Sunday, April 18, 2010

ఆగకుండా....వెంటాడుతున్న....దంతెవాడ

రోజూ రాసే మీడియా రొచ్చుకు భిన్నంగా...ఏదైనా రాయాలని ఉదయాన్నే అనుకుని...'హిందూస్తాన్ టైమ్స్' మొదటి పేజీ చూస్తే...గుండె తరుక్కు పోయింది. దంతెవాడలో మావోయిస్టులు విచ్చలవిడిగా జరిపిన కాల్పులలో తీవ్రంగా గాయపడిన  సీ.ఆర్.పీ.ఎఫ్.జవాన్లు తమ చివరి క్షణాలలో రక్తమోడుతూ తమ కుటుంబసభ్యులకు తమ మొబైల్స్ నుంచి చేసిన కాల్స్ పై ప్రత్యేక కథనం అది. 


"Dantewada jawans tried to reach out one last time" అనే శీర్షికతో ఉన్న ఆ వార్త హృదయాన్ని కదలించింది. దాని మొదటి పేరా (లీడ్) ఇలా ఉంది:
They wanted to listen to their children's voices one last time and give their wives the courage to carry on.
They wanted to apologise to their parents for deserting them.

The CRPF soldiers wounded in the jungles of Dantewada were using their mobile phones for that final, desperate call.
Life was slipping out of their grasp. Still, the jawans wanted to assure their loved ones that everything would be alright. 

For some, the bell kept ring- ing. For others, the phone was away from their families work- ing in the fields. Here are a few stories of those final moments.

ఒక జవాను పడిన వేదన గురించి వార్త చివర్న ఇలా ఉంది:   


Badly wounded, Ali Hassan, 34, of Khatola Village in Uttar Pradesh's Muzaffarnagar district, called his wife Tasmina.
“Take care of the daughters.
I might not survive as I have two bullets in my body,“ he said.
And then the phone was disconnected, forever.


ఈ కుటుంబాలు చేసిన తప్పు ఏమిటి? అలీ హసన్ కూతుళ్ళకు ఈ శిక్ష ఎందుకు పడాలి? ఈ వార్త చదివి...ఆ దండకారణ్యంలో చివరి క్షణాలలో జవాన్లు పడిన బాధను, కుటుంబం కోసం వారు పడిన వేదనను ఊహించుకుని బాధపడ్డాను. తెలంగాణా పల్లెలలో ఇళ్ళ నుంచి మావోయిస్టు ముద్ర తో యువకులను బలవంతాన తీసుకెళ్ళి పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్లు చేసినప్పుడు కూడా ఇదే బాధ కలిగింది. ఎన్నాళ్ళిలా పోరాటం? ఎంత మంది చావాలిలా? ఎన్ని కుటుంబాలు రోదించాలి ఇలా? 

జవాన్లను అలా చంపడానికి బదులు మావోయిస్టులు ఏదైనా వాయువు ప్రయోగించి వారిని నిర్వీర్యులను చేసి బంధించి తర్వాత వదిలేసే ఏర్పాటు వుండివుంటే ఎంత బాగుండేది? రెండు వర్గాల వారూ చంపుకోవడం కాకుండా...పరస్పరం కసి తీర్చుకోవడానికి మధ్యేమార్గంగా ఏదైనా కనిపెడితే ఎంత బాగుంటుంది? ఒక్క దెబ్బకు 76 మంది నేలకొరిగారు. ఇదే ఆఖరి పోరాటమన్న గ్యారెంటీ లేదు కదా!


ఈ అర్థం లేని పోరాటంలో సమిధలవుతున్న వారిని తలచుకుంటే...గుండె పగులుతుంది. మావోయిస్టులు నిజంగా తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తారా? అంటే...అది దుర్లభం అనిపిస్తుంది. అలాగని...రాజ్య వ్యవస్థను నిలువరించి వారు బతికి బట్టకట్టగలరా అంటే...అదీ ప్రశ్నార్ధకమే. ఇటు చూస్తే...ఈ పోలీసులు, సైన్యం వారిని ఎదుర్కుని పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. వారిది ఒక చచ్చుపుచ్చు వ్యవస్థ. అందువల్లనే....రెండు వైపులా వీరులు నేలకు ఒరుగుతున్నారు. 

అరుంధతి రాయ్ లాంటి ఒక రచయిత్రి స్వేచ్చగా దంతెవాడ వెళ్లి మావోయిస్టులతో గడిపి తీరిగ్గా వెనకకు వచ్చి పెద్ద వ్యాసం రాసారంటే...నిఘా ఏమైనట్లు? పోలీసులు...పై వారి ఆదేశాలను పాటిస్తూ అరణ్యంలో బిక్కుబిక్కున బతుకుతున్నారన్న సమాచారం ఇంకా భయం గొల్పేదిగా ఉంది. విపరీతమైన ప్రజాబలం లేనిదే మావోయిస్టులు ఇన్నాళ్ళు అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడపలేరు. ప్రజల దన్ను ఉన్నంతకాలం ఫేక్ ఎన్కౌంటర్ లు తప్ప పోలీసులు/జవాన్లు వారిని ఏమీ చేయలేరు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? చర్చలకు ఎవరు ముందుకు రావాలి? అసలు దేనిమీద చర్చ జరపాలి?


ఇన్ని ఆలోచనల మధ్య భారమైన హృదయంతో....CNN-IBN ఛానల్ ను సందర్శిస్తే...అక్కడా..."Dantewada Martyrs" అనే హృదయ విదారక కార్యక్రమం వస్తున్నది. అది దృశ్య కావ్యం కావడంతో ఇంకా ప్రభావశీలంగా అనిపించింది. అప్పుడిక లాభం లేదని...తెలుగు ఛానెల్స్ చూస్తే.... సినిమా పాటలు, మసాలా మాటలు కలగలిసిన వార్తలనబడేవి ప్రసారమవుతూ కనిపించాయి. అక్కడే ఫిక్స్ అయి సేద తీరాను...ఈ ఆదివారం ఉదయం.

6 comments:

Anonymous said...

హమ్మయ్యా ఇప్పటికీ గుర్తించారు మన తెగులు chaanels గొప్పతనం...మన లోకం లో మనం వుందామ్...రేటింగ్లు పెంచుకుందాం..ప్రపంచం ఏం అయిపోతే మనకేం...అందుకే అప్పుడే అన్నారు...శ్రీ శ్రీ .అసలు సీసలైన దొంగ *** కొడుకులసలే మెసలే లోకం లో ..అనీ .[.స్పీడ్ అయానంటారా???]

Anonymous said...

raaamu gaaru mee blog chaala baavundi... modati nundi mee blog ni follow avutunna..kaani naaku ardam kaani oka vishyam enti antee meeru telugu lo unna anni channels meeda drusti pedutunnatlugaa ani pinchatam ledu..kevalam edo oka naalugu tv channels choosi vaati meedane comments raastunnatlu gaa undi..intavaraku meeru blog lo mahaa tv gurunchi oka vimarsha leda pogadta ledu ante atishayokthi kaademooo anipistundi,,endhuku mee drustilo adi channel kadaaa leka mee vimarsha/pogadtha ki adi arhata saadincha ledaaa..

ilaaa anatam konchem badha gaa ne vundi meeru telagana channels meeda konchem makkuva choopistunnatlu anipistundi adi tappu kaadu ..enadhukantee iddaru pillalu unna amma aina neeku evarante istama aante iddaru ani chepppina evo okalla meeda pisrantaa ekkuva untundi...
eta vaata nenu cheppa vachhedi enti ante anni channels meeda drsuti petti andarini kadigi veyandi

mee comment kosam eduru choose oka abhimaani

Ramu S said...

డియర్ అభిమాని గారూ...
మీ పరిశీలన చాలా కరెక్టు. నేను అన్ని చానల్స్ మీద దృష్టి పెట్టి సమన్యాయం పాటించాలని అనుకుంటున్నాను. కానీ అది కుదరడం లేదు. కొన్ని చానల్స్ చూడడం అస్సలు కుదరడం లేదు. అది నా తప్పే. ఇక ముందు...దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. ఈ ఐ.పీ.ఎల్. మ్యాచుల వాళ్ళ నా పుత్రరత్నం టీ.వీ.ఇవ్వడం లేదు. నిజానికి ఈ-టీ.వీ.కూడా చూడడం లేదు. ఈ సమస్యకు ఒక పరిష్కారం చూస్తాను.
తెలంగాణా చానల్స్ మీద ప్రేమ అన్న మాట కరెక్ట్ కాదేమో! నేను నిష్పాక్షికంగా ఉండాలనే అనుకుంటున్నాను.
మీ అభిమానానికి థాంక్స్
రాము

kvramana said...

it is unfortunate that the country had to lose so many trained soldiers. The human side is really tragic. I saw those stories about the soldiers calling their homes for the last time using mobiles.
But, end of the day it is a war. Or the home minister thinks that Chhattisgarh is a war zone. I think it is equally important to know why the Maoists have turned so brutal. If you stop and take stock of things, neither the Maoists nor the police have any respect towards our laws. Encounter has now become a synonym for killing. The other day I saw that acid attack story and the sister of the girl was demanding that the accused should be "encountered". So, the police department has successfully made the people understand that encounter is nothing but straight manslaughter. Forget about the pre-talks days. After the talks between the AP and the Naxalites collapsed, Riyaz was the first top leader to be killed in an "encounter". There was a report in a Telugu newspaper about Riyaz getting captured in Ramnagar and two days later he was killed in Karimnagar during an exchange of fire. Or take the case of the "encounter" of Warangal acid attack accused. All the three were gunned down. What does this show? Even the protectors have no confidence in the law of the land. So, in a lawless situation, anything can happen. We sitting on the sidelines do talk about the human angle. Where is it?

Anonymous said...

కోట్ల సంవత్సరాల క్రితం ఉల్కా పాతాళ వల్లన డైనోసార్లు నాశనమైపోయినట్లు ఒక చిన్న క్రికెట్ బాలు సైజ్ ఉల్కలు జస్ట్ పది ఈ ప్రధాన ఛానల్ల హెడ్ ఆఫీస్ ల మీద(ఎవరూ లేని టైములో) పడి ఒకే సారి నాశనం అయితే గాని ఆంధ్ర ప్రదేశ్ కు శాంతి లేదు.

Krishna Chaitanya said...

Whats the use of Naxalism to present society? The so called naxals are no more following their ideologies, they are just kidnappers and goondas who threten people for money and they help the tribals just for their shelter and survival.
అలాగని...రాజ్య వ్యవస్థను నిలువరించి వారు బతికి బట్టకట్టగలరా అంటే...అదీ ప్రశ్నార్ధకమే. What do they do by fighting against this democratic system? If any change has to come, people have to vote against corruption and bad politicians. Its the people who elect the govt. in india.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి