Sunday, June 6, 2010

ఈనాడు జర్నలిజం స్కూల్--1992 బ్యాచ్ సమావేశం


ప్రముఖ భాషావేత్త, విమర్శకుడు బూదరాజు రాధాకృష్ణ గారు 'ఈనాడు జర్నలిజం స్కూల్' ప్రిన్సిపల్ గా ఉండి తయారుచేసిన రెండో బ్యాచ్ (1992) సమావేశం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. 

ఆనాడు రామోజీ రావు గారి చేతుల మీదుగా గురువుగారి ఆశీస్సులతో జర్నలిజం పట్టా తీసుకుని వెళ్ళాక... మళ్ళీ ఇప్పుడు కలుసుకున్న మిత్రులు ఇందులో ఉండడం విశేషం. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకూ ఈ సమావేశం సాగింది. జర్నలిజం లోమృగ్యమవుతున్న విలువలు, వ్యక్తుల నుంచి ఎదురయ్యే సాధక బాధకాలు, 'ఈనాడు' నేర్పిన క్రమశిక్షణ వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

1992 August 31 న 'ఈనాడు జర్నలిజం స్కూల్' పట్టా తీసుకున్ననాటి నుంచి ఇప్పటి వరకూ వృత్తిలో, జీవితంలో ఎదుర్కున్న ఎగుడు దిగుళ్ళను మిత్రులు పంచుకున్నారు. ఆద్యంతం ఆనందంగా, నవ్వులమయంగా ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనం జరిగింది. ఇందులో...హై లైట్ ఏమిటంటే....ప్రస్తుతం HM-TV లో పనిచేస్తున్న విజయ్ ను అప్పటి స్నేహితులు దాదాపు సగం మంది గుర్తుపట్టలేదు. ఇక నా తెల్లజుట్టు, బట్ట తల చూసిన మిత్రుడు ఇసికేల ఉదయ్ కుమార్...'ఏందబ్బా...చూడగానే సీనియర్ సిటిజెన్ లాగా కనిపిస్తివి..." అని ప్రేమతో రాయలసీమ యాసతో అంటే ఆనందం అనిపించింది. 

విశేషం ఏమిటంటే....ఈ బ్యాచ్లో ఉన్న ఇద్దరు గర్ల్ స్టూడెంట్స్ ను వృత్తిలో స్థిరపడిన తర్వాత మా బ్యాచ్ మెట్లు పెళ్ళాడడం. 'వసుంధర' పేజీలు ఈ స్థాయికి రావడానికి అహరహం ఉత్సాహంతో కృషిచేసిన ఇద్దరు జర్నలిస్టులు...పద్మశ్రీ, శోభ శ్రీ లు. పద్మ శ్రీ...అప్పట్లో 'ఈనాడు'లో ఉన్న బుడన్ ను, శోభ శ్రీ...అప్పట్లో 'ఆంధ్రభూమి'లో ఉన్న మధును పెళ్ళాడారు. 
పద్మ శ్రీని ఆ తర్వాత ఇంటర్నెట్ డెస్క్ కు మార్చారు. ఇప్పుడు తాజా బదిలీలలో....తనను మెదక్ డెస్క్ కు మార్చారు.

ఈ మీట్ లో అందరం కలిసి లంచ్ ఆరగించడం, ప్రతి ఏడాది కుటుంబాలతో కలుసుకోవాలని నిర్ణయించడం....విశేషాలు. ఈ ఫోటోలు ఉన్న వారి వివరాలు:
ఆసీనులైన వారు (కుడి నుంచి ఎడమకు):
ఉదయ్ కుమార్ (టీచర్), హేమ సుందర్ (ఈనాడు), శోభ శ్రీ (ఫామిలీ కోర్ట్ కౌన్సిలర్), పద్మ శ్రీ (ఈనాడు)

నిలబడిన వారు (కుడి నుంచి ఎడమకు):
MNV ప్రసాద్ (TV-9), KV రమణ (DNA), సత్యానంద కుమార్ (సాక్షి పేపర్), గోపరాజు రాధాకృష్ణ (Maa TV), పమిడికాల్వ మధుసూధన్ (ధాత్రి కమ్యూనికేషన్స్), శివ చరణ్ (రియల్ ఎస్టేట్), వేణు గోపాల రావు (ఈనాడు), రఘునాథ్ (ఈనాడు), ఎస్.రాము (జర్నలిజం టీచింగ్), షేక్ బుడన్ (Studio-N), విజయ్ కుమార్ (HM-TV), కేసరి మురళి (రియాలిటీ షో ల నిపుణుడు).
రెంటాల జయదేవ (ఇండియా టుడే), గోపాల క్రిష్ణ మూర్తి (సెక్రటేరియట్), అనిల్ కుమార్ (లాయర్), నాగేశ్వర్ గౌడ్ (సాక్షి), జమీర్ (ఈనాడు), రామచంద్రా రెడ్డి (బ్రాహ్మిణి స్టీల్స్), అచ్చియ్య దొర (ఈనాడు), భరణి (ఈనాడు), వల్లూరి రాఘవ రావు (N-TV), సత్యకుమార్ (భీమా రంగం), సత్యప్రసాద్ (వివరాలు తెలియదు) ఈ కార్యక్రమం లో పాల్గొనలేక పోయారు. 

ఈ సమావేశానికి వచ్చిన ఈ పిల్ల మూక వివరాలు (కుడినుంచి ఎడమకు): SFR స్నేహిత్ (రాము పుత్రుడు), సుజయ్ (మధు-శోభ పుత్రుడు), వెన్నెల (వేణూ కూతురు),  సుహానా (బుడన్-పద్మ శ్రీ కుమార్తె), మైత్రేయి (రాము పుత్రిక)

14 comments:

నరేష్ నందం (Naresh Nandam) said...

వృత్తి విద్యలో మిత్రులు అప్పుడప్పుడూ కలుస్తుండడం జీవితంలో ఎంతో ఉపకరిస్తుంది.
పద్దెనిమిదేళ్ల తర్వాత పాత స్నేహితులను కలుసుకోవటం చాలా సంతోషాన్నిస్తుంది.
ఆ ఆనందం మీ అందరిలో కనిపిస్తోంది.
అభినందనలు!
ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాల అమల్లో అందరూ శ్రద్ధ వహిస్తారని ఆశిస్తూ..


-నరేష్ నందం

quimicaindia said...

Any bloggers in them ??
let us have their blog details, so that we can follow them.

rgds
krishna

Saahitya Abhimaani said...

It always gives pleasure to meet our friends, especially with whom we studied.

Meeting colleagues and friends after some time gives great Nostalgic Pleasure and such memories are treasured in a special place in our Hearths.

Good that all of you could meet. Please do continue the effort at regular intervals.

Raja said...

hope the resolution about having a get together will be a reality..

Raja

-------------------------------------
No need to publish this
Ramu garu your son is a replica of you

hai telugu news said...

ఆడ పిల్లలు లేని మనం పద్మని ఒకళ్ళం, శోభని ఒకళ్ళం దత్తత తీసుకుందాం అని రామోజీ, బూదరాజు సరదాగా అనుకునే వాళ్ళట. బూదరాజే ఈ విషయం మా బ్యాచ్ క్లాస్ లో ఒకసారి చెప్పారు. ఆ మాట చెప్పే సమయం లో ఆయన గొంతులో ఫీలింగ్ ఇప్పటికీ నాకు గుర్తే.

ఈ సంఘటన చాలు మీది స్పెషల్ బ్యాచ్ అని చెప్పడానికి. అభినందనలు.

శ్రీనివాస్.

Ramu S said...

1) Two of them have just started blogs. I'll let you know once I get URLs.
2) నిజంగా ఆ ఇద్దరు శ్రీ లు చాలా బాగా పనిచేసారు. అయినా...వారికి సముచిత గౌరవం దక్కలేదు. ఇలాంటి వాళ్ళను కోల్పోవడం 'ఈనాడు' కే నష్టం.

రాము

ప్రసాదం said...

అన్నయ్యా నిజానికి గుర్తు పట్టకుండా ఉండాల్సింది మిమ్మల్ని. విజయ్ కాస్త లావయ్యాడు అంతే, విజయ్ ను గుర్తు పట్టకపోవడం విశేషమే మరి :) బుడన్ గారిని నేను గుర్తుపట్టలేకపోయాను.

nareshnunna said...

Dear Ramu,

Nice to see the Alumni Meeting, which seemed to be an intimate gathering.
Journalists from Eenadu Journalism school commonly possess 'work culture' with an immense professional zeal. Therefore, they are distinctive in the journlaists' groups.
But, surprisingly, they have nothing to do with serious literature (in general); or they have a little to do with literature. Having been trained up by colossus including Budaraju and Rambhotla, EJS students are ill-equipped with the literary, philosophical trends of the times.
I observed the general writings of many journos from Eenadu; of course, they are impeccable, crisp, nicely edited and so on. But, very aloof from the engrossing trends of modern prose.
Am I prejudiced? Are there any good writers, who put their aplomb on Telugu literature?
- Naresh Nunna

Ramu S said...

Mr.Naresh,
Thanks a lot for writing this comment. I can't buy your observation.
EJS offers a tailor-made course only to cater to the needs of day-to-day journalism. Hence they, including Boodaraju garu, taught us limited Telugu. They made it clear that no scholarly knowledge is needed to run the show in the media. Despite that there are good writers with literary skills.
For example, Goparaju Radhakrishna of Maa-TV is a writer. He brought out a book recently. P.Madhu himself is a very good writer but now he is into business. He penned some good poetry and songs.
The big name is Mr.Valloori Raghava Rao (N-TV). He had edited Andhra Prabha weekly, you know.
I will wait for your comment on this.
Cheers
Ramu

Krishnarjun said...

అప్పట్లొ తీయించుకున్న మీ గ్రూప్ ఫొటొ ఎదయినా ఉంటె పెట్టండి.1992 అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడన్న మాట.

త్వరలో నేను కూడా నా బ్లాగ్ మొదలు పెట్టనున్నాను.

మీ
క్రిష్ణ

Ramu S said...

Dear Krishnarjun gaaru
good idea.
My dear friends of EJS-1992
Can anyone of you scan our group photo and mail it to me? My scanner is out of service.
Lets post both the pictures side by side.
Cheers
Ramu

kvramana said...

annayya ramu
it was great to see our photograph on your blog. i was expecting a post on our meeting but your decision to add the group photo and also the picture of kids to the blog was fantastic. Indeed it was an extraordinary batch which definitely added a great value to Eenadu that time. I know that the batches that passed out of the school after us too used to talk about our batch. Can we plan a Newseum with the help of successful people like Madhu, Sivacharan, etc.?
Think about it
Ramana

Raja said...

Krishnarjun

Nice idea to have both pics its kinda nostalgic.

Wish you good luck in blogging.


Raja

Anonymous said...

Hi,
I am a regular follower of this blog. I am from chennai.I saw my college mate after a long time may be after 15 years. Though I know about his progress and talked to him twice or thrice over phone, I am able see Mr.Muralidhar Kesari in this photograph.Thanks a lot for this. I am not from media. But I like your blog. I wiah all the best for all of you.

sreerama

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి