Tuesday, June 8, 2010

TV-1 లో మతిలేని....చెత్త ప్రోగ్రాం....'మారో..మారో..మస్కా మారో'

మీరు రోడ్డు మీద యథాలాపంగా వెళుతూ ఉంటారు. చెట్టుపక్కన కోతివేషం వేసుకుని దాక్కున్న ఒక కొండముచ్చు లాంటి మనిషి ఒక్కసారిగా మీ మీదకు దూసుకొస్తాడు. మీరు భయపడి దూరంగా పోతుంటే...వాడు కోతి విగ్గు తీసి వెకిలిగా నవ్వి కెమెరా వైపు చూపిస్తాడు. 

మీరు బిజీగా ఫుట్ పాత్ మీద నడుస్తుంటారు. మీ ఆలోచనలు, సమస్యలతో మీరుంటారు. ఒకడు ఒక బకెట్ తీసుకుని మీ మీదకు అందులో ఉన్నది గుమ్మరించేందుకు దూసుకుని వస్తాడు. రావడమేమిటి...ఆ బకెట్ ను మీ మీదికి వచ్చి గుమ్మరిస్తాడు. అది ఖాళీ బకెట్, అందులో ఏమీ వుండదు కానీ....ఎవడో బకెట్ తీసుకుని మీదికి వస్తే గుండె జలదరిస్తుంది కదా!

రోడ్డుపక్కన ఒకడు షాక్ కొట్టినట్లు గిలగిలలాడుతూ ఉంటాడు. జాలితో మీరు తనను ఆదుకునేందుకు వెళ్తారు...ఎంతో ఆతృతతో. వాడు...కాసేపు ఉలకడు, పలకడు. మీరు కంగారు పడుతుంటే...ఒక్క సారి ఇకిలిస్తూ లేస్తాడు.

ఇవి, ఇవి కాక ఇంకొన్ని ఇలాంటి వెకిలి చేష్టలు, భయంగొలిపే, గుండె వేగం పెంచే ప్రోగ్రామ్స్ చేసి ప్రసారం చేస్తున్నది...TV-9 అనుబంధ ఛానెల్ TV-1. గతంలో తెలుగు ఛానెల్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి చాలా అపవాదుపాలయ్యాయి. జెమిని లో...ఇలాంటి క్రూడ్ జోక్ కు బలైన ఒక సీనియర్ సిటిజన్ మాట్లాడుతూ....''బాబూ...నేను హార్ట్ పేషెంట్ ను. నువ్వు చేసిన దానికి నాకేమైనా అయితే..." అని అడిగారు. అయినా....మనోళ్ళకు సిగ్గూ లేదు, ఎగ్గూ లేదు.

ఇందాక ఒక మిక్కీ మౌజ్ చెట్టు చాటునుంచి ఒక్క ఉదుటున దూకడంతో...అటు వైపు తల్లిదండ్రులతో వెళుతున్న ముగ్గురు చిన్న పిల్లలు జడుసుకున్నారు. వాళ్ళు కెమెరా...వారి వైపు చూపలేదు కాబట్టి...ఆ పిల్లల ఫీలింగ్ చూడలేక పోయాం, కానీ ఆ భయాన్ని ఊహించవచ్చు. జనాన్ని ఇలా భయపెట్టి చంపే...ప్రోగ్రామ్స్ ను నిలిపివేసి...ఆ చెత్త పనులు చేస్తున్న యాక్టర్స్, ప్రోగ్రాం హెడ్ లను అరెస్టు చేసి జైల్లో వేయాలి. 

7 comments:

Saahitya Abhimaani said...

ఇటువంటివి ఎదురైతే మెత్తగా తందామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మళ్ళి మొదలెట్టారన్న మాట. ఇటువంటి చెత్త జోకులకి గురైన వాళ్ళు వెంటనే పోలీసు కేసు పెట్టి అని వ్రాయబోతుంటే అనిపించింది వాళ్ళేమన్నా తక్కువ వాళ్ళా?? వీళ్ళ బాబులు!!! ఇద్దరినీ కలిపి ఒకే గాటన కట్టి ఆరు సంవత్సరాలు కేసు నడుపుతారు. ఎందుకు వచ్చిన పీడా మనకు అని జనం జడిసి ఇట్టాంటివి చూసీ చూడనట్టు ఊరుకునేది?

Raja said...

TV1 telecasts some weird stuff maaro maska maaro is one of them

siva garu aa programme chese vaalu meeku twaralo dorukutharu ani aasisthu

Raja

శరత్ కాలమ్ said...

భయపడుతున్నవారూ, బయపెట్టేవారూ కలిసి ఆడే నాటకాలే ఇవి అని విన్నాను. చూస్తున్న మనమేదో ఇలా దడుచుకోవడం తప్ప అక్కడంత దృశ్యం వుండదని నా అంచనా.

Ramu S said...

శరత్ గారూ..
కాదండీ...సీరియస్ గానే వీళ్ళు భయపెడుతున్నారు. stage managed కాదట. అయినా అవి చూస్తేనే తెలుస్తుంది.
రాము

సుజాత వేల్పూరి said...

జనాన్ని ఇలా భయపెట్టి చంపే...ప్రోగ్రామ్స్ ను నిలిపివేసి...ఆ చెత్త పనులు చేస్తున్న యాక్టర్స్, ప్రోగ్రాం హెడ్ లను అరెస్టు చేసి జైల్లో వేయాలి. ......I second...!

అంతే కాదు, భయపడిన వారు తేరుకున్నాక వెంటబడి ఆ యాంకర్లు, నటుల చెంపలు వాయగొట్టాలి. లేకపోతే బెల్టుతోనైనా సరే...అందినంత దూరం వెంటబడి కొట్టాలి.

Vinay Datta said...

These senseless programmes are based on a very hilarious, silent programme 'just for laughs'. That was truly funny. They also asked people not to blindly follow them. Our people simply cannot follow simple instructions.

Anonymous said...

sir....asalu ee program eppati nuncho telecast avuthondi tv1 lo....chala stupid concept...konni sarlu ayithe naku chala irritation vasthundi...ayina avathali vaarini bhayapetti kangaaru petti puttinche comedy sadism kaakapothe inkenti cheppandi!!!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి