Tuesday, June 1, 2010

FLASH:::: N-TV సీ.ఈ.ఓ.రాజశేఖర్ పై ABN-AJ లో స్టింగ్ వార్త

ఇప్పుడు N-TV సీ.ఈ.ఓ.గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు రాజశేఖర్ ను స్టింగ్ ఆపరేషన్స్ నీడలా వెంటాడుతున్నట్లు ఉంది. 

TV-9 లో చీఫ్ కో-ఆర్డినేటర్ గా ఉన్నప్పుడు ఆఫీసులో రాజశేఖర్ డబ్బులు తీసుకుంటూ నిఘా కెమెరా కంటికి చిక్కడంతో రవి ప్రకాష్ బైటికి గెంటాడని వార్తలు వచ్చాయి. ఒక నాలుగేళ్ళ కిందట పెద్ద సంచలనం సృష్టించింది ఆ స్టింగ్ ఆపరేషన్. ఆ తర్వాత కొన్ని రోజులు గమ్మున ఉన్న రాజశేఖర్ ఇది NRI ల చానెల్ అని నమ్మ బలికి...i-news స్థాపించాడు. TV-9 లో రాజశేఖర్ ఉండగా ఈ చేతులతోనే లంచాలు ఇచ్చామని చెప్పుకున్న MNR విద్యాసంస్థల వారు దాని యజమానులని తర్వాత తెలిసి జనం లబోదిబో మన్నారు.
i-news లో కూడా అపకీర్తి మూటకట్టుకున్న రాజశేఖర్ N-TV లో చేరాడు. "ఇండస్ట్రీ లో ఎవరికీ రాని జీతం నాకు వస్తున్నది," ఆయన తన సన్నిహితులతో చెప్పుకున్నారు.

N-TV కి పెద్ద పదవిలో వెళ్ళిన రాజశేఖర్ ఒక బిజినెస్ డీల్ లో శారద పీఠం అధిపతి స్వరూపానంద తో చేసిన టెలిఫోన్ సంభాషణ ను ABN-AJ ఛానెల్ ఈ ఉదయం ప్రసారం చేసింది. ఇందులో సరుకు కన్నా హడావుడి ఎక్కువగా ఉంది.
సుబ్బిరామి రెడ్డి తనతో మాట్లాడినట్లు, తాను TV-9 లో డేప్యుటి CEO గా ఉన్నప్పుడు ఇలాంటి కేసులు డీల్ చేసినట్లు, కింది స్థాయి ఉద్యోగులు తెలియక ఏదో చేస్తారని....రాజశేఖర్ మాట్లాడడం అందులో విన్నాం. ఆ గొంతు ఒకప్పటి నా మిత్రుడైన రాజశేఖర్ దే...ఆ కోతల మాటలు మావాడివే అనడం నిస్సందేహం.
అయితే...తనకు డబ్బు ఇవ్వమని డైరెక్టు గా రాజశేఖర్ చెప్పినట్లు ఇందులో ఎక్కడా లేదు. రాజశేఖర్ తెర వెనుక చేసినట్లు చెబుతున్న బేరాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బహిర్గతం చేసిన దాఖలాలు ఈ సంభాషణలో లేవు.  

రాజశేఖర్ తో మాట్లాడడానికి ABN వాళ్ళు లైవ్ లో ప్రయత్నించారు. మనోడు ఫోన్ ఎత్త లేదు. ఈ కేసులో...అసలు దోషులు ఛానల్ యజమానులు. వారి గురించి మాట్లాడాలి. ఎన్-టీ.వీ.చౌదరికి తెలీకుండా రాజశేఖర్ ఆ పని చేసి ఉండడు. అతను నీతిలేని జర్నలిస్టు అయితే...చౌదరి కూడా ఛానల్ ను అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నట్లే కదా. మరి ABN ఆ పెద్ద తప్పును గురించి ప్రస్తావించకపోవడం విడ్డూరం. 
ఇలాంటి విషయాలలోనే 'సత్యం' రక్షిస్తుంది. ఇప్పుడు చూడండి....TV-9 లో తనను సాగనంపిన విధానం, i-news ప్రవాస భారతీయులదని చేసిన దొంగ ప్రచారం, నిత్య అబద్ధాల కారణంగా ఇండస్ట్రీ లో ఒక్కరూ రాజశేఖర్ కు అనుకూలంగా మాట్లాడరు. రాజశేఖర్ విషయమైనా, వేమూరి విషయమైనా...మనం చెప్పుకోవాల్సింది ఒక్కటే....సత్యమేవజయతే.

3 comments:

శ్రీనివాస్ said...

ఒంగోలు లో కేబుల్ కట్ చేశారు ... ఎబిఎన్ న్యూస్ చూడకూడదు అని కాబోలు

Anonymous said...

journalisanike macha techela raja sekhar chesaadu athadini bahishkaristhe manchidi
mari intha bari teginchi lanchalu gunjadamemity ok mamulu journalist entha kastapadithay 10 000 vasthunnayi vallaku accredititions kuda ivvakudadu ippudu amar srinivasa redyy nidra pothunnara

సుజాత said...

ఏదేమైనా స్వరూపానంద అసలు స్వరూపం ఈ రకంగా బయటికి వచ్చినందుకు సంతోషించాలి.పొద్దున టీవీలో చూస్తుంటే మతి పోయిందనుకోండి. ఒక సందర్భంలో ఈయన హిందూ సంస్కృతికి అన్యాయం జరుగుతోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ఇంతకు ముందు చూసి ఆ కేకలు "జెన్యూన్"అనుకున్నా పొరపాటున!