Thursday, February 4, 2010

తెలుగు టీ వీ చానెళ్లకు బ్యాక్ గ్రౌండ్ పాటల పిచ్చి

సాధారణంగా ఇంట్లో ఎవరైనా తనువు చాలిస్తే...కుటుంబ సభ్యులకు దుఃఖం కలుగుతుంది. అదే కుటుంబ పెద్ద అకాల మరణం చెందితే ఆ ఫ్యామిలీ కి  కలిగే బాధ అంతా ఇంతా కాదు. అయితే...మంచికైనా..చెడుకైనా...గరిష్ట స్థాయిలో ప్రభావం (మాక్జిమం ఇంపాక్ట్) ఉండేలా కార్యక్రమాలు రూపొందించాలని...అది..ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని తెలుగు టీ.వీ.ఛానెల్స్ నమ్మకం.
మొన్నకు మొన్న విజయవాడలో ఒక పసిపాప నాగ వైష్ణవిని మామ వరస అయ్యే వ్యక్తి ఒక హంతక ముఠాతో కిడ్నాప్ చేయించి అత్యంత కిరాతకంగా చంపించి...మృత దేహాన్ని ఒక కొలిమిలో పడేసి సంచలనం సృష్టించాడు. ఈ వార్త విన్న మనిషి ఎవరికైనా గుండె బరువు ఎక్కుతుంది. బెజవాడలో ఇలాంటి నికృష్ట పనులు చేసే బ్యాచులు ఉన్నట్లు అందరికీ తెలుసు కానీ...మరీ ఒక చిన్నారిని ఇంత కిరాతకంగా చేస్తారని ఎవరు మాత్రం అనుకుంటారు?

సినిమా..క్రైం వార్తలు దొరికితే పండగ చేసుకునే తెలుగు మీడియా...కారు డ్రైవర్ హత్యను, ఆ పాప హత్యను, ఆ తర్వాత పాప తండ్రి ప్రభాకర్ మరణాన్ని చాలా ప్రభావశీలంగా ప్రజలకు అందించాయి. ఈ ఉదంతం మానవత్వానికి మచ్చ తెచ్చేది కాబట్టి....ఇందులో  ఒక పెద్ద డ్రామా ఉంది  కాబట్టి...సహజంగానే టీ.వీక్షకులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఇక...ఈ వార్తను, సంబంధిత స్టోరీ లను అత్యంత ప్రభావశీలంగా అందించేందుకు అన్ని తెలుగు ఛానెల్స్ పోటీ పడ్డాయి.

ఈ పోటీ నుంచి పుట్టిందే...బాక్ గ్రౌండ్ పాటల పిచ్చి.  తెర నిండా...నవ్వులు చిందిస్తున్న వైష్ణవి ఫోటో...తను పుట్టినరోజు నాడు తండ్రికి ముద్దు ఇస్తున్న వీడియో క్లిప్పింగ్...జనం వారి ఇంటి దగ్గర భారీగా గుమి కూడిన దృశ్యం చూపిస్తూ....కొన్ని ఛానెల్స్ విషాదం వర్షంలా కురిసే తెలుగు సినిమా పాటలు వేసాయి. zee-Telugu మిత్రులు ఇంకాస్త ఎక్కువ స్పందించారు.

ప్రత్యేకంగా...ఈ దారుణం పైనే ఒక పాట రాయించినట్లు ఉన్నారు వీరు. "ఏ పాపం ఎరుగని చిన్నతల్లీ..చిరునవ్వులే మాయం చేసారా తల్లీ..." అని డప్పు కొట్టుకుంటూ ఒక తెలంగాణా గాయకుడు పాడుతుంటే....అప్పటికే ఈ ఘోరంతో గుండె పగిలిన జనం తల్లడిల్లిపొయ్యారు. అది గుండె, మెదడు, నరాల మీద చాలా ప్రభావం చూపేదిగా ఉంది. అసలు డప్పు పాట అంటేనే గుండె కదిలించే సాధనం. 
రిపోర్టింగ్ లో ఎన్నో మరణాలు చూసిన నాకే...ఈ పాట..ఆ దృశ్యాలు గుండె మీద పని చేసాయి. ఒక్క క్షణం గుండె కలుక్కు మంటే....లేనిపోనిది...మనం కూడా పోతామేమో అని...ఒక ఆటల ఛానల్ పెట్టుకుని విషాదాన్ని దిగమింగుకున్నా. "బాల్యమందే నిన్ను చంపిందా...ఈ పాపిష్టి లోకం తల్లీ," "కొలిమిలో వేసి నను చంపారా తల్లీ.." వంటి విషాదకర చరణాలు ఆ సాంగ్ లో ఉన్నాయి.
సాక్షి, TV-1 వంటి ఛానెల్స్ కూడా బాక్గ్రౌండ్ పాటలు ధాటిగా వచ్చాయి. ఆ పాటలు నోట్ చేసుకున్న పేపర్ పోబట్టి అవి ఇక్కడ రాయలేక పోతున్నాను. ఇలా పాటలు వేయడంలో N-TV, TV-5, i-news కూడా చాలా ముందు ఉంటాయి. బోరు బావిలో పడి బాలుడు మరణించినప్పుడు, వై.ఎస్.ఆర్.మరణం తర్వాత కూడా ఛానెల్స్ ఇలాంటి పాటలే వేసాయి. 
నిజంగా ఒక విషయాన్ని ఇంత ప్రభావశీలంగా చూపించాల్సిన అవసరం ఉందా? ఒక మంచి స్క్రిప్టుతో వాస్తవాన్ని వాస్తవంగా చూపితే జనం చూడరా? ఏమో!
కాస్త సంసార పక్షంగా నడిచే ఇంగ్లీష్ ఛానెల్స్ లో ఇలా సినిమా పాటల మీద ఆధారపడి టీ.వీ.లు కార్యక్రమాలు చేయడం అరుదు. ఇదే విషయం ఒక సీనియర్ జర్నలిజం టీచెర్ తో నేను ప్రస్తావిస్తే....ఆయన భలే మాట చెప్పారు. దీన్ని 'wailing widow syndrome' (భర్త చనిపోతే భార్య పడే  అలవిగాని బాధ) అంటారనీ,  ఇది తెలుగు ఛానెల్స్ లో పతాక స్థాయికి చేరిందని ఆయన చక్కగా చెప్పారు. 
------------------------------------------
నోట్: పీహెచ్.డీ. పని ఒత్తిడి, ఉజ్జోగం, డెస్క్ టాప్ దెబ్బతినడం, మొన్నటి వరకూ టీ.వీ.కనెక్షన్ లేకపోవడం... వల్ల కొత్త పోస్టులు పెట్టలేదు.అంతే తప్ప కొందరు భావించినట్లు బెదిరింపులు...హెచ్చరికలు కారణం కాదు. మనం కూడా సై అంతే సై రకమే. ఇక క్రమం తప్పకుండా పోస్టులు ఉంటాయి. థాంక్స్  

11 comments:

Kathi Mahesh Kumar said...

ఈ మధ్యవచ్చిన ‘రణ్’సినిమాలో "సినిమావాళ్ళకూ మాకూ పెద్దతేడాలేదు. మీరూ మేమూ తయారుచేసేది సినిమాలే. కాకపోతే మా సినిమాని మేము ‘న్యూస్’ అంటాము" అంటుంది ఒక పాత్ర. ఇదీ అంతే

Anonymous said...

మీరు చెప్పింది అక్షరాల నిజం. నరకయాతన చూపిస్తున్నాయి ఈ న్యూస్ ఛానళ్లు. అసలు మెచ్యూరిటీ వున్న జర్నలిస్టులే వుండరా ఈ ఛానళ్ల లో? లేకపోతే ఎక్కడెక్కడి నిరుద్యోగులూ దీంట్లో దూరిపోతున్నారా? చూడపోతే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకోవటం మంచి లాభసాటి అయిడియా లా వుంది.

kvramana said...

Anna
Thanks for promising us that the posts will appear regularly from now onwards. But, PLEASE also consider our request to stay focused on media/journalism and not on Gutti Vankaya koora, recipes, your experiences at your dining table, irani hotels, osmania biscuits, blah blah blah.
PLEASE FOR GOD SAKE
Ramana

sandy said...

sir,bayapaddara ananduku feel ainatlunaaru.SORRY.roju mee postlu chadive alavaatu vunna naaku,vaaram rojuluga media gurinchi postlu leka poye sariki frustration vachindi.SORRY.keep going

Jagadeesh Reddy said...

ఒక్క తెలుగోళ్ళకనే కాదు.. ఇండియన్స్ అందరికీ ఈ పాటల పిచ్చి వున్నట్టుంది. ఏ సీరియల్ తీసుకున్నా ముందు టైటిల్స్ దగ్గర్నుంచి చివరి వరకు బ్యాగ్రౌండ్ పాటలు వస్తూనే వుంటయి. చిన్న చిన్న ప్రకటనల నుంచి, సినిమాల వరకూ ప్రతీ దాన్ని పాటల రూపంలో బాగా చెప్పవచ్చు అనుకుంటారేమో నాకు తెలీదు. ఈ పాటల పిచ్చి ఒక్క ఇండియా లోనే వుందనుకుంటాను. మిగతా ఏ దేశంలోనూ పెద్దగా పాటలు వినిపించవు.

Anonymous said...

TV channel is a commercial and business venture and they want to cash on everything for anything and throw over the faces of the viewers wnether good,bad or ugly.This background song culture of TV channels is nothing new to our channels as already the north channels started long ago.This is the way of life of TV channels and we cannot do anything other than switching to other channels.

JP Reddy

Anonymous said...

మీ బ్లాగు పాత థీంలో చూడముచ్చటగా ఉండేది. ఇప్పుడు అంతా గందరగోళంగా ఉంది. వీలయితే థీం మార్చగలరు.

Just my opinion, you may remove this comment after reading.

Anonymous said...

Most of the viewers of your blog are more interested in your comments on the electronic media it's good,bad and ugly 24x7.Ofcourse you may get bored of writing on same subject which prompts you to switch to non media topics which is I feel better for a change but it should be once in a week on sunday.Please take the opinion of others.

JP Reddy.

Saahitya Abhimaani said...

Ramu Garoo,

Thanks for coming back and resuming writing. I too strongly feel that the TV news channels should introspect and regulate themselves, lest there shall be statutory censorship shortly. I wrote an article on this in my blog. Some of the comments I & a few others had made in your comments also I included therein.
http://saahitya-abhimaani.blogspot.com/2010/02/blog-post.html

Anonymous said...

Supplementing ur comments, I will add one important observation. Owing to the 'wailing widow syndrome' by which the Telugu News Channels inflicted, audience of AP (without any regional disparities) brooded, grieved upon Vishnavi's gruesome murder and the sad demise of her father, Palagani Prabhakar.
Writing to my dismay, the actual widow of Palagani Prabhakar,has not affected by Wailing Widow Syndrome. She set herself ready for a spree of Interviews in TV channels.
Though she was so dramatically articulating a demand to bring back her spouse and daughter while taking away the assets that could be relinquished by her, I heard and understood different connotations emphasizing the eternity of assets!!!!

sarada said...

ramugaru ,
nijam raasarandi channels ante vaatiki news kaavali.news ni enni rakaalugaano choopinchalo annie chestaaru,mana kharma!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి