్లో వాస్తవం నాకు తెలియదు. మీరే చెప్పాలి.
7) "మరో యువరాజుకు రాష్ట్రాన్ని దోచి పెట్టండి..." అని అర్ధం పర్ధం లేకుండా రాసారు. ఈ యువరాజులతోనే సమస్య. ఆనంద్ నగర్కు అటూ...ఇటూ తిష్ట వేసిన ఈ యువరాజులు జెండాలు, ఎజెండాలు లేకుండా నడిపితే రాయలు రానక్కరలేదు.
రాము
Well Said Ramugaaroo.
arey boss, siva: change the dialogue sometimes sir.
whatr is well said? did you read point# 6 above?
that is the soul of the sole blog. the author faced aparthied at some point in his life. he is seeing the current reality with those shaded glasses.
period.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి