Wednesday, June 30, 2010

స్టూడియో-ఎన్ కు మసాజ్ తీట: ఛీ..ఛీ..థూ..థూ...జర్నలిజం


మసాజ్ పేరిట సెక్స్ సేవ అందించే వారిది బతుకు పోరాటం కావచ్చు.
మసాజ్ చేయించుకునే వారిది కండరాల నొప్పో, తీటో, ఒళ్ళు బలుపో కావచ్చు.

మరి...నీలి మసాజ్ సెంటర్లపై ప్రత్యేక స్టోరీ పేరుతో బూతు క్లిప్పులు, తిక్క బాక్ గ్రౌండ్ పాటలు, అమానుషపు బొమ్మలు చూపే ఛానల్ ను ఏమనాలి?

పసుపు రంగు ఛానల్ చేసిన నీలి రంగు జర్నలిజం ఇది. అదే...స్టూడియో-ఎన్ ఛానల్. అది ఈ రాత్రి 'ఫోకస్' పేరిట 'మసాజా? మజాకా?' అనే శీర్షికతో ప్రసారం చేసిన కార్యక్రమం ఫక్తు బాధ్యతారహిత జర్నలిజం. ఆ మిషతో...కుటుంబంతో కలిసి కూర్చొని చూడడానికి వీలు లేని బూతు బొమ్మలు చూపడం...ఒక వికారపు పని, మానసిక వైకల్యం, టీ.ఆర్.పీ. వేటలో చేసిన ఒక నీచ ప్రయత్నం. 

పోలీసోడికి...రాంగ్ రూట్ లో పోతున్న అర్భకుడు దొరికినట్లు ఈ మధ్యన ఈ టీ.వీ.ఛానెల్స్ కు మసాజ్ కేంద్రాలు దొరుకుతున్నాయి. మీరు గమనించారో లేదో... పుట్టగొడుగుల్లా ఈ ఛానెల్స్ పుట్టుకొచ్చాక పోలీసులు, ఛానెల్స్ కలివిడిగా, విడివిడిగా ఈ మసాజ్ కేంద్రాలను ఒక పెద్ద సబ్జెక్టుగా తెరమీదికి తెస్తున్నాయి...క్రమం తప్పకుండా. ప్రజల మానసిక బలహీనతను సొమ్ము చేసుకునే దారుణ ప్రయత్నమిది. ప్రతి పదిహేను రోజులకొకసారి....మసాజ్ సెంటర్లపై దాడులు, వార్తలు! ముఖం కనిపించకుండా కప్పుకుని ఆ గృహాల నుంచి మహిళలు వస్తుండడం, వారిని కెమెరా వీరులు వెంటాడి షూట్ చేయడం...దాన్ని నిస్సిగ్గుగా గంటల తరబడి చూపించడం....రెగ్యులర్ ఫీచర్ అయ్యింది. 

ఈ ఛానెల్స్ నిజంగానే సామాజిక ఉద్ధరణకు నడుం బిగించాయి...సాంస్కృతిక పోలీసింగ్ కు పాల్పడుతున్నాయి...అనుకోవడానికి వీల్లేదు. వార్తను వార్తలా కాకుండా...మసాలా దట్టించి ఈ కథనాలు పసారం చేస్తున్నాయి. దాడులు జరిపి ఆ అభాగినులను పట్టుకున్న ప్రతిసారి...బూతు క్లిప్స్ చూపించి ఛానెల్స్ హడావుడి చేస్తున్నాయి. 

ఇది ఛానల్ బాసులకున్న చిత్తకార్తె కక్కుర్తి వ్యవహారం...మనమేమీ చేయలేం...అనుకుందామా? ఆ పరిధులను కూడా మించి ఈ రాత్రి స్టూడియో-ఎన్ ఈ 'ఫోకస్' ను ప్రసారం చేసింది. ఇందులో...ఒక పురుషుడి మీద కూర్చున్న ఒక మహిళ వివస్త్ర కావడం, మరొక ఆమె సెక్సీగా ఒకడికి మసాజ్ చేయడం...వంటి తీవ్ర అసభ్య క్లిప్స్ పదే పదే చూపారు. దానికి తోడు..."యహ...యమ డూపు...యమ డూపు...ఎం.-టీ.వీ సుబ్బలక్ష్మిదే..." అంటూ ఒక దరిద్రపుగొట్టు బూతు సాంగు...బాక్ గ్రౌండ్ లో. 

సాధ్యమైనంత ఎక్కువ బూతు చూపడానికే మొత్తం కథనాన్ని సాగ తీసి కంపు కంపు చేశారు. టీ.ఆర్.పీ. రేటింగ్ సరిగా రాక నిస్పృహలో ఉన్న బాసులు మరీ ఇంతగా దిగజారారు. ఇది విచారకరం. బాసులూ...మీ తల్లి, మీ కూతురు, మీ కొడుకు, మీ పేరెంట్స్ కూచొని చూస్తున్నప్పుడు ఇదే బూతు మీ టీ.వీ.లో వస్తే....మీరు చూపితే ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి. మరీ...బరితెగించవద్దు. కాస్త సభ్యతతో ఉండవచ్చేమో చూడండి.   

ఈ బూతు వ్యవహారానికి మహిళా సంఘం నాయకురాలు సంధ్యక్క బైట్ ఒకటి. ఛానల్ చూపాల్సిన బూతు వివిధ యాంగిల్స్ లో, వివిధ ఎఫెక్ట్స్ తో చూపాక....ఆమె తెర మీదికి వచ్చి...'ఇది (మసాజ్ సెంటర్లలో చీకటి పనుల నిర్వహణ)దారుణం, ఘోరం, పాశవికం,' అని దంచుకున్నారు...సహజ శైలిలో. ఛానల్ వాళ్ళు గొట్టం నోటి దగ్గర పెట్టగానే ఉపన్యాసాలు దంచడం కాదు...వారు చేసే నీలి అకృత్యాన్ని కాస్త గమనించి....ఆ దారుణంపై ఉద్యమించి...మమ్మాదుకో...మహా తల్లీ.  బూతు పని చేస్తున్నది...ఆ ఆడ తల్లులు కాదమ్మా....ఈ బ్లూ ఛానెల్స్. 

25 comments:

Pam said...

Dear Ramu garu,

On 29th June, ABN AJ presented a program on Sex in TextBooks and one expert participating in the discussion in the studio directly pointed out that the clippings shown background with the songs is absurd and obscene.

Sandhya veellantha professionals ante they are stereo typed and lost thier skill to segragate good and bad in the whole incident.

Ante Hamsa lu kakulu veruveru ga kakunda andaru kakule annamata (channels and so called experts).

Guru

Manjusha kotamraju said...

well said,,

Anonymous said...

నిజం చెప్పనా ..

నేను మాత్రం మస్సాజ్ ఎలా చేస్తారో... స్టూడియో - N చానెల్ చూసే తెలుసు కున్నా .. చాల హాట్ గురు ...

శివుడు
రాజమండ్రి

maharshi said...

meeru TRP Weekly bloglo prakatiste baguntundemo. oka suggestion ante...
-maharshi

Vinay Datta said...

the third paragraph from the bottom of your post is very objectionable. it is as clear as a visual. is there any difference between the channel's report and your post?

Sudha Rani Pantula said...

రాము గారూ
చాలా బాగా చెప్పారు.
ఛానెల్స్ విచ్చలవిడితనం చూస్తే రోజు రోజుకి కడుపు రగిలిపోతోంది. మనం ఏమీ చెయ్యలేమా.
ఆ సంధ్య గారి మాటలు,ఉపన్యాసాలు బాగుంటాయి.కానీ ఈ కార్యక్రమాల్లో ఆవిడని ముందు పెట్టుకొని వెనక చూపించే ఫ్రేముల్లో ఏంచూపిస్తున్నారో చూడడం లేదా...పదే పదే అశ్లీల దృశ్యాలను చూపిస్తూ ఉంటే ఆవిడ వాళ్ళనేం అనరేం. వీలయితే ఆవిడ ఫోన్ నెం. కానీ, ఈ మెయిల్ ఐడీగానీ ఇవ్వరూ.
టీవీ ఫైవ్ వాళ్ళు వేసిన ఇలాంటి కార్యక్రమం2008 లో వస్తే మేము ఆ ఛానెల్ వాళ్ళకి నోటీసులు పంపించాం.పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఉలుకూ పలుకూ లేదు. ఆ కడుపుమంటతోనే ఓ కథ రాసుకున్నాను.http://illalimuchatlu.blogspot.com/2009_01_01_archive.html
మీ బ్లాగు రెగ్యులర్ గా చదువుతాను. కామెంట్ రాయడం మొదటిసారి గానీ.
ఇలాగే మంచి పోస్టులు రాయండి.కొందరికైనా వేడి పుడుతుంది.

తుంటరి said...

Are they really sure that these kind of news will increase TRP? do they have any evidence that people are really watching these kind of news? or its a just assumption?

Sujatha said...

Ramu garu,
I really have seen this happening! I can’t believe this. Whenever I see these kinds of stories (also read), I always have thought why no one sees these in this angle (the approach you took in your post), here Mr. Ramu made this possible. Thank you!! Not necessarily be Sandhyakka..but anyone can take initiative to fight this legally!!

Although I do not support body trading at any level, and against legalizing world’s most ancient and most disgusting profession, strongly feel that the media shows lot more “Digajarudutanam” than actual people who do this and the business owners. ETv and EENADU still had not parsed in to this level as far as I know!

Have lot more to say on your Blog..may be some other time!!

Keep up good work!

Thanks,
Sri

Srikanth said...

Can we file a PIL against the channel?

Ramu S said...

Dear Srikanth,
You are asking, "can we file a PIL?" Why do you want "We" to do that? Brother, please consult a good advocate and file it today itself. Before these channels destroy the system completely, please file a PIL and fight on your own. Nobody will come with you.

Maharshi rao...
I am going to run a series on TRP soon. I got into a MOU with two senior journalists on this issue. I don't want to give weekly TRP ratings since I believe it is full of loopholes.

Dear Tuntari...
The heads of TV channels firmly believe that vulgarity will bring them good TRP ratings. In many cases, they are right, as far as I know.

Dear Madhuri...
Yes, your observation is partially right. I diluted it to 5 degrees to give a rough idea to the readers as to what really happened. Believe me I feel lot of pain while giving you such descriptions. I request readers to alert me if you feel that I am inadvertently going overboard in such posts.

Cheers
Ramu

సుజాత వేల్పూరి said...

ఈ మసాజ్ సెంటర్లు కేరళ పేరును బాగా వాడుకుంటూ వేళ్ళూనుకున్నాయి. అది సరే ఈ సెంటర్లు సిటీలకి మహా ఐతే ఒక మోస్తరు టౌన్లకి(ఇదీ డౌటే) పరిమితం కదా! మరి ఇదేదో రాష్ట్రమంతటా వ్యాపిస్తోన్న స్వైన్ ఫ్లూ లాగా అర్జెంట్ గా భారీ ఎత్తున ఆయా క్లిప్పింగ్స్ తో తెరమీదికి తీసుకొచ్చి తెలియని వారికి లేనిపోని ఎడ్యుకేషన్ ఇవ్వడం సమంజసమా?పైన శివుడు గారి వ్యాఖ్య చూడండి!

ఇహ సంధ్యక్క గారికి కొన్ని ఊతపదాలు నోటిచివరే ఉంటాయి. బాక్ గ్రౌండ్ తెల్సుకోకుండా మాట్లాడ్డం భలే తెల్సు!

రాము గారూ, సామాన్య మానవులకు చాలామందికి TRP రేటింగ్స్ గొడవేమిటో, అవెందుకు పనికొస్తాయో తెలీదు. దాన్ని వివరిస్తూ మీరొక టపా రాయకూడదూ!

రాను రాను మిగతా ఛానెళ్ళకేమో గానీ న్యూస్ ఛానెళ్ళకి చైల్డ్ లాక్ ఏర్పాట్లు చేయాలేమో అని భయమేస్తోంది. లేదా ఏ మిడ్ నైటో చూసే ప్రోగ్రాముల్లో వార్తల్ని చేర్చుకోవాలేమో మరి!

ఇలాంటి చెత్త కార్యక్రమాల గురించి ప్రజలు ఉద్యమించాల్సిందే! అందరూ మెయిల్స్ పంపాలి, వ్యతిరేకిస్తూ ఉత్తరాలు రాయాలి. వాళ్ళు చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి వ్యతిరేక అభిప్రాయముందన్న విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. జనం స్పందన లేకపోతే "జనాదరణ"తోనే నడుస్తున్నాయి అంటూ మనమీదికే తోసేయగల్రు.

katta jayaprakash said...

I am sure every agrees with your views.I am not sure whether Sandhya had seen the Focus programme or not.If she had seen it she should have immediately contacted the channel to censor the clippings of the practicals of the massages.If any body got the address of vSandhya I request him or her to address a letter protesting the way the channel telecast the clippings and the silence of Sandhya on these clippings and request her not to get involved in such programmes anymore as she has been agitating against the children's ATA programme of ZEE TV for the obscenity.I feel the viewers must send mails to thse channels enmass protesting such clippings.I request Ramu to provide the emails of all the channels in this blog and appal to all the bloggers to protest on anything objectionable for the society on behalf of apmediakaburlu without any personal or proffessional interests but only in the interest of the people at large.
I do agree with Madhuri on the repetition of objectionable clippings in the blog by Ramu and satisfied with the explanation by him.Let us all fight against the obscenity in the channel unitedly.

JP.

katta jayaprakash said...

Infact it should have been Madhuri garu in my last blog.Sorry for it.
JP.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

అయిదారేళ్ళ క్రితం స్టార్ న్యూస్ ఛానల్, "వాళ్ళ కెమేరా కళ్ళకు వ్యభిచారంలో దొరికిపోయిన ఓ బాలీవుడ్ తార" అనే ప్రచారంతో వారం రోజుల పాటు ఊదరగొట్టి మూడు రోజుల కధనాన్ని నడిపించింది. మూడో రోజు వరకు వాళ్ళ ఛానల్ ఆయాప్రాంతాల పోలీసులతో కలిసి చేసిన దాడులు, ఆ దాడుల్లో పట్టుబడిన మహిళలను, కాలేజీ విద్యార్ధినులను చూపించింది. మూడో రోజు ఆ "తార" ముఖాన్ని ఫేడౌట్ చేసి కధనాన్ని ప్రసారం చేసింది. ఆ తర ముఖాన్ని చూపెట్టకపోవటానికి కారణం కూడా చెప్పి, ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పింది! ఇంతకి ఆ కారణం ఏమిటంటే, ఆ తార కూడా ఒక సామాన్య వ్యక్తే, ఆమెకు, ఆమె కుటుంబానికి సమాజంలో అవమానం జరిగిపోతుందని సహృదయంతో, ఔదార్యంతో ఆమె ముఖాన్ని చూపలేదట!!

మరి అంతకు మూడు రోజుల ముందు నుంచి దాదాపు ఓ యాభై అరవై మహిళలను, విద్యార్ధినులను చూపినప్పుడు ఈ ఇంగితం ఎందుకు లేకపోయిందో? వాళ్ళకు కుటుంబాలు లేవా? వాళ్ళు సమాజంలో మనుషులు కాదా? ఇది మన న్యూస్ ఛానల్స్ హిపోక్రసి. ఆ సినీతారను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకొనుంటారు. అలా చెప్పలేరుగా.

అంతేకాదు, పోలీసులు ఎక్కడైనా రెయిడ్ చేస్తే, ఆ మహిళల ఫొటోలు టైంస్ ఆఫ్ ఇండియాలంటి వార్తా పత్రికలు కూడా బాక్సులు కట్టి మరీ ప్రచురిస్తాయి. అదే టైంస్ ఆఫ్ ఇండియా (ముంబాయి మిర్రర్) చూస్తే, రోజుకు కనీసం ఓ రెండు మూడు వందల మసాజ్ సెంటర్ల, ఎస్కార్ట్ సర్వీసుల, ఫ్రెండ్షిప్ క్లబ్బుల క్లాసిఫైడ్లుంటాయి.

మన సోకాల్డ్ ప్రజాస్వామ్యాన్ని, ఫోర్త్ ఎస్టేట్ కూడా పరిహాసాస్పదం చేస్తున్నది.

Kathi Mahesh Kumar said...

"షేమ్ షేమ్ !" అంతకు మించి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదనుకుంటా.

Vinay Datta said...

JP garu,

I really don't mind if you or anybody addresses me only 'madhuri'.The way you write about somebody or quoting somebody itself reflects the respect you have for that person. That way you've always maintained dignity and respect in your comments and observations.

Thank you.

Daswidania said...

Good discussion.

Krishnarjun said...

RK - News too joined the bandwagon.yesterday night they ran a programme about joginis with syamala's photos in the background.

Nag said...

I agree with you what ever you had told in post,
Why don't we ban our self viewing such kind of channels(Don't ask me for god channels names :)) and ask our friends and families to do that, so that at least 0.000001% TRP reduces.

As people are seeing they are showing(I might be wrong as well).

I have seen one news item in BBC(sorry to BBC for comparing them with our channels) about some murder case on children they are not even showing/referring children faces/names. Instead of the children they are showing hand drawn images which shows their backs. If rules are like that(either by GOVT/Self) no body shows this kind of news items.

ramnarsimha said...

Sir,

SANDHYA..gari Ph no.(98490-18471) is available in Hyd.Police.Website(Womens Org. List)..

Unknown said...

ఫోర్త్ ఎస్టేట్ అనే పేరు తో ఏమి చేసినా చెల్లుతుంది అనే నమ్మకం బాగా ప్రబలుతున్నది. అలాగే చేస్తున్నారు.
ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో ప్రతిదీ వ్యాపార దృక్కోణం లో చేస్తున్నారు. అక్రమం గా సంపాదించిన డబ్బు మీడియా లో పెడుతున్నారు.
మీడియా లో ఉండే వారు సామాన్య ప్రజల కన్నా ఎక్కువ ఏమి కాదు. మీడియాలో జరిగే అవకతోవకల్ని, విపిరీత పోకడల్ని విచారించి, కట్టడి చేసే నిష్పాక్షిక వ్యవస్తని ఏర్పాటు చెయ్యవలసిన అవసరం స్పష్టం గా కనిపిస్తున్నది. ఇలాంటి వ్యవస్తలు ఏర్పాటు, తమ నైతిక భాద్యత గా భావించే స్తితి లో ప్రస్తుత ప్రభుత్వాలు లేవు. ఇది ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, మనబోటి వాళ్ళ నుంచి ఏమైనా వత్తిడి వస్తే, ప్రభుత్వాలు ఆ దిశగా కదలొచ్చు. మొన్న స్టూడియో - న్ వాళ్ళు చెసిన చవకబారు పని వాళ్ళకు మాత్రమే పరిమితం కాదు, మొదటి దీ కాదు.ఈ జాడ్యం మీడియా లో అంతటా ఉంది. ఇలాంటి వెధవ పని చెసిన వాళ్లకి భారి జరిమానా విధించటం తో పాటుగా వాళ్ళ ఛానల్ ప్రైం టైం లో 10 నిముషాలు బ్లాంక్ స్క్రీన్ తో రన్ చేసి, ఎందుకు బ్లాకు చెయ్యవలసి వచ్చిందో స్క్రోలింగ్ నడిపితే, మరే ఛానల్ ఈలాంటి బుద్ది తక్కువ పని చెయ్యదు.

శ్రీనివాసరావు

katta jayaprakash said...

Inview of the ban and restrictions on some message centres as well on the obscene dancing in the pubs and bars can the print media refuse to accept the classified and other ads on message centres,pubs etc with dancing girls?There are many friendship clubs duping the youth with blackmail etc in Hyderabad.Can the print media refuse to accept ads from such clubs and organisations?If not why the sermons against corruption ,immorality,unethical affairs in their writing by the print media?
JP.

Krishnarjun said...

చానళ్ళ దౄష్టిలో 'కాదేదీ "క్లిప్పింగ్" కనర్హం'.
పదేళ్ళక్రితం ద్రోహి అనే సినిమా వచ్చింది, అందులో కమల్ హాసన్, గౌతమి భార్యాభర్తలు.
ఓ సీన్లో కమల్ హాసన్, గౌతమిని తన పిల్లల ముందు KISS చేస్తే గౌతమి ఛీ !! పిల్లల ముందు ఏమిటిది అసహ్యంగా ? అంటుంది. దానికి కమల్, మనం నేర్పించక పొయినా టీవీలే వాళ్ళకు నేర్పుతాయి అంటాడు.

ఐనా, మన కష్టమంతా.. మన పిల్లలు మన కళ్ళ ముందు అటువంటి సీన్లు చూస్తే కలిగే ఇబ్బంది. మన పరోక్షంలో చూస్తే మనకే ఇబ్బంది లేదనుకుంటా ??!!

మన సమాజం ఒక Transition stage లో ఉంది కనుక మన కిటువంటి విషయాలు ఇబ్బందికరం. కొద్ది సంవత్సరాల తర్వాత మనం కూడా అలవాటు పడిపోతాం. సమాజ పోకడలని ఏ కొద్దిమందో ఆపలేరని నా అభిప్రాయం. సమాజ విలువలు కాలంతో మారుతూ ఉంటాయి. నేడు తప్పుగా కనిపించేది రేపు ఒప్పుగా కనిపించవచ్చు.

ramasai said...

God is great
I didn't watch the programme
In some News channels even Lady news readers .... sorry... promptor readers are using foolish laungate like pitcha kottudu, iragadeesadu.
In thelugu media I can channenge most of the persons does't know minimum GK also.. Mana Kharma

ABHIGNA

srikanth said...

Today I have seen a very good program in ABN on Prajakavulu. It was a 2 hour program on AndeSri, Suddala, Jayaraj & Gorati Venkanna. Its an excellent program in recent times in any channel.

Though its a off-topic in this forum , I couldnt find any better plance than this.

Thanks
Sreekanth

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి