Saturday, February 6, 2010

ఎన్-టీ.వీ. అరుణా? కాంగ్రెస్ స్పోక్స్ ఉమనా?

ఎన్-టీ.వీ.కి దేశ రాజధానిలో ప్రతినిధి గా ఉన్న అరుణ గారు పలు సందర్భాలలో ఫక్తు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. కొద్ది నిమిషాల కిందట పరకాల ప్రభాకర్ గారి "నమస్తే ఆంధ్రప్రదేశ్" షో లో ఢిల్లీ నుంచి లైవ్ లో ఆమె ఇచ్చిన విశ్లేషణ ఈ అనుమానానికి మరింత ఊతం ఇచ్చేదిగా ఉంది. 
కాంగ్రెస్ కమిటీ లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తండ్రి నమ్మిన బంటు కే.వీ.పీ.రామ చంద్ర రావుకూ ఎందుకు చోటు కల్పించినట్లు అని ప్రభాకర్ గారు అడిగితే...ఆమె విశ్లేషణను అందిస్తూ...."జగన్ క్రౌడ్ పుల్లర్. ఈ ప్రాంతంలో అయినా...ఆయన జనాలను ఆకర్షించగలరు," అని అరుణ గారు తేల్చేసారు. 
"మనం అలా చూడడం కరక్ట్ కాదు ప్రభాకర్ గారు.." అని ఒక దశలో ఆమె చెప్పారు. ఏ.ఐ.సీ.సీ.కి సొంత లాభాల దృష్ట్యా...భవిషత్తులో వీరిద్దరి వల్ల కలిగే మేలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అదేదో...తాను భావిస్తున్నట్లో...అలా అని సోర్సులు చెప్పాయనో...ఎవరో అనుకుంటూ ఉన్నారనో చెబితే...సరే అనుకోవచ్చు. అలా కాకుండా...రిపోర్టర్ ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడితే ఎలా?
అరుణ గారే కాదు...ఏ రిపోర్టర్ అయినా..ఈ విశ్లేషణల పేరిట నోటికొచ్చింది చెప్పడం బాగుండదు. జనం నవ్వుకుంటారు. లైవ్ లో ఏదో హడావుడిగా నోటికి ఏది వస్తే అది...బాస్ కు నచ్చే నాలుగు మాటలు చెప్పడం...ఢిల్లీ రిపోర్టర్ లకు ఎక్కువయ్యిందని ఆరోపణలు ఉన్నాయి. వారు మరోలా అనుకోకుండా...కాస్త డొక్క శుద్ధి పెంచుకుని, వృత్తిలో రాణించాలని మనవి.

ఈ మధ్య ఎన్-టీ.వీ. ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న డిబేట్లు కూడా సమంగా లేవనిపిస్తున్నది. ఒక ప్రాంతం నేతను ఒక ప్రశ్న అడగడం...ఆయన అది చెప్పగానే..."మరి ఆయన అలా అంటున్నారు..మరి మీరు ఏమనుకుంటున్నారు" అని వేరే ప్రాంత నేతను అనడం...మాటిమాటికీ ఈ ప్రక్రియ సాగడం చూపరులకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక మహిళా రిపోర్టర్ దేశ రాజధానిలో వివిధ ఛానెల్స్ లో పనిచేసిన అనుభవంతో దూసుకుపోవడం గర్వకారణమే. అయినా...మన మిత్రులు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి...స్కిల్ల్స్ పెంచుకోవడానికి....పని తీరు మెరుగు పరుచుకోవడానికి...యాజమాన్యాలు కూడా సహకరిస్తే...బాగుంటుంది.

6 comments:

శ్రీనివాస్ said...

అరుణ గారు గతం లో చేసిన ఊహాగానాలు కొన్ని నిజం అవడం వల్ల ఆవిడకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి ఉండవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఈవిడ దెబ్బకి కొమ్మినేని శ్రీనివాసరావు గారు బిక్క మొహం వేసేవారు. జనవరి 5 మీటింగ్ రోజు చిదంబరం ఏం మాట్లాడతారో ఈవిడ జనవరి 2న చిదంబరం పక్కనే ఉండి విన్నట్టుగా చెప్పేసారు. అది కూడా ఇలా చెప్పే అవకాశాలు ఉన్నాయి అనకుండా .... ఇలాగె చెప్తారు ఇంతకంటే ఏం ఉండదు అనేశారు .... అదన్నమాట

swapna said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

స్వప్న కామెంట్ అసహ్యంగా ఉంది. కామెంట్స్ వాడపోసే ఓపిక లేకపోతే బ్లాగ్ ముసేయి బ్రదర్.

Ramu S said...

Dear Anonymous,
I am extremely sorry for posting that nasty comment. Thanks for alerting me. I feel ashamed for this stupid mistake. Thanks a ton for your remark. I'll take care in future.
Cheers
Ramu

Anonymous said...

కానీ ఒక్కమాట చెప్పుకోవాలి. అరుణ మాట్లాడే తీరు,presentability చాలా బాగుంటాయి. she is very talented. no doubt.

ajoy said...

అరుణ గురించే చర్చ చేయడంలో అర్ధం లేదు..మొత్తంగా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టర్స presentation పై చర్చ జరిగితే ఉపయోగకరంగా వుంటుంది...అరుణ గురించి చర్చ జరిగింది కాబట్టి కొన్ని విషయాలను గమనించాలి...రవి గారూ..అరుణ కాంగ్రెస్ ప్రతినిదా అన్న మీ వ్యాఖ్యానమే సరిగా లేదు...యిక్కడ రెండు విషయాలున్నాయి...ఒకటి...రిపోర్టర్ సామర్ధ్యం, పరిణితి..రెండు...రిపోర్టర్ రాజకీయ పక్షపాతం....అరుణకు సామర్ధ్యం లేదనేది మీ భావనా ? లేక అరుణ కాంగ్రెస్ పక్షపాతిగా వ్యవహరిస్తున్నదనా ?? ఈ విషయం లో మీకు clarity లేదనిపిస్తోంది..రెండవదే మీ అభిప్రాయం అయితే మీది పూర్తిగా తప్పు..ఎందుకంటె రిపోర్టర్ చెప్పిన ఒకటి రెండు మాటలను బట్టి మీరు రాజకీయ ముద్రలు వేయడం సరికాదు..ఒకవేళ మొదటిది మీ భావన అయితే ఆ విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పలేకపోయారు...మీ వ్యాఖ్యానం చివర్లో ఎన్ టీవీ యాజమాన్యానికి కూడా మీరు సలహాలిచ్చారు...కాబట్టి మీరు స్పష్టంగా ఏమి చెప్పారో ఎవరిని నిందిచారో అర్ధం కాలేదు....యికపై reporters గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసేప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాము..యిక అరుణ presentation గురించి చెప్పాల్సి వస్తే భాషలో, భావాన్ని లౌక్యంగా చెప్పడంలో కొన్ని సమస్యలు వున్నాయన్నది నా అభిప్రాయం..