మనం చేసిన పనిని ఎవడైనా (బాధితుడైనా) సరే ఖండిస్తే...కసితో, ద్వేషంతో వాడి వెంటపడి వాడి తప్పులు వెతికి వాతలుపెట్టి పరువు తీయాలనుకోవడం మానవత్వం కాదు, దానవత్వం. ఇది రాక్షస బుద్ధి. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ రోజు కొట్టొచ్చినట్లు కనిపించింది.
ఈ మధ్య చిరంజీవి మీద 'ABN-ఆంధ్రజ్యోతి' ఎల్లో జర్నలిజానికి పాల్పడి కారుకూతలు కూస్తే ఒళ్ళు మండి పీ.ఆర్.పీ.కార్యకర్తలు దాని ఆఫీసు మీద దాడి చేశారు. దాడిని మనమూ ఖండిద్దాం. అయితే...అయ్యబాబోయ్...అసలే పత్రికా స్వేచ్ఛ...ఈ విలేకరులతో మనకెందుకు వచ్చిన గొడవ..అని అంతా కిమ్మనకుండా ఉంటే....'ఈనాడు' మాజీ విలేకరి, ప్రస్తుత పీ.ఆర్.పీ. శాసన సభ్యుడు కే.కన్నబాబు ఆ పత్రిక కం ఛానల్ మీద గళం ఎత్తాడు. అది సహజంగానే మన వేమూరి రాధాకృష్ణ గారికి, వారి బృందానికి నచ్చి వుండదు. అందుకే...ఆ మధ్య ఒక 'ప్రత్యేక వ్యాసం' లో కన్నబాబు మీద వేమూరి గారు అక్కసు వెళ్ళగక్కారు.
ఈ రోజు "'గుర్తు' తెలియని కన్నబాబు...అంటే...అన్నామంటారు" అన్న శీర్షికతో 'ఆంధ్రజ్యోతి' పేపర్ మొదటి పేజీలో ఒక ఫోటో ప్రచురించారు. ఇది, రెండో పేజీలో వేసిన వార్తా కన్నబాబు పరువు తీసే కార్యక్రమం. 'ఉదయించే సూర్యుడు' గుర్తు కాకుండా....'రైల్ ఇంజిన్' గుర్తు ఉన్న జెండాలు కట్టిన కాకినాడ సభలో మాట్లాడడం కన్నబాబు చేసిన పాపం.
ఆ వార్తలో చాలా అభ్యంతరకరమైన మాటలు వ్యంగ్యంగా రాసారు. "ఏ వార్త రాయడానికి ఎవరి వివరణ తీసుకోవాలో...ఎంత టైం తీసుకోవాలో ప్రాధాన్యాలు గుర్తు చేసి...తాను కూడా ఒకప్పుడు జర్నలిస్టు అని మాటిమాటికీ గుర్తుచేసే కన్నబాబు..పాత గుర్తు ఉన్న జెండాలతోనే జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించి...చివరాఖరున ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళిపోయారు," అని అందులో రాసారు. ఇది ఘోరం, దారుణం, బజారు జర్నలిజం. కన్నబాబుపై ఆ పత్రికలో పేరుకున్న అక్కసు, ద్వేషం, పగ, ఉడుకుమోతు తనం ఇందులో కనిపిస్తున్నాయి.
తాను జర్నలిస్టునని కన్నబాబు మాటిమాటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాడా? ఇది పచ్చి అబద్ధం. ఒక వేళ ఆయన గుర్తు చేసుకున్నా...అది తప్పు ఎలా అవుతుంది? నిజంగానే కన్నబాబు 'ఈనాడు'లో రిపోర్టర్ గా చాలా కాలం పనిచేసారు. మంచి వార్తలు ఇచ్చాడు. కిరసనాయలు దొంగతనం చేసిన వాడు, బియ్యం అక్రమంగా అమ్ముకున్న వాడు...నేను ఆ పని చేశాను అని గర్వంగా నిస్సిగ్గుగా చెప్పుకున్నప్పుడు... కన్నబాబు తాను విలేకరిగా పనిచేశానని ఉదయం నుంచి రాత్రి వరకూ చెప్పుకున్నా...తప్పు కాదే!
ఓకే...ఒకవేళ....పీ.ఆర్.పీ. ఎం.ఎల్.ఏ. చేసింది ఘోర తప్పిదమే, మహా పాతకమే అనుకుందాం...ఆ ఫోటో మొదటి పేజీకి అర్హమవుతుందా? సినిమాను కమ్మగా నలుగురు మారాజులు దున్నుకుంటూ ఉన్నారని...దాసరి నారాయణ రావు అన్న మాట రెండో పేజీలో వస్తుంది. అంతకన్నా ముఖ్యమైన వార్తలు లోపలి పేజీలకు పోతాయి. కన్నబాబు లాంటి వాళ్ళ పరువు తీసే ఫోటో మాత్రం మొదటి పేజీకి వస్తుంది.
మరి...వేమూరి గారు...తాను జీవితంలో బాలగోపాల్ గారిని కలవలేదని గతంలో ఒక 'ప్రత్యేక వ్యాసం' లో రాసారు. 'ఆంధ్రజ్యోతి' ప్రమాణాల బట్టి చూస్తే...అది కూడా...ఒక వార్తే కదా!
ఇదంతా కాదు...తాజా రాజకీయ పరిణామాలపై కురసాల కన్నబాబును, వేమూరి రాధాకృష్ణను ఒక చోట కూర్చోబెట్టి కాపీ కొట్టకుండా ఒక వ్యాసం రాయమందాం. అక్షర దోషాలు, వాక్య అన్వయం, విశ్లేషణ...బట్టి మార్కులు వేయమని ఒక ముగ్గురు పండితులను అడుగుదాం. ఆపుడు తెలుస్తుంది....మూర్ఖుడెవడో...మగధీరుడు ఎవడో.
Tuesday, April 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
రాముగారు ... ఆఖరు పేరా మాత్రం సూపర్... చూస్తూ వుండండి..మీ మీద కూడా ఎదయినా అంధ్ర జ్యొతిలొ ఫ్రంట్ పేజ్ లొ వస్తుందేమో :-))
సూపరు గా చెప్పారు మాస్టారు :)
రాము గారు,
కలాం గారు చెప్పినట్టు, మన దేశం లోనే, పనికి రాని వార్తలు ముందు పేజీ లోనూ, పనికొచ్చేవి మధ్య పేజీ లోనూ పేపర్లలో రావడం అలవాటే. మీరు సమస్యని బాగానే పట్టుకున్నారు, కానీ ఆవేశం దారి తప్పి రాదా కృష్ణ గారిని సవాలు చేసింది చివరకి. నేను జర్నలిస్టుని కాను, అంచేత, చీఫ్ ఎడిటర్ మొదటి పేజీ వార్తలు వ్రాస్తారేమో నాకు తెలియదు. ఏ విధము గా అయినా, నా దృష్టి లో అది అనవసరము.
వార్తా పత్రికలలో చెయ్యలేని (అంటే, అక్కడ ప్రచురింపబడని అని నా ఉద్దేశ్యము) వ్యాఖ్యానాలు ఇక్కడ చర్చించాలి లేదా, ఉన్న వార్తల మీద వ్యాఖ్యానించాలి అంతే కాని, మీరు కూడా, 'నేను నీకు లోకువ, నాకు నంబి కొండయ్య లోకువ' అన్నట్లు మీరు వారిని అన్నారు, మేము మిమ్మల్ని అంటాము అన్న ధోరణి లో పోకూడదు కదా?
ఇదే నా మొదటి కామెంట్ మీ సైట్ లో. బాదాకారము గా అభిప్రాయ భేదము తో మొదలయింది. నొచ్చుకోకండి, నొప్పించి ఉంటే, క్షంతవ్యుడను..
భవదీయుడు
సీతారామం
ఆఖరి ఛాలెంగ్ బాగుందండీ....ఇలా నీస్సిగ్గుగా ఎలా behave చేస్తున్నారో మన పాపెరోల్లు[paperollu]?i mean ఎలా వ్రాస్తున్నారో?జనాలు నవ్వుకుంటున్నారన్న స్పృహ కూడా లేదాయే??ఒకటి మాత్రం నిజ.. పాపెరుంధి కదా అని రాసి పారేసినా..జనానికి ఏది నిజమో?ఏది కహానీయో మాత్రం బాగా అర్దం చేసుకోగలరూ..అర్ధం చేసుకుంటున్నారు కూడా...
Asalu Editor K.Srinivas ki, Asst Editor Allam Narayanaku siggu ledu. Varthala pradhanyam ila chesthunnarante... Mamulu reporters, sub-editors Radhakrishna meppu kosam ayana shthruvula meeda leda non-TDP valla meeda kasitho rasthunnarani ardham chesukovachu. Mari Kannababu news front pageloki vachinanduku evarini thittali. Khachithanga K.Srinivas, Allam Narayane deeniki badhyatha vahinchali. Siggu leni waste fellows...
తప్పు ఎత్తి చూపే క్రమంలో మీరు కూడా వేమూరి స్థాయికే దిగజారిపోతున్నారు. గమనించ ప్రార్థన.
నేను వేమూరి స్థాయికి దిగాజారడమా? మీరూ, నేనూ ఎప్పటికీ ఆ స్థాయికి చేరుకోలేమని గమనించగలరని మనవి
రాము
saar,
kannabaabu tarapuna meeku inta avESam raavataaniki kaaranamemiti?
కన్నబాబు తరఫున...
నిజానికి నేను ఎప్పుడూ కన్నబాబును కలుసుకోలేదు. ఈనాడు లో ఉండగా అతని స్టొరీ లు చూసేవాడిని అంతే. అయితే..జ్యోతి వాళ్ళు అంత దారుణంగా అతనిపై ఏకపక్షంగా దాడి చేస్తుంటే...ఊరుకోలేక పొయ్యాను. కన్నబాబు అంత గొప్ప జర్నలిస్టు మరొకడు లేడు అని నేను అనడం లేదు...అలా టార్గెట్ చేసి దాడి చేయడం నాకు అనైతికమని అనిపించింది.
రాము
"Taaja raajakeeya parinaamaala pai Kannababunu, Vemuri Radhakrishnanu oka chota koorchobetti copy kottakunda oka vyasam raayamandam" "Appudu Telustundi moorkhudevaro, magadheerudevaro"... Ramu, idi avagaahana lekudaa raasinattundi. Radhakrishna chaala baagaa raastaaru. Teliyakapothe telusuko.
Iddarilo Radhakrishne baaga raastaaranedi naa abhiprayam. Ayina raatanu batti vaarilo okariki moorkhudani, marokariki magadheerudani birudulu ivvaalanukovadam sari kadu.
hi ramu gaaru,thanks for creating a platform for the most required debate .I dont claim to be genuine with hidden agenda inside(like eenadu nd andhra jyothy).I am a fan dr.chiru nd his party so only this article caught my attention.my request to u is pls provide the articles written by mr radha krishna nd kanna babu as we dont know who has written wt but seeing both of them claiming to be journalists.as u have created a platform,i request u to continue the debate with a wide motive.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి