విలేకరి అంటే పోలీసుకు కోపం, రాజకీయ నాయకుడికి పరాచకం, అధికారికి అసహ్యం. అందరూ విలేకరిని ఆడిపోసుకుంటున్నారు. వారిపట్ల కనికరం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. (చాలా సందర్భాలలో) నిజాలను వెలికి తెచ్చే విలేకరి అందరికీ కరివేపాకుతో సమానం--యాజమాన్యాలకు కూడా.
నిజానికి జర్నలిస్టుల జీవితాలు మున్నెన్నడూ లేనంత డోలాయమానంలో ఉన్నాయి. ప్రొఫెషనలిజం ఏ మాత్రం లేని బ్లాక్ మనీ యాజమాన్యాలు... ఏకవ్యక్తి స్వామ్యం... నీతీ జాతి లేని అబద్ధాల సీ.ఈ.ఓ.లు... కనికరం-డొక్కశుద్ధి లేని బాస్ లు... సరుకు లేకపోయినా మస్కా కొట్టి, బూట్లు నాకి పదవులు కొట్టేస్తూ మంచోళ్ళకు పొగబెట్టే నకిలీ జర్నలిస్టులు. ఈ విషవలయంలో చిక్కి నీతీ నిజాయితీతో జర్నలిజం సాగించాలనుకుంటున్న వారికి మున్నెన్నడూ లేనంత ఇబ్బంది ఉంది. మిగిలిన వారి సంగతి ఎలావున్నా...పెద్ద పదవుల కోసం 'ఈనాడు' గ్రూప్ నుంచి బైటికి వచ్చి వివిధ ఛానెల్స్ సరసన చేరిన జర్నలిస్టులు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారిది ఎవ్వరికీ చెప్పుకోలేని మూగవేదన.
ఒకప్పుడు రామోజీ రావు గారి కుడి భుజాలుగానో, అత్యంత సన్నిహితులుగానో ఉన్నవారు ఇప్పుడు టీ.వీ.ఛానెల్స్ లో పెద్ద పదవుల్లో ఉన్నారు. ఏదో కులం, గోత్రం చెప్పుకొని ఏదో ఒక పార్టీ కొమ్ముకాస్తూ లక్షలు ఆర్జించే బ్యాచ్ కు రోజులు బాగున్నాయి కానీ....ఇతరులు..."ఎందుకు వచ్చాంరా బాబు..." అని అనుకుంటున్నారు.
"నువ్వు ఎన్నైనా చెప్పు... రామోజీ రామోజీ నే. ఈ ఎదవలతో (అంటే..ఛానెల్స్ యజమానులు) ఆయన్ను పోల్చలేము," అని 'ఈ-టీవీ' నుంచి బైటికి వచ్చి ఒక మూడు ఛానెల్స్ మారిన ఒక సీనియర్ జర్నలిస్టు మొత్తుకుంటూ ఉంటాడు. డే టు డే జర్నలిజం లో రామోజీ వేలు పెట్టరనీ, దానికి భిన్నంగా ఈ యజమానులు ప్రతి వార్తలో వేలుపెట్టాలని చూస్తారని వీరు చెబుతున్నారు. పైగా వీరంతా బూతు కోసం వెంపర్లాడుతుంతారని చెబుతారు.
HM-TV, Zee-TV లలో సీనియర్ ఉద్యోగులు పెద్దగా నసగడం లేదు. కారణం...యాజమాన్యాలు కాకుండా...అక్కడ రామచంద్ర మూర్తి గారు, ఇక్కడ శైలేష్ రెడ్డి గారు వ్యవస్థలు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ హృదయం ఉన్న జర్నలిస్టులు. i-news లో కందుల రమేష్ గారు ఉన్నా...ఆ యాజమాన్యం ఒక గందరగోళంలో ఉంది. N-TV లో కూడా నికార్సైన జర్నలిస్టులు ఉన్నారు కానీ...పాపం ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కున బతుకుతున్నారు. బూతు మీద బతికే TV-9, TV-5, ABN- ఆంధ్రజ్యోతి గురించి ఆదివారం పూట అనుకోవడమే పాపం. అక్కడ పనిచేసే నికార్సైన జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. యాడ్స్, సినిమాలలో ప్రవేశం ఉన్న రామ్ రెడ్డి గారు 'సాక్షి' లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆయనదంతా...వినూత్న పోకడ. ఈ మధ్యనే అక్కడ చేరిన స్వప్న మంచి జర్నలిస్టు గానీ...ఒక రాజకీయ ఛానల్ లో ఆమె ఏమి చేయగలరు?
ప్రొఫెషనలిజం, జీతాల చెల్లింపు, ఆడ వాళ్ళతో వ్యవహరించే తీరు...అన్నీ వివిధ ఛానెల్స్ లో భిన్నంగా ఉండడం కొందరు మాజీ 'ఈనాడు' వారికి రుచించడం లేదు. అయినా ఏమీ చేయలేని దుస్థితి. "ఈ దరిద్రులు...దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగాలు పీకి పారెయ్యడంలో వీరికి కనికరం, దయ, జాలి లేనే లేవు. మా పరిస్థితి చాలా అనిశ్చితిలో ఉంది," అని మరొక సీనియర్ వాపోయాడు.
మరి 'ఈ-టీవీ' నుంచి TV-9, I-News లలో పనిచేసిన యాన్డ్రపు రాజశేఖర్ పరిస్థితి బాగానే ఉంది కదా అంటే...ఒక సీనియర్ ఒక నవ్వు నవ్వాడు.
మొత్తం మీద...నిజాయతీగా ఉండే జర్నలిస్టులకు ఏమవుతున్నదంటే...వీరు వృత్తిగత విషయాలలో రాజీ పడ్డారు కానీ...యజమానులను బుట్టలో వేసుకోలేక పోతున్నారు. వాళ్ళకు బూతు జోకులు చెప్పాలి...ఘడియఘడియకు పొగడాలి...ఇకా కొన్ని పాడుపనులు చేయడంలో వారికి సహకరించాలి. రామోజీ దగ్గర ఉన్నప్పుడు..ఒక పెగ్గు మందైనా వేయని వీళ్ళకు ఇవి చాతకావడం లేదు కొత్త యాజమాన్యాల దగ్గర.
సీనియర్ల పరిస్థితి ఇలా ఉంటే...కొత్తగా చేరిన వారు..."ఓర్నీ..ఇదా జర్నలిజం అంటే.." అని ముక్కున వేలేసుకుంటున్నారు. మరి పరిస్థితి ఎప్పుడు మారుతుందో!
కొస మెరుపు
ABN- ఆంధ్రజ్యోతి "Open Talk" అనే కార్యక్రమంలో ప్రశ్నలు అడిగే...మన వేమూరి రాధాకృష్ణ గెస్టులను.."యహ...చెప్పండి..మీరు ఎవరితోనో...తిరిగి ఉంటారు. నిజంగా మీకు 'ఎవ్వారూ' లేరా?" అని పచ్చిగా అడుగుతాడు...తనంత నిజాయితీ పరుడు యవ్వడూ లేనట్లు ప్రకటనలు చేస్తాడు గానీ...జర్నలిస్టులకు కనీసం అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడంలేదట. అన్యాయాలను ప్రశ్నించే జర్నలిస్టులకే దారుణ అన్యాయం...అయినా ఎవ్వరూ కిమ్మనని ఆటవిక వైనం.
Sunday, February 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
గురూ గారూ,
మీరు రాసింది బాగానే ఉంది కానీ, ఈనాడులోనూ మీ నాటికీ, ఈనాటికీ మారుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తే బాగుండేదేమో? మిగిలిన వాటంతగా చెడిపోకపోయినా అవే వ్యాధుల లక్షణాలు ఇక్కడ కూడా కనబడుతున్నాయని భోగట్టా.. మీరేమంటారు? గుడ్డికన్న మెల్ల నయం అని సంతృప్తి పడమంటారా?
Those who left Eenaadu and ETV for more monetary benefits are definetely repenting for their biggest blunder i their life.It is true Enaadu has got it's own style of functioning and way of proffessional life which may not be palatable to many but after leaving it and tasting the new managements they now feel that the old is gold.Whatever might be the policies and political background of enadu and ETV one has to agree that Ramoji Rao had brought a great revolution and transformation in Telugu journalism which had spread to all the regions of the country whgich has become a number on in media.Ofcourse due to political jealousy and intolerance Ramoji Rao had to face a lot of troubles due to his over confidence in Margadarsi chit funds and financial mess though he had not deceived the people but deceived the government by going against the rules of Chit funds.Even his son Suman who had dragged the family into streets and media had returned to his father as blood is thicker than anything and I am sure most of the people who left Ramoji Rao better go back to him to have a dignified and respectable and disciplined job with proffessional satisfaction.Ofcourse every one got his or her own style of functioning which cannot be questioned as long as one has respect,affection,good manners and regular payment from the management.
JP Reddy
Recently when Krishnamohan MLA,Chirala,who was exposed by TV9 and NTV for his alleged anti social activities in his constituency with criminal background ,the MLA had hit back these channels by exposing the immoral lives of the CEOs of these channels.But the journalists associations led by Srinivas Reddy had backed these CEOs and forced thye MLA to apologise for his personal allegatuons against these CEOs of the channels.
Is it proper and moral to the Journalistsa associations to back these CEOs for their immoral and anti social lives who are questyioning and exposing the immoral and anti social lives of the politicians,officials and others in their electronic media?Why this double standard?why Srinivas Reddy has been supporting these CEOs for their unlawful activities?Are they getting any incentives from these channels for suppoerting them?Or any share in the profits?Otherwise why this love for these people?
JP
వెలుగు అనే పత్రిక వస్తోందని, జాగరణ్ వాటా ఉందని వినిపిస్తోంది. ఇప్పటికే జాగరణ్ హిందీ పేపర్ హైదరాబాద్ జూబ్లి హిల్స్ లో ఉచితంగా వేస్తున్నారు. మొత్తం మిద ఆంధ్రా పెట్టుబడి దారులు మరో ప్రాంతాన్ని వెతుక్కో వాల్సిందే. ప్రస్తుతానికి "వెలుగు" దీపికలు... ఈనాడు, మాజీ ఈనాడు బృందమే అయినా లాంచింగ్ తర్వాత మొత్తం తెలంగాణా వాళ్ళు ఆక్రమించుకోవడం ఖాయం. కొత్త సమాచారానికి ప్రయత్నించండి.
ఏపి మీడియా కబుర్లు పాత పోస్టులకు స్పందనల్లో రెండు నెలల క్రితం నేను సూచించిన "వస్తు, సేవల బహిష్కరణ" అంశాన్ని ఇప్పుడు మరింత మెరుగ్గా కోదండ రామ్ వేదిక మీదికి తెచ్చారు. గమనించారా. అప్పడు ఒక అన్నయ్య అమెరికా నుంచి బుర్ర దొబ్బిందా అని స్పందించాడు.
కోదండ రామ్ తెలంగాణాను వ్యతిరేకించే వాళ్ళ వస్తు సేవల బహిష్కరణ అనగానే బాద్యత గల ఒక కోస్తా నాయకుడు "మేం పెట్టిన కంపెనీల్లో ఉద్యోగాలు కూడా వదిలేస్తారా అని అడిగారు. అంతా మన మంచికే. మేం ఇటునుంచి నరుక్కోస్తాం. మీరు అటునుంచి నరుక్కు రండి".
Yes boss,
I too came to know about Dainik Jagaran's newspaper recently. I didn't have any contacts there. Anyway, one of our friends will be there to fill it up with his chamchas...leaving behind the real journalists. Lets wait and watch.
cheers
ramu
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి