'ఈనాడు' లో సాధారణ కంట్రిబ్యూటర్ గా జర్నలిజం లో కెరీర్ ఆరంభించి స్పోర్ట్స్ ఎడిటర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి రేగళ్ళ సంతోష్ కుమార్. క్రీడల పట్ల మక్కువతో దాన్నే జర్నలిజంలో తన రంగంగా ఎన్నుకున్నాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు.
సంతోష్ గురించి రాయడానికి కారణం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. నిన్న సచిన్ 200 పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించడం...దాన్ని యావత్ క్రీడాలోకం ఆస్వాదించడం చూసాం. సచిన్ రికార్డు పై ఈ రోజు "నీవొక దుర్గం...మాకొక స్వర్గం!" అన్న శీర్షికతో 'ఈనాడు' బ్యానర్ గా ప్రచురించిన స్టోరీ నాకు చాలా నచ్చింది. ఇంత సృజనాత్మకంగా ఏ పేపర్ ఈ వార్తను ప్రచురించలేదు. "హిందూస్తాన్ టైమ్స్" లో అనిల్ కుంబ్లే చేత బ్యానర్ స్టోరీ రాయించారు గానీ నాకు పెద్దగా కిక్ ఇవ్వలేదు. మన సంతోష్ 'ఈనాడు'కు రాసిన స్టోరీలో చాలా లోతైన విశ్లేషణ, అంతకన్నా ఎక్కువ రసరమ్య తెలుగు ధార ఉంది.
సంతోష్...అలగ్జాండర్ ఫ్లెమింగ్ నుంచి ప్రారంభించి...రాబోయే ప్రపంచ కప్ లో సచిన్ నుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పి ముగించాడు. ఆద్యంతం ఇందులో మంచి ఊపు కనిపించింది. అయితే..మా ఇంట్లో ఇద్దరు చదవర్లు ఉన్నారు. ఏది చదివి వినిపించినా...అందులో లోపాన్ని/ తమ అభ్యంతరాలను చటక్కున చెప్పేస్తారు. ఇది వీరితో వచ్చిన తంటా..చిక్కు...తలనొప్పి.
సంతోష్ రాసిన లీడ్లో ఫ్లెమింగ్, రైట్ బ్రదర్స్, ఆర్మ్ స్ట్రాంగ్, హిన్స్ లు అద్భుతాలు సృష్టించినప్పుడు..."ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ క్షణాలను అనుభవించిన వారెంత పులకించారో తెలీదు కానీ..సచిన్ ద్విశతకాన్ని కనులారా చూసిన క్రీడా ప్రేమికులు మాత్రం అంతటి మహదానందాన్ని అనుభవించారు," అని ఉంది.
"..అప్పటి జనం పులకరింత తెలియదు కదా...అంతటి మహదానందం ఇప్పుడు జనం అనుభవించారు....అనడంలో పొంతన లేదు," అని హేమ, మైత్రేయి వాదించారు. అలాగే..."అతని ఆటను...:" తో మొదలై "..ఎవ్వరూ అనుకోరు"తో మూడో కాలంలో ముగిసిన వాక్యం కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నదని, రచయిత మనసు ఆవిష్కృతం కాలేదనిపించింది.
సరే...అన్వయం సంగతి ఎలా ఉన్నా...ఇందులో సెంట్రల్ ఐడియాలు ఐదు ఉన్నాయి. 1) ఒక అపూర్వ ఘట్టం జనానికి ఇచ్చిన మహదానందం 2) ఓపిక, తపన, ఏకాగ్రతతో ఏదైనా ఎలా సాధించ వచ్చో సచిన్ సాక్ష్యంగా చెప్పడం 3) అంత సాధించినా మిడిసి పడకూదదన్న సందేశం 4) వయసు మీరినా కోడెద్దులా ఉరకలు వేసే సచిన్ ఉత్సాహం 5) జనం సచిన్ నుంచి ఏమి కోరుకుంటున్నారు.
ఏ మాటకు ఆ మాట...'ఈనాడు' ఇంత మంచి జర్నలిస్టుకు సముచిత హోదాను ఇచ్చి ప్రోత్సహించింది. తనకు కూడా 'ఈనాడు' పట్ల మంచి నిబద్ధత ఉంది. "సంతోష్...కీప్ ఇట్ అప్. మంచి తెలుగు ధారతో క్రీడలపై ఒక పుస్తకం రాయవయ్యా బాబూ...," అని నేను సదుదేశ్యంతో సలహా ఇచ్చాను.
Thursday, February 25, 2010
Subscribe to:
Post Comments (Atom)
17 comments:
good post
Yes.. A good Article By Mr. Santosh.
Mana Santosh raasinatlugaa chebuthunna item vaasthavamga draft chesindi Sports desk sabhudu. Anduku nenu prathyaksha saakshini. Santosh thaane ee item rasinatlu gaa cheppukovatam eemi baaga ledu.
ఫ్లెమింగ్ తో, అర్మ్ స్ట్రాంగ్ తో పోల్చడం ఎక్కువ అయినా కవిత్వం లో తప్పు లేదు. ఇవ్వాళ బానర్ కవిత్వమే అయినా కిక్ ఇచ్చింది. గత నాలుగు నెలలుగా నాకు నేనుగా మనస్పూర్తిగా సంతోషించిన సందర్భం సచిన్ డబల్ సెంచరి యే. రాష్ట్ర ప్రజలందరి పరిస్థితి ఇదే అయి ఉంటుంది. అదీ పాక్ క్రికెటర్ రికార్డు చిత్తు చేయడం ఇంకా సంతోషం. ఇది వేరే జట్టు వాడు చేసినా అంతే సంతోషం. మన సచిన్ చేస్తే ఇక చెప్పేది ఏముంది. మొత్తం మిద తెలంగాణా ఆంద్ర గొడవలు మరచి పోయి, ఆఫీస్ లో ఒక్కసారి అందరం ఒకళ్ళ మిద ఒకళ్ళం పడి కావలించుకొని, సచిన్ గొప్పదనం మిద ఏకాభిప్రాయనికి వచ్చి, రాని నస గాళ్ళను దబాయించి పండగ చేసుకున్నాం.
శ్రీనివాస్
'నీవొక దుర్గం .. మాకొక స్వర్గం' ఏమిటీ? ఏదో ప్రాస కోసం ప్రయాసే తప్ప ఆ రెంటికీ పొంతనేది? సచిన్ అభేద్యమైన దుర్గం లాంటోడు - అంతవరకూ బాగానే ఉంది. అతను మనకి స్వర్గం చూపించాడనటం అతిశయోక్తిలాగే కాదు, ఎబ్బెట్టుగా కూడా ఉంది.
నాకా ఫ్రంట్ పేజీ స్టోరీలో ఎగ్జైట్ మెంట్ ఎక్కువైందేమో అనిపించింది. పెన్సిలిన్ కనుగొన్న ఘటనకీ సచిన్ డబుల్ సెంచరీకీ పోలిక పెట్టడం odd గా అనిపించింది. అలాగే శ్రీ శ్రీ కవిత(నేనొక దుర్గం నాదొక స్వర్గం) ను కాపీ చేయకుండా ఇంకేదైనా పెట్టి ఉంటే బావుండేదనిపించింది.
ఒక్క విషయానికి మాత్రం సంతోష్ నాకు భలే నచ్చుతాడు. హెడ్ లైన్స్ భలేగా ఉంటాయి.
పోయిన సారి IPL లో పెట్టిన హెడ్ లైన్స్ ఇంకా మర్చిపోలేను. డెక్కన్ ఛార్జర్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మీద గెలిచినపుడు "గిల్లీ దెబ్బకు ఢిల్లీ అవుట్" అని పెట్టాడు. డెక్కన్ ఛార్జర్స్, విజయమాల్యా టీమూ సెమీ ఫైనల్స్ లోకి రాగానే "అట్టడుగుల అట్టహాసం" అని పెట్టాడు. నవ్వకుండా ఉండలేకపోయాను.(అంతకు ముందు టోర్నమెంట్ లో రెండూ అట్టడుగు జట్లేగా మరి)
కప్ గెల్చినపుడు "డెక్కన్ కే దక్కెన్" అనే హెడ్ లైన్ కూడా భలే నచ్చింది. తను చాలా enthusiastic అనిపిస్తోంది ఇతని గురించి చదువుతుంటే!
మా ఇంట్లో ఇద్దరు చదవర్లు ఉన్నారు. ఏది చదివి వినిపించినా...అందులో లోపాన్ని/ తమ అభ్యంతరాలను చటక్కున చెప్పేస్తారు. ఇది వీరితో వచ్చిన తంటా..చిక్కు...తలనొప్పి...
చిక్కేమిటండీ, ఇలాంటి విమర్శకులు ఇంట్లోనే ఉంటే భలే ఉంటుంది. బోల్డంత చర్చ!
Why this mania for cricket?Why not the same spirit to hockey and other games?If our government,SAI,corporate sector and media devote atleast 50% of the importance and preference of cricket to hockey ,I am sure we would have won many hockey medals internationally.It is most unfortunate that the way our country is treating cricket has become a DURGAM to the SWARGAM of hockey but hockey should not be promoted at the cost of cricket but both must be given equal importance some time more as hockey is our national game whereas cricket is an imported game.
JP.
Mr. Anonymos,
Show me other game or sport which got pride as cricket to India? Rememebr, the old Darwin theory - survival of the fittest. Lets come to hockey - Is there a team spirit in team to win a match, then why we need to bother about the game which is giving any mileage? See players Saina etc or giving some mileage.
No doubt Santosh is a good and experienced sport journalist. He writes and edits well.
Mahesh.K
No doubt Mr Santosh is a good and experienced sports journalist.
Mahesh K
పైన ఎవరో ఆ వ్యాసం వ్రాసింది సంతోష్ కాదని వ్రాసారు. నిజమే అయి ఉండవచ్చు కానీ అది అంత ముఖ్యమైన పాయింట్ కాదు. సబ్ వ్రాసిన దానికి సరైన స్థానం ఇవ్వడమే ఎడిటర్ బాధ్యత. ఇన్ఛార్జి క్రింది వారి సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించని వాడైతే అంతకన్నా నరకం ఉండదు. ఇది పాత్రికేయలోకంలో ఉన్నవారందరికీ తెలుసు. కనుక ఆ వ్యాసాన్ని మనకందించినందకు బాధ్యునిగా సంతోష్ అభినందనీయుడే.
i second abrakadabra.
who ever taught Telugu to eenadu journalists, has done a great damage to the Telugu mankind (i dont think Bu.Ra. did this)
i never understand, why these eenadu writers crave for praasa. In their pursuit of praasa, sometimes the writings become "kruthakam". one example was that "deccan ke dakken!"
praasaa is not the ONLY thing that a writer should die for.
and, its better we all NOT talk about the editorials that are written in this largest circulated news paper. Nonsensical thoughts, completely irrelavent topics are discussed there. If any of you had read Nanduri's editorials in good old Andhra Jyoti, you would agree with me.
OT:
today's priyamani photo on cinema page is soooooooopar! it beats playboy centerfold page! ;)
..yawn......some rant..good start to the day!
btw, monna raatri in TV9, a producer is attacking onesided on charmi.
it was a complete character assasination.
Merugaina Samajam Kosam!
మీ బ్లాగును మంచి ఉద్దేశంతో, చక్కగా నిర్వహిస్తున్నారు. చక్కగా రాశారు ఈ పోస్టు. అభినందనలు!
అయితే, ఈనాడులో పెట్టిన ఆ శీర్షిక అంత బాగా కుదిరినట్టు లేదు.:)
హాయ్..
ఒక రెండు విషయాలండీ...
ఒకటి) ఒక మిత్రుడు..."ఆ స్టోరీ సంతోష్ రాయలేదు" అని కామెంట్ గా రాసారు. అది తప్పున్నర తప్పు. నేను క్రాస్ చెక్ చేసుకున్నాను. ఎందుకండీ...తమరు స్వయంగా చూసినట్లు రాసారు? మనం కాస్త నైతికతతో బతుకుదాం సార్...
రెండు) నా విచారణలో మరొక ఆసక్తికరమైన అంశం తేలింది. ఆ మొదటి వాక్యం చివర్లో సబ్-ఎడిటర్ చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. దాని వల్ల కొద్దిగా అన్వయం సమస్య వచ్చింది. సంతోష్ తో మాట్లాడితే గానీ మరిన్ని వివరాలు తెలియవు.
...రాము
ఆ వార్తలోని ప్రతి అక్షరం సంతోష్ గారి సొంతం. ఇది వంద శాతం నిజం. మరొకరి రాతను తనదిగా చెప్పుకునేంత దౌర్భాగ్యపు స్థితిలో ఆయన లేరు. కొందరు ఇన్ఛార్జ్ లు అలా చేసే మాట వాస్తవం. అందరూ అలా ఉంటారనుకోవడం పొరబాటు. ఈ రాత ఆయనది కాదని.. గాలి మాటలు చెప్పటం, దాన్ని దగ్గరుండి చూసినట్లు చెప్పడం అనైతికం, పచ్చి అబద్ధం.
ఆ వార్తలోని ప్రతి అక్షరం సంతోష్ గారి సొంతం. ఇది వంద శాతం నిజం. మరొకరి రాతను తనదిగా చెప్పుకునేంత దౌర్భాగ్యపు స్థితిలో ఆయన లేరు. కొందరు ఇన్ఛార్జ్ లు అలా చేసే మాట వాస్తవం. కానీ అందరూ అలా ఉంటారనుకోవడం పొరబాటు. ఆయన కాపీ కొట్టారన్నదే పచ్చి అబద్ధమైతే.. ఈయనెవరో స్వయంగా చూసినట్లు చెప్పడం దివాళాకోరుతనం.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి